Home » Suryadevara rammohan rao » సాహసి


    "అంతా... జోకే... నిన్ను భయపెట్టడానికి... పద... పద- లగేజీని పట్టుకో..." తన లగేజీని తను పట్టుకుంటూ అంది ఇందుమతి.

    కొండ ఏటవాలుగా ఉంది. దారిలేదు- భుజమ్మీద లగేజీతో ముందు నడుస్తున్న యువరాజు చేతిలో పొడవాటి కోటలోని కత్తి వుంది.

    ఆ కత్తితో అడ్డొచ్చిన తుప్పల్నీ, డొంకల్నీ నరుకుతూ, దారి తీస్తున్నాడు యువరాజు.

    "చేతిలో కత్తితో నువ్విప్పుడు నిజంగా యువరాజులా ఉన్నావయ్యా..." కపాలేశ్వర అన్నాడు.

    ఆ మాటకు నవ్వింది దేవులపల్లి యువరాణి ఇందుమతి.

    గంటలు గడుస్తున్నాయి ఎండ చిక్కబడుతోంది- గాలి వేడెక్కుతోంది. ఎక్కడనుంచో భీకరంగా విన్పిస్తున్న అడవి ఏనుగుల అరుపులు, ఆకు కదిలినా, పాము బుస కొట్టినా... ఏ క్షణంలోనయినా ఎదురయ్యే ఏ ప్రమాదాన్నయినా... అవలీలగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉక్కు మనిషిలా నడుస్తున్నాడు యువరాజు.

    ఆ వెనక ఇందుమతి- వెనక బృందం.

    అందరి వంటినిండా చెమటలు పట్టేస్తున్నాయి- చెమటలో తడిసిపోయిన గోధుమరంగు చీరలో... ఇందుమతి మొగలినాగులా ఉంది.

    మధ్యాహ్నం నాలుగు గంటలైంది.

    ఆకాశమ్మీద ఎవరో మేఘాల గొడుగు దట్టంగా కప్పేసారు.

    మసక చీకటి... పట్టపగలే మేలి ముసుగులా ఉందా ప్రాంతం.

    సరిగ్గా-

    సరిగ్గా-

    ఆ సమయంలో రెండు యోజనాల దూరం నుంచి పులిగాండ్రింపు వినబడింది. అది గాయపడిన పులి అరుపు... పిడుగుల గర్జనలా ఉందా గాండ్రింపు.

    పులి గర్జన వినగానే వైశాలి గుండె మీద పులిపంజా పడినట్లుగా బయపడి పోయింది. ఎందుకొచ్చానా అని ఒక్కక్షణం తనని తను తిట్టుకుంది.

    "టైగరా..." నుదుటన పట్టిన చెమటను ఎడంచేతితో తుడుచుకుంటూ అంది వైశాలి.

    "ఎవరూ మాట్లాడకండి...." హెచ్చరించాడు కపాలేశ్వర్.

    లోయ దిగి, మళ్ళీ కొండెక్కుతున్న ఆ బృందంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉన్నారు ఉద్విగ్నతే ఊపిరిగా ఉన్నారు. మనిషి వాసన పసికట్టిన పులి... దూరంగా కొండమీద, జిరాఫీలా మెడరిక్కించి చుట్టూ చూస్తోంది.


                   *    *    *    *


    దేవదారు వృక్షాలమీంచి, భరద్వాజ పక్షులు కలకలరావం చేస్తున్నాయి. ఆకాశమంత ఎదిగిన చెట్లు, భూతాల్లా ఉన్నాయి- పరిసరాల్ని సునిశితంగా పరిశీలిస్తూ నడుస్తున్నాడు యువరాజు. వంటిమీద నుంచి చెమటలు ధారలుగా కారుతున్నా, అతను లక్ష్యపెట్టడం లేదు... చాలా ఉత్సాహంగా ఉందతనికి.

    ఎలుగుబంటో, పులో, ఎదురయితే... తన ధైర్యాన్ని, సాహసాన్ని నిరూపించుకోవడానికి వీలవుతుందన్న ఉదేశ్యంతో ఉన్నాడతను. ఆయాసం, ఉత్సాహాన్ని మింగేస్తోంది. బండరాళ్ళ మీద నుంచి నడవడం కష్టంగా వుంది.

    "ఎక్కడయినా, కాసేపు కూర్చుందాం... ఇందూ..." ఆ మాట అంటూనే- ఒక రాతిబండ మీద కూలబడి పోయింది వైశాలి ఆయాసముతో.

    అప్పటికే యువరాజు, ముత్యాలనాయుడు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళ వెనగ్గా ఉంది ఇందుమతి.

    "యువరాజూ... కాసేపు ఆగుదాం..." లోయలోంచి తలెత్తి కొండవేపు చూస్తూ అంది ఇందుమతి.

    పులి గర్జన, అకస్మాత్తుగా మాయమవడంతో, కొంత ధైర్యం వచ్చింది బృందానికి.

    "తినడానికేదైనా ఇవ్వు... యువరాజూ..." కేకేసాడు కపాలేశ్వర. బిస్కెట్లు, బ్రెడ్డూ, జామ్ అందరికీ పరిమితంగా ఇచ్చాడు యువరాజు. సడన్ గా "ఫ్రూట్స్... ఫ్రూట్స్-" అరిచింది వైశాలి. దూరంగా పనసచెట్టు, బాగా పండి కింద పడిపోయిన పనసపండ్లు... రెండు పనసపళ్ళు తెచ్చి కోసి అందరిముందు పెట్టాడు యువరాజు.

    కడుపులు నిండిపోయాయి-

    మళ్ళీ అందరూ ప్రయాణం సాగించారు.

    "సడన్ గా పులి అరుపు మాయమై పోయిందేమిటి...?" ఆశ్చర్యంగా అడిగింది వైశాలి.

    "మనుషుల్ని  చూసిన అన్ని పులులూ- మనుష్యులమీద బడవు- మనుషుల్ని తినవు. దేహదారుఢ్యం కోల్పోయిన పులులు, గాయపడిన పులులే ఏ ఆహారం దొరకనపుడు... తప్పనిసరిగా మానిటర్స్ గా మారతాయి-" చెప్పాడు కపాలేశ్వర్.

    "ఈ పులి మానిటర్ కాదా?"

    "మానిటర్- టైం వేస్ట్ చెయ్యదు..." చెప్పాడు మళ్ళీ.

    కపాలేశ్వర అంచనా తప్పని తెలీదు- మనిషి వాసనను ఎగ పీలుస్తూ ఇరవై అడుగుల దూరంలో, రెల్లు పొదల్లోంచి పులి... వారిని వెంబడిస్తోందని అవకాశం కోసం చూస్తోందని- అక్కడున్న వారెవరికీ తెలీదు.


                  *    *    *    *


    మరో మూడు గంటల తరువాత వారికి మొదటి మజిలీ పూర్తయ్యింది. నేలకు వెయ్యి అడుగుల ఎత్తయిన ప్రదేశంలో వాళ్ళున్నారు. అందరూ తమ భుజాల మీద లగేజీని దింపి కూర్చున్నారు. ఎవరూ పావుగంట సేపు మాట్లాడలేకపోయారు ఆయాసంతో- అలసటతో, బైనాక్యులర్స్ ని తీసుకుని చుట్టూ చూస్తోంది ఇందుమతి.

    ఎంత ఎత్తయితే ఎక్కి కొండెక్కారో, అంతలోతున ఒక ఆరు గుడిసెలు కనిపిస్తున్నాయి విసిరేసిన నక్షత్రాల్లా.

    "ఏదో ఊరు కన్పిస్తోంది..." అంది ఇందుమతి ఒకింత సంతోషంగా. బైనాక్యులర్స్ ని తను తీసుకుని చూశాడు కపాలేశ్వర్.

    "ఆ గ్రామం పేరే... రాబ... అక్కడికి మూడుమైళ్ళ దూరములో కంచూరు రాక- రాత్రి ఏ సమయానికయినా మనం కంచూరువాక చేరుకుంటే బాగుంటుంది..." చెప్పాడు కపాలేశ్వర్.


                  *    *    *    *    


    రాబ ప్రాంతం ఒకప్పుడు విస్తారమైన పులులకు ప్రసిద్ధి... విశ్వరూపశర్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది.

    "మరి ఆలస్యం దేనికి బయలుదేరుదాం..." ముత్యాలనాయుడు లేస్తూ అన్నాడు.

    అతని వెనుక రాకీ మత్తుగా నడుస్తోంది.

    "మనం వెళ్తున్నది... సరయిన దారేనా-"

    "ప్రస్తుతానికి రైటే... ఎవరయినా ట్రైబల్ ని సంపాదించాలి. కంచూరు వాకలో దొరకవచ్చు-" అన్నాడు కపాలేశ్వర్.

    అందరూ మూటలు భుజాలకు ఎత్తుకున్నారు.

    "బీ- క్విక్..." తొందర చేసింది ఇందుమతి.

    తనకి విశ్వరూపశర్మ చెప్పినంత మేరకు, తను ఊహించినంత మేరకు తన నిధి అన్వేషణలో కంచూరువాక ఒక ముఖ్యమయిన ప్రదేశం. నిధికి సంబంధించిన విషయం ఏదైనా తెలిస్తే... అక్కడే కొంత సమాచారం తెలియాలి.

    ఆ ఆలోచనే ఉత్సాహంగా వుంది ఇందుమతికి.

    సింధూరవైపు చెట్ల నీడల్లోంచి, పడమర సూర్యుని కాంతి పల్చపడుతోంది. అందరికంటే ముందు యువరాజు నడుస్తుంటే, చివర కపాలేశ్వర్ నడుస్తున్నాడు.

    కపాలేశ్వర్ ముందు వైశాలి నడుస్తోంది.

    వైశాలి పల్చటి చీరా, జాకెట్టు పూర్తిగా చమటతో తడిసిపోయాయి. ఆమె నడుం భాగంలో మిలమిల మెరుస్తున్న చమట బిందువుల్ని చూస్తుంటే, కపాలేశ్వర్ కి తమకంగా వుంది.

    అతనికి నిగ్రహించుకోవడం కష్టంగా వుంది.

    వైశాలి దృష్టి ముందు నడుస్తున్న యువరాజు, స్పోర్ట్స్ బనీన్ లోంచి కన్పిస్తున్న కండల మీదుంది.

    ఒక్కసారైనా ఆ కండల్ని చుట్టెయ్యాలి- యువరాజు కరకు చేతుల్లో పూర్తి... పూర్తిగా నలిగిపోవాలి- ఆ ఆలోచనతో వైశాలి మనసు ఉరకలు వేస్తుంది.

    "ఎప్పుడైనా... ఒక్కసారైనా అవకాశం రాకుండా పోతుందా... నా ప్రతాపం చూపించక పోతానా..." కపాలేశ్వర్ మనసులోనే అర్రుపు చాస్తున్నాడు.

    కొండ దిగువన రాబ గ్రామంలో- ఇళ్ళ నుంచి పొగలు లేస్తున్నాయి. దట్టమైన ఆ పొగ... వింత వాసన వారి ముక్కుపుటాలకు తగులుతోంది.

    అప్పటికి పూర్తిగా చీకటి చిక్కబడింది. అక్కడికి ఒక కిలోమీటరు దూరంలోనే వుంది ఆ గ్రామం. చేతి వాచీ వేపు చూసింది ఇందుమతి. చిన్న ముల్లు ఎనిమిది మీద, పెద్ద ముల్లు పన్నెండు మీద ఉన్నాయి. ఆ ముల్లులు రేడియం మెరుపుతో మెరుస్తున్నాయి. సరిగ్గా ఆ సమయంలో-

    ఆ గ్రామానికి చివర రావి చెట్టుకింద 'పెద్ద తల్లి' గుడి దగ్గర గిరిజన జనం గుమిగూడున్నారు.

    గుడి ముందు, భోగిమంట లాంటి మంట ఉవ్వెత్తున మండుతోంది. గిరిజన పూజారి పూనకం పట్టిన వాడిలా  అరుస్తున్నట్టున్నాడు. ఆ అరుపులకు తోడుగా గిరిజనులు తప్పెట్లు వాయిస్తున్నారు. ఆ వాయిద్యాల ఘోష... యముని మహిషపు లోహ ఘంటల ధ్వనిలా వుంది.

    ఆ ధ్వని విని ఉలిక్కిపడ్డాడు యువరాజు.


                   *    *    *    *


    ఊరు మీద దుప్పటి కప్పినట్టుగా వుంది చీకటి... పెద్ద తల్లి గుడి ముందు రగిల్చిన మంటల వెలుగుల్లో సమీపంలోని దట్టమైన చింతచెట్టు కొరివి దెయ్యాల్లా కనిపిస్తున్నాయి.

    "ఊళ్ళో ఎవరో చచ్చిపోయారు... శవదహనం జరుగుతోంది... మనం అక్కడికి వెళ్లడం ఈ సమయంలో మంచిది కాదు..." నెమ్మదిగా చెప్పాడు కపాలేశ్వర్.

    ఏటవాలు కొండమీంచి, ఊరు స్పష్టంగా కన్పిస్తోంది... అరుపులు స్పష్టంగా విన్పిస్తున్నాయి.

    "ఎక్కడా ఏ మాత్రం శబ్దం చెయ్యకుండా, ఈ ఊరుని దాటేద్దాం... శవదహనాన్ని ఇతరులు చూశారని వాళ్ళకు తెలిస్తే... బాణాల్తో పొడిచి చంపేస్తారు..." మళ్ళీ చెప్పాడు కపాలేశ్వర్.

    యువరాజు, కపాలేశ్వర్ చేతుల్లో టార్చిలైట్లున్నాయి... నెమ్మదిగా కొండ దిగి, వాగు పక్క నుంచి ఊపిరి బిగపట్టి నడుస్తున్నారు.

    తప్పెట్ల మోత, పూజారి అరుపులు క్రమంగా ఎక్కువయ్యాయి. అందరూ ముందు నడుస్తున్న దశలో కపాలేశ్వర్-

    "ఈ ఆచారం ఏదో వింతగా వుంది... నేను చెట్టు చాటునుంచి చూసొస్తాను... మీరు నడుస్తుండండి" అని చెప్పి, ఇందుమతి కళ్ళవేపు చూశాడు ఇందుమతి ఆశ్చర్యంగా చూసింది అతనివేపు.

    "ఇలాంటి ఆచారాలు... తెలుసుకోవటం... అవసరం... ముందు ముందు... మనకు ఉపయోగపడతాయి."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra