Home » Mallik » నవ్వితే నవ్ రత్నాలు - 1

 "టేబుల్ లైట్!... బాగుంది కదూ?... హిహి!!..." దాని వంక సంతోషంగా చూస్తూ అన్నాడు మోహన్.
    "ఇప్పుడు ఈ ప్యాకెట్ నేను విప్పుతా..." అంది రాధ సంబరంగా రెండో ప్యాకెట్ చేతిలోకి తీస్కుంటూ.
    "ఊ... ఊ... విప్పూ..." హుషారుగా అన్నాడు మోహన్.
    రాధ ఆ ప్యాకెట్ విప్పదీసింది. అందులో కూడా టేబుల్ లైట్!
    "హర్రే!... గమ్మత్తుగా ఉందే!! ఇందులో కూడా టేబుల్ లైట్ ఉంది!! హిహి..." అంది రాధ.
    తర్వాత ఇంకో ప్యాకెట్ విప్పారు. అందులో కూడా టేబుల్ లైట్! ఇంకో ప్యాకెట్ లో చేక్కముక్కమీద కడవ చంకలో పెట్టుకున్న బొమ్మ!
    ప్యాకెట్లు విప్పుతున్న కొద్దీ ఇద్దరికీ బి.పి. పెరిగిపోసాగింది.
    పెళ్లంటే ఏదో ఒక ప్రజంటేషన్ తీస్కెళ్లి వాళ్ల మొహాన కొట్టాలా.. అలా పనికిరానివి ఇచ్చేకంటే ఏమీ ఇవ్వకుండా ఉంటే నయం కదా!...
    విసుక్కుంటూ, తిట్టుకుంటూ ప్యాకెట్లన్నీ విప్పారు రాధ, మోహన్ లు.
    వాటిల్లోంచి బయటపడినవి ఇవి:
    పద్నాలుగు టేబుల్ లైట్లూ, ఇరవై చెక్కమీద పెయింట్ చేసిన సీనరీలూ, ఐదు కప్పూసాసరుసెట్లూ, పదిహేను ఫోటో ఆల్బంలూ, ఆరు ఫోటో ఫ్రేములూ వగైరా... వగైరా...
    వాటిని చూస్తూనే మోహన్, రాధలు నీర్సంగా మంచంమీద వాలిపోయారు.   
   
                              *   *   *
                        వాడు తెల్సు... వీడు తెల్సు
   
    వరండాలో ఆడుకుంటున్న అయిదేళ్ల బుజ్జిగాడిని డంబాల డింబారావు అడిగాడు.
    "బాబూ... మీ నాన్నగారు ఉన్నారా?..."
    బుజ్జిగాడు ఓసారి చొక్కా జేబులో చూస్కుని "లేరు..." అని మళ్లీ తన ఆటలో మునిగిపోయాడు.
    "ఓర్నీ... జేబులో చూస్కుని చెప్తావేం?... మనుషులెక్కడైనా జేబుల్లో ఉంటారా?...ఆ??..." అని ఆశ్చర్యంగా అడిగాడు డింబారావు.
    "మర్లేపోతే ఆ ప్రశ్నేంటి?... మీ నాన్నగారు ఉన్నారా పోయారా అంటూ?... మీ నాన్నగారు యింట్లో ఉన్నారా అని అడగాలి!" మొహం చిట్లిస్తూ అన్నాడు.
    డింబారావు ఒక్కక్షణం తెల్లబోయి చూసి తర్వాత ఓ వెర్రినవ్వు నవ్వి "ఓర్ ఓర్ ఓర్ ఓరి...నీకు భలే తెలివి తేటలున్నాయ్!...సర్లే....ఇప్పుడు చెప్పు...మీ నాన్నగారు యింట్లో ఉన్నారా?..."అంటూ అడిగాడు.
    "ఉన్నారు...'సమాధానం చెప్పి లోపలికి పరుగు తీశాడు.
    "నాన్నా...నాన్నా...నీకోసం పక్కింటి డంబాల డింబారావు అంకుల్ వచ్చాడు...."అంటూ తండ్రి రామలింగానికి చెప్పాడు బుజ్జిగాడు.
    ఆ మాట వినగానే రామలింగం గుండె పొట్టలోకి జారిపోయాడు.
    "ఓర్నాయ్ నో...ఈ బోర్ గాడు వచ్చాడా?.... చచ్చాన్..." అని మనసులో అనుకుని.
    "నేను యింట్లో లేనని చెప్పెయ్..." అన్నాడు బుజ్జిగాడితో రామలింగం.
    బుజ్జిగాడి రివ్వున బయటికి పరుగుతీసి డింబారావుతో చెప్పాడు.
    "మా నాన్నగారు యింట్లో లేనని చెప్పమన్నారు."
    "ఓర్ ఓర్ ఓర్ ఓరి!... మీ నాన్నకూడా భలే తెలివైన వాడేరా!.... లేనని చెప్పిస్తే అంత తేలిగ్గా వదిలిపెడ్తానా?...." అంటూ యింట్లోకి అడుగుపెట్టాడు డంబాల డింబారావు.
    డింబారావు యింట్లోకి రావడం గమనించిన రామలింగం బెడ్ రూంలోకి పరుగుతీసి మంచం కింద దాక్కున్నాడు.
    డింబారావు రామలింగంకోసం హాల్లో వెతికాడు. తర్వాత తలుపుల వెనకాల వెతికాడు. అక్కడ బీరువా ఉంటే దాంట్లోకి తొంగిచూశాడు. ఆ పక్క గదిలో కూడా వెతికాడు.
    అతనికి రామలింగం కనిపించలేదు.
    "రామలింగం!....ఎక్కడున్నా మర్యాదగా బయటికి రా...నీ అంతట నువ్వే వచ్చి లొంగిపోతే నిన్ను త్వరగా వదిలేస్తా... లేకపోతే అంతే సంగతులు!!" గట్టిగా అరిచాడు బెదిరిస్తూ  డింబారావు.
    రామలింగం కిక్కురుమనకుండా మంచం క్రిందే దాక్కుని ఉన్నాడు.
    డింబారావు మెల్లగా వంట గదిలోకి వెళ్లాడు.
    అక్కడ రామలింగం భార్య సరస్వతి వంట చేస్కుంటూ ఉంది.
    వంటగది తలుపుల వెనకాల చూశాడు డింబారావు.
    "ఏంటండీ వెతుకుతున్నారు?" అంటూ అడిగింది సరస్వతి.
    ఆవిడని చూడగానే అయిడియా వచ్చింది డింబారావుకి.
    "ఆ!..." అంటూ చెంగున ఒక్క గెంతు ఆమె ముందుకు దూకి ఆమె పైటలాగాడు.
    సరస్వతి "ఓర్నాయనో... ఓలమ్మో..." అంటూ లబ్బులబ్బున మొత్తుకుంది.
    "అట్టా అరవకమ్మా... నేనేం చెయ్యన్లే...! మీ ఆయన నీపైట చతునేమైనా దాక్కున్నాడేమో చూద్దామనీ... హి..." అన్నాడు డింబారావు.
    సరస్వతి అతని చేతిలోంచి పైట గభాలున లాక్కుని "మీ సైత్యం మండా...! ఈయన రావడం... మీరు దాక్కోడం...! ఆ తర్వాత ఈయనఇల్లంతా వెతికి మిమ్మల్ని పట్టుకోడం మామూలేగా...!త్వరగా బయటికి తగలడండి...!ఈయన నా పైటా, చీరా అన్నీ లాగేసేలా ఉన్నాడు..." గట్టిగా అరుస్తూ అంది సరస్వతి.
    అది వింటూనే రామలింగం "లబ లబ లబ..." అంటూ నోటిమీద అరచేత్తో కొట్టుకుంటూ మంచం కింద నుండి బయటికొచ్చి వంట గదిలోకి తుపాకీ గుండులా దూసుకొచ్చాడు.
    ఆ సమయంలో డింబారావు సరస్వతి ముందు రెండు చేతులూ కట్టుకుని నిల్చుని "హిహి...హిహిహి...హ్హిహ్హి" అని నవ్వుతున్నాడు.
    "నవ్విందిహ చాల్లె... బయటికి పద... వరండాలో కూర్చుని మాట్లాడుకుందాం..." నెత్తి బాదుకుంటూ అన్నాడు రామలింగం.
    ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.
    "భలే దాక్కున్నావే... హిహి... నా చిన్నప్పుడు రాజీవ్ గాంధీతో కల్సి దొంగాట ఆడేటప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఇలాగే దాక్కునేవాడు...నేను మాత్రం ఎక్కడ దాక్కున్నాడో ఇట్టే పట్టేసేవాడ్ని... తెల్సా?..." అన్నాడు డంబాల డింబారావు.
    "ఏంటి?... రాజీవ్ గాంధీ కూడా నీకు తెల్సా?" ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రామలింగం.
    "ఓర్ ఓర్ ఓర్ ఓరి.. తెల్సా అని అడుగుతావేం నీ అసాధ్యంకూల. కల్సి ఆడుకున్నాం అని చెప్తుంటే!..
    "నువ్వు భలే లక్కీలే... ప్రైం మినిస్టర్ కూడా నీకు తెల్సు!..." పళ్లు కొరుకుతూ అన్నాడు రామలింగం.
    "అసలు రాజీవ్ గాంధీకి సోనియాగాంధీని పెళ్లి చేస్కోమని సలహా యిచ్చింది ఎవరనుకున్నావ్... నేను..." అన్నాడు డింబారావు కులాసాగా కాళ్లూగిస్తూ.
    "అలాగా, నేననుకుంటూనే ఉన్నాన్లే... సరేగానీ నీకు ప్రైం మినిష్టర్ కూడా తెల్సుకదా... నా ప్రమోషన్ గురించి ట్రై చేసి పెట్టకూడదూ?... అడిగాడు రామలింగం.
    "నేనడిగితే రాజీవ్ గాంధీ మీ హెడ్డాఫిసుకు ఫోన్ చేసి చెప్తాడనుకో... కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు అతనికి చెప్తే బాగుండదు.. ఏదైనా పెద్దపెద్ద పనులు చెప్పు... చేయించి పెడ్తా..."
    "పెద్ద పనులంటే?"
    "నీకు వచ్చే ఎలక్షన్లలో నించోడానికి టిక్కెట్టు కావాలా చెప్పు.. క్షణాల్లో ఇప్పిస్తా."
    "నాకు ఈ ఎలక్షన్లూ రాజకీయాలూ ఎందుగ్గానీ... నాకు ప్రమోషన్ ఇప్పించు చాలు" అన్నాడు రామలింగం.
    "మీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరూ?" అడిగాడు డంబాల డింబారావు.
    "జి.విశ్వేశ్వర్రావు!" చెప్పాడు రామలింగం.
    "ఎవడూ?... గొట్టిముక్కల విశ్వేశ్వర్రావేనా...! వాడూ నేనూ చిన్నప్పుడు గోచీలు పెట్టుకుని చెర్లోదూకి ఈతలు కొట్టే వాళ్లం...హిహి..."
    "ఆయన గొట్టిముక్కల విశ్వేశ్వర్రావు కాదు.. గున్న గొప్పుల విశ్వేశ్వర్రావు"
    డంబాల డింబారావు కళ్లు ఇంతింత చేసి రాలింగం వంక చూశాడు.
    "గున్న గొప్పుల విశ్వేశ్వర్రావా?... ఓర్ ఓర్ ఓర్ ఓం... వాడు నాకు వేలు విడిచిన మేనమామ కొడుక్కిబొటనవేలు విరక్కొట్టిన బానగారి తమ్ముడి మాంగారికి అల్లుడు...! వాడూ నేనూ చిన్నప్పుడు కల్సి చదూకున్నాం" అన్నాడు డంబాల డింబారావు.
    "మీ చుట్టరికం సంగతి ఎలా ఉన్నా కల్పి చదూకున్నాం అని అంటున్నావు కదా...! అతనికి చెప్పి నాకు ప్రమోషన్ వచ్చేలా చెయ్యి..." అడిగాడు రామలింగం.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra