Home » Suryadevara rammohan rao » క్రిమినల్స్ -1


    "మంత్రి పట్టాభి నియోజక వర్గానికి  ఎవరు వెళతారు? మధుమూర్తితో ఎవరు తలపడతారు!"

    వారిలో ఒకింత కలవరపాటు. ఖాకీబట్టల చాటున కలవరపాటు. ఆ పదిమంది ఆఫీసర్స్ కి ఏదో అగ్ని పరీక్ష.

    "నాకు తెలుసు వాళ్ళెంత  నరరూప రాక్షసులో...." సూదిపడితే వినిపించే విచిత్రమయిన  నిశ్శబ్దం అలుముకుంది అక్కడ.

    దొర కళ్ళు పోలీసు జాగిలంలా ఆ పదిమంది ఆఫీసర్స్ మొఖాల వైపు  ఓ రౌండ్ వేసాయి అంత వేగంతో అతను చూడగలడని వారికి ఊహకే అందని విషయం.

    వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ పోస్ట్ ని ఆఫర్ చేయటమంటే  కోరికోరి పులినోట్లో  తలపెట్టటమే అని వారికి బాగా తెలుసు.

    ఎందుకంటే రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ప్రతి ఆఫీసర్ ముందుగా చదివేది, పట్టాభి, మధుమూర్తిల ఫైలే యుగంధర్ కి ఆనందంగా వుంది. అక్కడెవరూ  నేనేనంటూ ముందుకు రాకపోవటం.

    అక్కడే  అతను పొరపాటుగా  యోచించాడు. ఆ సమావేశపు వివరాలు  సయితం  అప్పటికే  పట్టాభి, మధుమూర్తులకు  తెలిసిపోయాయన్నది  అతనికి తెలియని విషయం. గౌసుద్దీన్ అనే ఆఫీసర్ సీట్లోంచి లేచి నిలబడ్డాడు.

    "యూ?" అన్నట్లు ఒకింత ఆశ్చర్యపోయి  చూశాడు దొర.

    అతను వినయంగా తలూపాడు.

    అప్పటికే  యుగంధర్ షాక్ తిన్నాడు.

    ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్ళరు. వాళ్ళతో  ఎవరూ తలపడలేరు అనుకుంటున్న  యుగంధర్ అంచనాలు  తలక్రిందులయ్యాయి. తనిప్పుడు లేవాలో, లేదో తెలియని  సందిగ్ధత....

    అంతలో__

    "ఓన్ లీ ఒన్?" దొర ఒకింత సర్ క్లాస్టిగ్గా అన్నాడు.

    చటుక్కున లేచి నించున్నాడు యుగంధర్. దొర ప్రశంసాపూర్వకంగా చూశాడు అతనివేపు.

    యుగంధర్ లేవటంతో గౌసుద్దీన్ మొఖం మాడిపోయింది.

    "యూ టూ ఓన్ లీ? వెల్ మీ ఇద్దరిలో ఎవర్ని పంపాలన్నది  త్వరలో  డిసైడ్ చేస్తాను నౌ యూ కెన్ గో" అన్నాడు దొర గంభీరంగా.


                               o    o    o


    "నేను చెప్పానా లేదా? మరొకరో, ఇద్దరో కూడా  తమ సమ్మతి తెలుపుతారని" మార్తాండ్ సాలోచనగా  అన్నాడు.

    "ఎలా ఊహించగలిగారు?" యుగంధర్  ఆశ్చర్యపోతూ  అన్నాడు.

    మార్తాండ్ మౌనంగా వున్నాడు.

    "గౌసుద్దీన్ అంత ధైర్యం చూపించటం నాకానందంగా వుంది. కండబలమేకాదు, గుండెబలమున్న వాళ్ళు మొత్తానికి ఒకరిద్దరయినా  మా డిపార్టుమెంట్ లో వున్నారు చూశారా నాన్నగారు?" అప్పుడు చటుక్కున తలెత్తి  కొడుకువేపు చూశాడు  అతను.

    "గుండెబలంకాదు. తన గుడిని  పదిలం చేసుకునేందుకు  ముందుకొచ్చాడు" యుగంధర్ తండ్రివేపు అర్ధంకానట్లు  చూశాడు.

    "అర్ధంకాలేదా? అతను పట్టాభి, మధుమూర్తుల మనిషి" షాక్ తిన్నాడు యుగంధర్.

    "అంత తెలివికలవాళ్ళు  మధుమూర్తి, పట్టాభి."

    "నమ్మలేకపోతున్నాను నాన్నగారూ"

    "నువ్వు చిన్నబుచ్చుకోనంటే  ఓ నగ్నసత్యం చెబుతాను. పోలీసుల్లో కంటే, క్రిమినల్స్ లోనే ఎక్కువ తెలివికలవాళ్ళున్నారు. అందుకు నిదర్శనమే  రోజురోజుకు  పెరుగతున్న నేరాల సంఖ్య. నేరాలు 1,2,4,6,16,32 నిష్పత్తిలోనన్నా  పరిష్కరించగలుగుతున్నారా?" అతని గొంతులో  కర్కశత్వం  తొంగిచూసింది.

    యుగంధర్  తన డిపార్టుమెంట్  అసమర్ధతకి  సిగ్గుతో  తలవంచుకున్నాడు.

    "అవన్నీ ఇప్పుడు  అప్రస్తుతం. ఇకపోతే  ఇప్పుడు నీకు, గౌసుద్దీన్ కి మధ్య టాస్ ఎగరబోతోంది  దొరచేతిలో. అది నీకు అనుకూలంగా పడేలా  చేసుకో. ఈ వారంలో డి.ఐ.జి, మీ ఇద్దరిలో ఎవరన్నది డిసైడ్ చేసే పనిలో  నిమగ్నమవుతాడు  బీ అలర్ట్" అంటూ అతను  బెడ్ రూమ్ వేపుకు  సాగిపోయాడు.

    యుగంధర్  ఆలోచనల్లో పడ్డాడు. అరగంట తర్వాత ఒక నిర్ణయానికొచ్చి  చేయకూడని పని ఒకటి చేయాలనే  స్థిరనిశ్చయానికొచ్చాడు. ఆ మరుక్షణం ఫోన్ చేసి తన క్రింద  సర్కిల్  ఇన్ స్పెక్టర్ ని రమ్మన్నాడు.


                                                                o    o    o


    ఉదయం ఆరేడు గంటలమధ్య ఉదయ్  తన ఇంటి అడ్రస్ కోసం అన్వేషణ మొదలెట్టాడు. అతనికి చాలా బాధగా వుంది. తండ్రి కనీసం ఒక్కసారన్నా  ఇంటి అడ్రస్ యివ్వలేదు. తను జైలుకెళ్ళేప్పుడు వున్న ఇల్లు మారినట్లు మాత్రం ఖచ్చితంగా తెలుసు ఉదయ్ కి. అంత పెద్ద నగరంలో ఎలా  పట్టుకోవాలి?

    వళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించే తండ్రి మారిపోయినందుకు  కలిగిన బాధకంటే  కనీసం జైలు నుంచి విడుదలయ్యాక అన్నా  అక్కను, అమ్మను చూడలేకపోతున్నందుకు  ఎక్కువ బాధగా  వుంది అతనికి.       

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra