Home » Vasireddy seeta devi novels » బంధితుడు


    ఆ గాజులు తనకు ఎరియర్స్ వచ్చినప్పుడు చేయించాడు.

    అవి కొన్నరోజు పద్మముఖం సంతోషంతో ఎంతగా వెలిగిపోయింది? ఆ రోజు సరోజ అన్నయ్యలేడు.

    పద్మ గాజులు తను దొంగతనంగా తెచ్చి చెల్లిలికి ఇవ్వడం ఏమిటి? నిజంగానే తను ఒట్టిపూల్!

    సెంటిమెంటల్ పూల్!

    పద్మను ఎన్నిసార్లో  మానసిక వ్యధకు గురిచేశాడు.

    పద్మ మొదటినుంచీ అంటూనే ఉంది.

    తనే  కానకపోయాడు.

    పద్మకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు.

    సరోజ అంటే అసూయ అనుకున్నాడు. ఆడబిడ్డ పొడగిట్టదనుకున్నాడు. సరోజ విషయంలోనే పద్మను రెండుసార్లు కొట్టాడు. పైగా యీసారి ఆమె గాజులు దొంగిలించాడు. మాట మాత్రం చెప్పేలేదు.

    చాలా అభిమానం గల మనిషి; ఎంత బాధ పడుతుందో! ఎలా ఉందో?

    తన చెల్లెలికంటే హరికృష్ణే నయం! అతనికి తనమీద వున్నపాటి అభిమానం తన చెల్లెలికి లేదే!

    పోనీ, వాళ్ళిద్దరూ బాగున్నారు!

    అంతే చాలు!

    తనకు కావాల్సింది అదేగా?

    తనకు యింక యిక్కడేం పని!

    సత్యనారాయణ మంచంమీదనుంచి లేచినిలబడ్డాడు. మెల్లగా తలుపు తీసుకుని హాలులోకి వచ్చాడు.

    గడియారంలోని పెండ్యులం కాలాన్ని  ముక్కలు ముక్కలుగా  నరుకుతూ వుంది. 'టిక్ టిక్' మని శబ్దం చేస్తూ.

    పన్నెండు గంటలు దాటింది. మూడు గంటలకు బండివుంది. ఆ మూడుగంటలూ స్టేషన్ లోనే గడపొచ్చు!

    సత్యనారాయణ టేబుల్ మీద వున్న తన చేతిసంచి తీసుకొని చిన్నగా తలుపు తెరిచాడు. బయటకొచ్చి తలుపు దగ్గరగా వేసి  చీకట్లో కలిసిపోయాడు.

    నవంబరు నెల. చలి ఎముకల్ని కొరికేస్తూంది.

    సత్యనారాయణ నిర్మానుష్యంగా వున్న రోడ్డుమీద నడుస్తున్నాడు.

    ఆటో స్టాండులో  ఆటో ఎక్కాడు.

    స్టేషన్ లోని వెయింటింగ్ రూంలోకి రాగానే సత్యనారాయణకు మరీ ఎక్కువ చలి అనిపించింది.

    సిగరెట్ పెట్టేకోసం జేబులో చెయ్యిపెట్టిన సత్యనారాయణ చెల్లేలు రాసిన ఉత్తరం చేతికి తగిలింది.

    తాచుపాము చేతికి తగిలినట్టయి పోయాడు.

    ఉత్తరం తీసి పరపరా చింపిపారేశాడు. కాగితం ముక్కల్ని పిచ్చివాడిలా చూస్తూ కూర్చున్నాడు సత్యనారాయణ.

    క్రిందటరోజు ఉదయం చెల్లేలి దగ్గరనుండి ఉత్తరం వచ్చినప్పటినుంచీ అంతవరకూ జరిగిన సంఘటనలన్నీ, ఒక్కొక్కదాన్నే మనసులో చిత్రించుకుంటూ, చలికి వణికిపోతూ మోకాళ్ళ మీద తల ఆనించి కూర్చున్నాడు సత్యనారాయణ.

    మూడు గంటలూ ఎలాగో గడిపి బండి రాగానే ఎక్కికూర్చున్నాడు.

    పండగపూట తన పిల్లలూ, భార్యా యెలా వున్నారో!

    అసలు వంట చేసిందో లేదో?

    అంతచేసిణా పిల్లలకు పెట్టి తను తినలేదేమో?

    ఎలా తింటుంది?

    అన్నం ఎలా సహిస్తుందా? కట్టుకున్న భర్త అంత పనిచేస్తే? అసలే అభిమానవతి, మొండిఘటం! ఎంత వ్యధకు గురైందో!

    తనవన్నీ పిచ్చి ఊహలు, భ్రమలూనూ!

    హరి అన్నట్టు వట్టి సెంటిమెంటల్ పూల్!

    అందరి గుంచీ బాధపడుతూ వుంటాడు.

    తన చెల్లెల్ని గురించి వస్తూ అలాగే అనుకున్నాడు.

    ఈ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. అసలు ఆడవాళ్ళే అంత!

    తన పెళ్ళాంకూడా బాగా గారెలూ, బూరెలూ వండుకొని తినే వుంటుంది!

    పండక్కు ఇంకో కొత్తచీర కట్టుకొని త్తెతక్కలాడి వుంటుంది.

    దానిదగ్గర తనకు తెలియకుండా బోలెడంత డబ్బు వుంది.

    చూడలేదుగాని, ఏ చీరల మడతలో దాచే వుంటుంది. పుట్టింటివాళ్ళు వున్నవాళ్ళేగా? అదే దాని అహం!

    మొన్న వాళ్ళ నాన్నా వచ్చినప్పుడు ఏ మాత్రమో యిచ్చేవుంటాడు. ఇంట్లో అంతా దాని పెత్తనమూ, దాని వాళ్ళ పెతనమే నాయే! తనేమన్నా పట్టించుకుంటాడా, ఏమన్నానా?

    తను వట్టి అసమర్థుడు!

    దద్దమ్మ!

    వాజమ్మ!

    సూటిగా అనకపోయినా భార్యమాటల్లో అదే భావం ఎన్నిసార్లు తనకు గోచరించలేదు! అయినా ఏం చేశాడు?

    నిజంగా తను దద్దమ్మే!
   
    అందుకే అందరి గురించి తను అంతగా ఆలోచిస్తాడు, బాథపడ్తాడు.

    తనను గురించి ఎవరూ ఆలోచించరు.

    తన గురించి బాధపడేవాళ్ళే లేరు.

    అనవసరంగా తనను తను హింస పెట్టుకుంటున్నాడు.

    వాళ్ళు- అదే- ఆడవాళ్ళు స్వార్థపరులు. తమను గురించే ఆలోచించుకొంటారు.

    చీరెలూ, నగలూ ఉంటే చాలు!

    అందుకే మొగుడు బతకాలని ప్రార్థించరు.

    నా పరుపు, కుంకం కాపాడమని ప్రార్థిస్తారు.

    తన పెళ్ళానికేం? బాగానే ఠింగురంగా మంటూ వుంటుంది.

    ఏ దిగులూ లేకుండా పండగ చేసుకొని వుంటుంది.

    తనంటే అసలు దానికి గౌరవమేలేదు.

    స్వార్థం, అహంకారం దానిలో గూడుకట్టుకొని వున్నాయి. తన చెల్లెలి పోడ బొత్తిగా దానికి గిట్టదు.

    దానికి తనంటే ప్రేమ లేదా?

    అభిమానం లేదా?

    పైకి చూపించదు.

    కాని తనంటే తన  భార్యకు చాలా గౌరవం!

    ఎంతో ప్రేమ! తనే తన భార్యను అర్థంచేసుకోలేదు.

    చేతులారా ఇదంతా తెచ్చి పెట్టుకున్నాడు.

    పద్మ అంటూనేవుంది, తనే వినిపించుకోలేదు. అనవసరంగా దానిమీద చెయ్యి చేసుకున్నాడు.

    పద్మ మాత్రం తక్కువైందా?

    నోటికి ఏదోస్తే అదే అనేస్తుంది!

    తను లేకపోవడం తన పెళ్ళానికి ఇంకా హాయిగా వుండివుంటుంది.

    బహుశా దాని చెల్లేలూ, పిల్లలూ పండక్కు వచ్చి వుంటారు. లేదు! వాళ్ళు వస్తే తను బయలుదేరే  సరికే రావాలి.

    అదే తనమీద కోపంతో పుట్టింటికి పోయి వుంటుంది.

    పుట్టింటిలో అందరి మధ్యా గారెలూ బూరెలూ తింటూ హాయిగాను వుండి వుంటుంది.

    తనే అనవసరంగా పిచ్చి ఊహలతో బాధపడుతున్నాడు.

    అది తను వెళ్ళేటప్పటికి ఇంట్లో వుండదు.

    పుట్టింటిలో హాయిగా తింటూ కులుకుతూ వుంటుంది.

    తను దాన్ని రమ్మని చస్తే రాయడు.

    వస్తే వస్తుంది లేకపోతే లేదు.

    తనూ చూస్తాడుగా? మొగుణ్ని వదిలేసి పుట్టింటిలో ఎంతకాలం వుండగలదో? ఎంతకాలం పుట్టింటివాళ్ళు పెడ్తారో!

    చివరకు అదే వస్తుంది. తనను క్షమించమని ప్రాథేయపడుతుంది! కాళ్ళమీద పడుతుంది.

    సత్యనారాయణ ఆలోచనల తాకిడికి అలసిపోయాడు.

    మెదడంతా ఏదో తినేస్తున్నట్టు వుంది!

    మనసును ఏదో పురుగు తొలిచేస్తుంది!

    ఎవరిమీదో, ఎందుకో కసి! మనసంతా కసికసిగా వుంది.

    బాధతో కుములుతూ కుములుతూ రైలు కుదుపులకు కునుకు తీశాడు సత్యనారాయణ.

    రైలు వేగంగా, శరవేగంగా పరుగులు తీస్తూంది.

    చెట్లూ, చేలూ, టెలిగ్రాఫ్ స్తంభాలూ, స్టేషన్లూ రయ్యిమని వెనక్కు పోతున్నాయ్!

    గంట గడిచాయి.

    మైలురాళ్ళు వెనక్కు జరిగాయి.

    సాయంకాలం అయింది. చలిగాలి ప్రారంభం అయింది.

    సత్యనారాయణ రైలుకిటికీ బద్దపై గడ్డం ఆనించి అస్తమిస్తున్న సూర్యుణ్ని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు.

    చీకటి పడుతోంది.

    సత్యనారాయణ గుండెలో కూడా చీకట్లు అలుముకుంటున్నాయి.

    బండి స్టేషన్ లో ఆగింది.


                                                                                           16


    సత్యనారాయణ బండి దిగి సంచి చేత్తో పట్టుకుని స్టేషన్ రోడ్డునే ఇంటి నడక సాగించాడు.

    వేగంగా నడుస్తున్నాడు.

    అతని ఆలోచనలు మధ్యమధ్య అతని కాళ్ళకు అడ్డం పడుతున్నాయి.

    అనుకోకుండా ఓ క్షణం నిలబడిపోయి  మళ్ళీ నడక సాగిస్తున్నాడు.

    తరుముకోస్తున్న చీకట్లను  తరిమికొడ్తూ అప్పుడే మునిసిపాలిటీ దీపాలు  వెలిగాయి.

    సత్యనారాయణ స్టేషన్ రోడ్డునుంచి తను వుండే వీధి మలుపు తిరిగాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra