Home » Suryadevara rammohan rao » జనవరి 5

  

       ఆ తరువాత 3, 200 అమెరికన్ డాలర్స్ (రూ.52,800) పెట్టుబడి పెట్టి 600 సెకండ్ హేండ్ చిన్నపాటి వార్ సర్ఫ్ లస్ యింజన్స్ కొన్నాడు.
   
    అవి గేసో లైన్ ఇంజన్స్.
   
    యుద్ద సమయంలో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తిచేసే జనరేటర్స్ గా వాటి నుపయోగించటం జరిగింది.
   
    టూ స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్స్ ని కొద్దిపాటి మార్పులతో బైస్కిల్స్ కి ఏక్సిలర్ పవర్ ను సప్లయ్ చేసే విధంగా తయారు చేసాడు హోండా.
   
    జపాన్ లో, అప్పట్లో గేసోలైన్ చాలా ఖరీదు వుండేది. సాధారణ పౌరులు దాన్ని కొనగలిగేవారు కాదు. పైగా గేసోలైన్ ఉత్పత్తి చేసే సప్లయ్ కూడా చాలా తక్కువగా ఉండేది.
   
    వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సాయ్ ఛిరో హోండా ఆ ఇంజన్స్ పని చేసేందుకు టర్పెంటాయిల్ ని గేసోలైన్ ఆయిల్ తో కలిపి సరికొత్త ఇంధనాన్ని తయారుచేసాడు. తను కొన్న ఇంజన్స్ అమ్ముకునేందుకు అతను ఎంతో శ్రమకోర్చి ఎన్నో ప్రయోగాలు చేయవలసి వచ్చింది.
   
    అతను కనుగొన్న ఆ పక్యం బాగా పనిచెయటమేకాక, తక్కువ ధరకే లభ్యమయ్యే వీలుండటంతో, హోండా దగ్గరున్న ఇంజన్స్ త్వరగా అమ్ముడు పోసాగాయి. దాంతో అనుకోకుండా రెండో వ్యాపారం మొదలయింది. తన ఇంజన్స్ కొన్న వినియోగదారులు వాటిని నడిపించగల ఫ్యూయల్ కోసం తిరిగి హోండా దగ్గరికే రాసాగాయి.
   
    మొదటి సంవత్సరం హోండా 9 లక్షల ఏడువేల రూపాయల అమ్మకాలను సాధించాడు. అయితే పెట్టిన ఖర్చులు ఎక్కువ కావటంతో లాభం ఏమీ రాలేదు. కాని మరో సరికొత్త ఆలోచన అతనిలో ఊపిరి పోసుకుంది.
   
    తనే సొంతంగా ఇంజన్స్ ని ఎందుకు తయారు చేయకూడదన్నదే ఆ ఆలోచన.
   
                      *    *    *    *    *
   
    హార్డ్ డ్రయివింగ్ ఇన్ వెంటర్....
   
    మేగ్నిఫిషియంట్ ఇంటిలిజెంట్.
   
    యంత్రాల అంతరాళంలోకి పాదరసంలా దూసుకుపోయే చురుకుదనం.... యంత్రసమస్యల్ని స్కాన్ చేసి ఆ సమస్యలను పొరలుగా, అరలుగా విడగొట్టగల మేథస్సు.... హోండా సొంతం.
   
    చూస్తుండగానే హోండా బిరీల్డ్ చేసిన ఇంజన్ల అమ్మకాలు బాగా పెరిగిపోయాయి.
   
    నిజానికి హోండాకి మార్కెటింగ్ సైడ్ అనుభవం లేదు. మార్కెటింగ్ గిమ్మిక్స్ అంతకంటే తెలీవు. అతని కెంతసేపు యంత్రాల గురించే ఆలోచన కాని కాలగమనంలో ఒక వ్యాపారసంస్థ నిలదొక్కుకోవాలంటే మార్కెటింగ్ ఎంత అవసరమో గుర్తించాడు.
   
    తన వస్తువులు అమ్ముడుపోవాలి. తనకు లాభాలు రావాలి లేదంటే తను తన సంస్థ మూసేసుకోవాల్సి వస్తుంది.
   
    అందుకే బాగా ఆలోచించి రీబిల్డ్ ఇంజన్స్ అమ్మే ఒక డీలర్ తో ఒక ఎగ్రిమెంట్ కి వచ్చాడు. అతనితో కల్సి మోటార్ సైకిల్స్ కన్వెర్షన్ కిట్స్ బైస్కిల్స్ కోసం అమ్మటం ప్రారంభించాడు. మార్కెటింగ్ బర్డెన్ ని ఆ విధంగా తాను కలుపుకున్న డిస్ట్రిబ్యూటర్ మీద మోపాడు.
   
    తనకు తెచ్చిన హోండా జీవితాన్ని ఇన్ స్పిరేషన్ కోసం నెమరు వేసుకుంటున్న విమల్ ఏదో శబ్దం వినిపించటంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకున్నాడు.
   
    గుమ్మంలో మేఖల నించుని విమల్ కేసే ఆసక్తిగా చూస్తోంది.
   
    కడిగిన ముత్యంలా, వెన్నెల జలపాతంలా, యౌవనపు ప్రఘోషంలా కనిపిస్తున్న మేఖలను చూసి కలవరపడ్డాడు విమల్. సహజసిద్దమైన ఆపోజిట్ సెక్స్ రియాక్షన్ కి గురయ్యాడో క్షణం.
   
    "రావచ్చా?" మేఖల నవ్వుతూ ప్రశ్నించింది.
   
    అతను తడబడుతూ రమ్మన్నట్లుగా తలూపాడు.
   
    మేఖల వచ్చి టేబుల్ కి ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుంది.
   
    "ఎలా వుంది వ్యాపారం?" మేఖల అతనికేసి ఆసక్తిగా చూస్తూ అడిగింది.
   
    అతను వెంటనే సమాధానం యివ్వలేదు.
   
    "చూస్తూ కూడా అడిగానని అపార్ధం చేసుకోకండి. మీకిష్టమైతేనే చెప్పండి" అందామె తిరిగి,
   
    "ఇది రెండోరోజు.....ఇంతవరకైతే ఏమీ లేదు. చూడాలి ఏమవుతుందో" అతని మాటల్లో నిరాశా, నిస్ప్రుహలయితే తొంగిచూడలేదు కాని, నిర్లిప్తత మాత్రం లీలగా గోచరించింది.
   
    "నా గురించి అడగరేం...?"
   
    "ఇతరుల గురించి మనం అడిగినప్పుడు మనం కూడా యితరులకు మన గురించి చెప్పటం మర్యాద కదా!"
   
    ఆ రెండురోజుల తన అనుభవాలను చెప్పింది. చివరగా నా పరిస్థితి ఎలా పరిణమించవచ్చని అడిగింది.
   
    "ఆ టైలర్, సేల్స్ మెన్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. మీ వ్యాపారంలో పాలుపంచుకుంటారు"
   
    "అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?"
   
    "మీరు ఆఫర్ చేసిన పాతికవేల డిపాజిట్స్ ఇవ్వజూపిన వాటాలు, వాళ్ళనే రప్పిస్తాయి"
   
    "థాంక్యూ....నేను బోణీ చేయనా మీ వ్యాపారానికి?" ఆమె అభిమానంగా అంది.
   
    అతనో క్షణం ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు.
   
    "రడీమేడ్ దుస్తుల తయారీలో నేను విజయం సాధించాలంటే ఏం చేయాలి?" ఆమె సీరియస్ గా అడిగింది.
   
    ఆమె కంఠంలో ధ్వనించిన సీరియస్ నెస్ ని అతను గుర్తించాడు.

    "మీరు తీసుకునే ఫీజు నాకు మాత్రం రీజనబుల్ గా ఉండాలి. నాల్గు డబ్బులు సంపాదించాక కావాలంటే ఎక్కువ యిచ్చుకుంటాను" అందామె చిరునవ్వుతో.
   
    "థాంక్యూ-కనీసం మీరయినా గుర్తించారు. నేను మీకిచ్చే ఐడియా సక్సెస్ అయితే-ఐ మీన్.... చేసుకోగలిగితే మీరు నాకివ్వటం కాదు. మీరేది అడిగినా నేనే యిస్తాను....." అని క్షణం ఆగాడు.
   
    ఏదడిగినా అనే మాటకు విమల్ ష్టికాన్ చేస్తే....?
   
    ఆ మాట మీదే నిలబడమని అడిగితే....?
   
    ఆమె అలా ఆలోచిస్తూండగా అతను చెప్పటం ప్రారంభించాడు.
   
    "ఈ కాలపు యువతలో వారి ఫ్యాషన్స్ లో నెగిటివ్ అప్రోచ్ ఎక్కువ వుంటుంది. ఒక రౌడీని, గూండాని, గజదొంగని, హీరోని చేసి సినిమా తీస్తే హిట్ అవుతుంది. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో, హీరోల పాత్రలన్నీ నెగిటివ్ క్యారెక్టర్సే. ఆవేశం, అగ్రెసివ్ నెస్, అవసరమయితే పదిమందిని తన్నే సామర్ధ్యం ఉన్న పాత్రల్ని ప్రేక్షకులు యిష్టపడతారు. నిజజీవితంలో నిజంగా పదిమందిని ఎదుర్కొనగలడా అన్న యదార్ధాన్ని వాళ్ళు పట్టించుకోరు. రఫ్ గా, మొరటుగా ఉన్న హీరోలనే హీరోయిన్ ఆకర్షిస్తున్నట్టు సినిమాలో చూపిస్తుంటారు. ఓహో-అది నిజమే కాబోలని నేటి తరపు యువకులు అలాగే కనిపించేందుకు ప్రయత్నిస్తారు. అవసరమయితే పదిమంది గూండాల మధ్య చిక్కిన తనను రక్షించుకోగల వ్యక్తినే యువతులూ యిష్టపడుతుంటారు.
   
    దీనిని బట్టి సినిమాలు నేటితరాన్ని పాడుచేస్తున్నాయని నా ఉద్దేశం కాదు.
   
    సమకాలీన జన జీవనాన్ని, జీవిత విధానలనీ ఒకింత ఎగ్జాగరేట్ చేసి చూపిస్తాయి సినిమాలైనా, నవలలైనా.
   
    వీటి ప్రభావం యువత మీద అసలుండదని చెప్పటమూ తప్పే- అవే పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పటమూ తప్పే ఎక్కడో ఒంగోలులో గూండాగిరి జరిగితే ప్రచారసాధనాలు లేనట్లయితే ఒంగోలులో వుండే యువతకే ఆ విషయం తెలుస్తుంది ప్రచార సాధనాలు విస్తృతంగా దేశవ్యాప్తంగా పర్చుకుపోయాయి గనుక కొన్ని గంటలలోనే ఆ విషయం రాష్ట్రవ్యాపిత యువతకు తెల్సిపోతుంది. ఇంకా తరువాత ఆ సంఘటనను ఉత్తేజంగా తీసుకొని ఒకింత డ్రైమటైజ్ చేసి సినిమాలు, నవలలు వస్తుంటాయి.
   
    సినిమాలు, నవలలు సమకాలీన జీవన విధానాలకు కొన్ని యోజనాల దూరంలో మాత్రం ఉండవు. స్పిల్ బెర్గా తన సినిమాల్లో ఇతర గ్రహాలకు మనిషి వెళ్ళటాన్ని, అక్కడ జీవరాశులు భూమ్మీదకు రావటాన్ని చూపిస్తాడు. అంతరిక్ష పరిశోధనల్లో పూర్తిగా వెనుకబడి వున్న ఇండియాలోని ప్రజలకు అది అభూత కల్పనగా నేటివిటీకి దూరంగా వున్నట్లనిపిస్తుంది. అదే అమెరికాలోని ప్రజలకు అలా కనిపించదు. వాళ్ళకా ప్రయోగాలు కొత్తకాదు. బ్యాక్ టు దీ ఫీచర్ అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులోని హీరో ఒక టైమ్ మెషిన్ ని కనుక్కొని భూతకాలంలోకి ప్రయాణించి అప్పట్లో జరిగిన సంఘటనల్ని చూడగలుగుతాడు.
   
    సో.....మనదేశంలో జరిగే సంఘటనలు వివిధ ప్రసారమార్గాల ద్వారా ప్రజల్ని టచ్ చేస్తాయి.
   
    ఇవన్నీ కలిసి యువత అభిరుచుల్ని నిర్ణయిస్తాయి. వారి ఫాషన్స్ ని ప్రభావితం చేస్తాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra