Home » Yamini saraswathi novels » అనురాగ జలధి

    మనిషి ఆశలు తీరక - వాటిని దూరం చేసుకోలేక మధనపడుతూ వుంటాడు శ్రీకర్ పరిస్థితి కూడా అలాగే వున్నది.
    ఆవేళ ఆఫీసుకి బయలుదేరాడు శ్రీకర్. ఆఫీసు వరండాలో ఎవరో అమ్మాయి నిలబడి వుండటం దూరాన్నుంచి చూశాడు శ్రీకర్! ఆమె ఎవరో కాదు జ్యోతి!
    జ్యోతిని చూసి కొన్ని క్షణాలు అతని గుండె లయ తప్పింది.
    ఆశ్చర్యమూ, ఆనందమూ ముప్పిరికొనగా కొన్ని క్షణాలు అలాగే దూరంగా నిలబడిపోయాడు శ్రీకర్.
    "జ్యోతి! ఇక్కడికెందుకొచ్చింది? తన తప్పు తెలుసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చిందా అబ్బా! ఎన్నాళ్ళయింది జ్యోతిని చూసి! జ్యోతి ఇలా నన్ను వెతుక్కుంటూ వస్తుందని తను ఊహా మాత్రంగానైనా అనుకోలేదు.
    జ్యోతి వచ్చింది! ఏం మాట్లాడాలి?
    తిరిగి ఆమెతో సంసారం చేయగలడా తను? అంత అవమానం చేసింది. అలాంటి రాక్షసితో తిరిగి కాపురమా? నో...నో...తనకూ ఆత్మాభిమానం వున్నది. ఆమె కావాలనుకుంటే కలిసి వుండటం, కాదని తూలనాడితే దూరంగా వుండడమా? నో...అలా జరగడానికి వీల్లేదు. తను జ్యోతితో తిరిగి కాపురం చేయడం కల్ల.
    నీలవేణి...అవును ఆమె కావాలి నాకు...ఆమె కావాలి.
    "కాపురం చేయనంటే ఎలా బ్రదర్! ఎంత కాదనుకున్నా ఆమె నీ భార్య. మీరు కొట్లాడుకుని దూరంగా వున్నారేగాని ఇంకా విడిపోలేదు. మీ మధ్య ఆలుమగల బంధం వుంది."
    "ఇంకెక్కడి బంధం? తాళి తెంపి మొఖాన కొట్టింది."
    "అయినా విడాకులు పొందలేదు మీరు. అంతవరకూ ఆవిడ నీ భార్యే."
    శ్రీకర్ నలిగిపోయాడు. ముందుకు అడుగు పడలేదు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. జ్యోతి పలకరిస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆరాటపడుతున్నాడు.
    అదురుతున్న గుండెల్ని నొక్కిపట్టి, చకచకా అడుగులేసుకుంటూ వరండాలోకి వచ్చాడు. ఆమె ఆ వేపు తిరిగి నిలబడి వుంది.
    శ్రీకర్ హృదయం ఝల్లుమంది కొన్ని క్షణాలు ఆమెను చూసి. ఈ ఆనందం కోసమే కదూ, తాను పరుగులు తీసింది? ఈ పిచ్చితోనే గదూ ఇల్లరికం వెళ్ళింది? ఏమి సౌందర్యం? కన్నార్పకుండా ఆమెను చూడసాగాడు.
    "జ్యోతీ"! ఆగలేక మృదువుగా, మెత్తగా పిలిచాడు శ్రీకర్.
    ద్వారం వద్ద నిలుచున్న వ్యక్తి ఇటుగా తిరిగింది!
    "అంతే! శ్రీకర్ ఆమెను చూసి కొయ్యబారిపోయాడు. చప్పున తలవంచుకున్నాడు. ఆమె జ్యోతికాదు_ ఎవరో అపరిచిత వ్యక్తి. 
    "ఏమివండర్! అచ్చం జ్యోతిలా మభ్యపెట్టింది.
    తనెంత ఆశపడ్డాడు, మధనపడ్డాడు. ఎవరీమె? వెనక నుంచి చూస్తే ముమ్మూర్తులా జ్యోతిలానే వుంది.
    ఇంకానయం...!
    అప్రయత్నంగా గుండెలమీద చేయి వేసుకున్నాడు శ్రీకర్.
    అతని గుండె వేగంగా కొట్టుకుంటూంది.
    "అనవసరంగా ఎవరినో చూసి జ్యోతి అనుకుని భ్రమచెంది తెగ ఆరాటపడ్డాను-" అని నొచ్చుకున్నాడు.
    ఇంతలో అక్కడకు నీలవేణి నవ్వుతూ వచ్చింది.
    "శ్రీకర్ నీకో శుభవార్త-" నవ్వుతూ అన్నది నీలవేణి.
    ఏమిటన్నట్లుగా నొసలు చిట్లించాడు శ్రీకర్. ఆమె కొత్తచీర కట్టింది. తలంటుకుంది కాబోలు వెంట్రుకలు గాలిలో వింతగా నర్తిస్తున్నాయ్. ఈవేళ ఏదో కొత్తగా కనిపిస్తోంది. విశేషమేదో వుంటుందని అతను అనుకున్నాడు.
    "ఇవ్వాళ నా బర్త్ డే! సాయంత్రం మా ఇంటికి రావాలి" నవ్వుతూ చెప్పింది నీలవేణి. శ్రీకర్ ముఖం విప్పారింది.
    "హాపీబర్త్ డే నీలా? నీ ముఖంలో వెల్లివిరిసే ఆనందం చూసి ఇవ్వాళ ఏదో విశేషముంటుందనే ఊహించాను-" అభినందనలు తెలిపాడు శ్రీకర్.
    "తప్పకుండా రావాలి సుమా!" అన్నది నీలవేణి.
    "అలాగే! నీవు పిలిస్తే రాకుండా యెలా వుండగలను?" ఆరాధనగా చూసాడు. ఆమె నవ్వింది తృప్తిగా నిండుగా.
                                                        30
    సాయంత్రము నీటుగా డ్రస్ చేసుకున్నాడు శ్రీకర్.
    బజారుకు వెళ్ళి మంచి ప్రజంటేషన్ కొనాలని షాపులన్నీ గాలించాడు. కంటికి నచ్చినది, మనసు మెచ్చింది ఏదీ కనిపించలేదతనికి. తన ప్రేమకు చిహ్నంగా మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు.
    చివరకు పాలరాతి తాజ్ మహల్ బొమ్మకొన్నాడు.
    దానిని చూసుకుని తృప్తిపడి ప్యాక్ చేయించాడు.
    రిక్షా ఎక్కి నీలవేణి ఇంటికి బయలుదేరాడు శ్రీకర్. అతని మనసెందుకో తీయగా మూలుగుతోంది. అమితోత్సాహంతో వెళ్ళాడు.
    వాకిట్లోనే నీలవేణి రిసీవ్ చేసుకుంది శ్రీకర్ని.
    ఆమె అలంకరణ అతడ్ని పిచ్చివాడ్ని చేసింది.
    లేత నీలిరంగు పట్టుచీరె! అదే కలర్ మ్యాచ్ బ్లౌజు ధరించింది. బారుగా అల్లిన జడలో నిండుగా చేమంతులు తురిమింది. కళ్ళకు కాటుక రేఖ! నుదుట గుండ్రని తిలకం బొట్టు. పెద్ద అలంకరణ లేకపోయినా ఆ కొద్దిపాటి అలంకరణే ఆమెకు వన్నెలు దిద్దాయి. "నీల ఎంత బావుంది" అని అనుకోకుండా ఉండలేకపోయాడు శ్రీకర్.
    "హాయ్ బావున్నారా?" తెల్లని టినోపాల్ అడ్వర్ టైజ్ మెంట్ దుస్తుల్లో చిరునవ్వు చిందిస్తూ అక్కడకు వచ్చాడు శంకర్. శ్రీకర్ కూడా విష్ చేశాడు మర్యాదగా.
    పార్టీకి జనం పెద్దగా రాలేదు.
    శ్రీకర్ తో పాటు మరో నలుగురు అమ్మాయిలు వచ్చారు. మొగవాళ్ళు శ్రీకర్, శంకర్ ఇద్దరే!
    నవ్వుల మధ్య కేక్ కట్ చేసింది నీలవేణి. కేక్ ముక్క చేతబట్టుకుని ప్రక్కప్రక్కన నిల్చున్న శ్రీకర్ - శంకర్ లను చూసి నవ్వింది. తనకు ఇస్తుందని ఆశపడ్డాడు శ్రీకర్.
    అమ్మాయిలంతా చప్పట్లు చరిచారు. శ్రీకర్ కి ఎందుకో బాధనిపించింది. అయినా బయట పళ్ళేదు.
    తరువాత కాఫీ టిఫిన్ ముగించుకుని కబుర్లలో పడ్డారంతా.
    అందరూ ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడేస్తూ నవ్వుతున్నారు. శ్రీకర్ మాత్రం ముభావంగా వుండిపోయాడు. శంకర్ - నీలవేణి అలా ఒకర్ని ఒకరు దెప్పుకుంటూ పోట్లాడుకుంటూ అంతలోనే హాయిగా నవ్వేయడం శ్రీకర్ కి నచ్చలేదు. ఎదరో సన్నగా జ్వాల! అసూయ రగులుతోంది.
    "మీరేమిటి అలా మౌనంగా అయిపోయారు?" నవ్వుల మధ్య శంకర్ శ్రీకర్ ని హూస్తూ అడిగాడు.
    "ఏంలేదు మిమ్మల్ని చూస్తుంటే జెలసీగా వున్నది" బలవంతాన నవ్వాడు శ్రీకర్.
    "జెలసీనా? భలేవారే...ఈ రాక్షసితో నేను వేగలేక ఛస్తున్నాను" నీలవేణివైపు కొంటెగా చూస్తూ అన్నాడు శంకర్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra