Home » Ravulapalli sunitha » Death Sentence


    అతనికి విషయం చెప్పెయ్యాలని తొందరెంత ఉన్నా ఆయాసంతో మాట బయటికి రావడంలేదు.

 

    అతని పరిస్థితి చూసి లేచి నిలబడి, 'కూర్చోండి' అంటూ కుర్చీ చూపించాడు శరత్ చంద్ర. అతని చేతిలోని బ్లడ్ రిపోర్టు పేపర్లు చూసి ఏం వార్త తెచ్చాడోనని టెన్షన్ ఫీలయ్యాడు.

 

    చేతిలో పేపర్లు శరత్ చంద్రకి అందించి, అతను కుర్చీలో కూలబడ్డాడు. అలాగే నిలుచుండి పోయాడు శరత్ చంద్ర. ఆ కాగితాల్లో ఏం రిపోర్టు వచ్చిందో చూడ్డానికి జంకాడు. మెల్లగా కాగితం మడతలు విప్పాడు.

 

    అతని చూపు టైపు అక్షరాల మీద పరుగులు తీసింది. కన్నార్పకుండా చూస్తున్న రవళీ, రాజ్యం కూడా ఒక్క ఉదుటున వచ్చి శరత్ చంద్ర చేతిలోని రిపోర్టులోకి తొంగిచూశాడు.

 

    మెల్లగా మెల్లమెల్లగా శరత్ చంద్ర మొహంలో నవ్వు కదిలింది!

 

    "ఓ....హ్!" రాజ్యం రెండు చేతులు పట్టుకొని ఊపేస్తూ అరిచింది రవళి.

 

    "సరే! నేను వాళ్ళ వాళ్ళకి కూడా చెప్పేస్తాను!" అంటూ బయటికి పరుగెట్టింది.

 

    సరిగ్గా ఆ సమయంలోనే గోవిందం, చలపతిరావు భార్య సత్యవతి దగ్గర బేరాలాడుతున్నాడు.

 

    "ఛీ.... ఛీ.... ఛీ! ఎవడూ దొరకనట్లు దిక్కుమాలిన డ్యూటీ నాకు తగిలించిన్రు. ఆడెవడో జబ్బు తగిలించుకొనుడేందీ - ఇయన్నీ నేను తగలెట్టుడేందీ. పరేషానైపోతున్నా" అనుకుంటూ సత్యవతి దగ్గర కొచ్చాడు. ఆ పూట చలపతిరావు దగ్గర వస్తువులు కాల్చేసే డ్యూటీ అతనికి పడింది.

 

    "పైసలియ్యమ్మ. మీ హజ్ బెండ్ కి వాడిన దూదులు, సిరంజిలు, గ్లవుజులు అన్నీ మంటబెట్టాలె!"

 

    "అవన్నీ తగలబెట్టడానికి నేను డబ్బులివ్వటం ఏమిటి బాబూ?" సౌమ్యంగానే అందావిడ.

 

    "మీరియ్యకుంటే ఎవరిస్తరు నాకు. రోగం నా అయ్యకేమన్న వచ్చిందా?" కసురుకున్నాడు.

 

    ఇతనితో ఎందుకు లెమ్మని పదిరూపాయలు తీసిచ్చింది.

 

    "ఇరవై అయితది!" అన్నాడు బింకంగా.

 

    "ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వం. ఇంకా మాట్లాడితే నీమీద కంప్లయింట్ వెళుతుంది" కఠినంగా అంది సత్యవతి కూతురు రాధ.

 

    పది రూపాలు జేబులో పెట్టుకొని వెంటనే వెనుదిరిగాడు గోవిందం.

 

    ఎస్. టి.డిలు.... ఎస్.టి.డి.లు అంటించుకోటానికయితే పైసలు బాగానే ఉంటై....!" గొణుక్కుంటూ వెళుతున్నాడు.

 

    "ఏందన్నా ఎస్.టి.డి అంటున్నావ్ ఫోను కొట్టాల్నా ఎవరికన్నా?" అప్పుడే అటుగా వస్తున్న వార్డ్ బోయ్ యాదగిరి అన్నాడు.

 

    "ఆ.... నా మొకానికి ఎస్.టి.డి. కూడ!" అని వెంటనే నాలుక్కరుచుకున్నాడు. 'ఇదేంది గిట్లా మాట్లాడుతున్నా' అనుకొని,

 

    "ఒరె యాదగిరీ - ఎస్.టి.డి అంటే ఫోను కాదురా, సెక్సువల్లీ ట్రాన్స్ మిట్టెడ్ డిప్షిజ్" అన్నాడు.

 

    "సమజ్ కాలే అన్నా!"

 

    "ఇదరా" అని దగ్గరకి పిలిచి చెవిలో గుసగుసలాడ, "దాన్నే ఎయిడ్సంటారు. గా ముసలాయనకు ఏం పొయ్యేకాలమో చెడు తిర్గుడు తిరిగి ఆ రోగం దెచ్చుకున్నాడు" అని పైకి చెప్పాడు.

 

    సత్యవతి దగ్గరి కెళుతున్న రవళి ఆ మాటలు విన్నది. 'రోగిని వెలివేయడం మొదలయింది' అనుకొంది. ఇవాళీ రిపోర్టే పాజిటివ్ గా వస్తే ఈ కారిడార్లోని కబుర్లు చిలువలు పలువలుగా పాకి, పాకి ఆ కుటుంబాన్ని ఎంత హింసకి గురి చేసి ఉండేవో ఊహించింది. అక్కడే ఆగి అతన్ని పిలిచి చెప్పింది.

 

    "గోవిందం! ఇంకెక్కడా ఇలా మాట్లాడకు. ఆయనకి ఆ జబ్బు నువ్వనుకున్నట్లు వచ్చింది కాదు. అసలతనికి ఎయిడ్స్ కాదని ఇప్పుడే రిపోర్టు వచ్చింది. ఈ మాటలు ఇహ ఇంతటితో ఆపేసెయ్!" అధికారం ధ్వనించే గొంతుతో అని, అతనికి మళ్ళీ మాట్లాడే అవకాశం యివ్వకుండా వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది.

 

    వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ మూతి ముప్పయిమూడు వంకర్లు తిప్పాడు గోవిందం. అతన్ని చూసి నవ్వాడు యాదగిరి.


                                *    *    *    *


    "ఐ కంగ్రాచులేట్ యూ సార్!" చెయ్యి ముందుకు చాచింది రాజ్యం.

 

    ఆ చెయ్యందుకొని నొక్కి వదిలేశాడు శరత్ చంద్ర. అతనిప్పుడు మాట్లాడే స్థితిలో లేడు. పట్టరాని ఉద్వేగంతో మొహమ్మీద చేతులు ఆనించుకొని కుర్చీలో కూర్చుండిపోయాడు. అదొక అలౌకికానందం!

 

    ఎంతో టెన్షన్నీ, రిస్క్ నీ భరించి బ్రతికించుకున్న రోగిని, ఎయిడ్స్ గద్ద తన్నుకుపోతుందేమోనని తీవ్ర ఆందోళనకి గురయివున్నాడు.

 

    అతడెంత బాధ పడుతున్నా బయట పడనీయని నిండు మనిషిని అప్పుడు అర్ధమైంది రాజ్యంకి.

 

    "ఎడ్వాన్ స్ డ్ టెస్టులో నెగిటివ్ అని కన్ ఫర్మ్ అయింది సార్" అప్పటికి తేరుకుని చెప్పాడు మైక్రోబయాలజిస్టు.

 

    స్పృహలోకొచ్చాడు శరత్ చంద్ర.

 

    "థాంక్యూ వెరీమచ్!" అంటూ అతని ముందుకు చెయ్యి చాపాడు.

 

    "మీ అందర్నీ చాలా టెన్షన్ లో పెట్టాల్సొచ్చింది. క్షమించండి సార్" చెయ్యందుకొని చెప్పి సెలవు తీసుకున్నాడతను.

 

    సత్యవతికి విషయం చెప్పి తిరిగివచ్చింది రవళి.

 

    హాస్పిటల్ అంతా టెన్షన్ నుండీ రిలీవయిన ఆనందం వెల్లి విరిసింది.

 

    పరుగుపరుగున వచ్చాడు కిరణ్. గదిలోకి దూసుకురాబోతుండగా, రాజ్యం పరుగుతో ఎదురుపడి గుమ్మానికి అడ్డంగా నిలబడింది.

 

    "అమ్మో! మీరు రాకూడదు ఎయిడ్స్!"

 

    "అయితే ఏంటట?" ఉడుక్కున్నాడు.

 

    "నా చేతుల నిండావుంది పూసేస్తాను" అంటూ గుమ్మానికి అటూ ఇటూ చాపి వుంచిన చేతులు తీసి ముందుకు చాపిందో లేదో.... అతడు హఠాత్తుగా రాజ్యం నడుం దగ్గర రెండు చేతులతో పట్టుకొని పైకిలేపి, ఆమెతో సహా లోపలికొచ్చేశాడు.

 

    "అయ్యో.... అయ్యో" అని అరుస్తోంది రాజ్యం.

 

    తెల్లబోయి చూస్తున్నారు రవళీ, శరత్ చంద్ర.

 

    "నాతో పెట్టుకోకు మరి!" అంటూ ఆమెని దించి రవళీ శరత్ చంద్రలకి ఒకరి తర్వాత ఒకరికి అభినందిస్తూ చెయ్యదించాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra