Home » Balabhadrapatruni ramani » ఆ ఒక్కటీ అడిగేసెయ్


    ఆశ్రిత అందర్నీ తప్పించుకుంటూ ముందుకు పరిగెత్తి రిషిని ఒడిలోకి తీసుకుంది. రిషి కళ్ళు మూసుకుపోతుండగా "ఆశ్రితా వచ్చావా!" అన్నాడు, వెంటనే అతని కళ్ళు మూసుకుపోయాయి. రక్తం ధారగా కారిపోతోంది.

    "రిషీ.... కళ్ళు తెరు...." ఆశ్రిత ఏడుస్తూ కుదిపేస్తోంది.

    "అంబులెన్స్ వచ్చింది. త్వరగా ఎక్కించండమ్మా" లింగం ఆమె ఒడిలోంచి రిషిని లేవదీస్తూ అన్నాడు.

    ఆశ్రితకి కళ్ళ ముందు జరుగుతున్నదంతా ఇంకా కలలాగే వుంది. డీప్ షాక్ లో వున్నదానిలా వాళ్ళని అనుసరించింది.

    రిషి అపస్మారకంగా పడి ఉన్నాడు.

    "ఇతను మీకు తెలుసా తల్లీ?" అని లింగం అడిగిన ప్రశ్నకి ఆశ్రితకి ఎం సమాధానం చెప్పాలో తెలీక బ్లాంక్ గా చూస్తుండిపోయింది.


                                                                   *    *    *    *

    "ఆశ్రితా! కంట్రోల్ యువర్ సెల్ఫ్!" ఆశ్రితని దగ్గరగా తీసుకుంటూ చెప్పింది శ్రీజ.

    ఆశ్రితకి దుఃఖం ఆగడంలేదు. "నా ఎదురుచూపులు ఇందుకోసమా? అతన్ని ఇలా చూడడం కోసమా?" ఏడుస్తూనే అడిగింది.

    "రిషికి ఏమీకాదు. ఊర్కో!" చెప్పింది శ్రీజ. రిషి గదిలోంచి డాక్టర్ బైటికి రాగానే అందరూ చుట్టుముట్టారు.

    ఎలావుంది రిషికి?" మధు ఆతృతగా అడిగాడు.

    "కళ్ళు తెరిచాడా?" ముసలాయన కంగారుగా అడిగాడు.

    "మీ కాళ్ళు పట్టుకుంటాం. అబ్బాయిని కాపాడండి బాబూ!" వనజాక్షి కళ్ళ నీళ్ళతో అంది.

    "ఉష్. ఊర్కో. అబ్బాయికి ఏమీకాదు. ఏడుకొండలూ నడిచి వస్తానని వెంకన్నకి మొక్కుకున్నానుగా" అంది బామ్మగారు.

    "ఊకె లొల్లి చేయకండి. డాక్టర్ సాబ్ ని చెప్పనీయండి!" మల్లేష్ అరిచాడు.

    "మీలో ఆశ్రిత ఎవరు? ఆ పేరే కలవరిస్తున్నాడు" డాక్టర్ చెప్పాడు.

    "నేనే!" ఆశ్రిత గభాల్న లేస్తూ అంది.

    "మీరొక్కరూ లోపలికి వెళ్ళండి. 24 గంటలు గడిస్తే గండం బయటపడినట్లే!" చెప్పాడు డాక్టర్.

    ఆశ్రిత ఆపుకోలేనంత వుద్వేగంగా లోనికి పరిగెత్తింది.

    తలకీ, భుజానికీ కట్లతో, దీనంగా వున్న రిషిని చూస్తే ఆమెకి ఏడుపు ఆగలేదు. పైట కొంగు నోట్లో కుక్కుకున్నా శబ్దం పైకి వస్తూనే వుంది.

    ఆ రాత్రంతా మూసివున్న ఆ కనురెప్పలకేసే ఆశగా చూస్తూ ఆమె జాగారం చేసింది. అతని జుట్టులోనికి వేళ్ళు జొనిపి రాస్తూ, అతని నుదుటి మీద చుంబిస్తూ మౌనంగా వేడుకుంది- "నా మనసనే తెల్లకాయితం మీద నీ జ్ఞాపకాల అల్లిబిల్లి గీతలు అర్ధం కాకుండా గజిబిజి చేస్తున్నాయి. ఎం వ్రాయదలుచుకున్నావో అర్ధమయ్యేటట్లు చెప్పు!" అని.

    దినకరుడు వెండి గిన్నెలో వేకువని తెచ్చి రాశిగా పోస్తుండగా రిషికి మెలకువ వచ్చింది తెరిచిన ఆ కనులకి ఎదురుగా ఆశ్రిత దర్శనమిచ్చింది.

    "శుభోదయం!" అంది తడిసిన మంకెనల్లాంటి ఎర్రని కళ్ళతో.

    "అవును, శుభోదయమే!" అతను ఆమెని అపురూపంగా చూస్తూ అన్నాడు.

    "రిషీ!" ఆమె తట్టుకోలేనట్లుగా అంటూ అతని ఎదకి తన తల ఆన్చింది.

    "మా ధియేటర్లోనే పని చేస్తున్నట్లు నాకు తెలియనే తెలియదు రిషి" అంది.

    అతని మనసు ఆమెతో గుసగుసగా అంది: "నీ జ్ఞాపకాల వడగళ్ళ ధాటికి నా భావనల కాయితపు పడవలు తట్టుకోలేకపోయాయి. నా తాలూకు విరహపు పెనుగాలి తాకిడికి నా చిరు ఆశాదీపం కొట్టుమిట్టులాడిపోయింది. అయినా నువ్వు వస్తావనే నా ఆశ. అలాగే వచ్చావు. చూసావా!"

    ఆశ్రిత అతని కళ్ళలోకి చూసి నవ్వింది.

    "ముద్దు పెట్టుకోవాలని వుంది. కానీ శరీరం సహకరించడం లేదు" చెప్పింది మనసు.

    ఆశ్రిత వంగి అతని పెదవుల మీద తన పెదవులతో తియ్యని ముద్ర వేసింది. ఆమెని అలాగే అదిమిపట్టుకుంటూ "ఇంక వదలను. పారిపోతావు" అన్నాడు రిషి.

    "ఎలా ఆపుతావు? శాశ్వతంగా ఇంకొకరి స్వంతం అయిపోబోతూన్నాను నేను" అంది ఆశ్రిత.

    "నో!!" రిషి ఆవేశంగా అరిచాడు.

    "యస్!" ఆశ్రిత నెమ్మదిగానే అయినా వాడిగా అంది. "ఆదివారం నాకు నిశ్చితార్ధం. ఇలా ఒళ్ళంతా కట్లతో పడివున్న నువ్వు ఎలా ఆపుతావు?"

    రిషి షాక్ కొట్టినట్లు చూసాడు. "ఏవిటి నువ్వంటున్నది? నిజమా?" అడిగాడు.

    "అవును. నాన్నగారు నన్నో కోటీశ్వరుడికి కోడల్ని చెయ్యాలను కుంటున్నారు" అంది ఆశ్రిత.

    "నువ్వు అందుకు ఒప్పుకున్నావా? అంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతున్నావు ఆశ్రితా?" రిషి బాధగా అడిగాడు.

    ఆశ్రిత అతని కళ్ళల్లోకి చూస్తూ దృఢంగా అంది. "ఏం చెయ్యమంటావు? నా పరిస్థితిలో వుంటే నువ్వేం చేస్తావు?"

    రిషి కోపంగా "చచ్చినా ఒప్పుకునేవాడ్ని కాదు! ప్రేమించిన వాడి దగ్గరకు పారిపోయి వచ్చేసుండేవాడ్ని!" అన్నాడు.

    "ఆ తర్వాత?...." ఆశ్రిత రెట్టించింది.

    "హాయిగా ఇద్దరం కలిసి...." అని రిషి ఆమె నవ్వడం చూసి ఆగిపోయాడు.

    "హాయిగా ఇద్దరూ కలిసి పస్తులుంటూ, ఆకలి బాధకి తాళలేనప్పుడు ఒకళ్ళని ఒకళ్ళం నీవల్లే ఇలా బ్రతకాల్సి వస్తోంది అని నిందించుకుంటూ చివరికి ఒకర్ని ఒకరం అసహ్యించుకునే స్థాయికి దిగజారిపోయి...."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra