Home » Kommuri venugopala rao » Medalo Needalu


    లలితమ్మగారు కూడా భర్తతో యీ విషయమే చెప్పాలనుకుంది. కాని తను ఆ మాట అంటే ఆయన తనమీద ఎక్కడ విరుచుకుపడతాడోనన్న భీతితో ఊరుకుంది.

 

    విశ్వనాథంగారు చప్పబడిపోయి సాలోచనగా "నేను వెళ్ళాలంటారా?" అన్నాడు.

 

    "మీరు ఒకసారి వెళ్ళి వస్తేనే బాగుంటుందండీ!" అన్నది సమయం చూచుకుని లలితమ్మగారు ఇప్పుడు.

 

    చివరకు అదే బాగుంటుందని ఆయనకూ అనిపించింది. ఆ సాయంత్రమే జగన్నాథంగార్ని తీసుకుని కార్లో బయలుదేరి వెళ్ళాడు.

 

    అక్కడకు వెళ్ళేసరికి బాగా రాత్రి అయింది. ఈసారి వియ్యంకుడే ఊడిపడే సరికి మొదట కాస్త మర్యాద చేశారు పెళ్లివారు. కాని విషయం ఆకళింపుకు వచ్చేసరికి తారామండలానికి లేచారు.

 

    "ఇదేమన్నా బొమ్మలపెళ్లి అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్లు మార్చటానికి. నలుగురిలోనూ మాకు ఎంత అప్రతిష్ట? అసలు మీరేమీ మాటస్థిరంలేనివారల్లే కనిపిస్తున్నారే? అనవసరంగా తొందరపడి ఒప్పుకొన్నట్లుగా వుంది" అన్నారు ఎంతో విచారపడిపోతున్నట్లుగా.

 

    విశ్వనాథంగారు ఆవేశాన్ని చంపుకుని "మరో పదిహేను రోజుల్లో సరిగా పంచమినాడు మంచి ముహూర్తం వుందండీ! అది ఉభయులకూ సదుపాయంగా వుంటుందని నా ఉద్దేశం" అన్నాడు.

 

    "వీల్లేదు ఏమయినా సరే మేము పెట్టిన లగ్నానికే జరగాలి లేకపోతే అసలు పెళ్ళే చేసుకోము. ఆఁ" అన్నాడు పెళ్లికొడుకు తండ్రి దృఢంగా.

 

    తర్వాత పెద్ద వాగ్వివాదం చెలరేగింది. ఈ పెళ్ళి జరగాలంటే ఫలానివి తీర్చాలంటూ వాళ్ళింకా లక్షా తొంభయి కోర్కెలు కోరారు. అవన్నీ తీర్చాలంటే బాప్ రే! అందులో వాళ్ల సంభాషణ పద్ధతికూడా చాలా మొరటుగా గర్హనీయంగా వుంది. అసలే ఉద్రేకి అయిన విశ్వనాథంగారు మాటకు మాట అంటించేసరికి వారిలో ఒక మనిషి-

 

    "ఏమండోయ్! మీరేమో మాతో దెబ్బలాటగానీ పెట్టుకుందామణి వచ్చినట్లున్నారు. మేమంత తీసిపోయామను కుంటున్నారేమో మాచేతుల్లో చాలామంది రౌడీలున్నారు తెలుసా?" అంటూ మాట తూలాడు.

 

    విశ్వనాథంగారి కారు డ్రైవరు ఇంతసేపట్నుంచి యీ రభస అంతా గమనిస్తూనే వున్నాడు. తన యజమానిని అంతమాట అనేసరికి అతనికి పౌరుషం వచ్చి "ఏంటయ్యా, మీరు రౌడీల్ని పిల్చుకొచ్చేది? ఈ ఊళ్ళో నేను పదేళ్ళు డ్రైవరుగా పనిచేశాను. ఈ ఊళ్ళోని డ్రైవర్ లంతా నేను కేకపెడితే పరిగెత్తుకు వస్తారు. మరి మీ రౌడీలందర్నీ రమ్మనండి. మనదమ్ములు చూసుకుందాం" అంటూ మీదకు లేచాడు.

 

    వాళ్లు ఒక్కక్షణం దిమ్మెరపోయి సహాయంకోసం అన్నట్లుగా ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. తర్వాత ఒకడు కాస్త ధైర్యంచేసి "ఏమిటి మీరు పెద్ద ప్రయత్నంమీదే వచ్చారన్నమాట. మీరింకా పెద్ద మనుషులనుకొని అపోహ పడినాము" అంటూ ఆశ్చర్యం ప్రదర్శించాడు.

 

    విశ్వనాథంగారి అసహ్యంవేసి ఇహ ఆ వాతావరణంలో ఉండలేక లేచి నిల్చున్నాడు. "మీ అందరకూ ఒక్క నమస్కారం. పెద్దమనిషిని కాబట్టే మీరిన్ని మాటలన్నా ఉపేక్షించి ఊరుకున్నాను. పరువు, ప్రతిష్ట విషయం మీకన్నా నాకెక్కువ తెలుసు. కాబట్టి ఒక సూచన ఇస్తున్నాను. పెళ్లి ఇంచుమించు జరిగేటంతవరకూ వచ్చింది. కాబట్టి మేము పెట్టిన లగ్నానికి మీకు ఇష్టమయితే రెండురోజుల్లోగా వైర్ ఇవ్వండి. లేకపోతే ఇది కాన్సిలు అయినట్లే. ఇదే చివరిమాట" అంటూ బయటకు వచ్చేశాడు.

 

    కారులో బాగా గాయపడిన మనసుతో వెనక్కి అనుకుని జారగిలబడి ఆయన "నేను యింతకోపిష్టిని, అహంభావిని. ఎందుకు వాళ్ళన్న మాటలన్నీ విని భరించాను? ఎలా తమాయించుకున్నాను? ఆడపిల్ల తండ్రి కావటం చేతనా నాలో ఇంత సహనం వచ్చింది?" అని విస్మయపడసాగాడు.

 

    ఇంటికి వచ్చి, అన్ని విషయాలు తెలిశాక లలితమ్మగారు భర్తకు తెలియకుండా నెత్తీనోరూ కొట్టుకుంది. తమ కుటుంబం నలుగురిలోనూ నవ్వులపాలు కావల్సి వస్తుందని గిజగిజలాడిపోయింది.

 

    విశ్వనాథంగారు వంటరిగా గదిలో కూర్చుని ఆలోచించిన కొద్దీ ఆయన హృదయం కుతకుత ఉడికిపోసాగింది. నిముషాలు గడిచినకొద్దీ ఈ సంబంధం పట్ల ఆయనకు అసహ్యం ఎక్కువయిపోసాగింది. విరక్తి కలిగింది.

 

    ఉన్నట్లుండి ఉప్పెనలా ఆవేశంవచ్చి రామాన్ని పిలిచి "మనమీ సంబంధం కేన్సిల్ చేసుకున్నట్లు వైరిచ్చిరా" అన్నాడు.

 

    లలితమ్మగారు కంగారుపడుతూ "ఆ పని మనం చెయ్యటమెందుకండీ? వాళ్ల దగ్గర్నుంచి ఏ కబురూ రాకపోతే అర్థం అదేగా" అంది.

 

    అక్కడున్న బంధువులలో ఒకరిద్దరూ అనుభవజ్ఞులు. తలలుపండినవారూ 'తొందరపడకు నాయనా. కళ్యాణ సందర్భంలో ఆవేశం కూడదు' అని సలహా ఇచ్చారు.

 

    విశ్వనాథంగారు వినిపించుకోలేదు. రామాన్ని టెలిగ్రాఫ్ ఆఫీస్ కి తరిమేదాకా ఆయన మనస్సు ఊరట చెందలేదు.

 

    రామం అలా కనుమరుగు అయీ అవగానే 'టెలిగ్రాం సార్' అన్న కేక వినిపించింది బయటనుంచి.

 

    అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

 

    "మేము ఇష్టపడినాం. మీరు నిశ్చయించిన లగ్నానికే ఖాయం చెయ్యండి" ఇదీ తంతి.

 

    లలితమ్మగారి ముఖం వికసించింది. "సుందరం త్వరగా పో, పోయి రామాన్ని వైర్ ఇవ్వకుండా ఆపించు. తొందరగా వెళ్ళు" అంది అరుస్తూ.

 

    విశ్వనాథంగారు వారించలేదు. ఆయనలో ఆవేశం అంతరించిపోయింది.


                                      *  *  *


    పెళ్లి జరుగుతోంది.

 

    ప్రతి ఘడియకూ ఓ గందరగోళమే. అల్లరీ, ఆగమే. భోజనాలదగ్గర, లాంఛనాల దగ్గర, అలకపాన్పు దగ్గర వేడుకలదగ్గర పేచీలు, పేచీలు!

 

    చూసినవాళ్ళంతా ఛీ ఛీ అని చీదరించుకున్నారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra