Home » D kameshwari » Madhupam


    ఇన్ స్పెక్టర్ , "సర్, స్టేషన్ కి రండి రిపోర్టు రాసిద్దురు గాని ...." అన్నాడు.
    "బాడీ.... ఎప్పుడిస్తారండి" పక్కింటి సుబ్రహ్మణ్యం అడిగాడు.
    "పోస్టుమార్టం అవాలి గదా. ఈలోగా మీ బంధువులందరికీ తెలుపుకోండి. కనీసం పన్నెండు వంటిగంట అవచ్చు. పోస్టుమార్టం చేసే డాక్టరు , స్టాఫ్ రావాలి గదా."
    సుధాకరమూర్తి, ప్రదీప్ పోలీస్ స్టేషన్ కెళ్ళి రిపోర్టు ఇచ్చి వచ్చారు. శవాన్ని పోస్టుమార్టం కి ప్రభుత్వాసుపత్రికి తీసికెళ్ళారు. ఊర్లో ఉన్న సుధాకర్ మూర్తి అక్క బావ, వచ్చారు. కబురు తెలిసి. స్నేహితులు , సరోజ ఆఫీస్ స్టాప్ కబురు తెలిసి ఒక్కొక్కరే వచ్చారు. బాడీ వంటి గంటకి ఇంటికి తీసుకొచ్చారు. సరోజ తల్లిదండ్రులు మర్నాడు పది గంటలకి గాని రాలేరు. అంచేత బాడీ అంతసేపు ఉంచడమా సాయంత్రం లోగా దహన సంస్కారం జరపడమా అన్న తర్జన భర్జనల తరువాత రాత్రి ఎప్పుడో పోయిన శవాన్ని ఇంకా ఉంచడం అనవసరం అని అంతా తీర్మానం చేసి ఐదు గంటల కల్లా శవాన్ని తీసికెళ్ళి దహన సంస్కారాలు జరిపించారు.
    
                                            *    *    *    *
    సరోజ పోయి అప్పటికి వారం అయింది. హత్య జరగడానికి కేవలం డబ్బు నగలు దోచుకోడానికి అంటే నమ్మబుద్ది కావడం లేదు ఇన్ స్పెక్టర్ కి . ఎంచేత అంటే సుధాకర్ ఊరికి వెళ్ళాడని , సరోజ వక్కర్తే ఉందని దొంగలకి తెలుసా? ఎవరన్నా తెలిసినవారు చెసారా? చేయడానికి కారణాలు, మోటివ్ ఏమిటి? అసలు హత్య చేసిన వారు ఎవరు? ఎలా లోపలకు వచ్చారు? ఏ మామూలు దొంగలో అయితే ఇరవై నాలుగు ఫ్లాట్స్ వుంటే, ఈ ఇంతలోకే దూరి కాస్తపాటి నగలు, డబ్బు కోసం హత్య చేస్తారా? లోపలికి ఎలా రాగలిగారు? - సరోజ తలుపు తీసిందా? - అర్ధరాత్రి ఎవరో తెలీకుండా అంత సులువుగా తలుపెందుకు తీసింది? పోస్టుమార్టం ప్రకారం హత్య పన్నెండు తరువాత వంటి గంటన్నర లోపల జరిగి ఉండవచ్చని వచ్చింది. సరోజకి ఎవరో తెలిసిన వారా? రెండు తాళాలలో సుధాకర్ దగ్గిర ఒక తాళం ఉంది. భార్యని హత్య చేసే కారణం ఏమిటి అతనికి? ముందురోజు సాయంత్రం 6 గంటల వరకు విజయవాడలో ఉన్నట్టు మాట్నీకి వెళ్ళినట్టు, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్  రాత్రి తొమ్మిదిన్నర కి ఎక్కినట్టు టిక్కెట్టు చూపిస్తుంది. అసలు అతను చేసాడనడానికి మోటివ్ ఏమిటి? భార్య మీద ఏదన్నా అనుమానమా/ భార్యకి ఇంకొకరితో ఎవరితో నన్నా అక్రమ సంబంధం ఉందని అతనికి తెలిసిందా? లేక, ఇతనికేమన్నా వివాహేతర సంబంధాలుండి భార్యని వదిలించుకోవడానికి ప్లాన్ చేశాడా/ అతని మొహం, మాటలు చూస్తె అలా అనుమానించదగ్గ ఆధారాలు కలపదలేదే? రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఏ ఒక్కదానికి సరి అయిన ఆధారాలు, లింకు అతనికి దొరకడం లేదు.
    సరోజ హత్య జరిగిన మర్నాడు ఇన్ స్పెక్టర్ సునీల్ వర్మ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ని రకరకాలుగా ప్రశ్నించాడు. అతని మాటల వల్ల తెలిసిన విషయాల బట్టి అపార్ట్ మెంట్ లో నీళ్ళ ప్రాబ్లం వుండడం వల్ల రోజూ రాత్రి పన్నెండు వంటి గంట మధ్య తప్పకుండా వాటర్ టాంకర్ వస్తుంది. అవసరమైతే రెండు వస్తాయి. అర్ధరాత్రి - ఆటైములో వాచ్ మెన్ వెనుక పక్క గేటు తెరిచి టాంకరు ని లోపలికి రానిచ్చి నీళ్ళు సంప్ లోకి పోయిస్తాడు. అపుడు మెయిన్ గెట్ కి తాళం ఉంటుంది. పన్నెండు పన్నెండు న్నరకి సినిమాల నించి, క్లబ్బుల నించి వచ్చేవాళ్ళు వచ్చాక కార్లు వచ్చే గేటు తాళం పెట్టి, మనుషులు నడిచే చిన్న గేటు తీసి వుంచుతాడు. ఎవరన్నా రావడానికి వీలుగా , టాంకరు వచ్చి వెళ్ళాక రెండు గంటల ప్రాంతంలో చిన్న గేటు తాళం పెట్టి గేటు ముందే పక్క పరచుకుని నడుం వాలుస్తాడు. తర్వాత ఎవరన్నా వస్తే అడిగి, చూసి తాళం తీస్తాడు. అదీ అక్కడ రొటీన్. అంటే వాచ్ మెన్ తాళాలు ఎప్పుడు వేసేది , టాంకరు ఎప్పుడు వచ్చేది తెలిసిన వారే , టాంకరు వచ్చిన సమయంలో చిన్న గేటు లోంచి వచ్చారా? వచ్చి హత్య చేసి అలాగే వెళ్ళాడా? నీళ్ళు సంప్ లోకి వదిలి తాళం వేసి, ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఎక్కించడానికి మోటర్ వేసి రావడానికి ఎంత లేదన్నా అరగంట పడుతుంది. కనుక ఆ అరగంటలో హత్య జరిగి వుండవచ్చు. అంటే ఈ రోటీనంతా తెలిసన వాళ్ళు చేసిన పనా? ఆ తెలిసినవారెవరు? వాచ్ మెన్ ని అతని అక్క బావల్ని అపార్ట్ మెంట్ యిరుగు పొరుగుల్నీ సుధాకర్, సరోజల దాంపత్య  జీవితం గురించి, వారి ప్రవర్తన , రాకపోకలు గురించి రకరకాలుగా ప్రశ్నించినా పెద్దగా ఏ విషయమూ రాబట్టలేకపోయాడు ఇన్ స్పెక్టర్. ఇద్దరు ఉద్యోగస్తులవడం వల్ల ఏ ఆదివారమో తప్ప, రాత్రిళ్ళు తప్ప ఇంట్లో ఉండేది తక్కువ. కనుకపెద్దగా వారి విషయాలు తెలియవన్నట్టే అంతా చెప్పారు. ఎప్పుడో ఊర్లో ఉండే అతని అక్క బావ , ఎప్పుడైనా అతని స్నేహితులు ఫామిలితో వచ్చేవారు ఎక్కువ రాకపోకలు లేవన్నారు. ఇద్దరి మధ్య మాములుగా భార్యాభర్తలు ఎప్పుడన్నా తగవులు పడడం సహజంగా జరిగేదే. అలా మాట అనుకున్నా తాము వినలేదన్నారు. ఇద్దరూ పెళ్ళయిన కొత్తలో ఎప్పుడన్నా సినిమాకి, షికారుకి , హోటళ్ళ కి స్కూటర్ మీద వెళ్ళడం చూసేవారని, ఈ మధ్య లా వెళ్ళడం చూడలేదని చెప్పారు. సుధాకర్ ఇల్లు సోడా చేసినా ఏ క్లూ దొరకలేదు. పరిశోధన అరంగుళం ముందుకు జరగలేదు. అసలు సుధాకర్ విజయవాడ వెళ్ళినట్లు - చెపుతున్నది నిజమేనా? తను వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఈ నాటకం ఆడాడా? - అలా అయితే అతని దగ్గర మాట్నీ టిక్కెట్టు వుందే! రైలు టిక్కెట్టు పోనీ రిటర్న్ జర్నీ టిక్కెట్టు అనుకుంటే సినిమా టిక్కెట్టు సంగతేమిటి . ఆ లాడ్జి మెడికల్ షాపు వారిని వాకబు చేస్తే ఏమన్నా సంగతులు తెలుస్తాయా - ఓసారి విజయవాడ వెళ్ళివస్తే - ఇన్ స్పెక్టర్ సునీల్ వర్మకి విజయవాడ వెళ్ళి వస్తే కేసులో ఏదన్నా పురోగతి లభిస్తుందేమోనన్న ఆశ వుంది.

                                        *    *    *    *
    విజయవాడలో అతను దిగిన లాడ్జికి ముందు వెళ్ళాడు. సుధాకర్ శుక్రవారం ఉదయం వచ్చి వంటిగంటకి లాడ్జి ఖాళీ చేసినట్టు చెప్పారు. అతను రాత్రి 10 గంటలకి కదా ట్రైను వంటిగంటకి ఎందుకు ఖాళీ చేశాడు? ఇన్ స్పెక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు.
    "మా చెకింగ్ టైము ఒంటిగంట సార్. రాత్రి వరకు ఉంటే మరో రోజు చార్జీలు ఇవ్వాలని ఒకరోజు పని వుండి వచ్చినపుడు ఆయనలా లంచ్ తిని చేతిలో చిన్న సూట్ కేస్ గనక చెక్ వుట్ చేసి సాయంత్రం పని చూసుకు దొరికిన ట్రైనుకి వెళ్ళిపోతుంటారు సార్. అతని అలవాటు పాతదే" అని చెప్పారు.
    మెడికల్ షాపు వారిని కలిస్తే వాళ్ళూ సుధాకర్ పదకొండు గంటలకి వచ్చినట్టు కన్ ఫర్మ్ చేశారు. సుధాకర్ కలుసుకోవాలనుకున్న డాక్టరు ఊళ్ళో లేకపోవడం, సాయంత్రానికి రాకపోవడమూ నిజమే అయింది. ఇంక మిగిలింది  సినిమా హాలుకెళ్ళి అరా తీయడం - మేనేజర్నీ కలుసుకుని తన దగ్గిరున్న మాట్నీ టిక్కెట్టు  చూపించి ఎవరన్నా సినిమా మధ్యలో వెళ్ళిపోయారా శుక్రవారం మ్యాట్నీలో , మీ గెట్ కీపర్లని అడగగలరా అంటూ చెప్పబోతుంటే మేనేజర్ చేతిలో టిక్కెట్టు చూసి, "ఇది గురువారం మాట్నీ టిక్కెట్టు సార్, శుక్రవారంది కాదు" అన్నాడు.
    ఇన్ స్పెక్టర్ తెల్లబోయాడు. అంతవరకు టిక్కెట్టు సరిగా చూడనందుకు తిట్టుకున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra