నా మనసులో ఉబుకుతోన్న భావాలను అదిమెయ్యటానికి ప్రయత్నిస్తున్నాను.


    "ఓ మనసా! నువ్వు ఆత్మ, బుద్ధి, ఇంకా రకరకాల అరలతో, పొరలతో మమ్మల్ని వంచన చేస్తూ దేవుళ్ళ దగ్గర్నుంచి మామూలు మనుషులు దాకా అర్థంకాని స్థితిలో అయోమయంలో పడేస్తూ ఎందుకు నిజాన్ని నొక్కేస్తున్నావు. నీ మాయలో పడి మనుషులు నిజాన్ని ఎప్పుడో మరిచిపోయారు. భ్రమలో పుట్టి, భ్రమలో పెరిగి, భ్రమలో చచ్చిపోతున్నారు. నువ్వు...."


    "ఏమిటి ఆలోచిస్తున్నావు?"


    "ఆలోచన లేని దశకు చేరుకోవాలని" అంటూ నవ్వేశాను.


    ఆ దశకు చేరుకోవాలన్న ప్రయత్నంలో జీవితాలు చివరి దాకా తగలబడి పోతుంటాయి. దాని జోలికి పోకపోవటం మంచిది.


    అయితే నేను....


    "నేను.... నేను.... నేను...." అనే పదాన్ని పదే పదే తలుచుకోవటం మానేయ్. ఉన్నచోటనే ఉండిపోతావు. అడుగు ముందుకు కదలదు. ఈ సాదా, రుచీ పచీ లేని జీవితం నీకొద్దు. నీ చుట్టూ దివ్య తేజస్సులా అనేక కాంతులు వెలుగుతున్నాయి. అవి నా కంటికి కనిపిస్తున్నాయి. ఆ కాంతి కిరణాలతో ఆలోచించటానికి వ్యవధి లేకుండా, ఊపిరాడని వ్యాపకాలలో మునిగిపోతూ ముందుకు దూసుకెళ్ళిపో. సాహసం చెయ్. సాహసం లేని జీవితం బానిసపు చావుకన్నా హీనమైనది.  


    కానీ ఈ సమాజం....


    శమంతకమణి కళ్ళు రక్తారుణిమ కాంతితో భగ్గుమన్నాయి.


    సమాజం.... సమాజం.... సమాజం.... విని విని విసిగెత్తి పోయిన పదం. ఆపదలో ఉన్నప్పుడు కనిపించకుండా అపశృతి అనిపించినప్పుడు విరుచుకుపడే సమాజం.


    గ్లాసులో మిగిలి ఉన్న విస్కీని మళ్ళీ ఒక్క గ్రుక్కలో త్రాగేసింది.


    "ఈ ప్రభుత్వం, ఈ పరిపాలకులు, ఈ సమాజం, ఎప్పుడన్నా సామాన్యుల గుండెల్లోకి వెళ్ళి చూశారా?"


    "కృషి వల్ల ఏదన్నా సాధించగలమని, అన్నీ కలిసొచ్చిన ప్రబుద్ధులు ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ ఎంత కృషి చేసినా చిత్తశుద్ధితో పాటుపడిన ఆ మేధస్సుకు, కృషికి, శ్రమకు, అర్హతకు, అందులో పదోవంతు కూడా ప్రతిఫలం లేక ఆర్ధిక గృహ సమస్యలతో అల్లాడిపోతూ, అనుక్షణం నరకం, రోజూ చిత్రవధ ఈ ఆక్రందనలు ఎవరు పట్టించుకుంటున్నారు?"


    "అసలు ఒకరి బాధ అనే దాన్ని ఇంకొకరు పట్టించుకుంటున్నారా? పక్కవారి బాధను అర్థం చేసుకునే కనీస జ్ఞానం ఎవరికైనా ఉందా? నదుల్లో ఎంతమంది తల్లులు పిల్లలతో సహా దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నిదానంగా ఆలోచిస్తే ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ ప్రభుత్వాలు సిగ్గుతో తలలు బ్రద్దలు కొట్టుకోవాలి. నాతో బయటకురా. వ్యభిచార గృహాలు, వ్యభిచార గృహాలు అని ఘోష పెడుతూ లాడ్జింగ్ లు లాడ్జింగులు అని జనం పేర్లు పెట్టి పిలుస్తూంటారే. ఆ యువతుల ఘోరమైన బ్రతుకులు, అసహ్యమైన భేషజాలు, సహజత్వాన్ని మరిచిపోయి ఎంత వికృతంగా బ్రతుకుతున్నారో చూపిస్తాను. అలా తయారైన ఆడవారిలోని రాక్షసత్వాన్ని చూపిస్తాను. వాళ్ళ రెసిస్టన్స్ పవర్ ని చూపిస్తాను. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు, అమ్మాయిల్ని పాడు చెయ్యటం తప్ప ఇంకెందుకూ పనికిరాని మొగముండాకొడుకుల దాహానికి ఎలా ఆహుతై పోతున్నారో చూపిస్తాను. ఇంకా దిగువ తరగతికి వెళ్ళు. వాళ్ళకు అక్షర జ్ఞానం ఉండదు. పడిపోయే పాకల్లోనో, రోడ్డు ప్రక్కనున్న ఫుట్ పాత్ ల మీదే కాపురాలు చేస్తూ ఉంటారు. ఆడది తప్పు చేస్తే మగాడు నరికి పారేసేటట్టు ఫోజులు పెడుతూ ఉంటాడు. అక్కడక్కడా అలా నరికి పారేసిన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అయినా వ్యవహారం ఆగదు. ఆ భాషా పద్ధతులు వేరుగా ఉంటాయి. పడిపోయే వాళ్ళు పడిపోతూ ఉంటారు. హైక్లాస్ సొసైటీనీ కళ్ళతో నువ్వే చూశావు. వీళ్ళకు సెంటిమెంట్స్ ఉండవు. ఏ నీతి నియమాల మీద గౌరవం ఉండదు. విశృంఖలత్వమంటే మోజు. నీ మొహంలో సందేహం అర్థమౌతుంది. ఆ రాత్రి భార్యాభర్తల ఘోరమైన పోట్లాట. కత్తితో పొడవటం. అలాంటి చెదురు మదురు సంఘటనలు అన్ని వర్గాల్లో ఉన్నట్లే అక్కడా ఉంటాయి. అది తప్పదు. భార్యాభర్తలు ఒకర్నొకరు హింసించుకుంటూ ఉంటారు. ఈ హింస మామూలే. కొంచెం డైవర్ట్ అయ్యాను. రోజూ ఎన్ని కిడ్నాప్ లు, రేప్ లు. ఆ ఆశ్రమ పాఠశాలల్లో, హాస్టళ్ళల్లో ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు అన్నా ఇన్నా? ఈ ప్రపంచాన్ని సెక్స్ పరిపాలిస్తోంది. డబ్బు పరిపాలిస్తోంది. పవర్ పరిపాలిస్తోంది. గూండాలు పరిపాలిస్తున్నారు. బాధితులకెక్కడా న్యాయం జరగదు. పోలీసుల దగ్గరకు వెళితే ఎవరో కొందరు తప్ప లైసెన్స్ డ్ గూండాల్లా ప్రవర్తిస్తారు. ఎప్పుడన్నా వాళ్ళ భాష విన్నావా? అదా? అది తిరుగుతుంది. ఇదా? ఇది అడ్డమైన వాళ్ళతో పడుకుంటుంది. వాళ్ళకవసరమై వస్తే సెల్యూట్ కొట్టి, సార్ అని, అయ్యగారూ అని, దొరగారూ అని సంబోధిస్తారు. లేకపోతే అవతలి వాళ్ళను పురుగుల్ని చూసినట్లు చూస్తారు. ఏరా, ఏమే, లంజా, లంజాకొడుకా.... ఇవీ వాళ్ళ సంబోధనలు. ఈ దరిద్రగొడ్డు వాతావరణంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి ఎవర్ని అప్రోచ్ అవుతాడు? అతనికి ఇంకా ఇంకా అపకారమే కానీ న్యాయం జరగదు. ఈ ఛండాలపు వ్యవస్థలో మనిషి అవకాశం ఉన్నప్పుడు కొన్నిటికి తిలోదకాలొదులుకుని విజృంభించి ఎదగాలి. రకరకాల రుగ్మతలతో కుళ్ళిపోయిన ఈ సమాజమంటే నాకు కసి నాక్కావల్సింది నేను ఎదగటం. ఈ సమాజాన్ని చెండుకు తినటం. అంతేకాని నేను నేనుగా ఉండాలనుకోవటం కాదు. సతీ! నిన్నాహ్వానిస్తున్నాను రా. నాతో చెయ్యి కలుపు. నిన్నెక్కడికి తీసుకెళతానో చూడు. నిన్ను అపురూప వ్యక్తిగా మలుస్తాను. ఈ దేశాన్నే నీకు పాదాక్రాంతమయేటట్లు చేస్తాను."   


    ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయాను. మనసులో ఏవో అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయి. ఏదో భయం నన్నావహిస్తోంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra