Home » Yamini saraswathi novels » Madyataragati Manishi


    'రెండు రూపాయలా?' అనుకున్నాడు. ఈ టౌను మనుషులకి డబ్బంటే లెక్కలేదు కాబోలు అనుకుని "నాలుగణాలిస్తాను" అన్నాడు.
    ఫక్కున నవ్వాడు వాడు పెద్దయ్యా! ఇరవై అయిదు పైసలకి కాఫీ కూడా రాదు. నీవు కొత్తోడివిలాగున్నావు, రూపాయిన్నరకి తక్కువ ఎవ్వరూ రారు" అన్నాడు మళ్ళీ.
    'నడిచి వెళతాను' అని దారి కనుక్కుంటూ ముందుకి సాగాడు రమణయ్య.
    టౌన్లో ఎక్కడ చూసినా జనం, హోటళ్ళముందు, అంగళ్ళ ముందు జనం. "హాయిగా పెళ్ళాలూ, ఇళ్ళూ పెట్టుకుని ఈ హోటలు కూళ్ళలో ఏం మజా ఉంటుందని ఇలా ఎగబడుతున్నారో?" అనుకున్నాడు రమణయ్య.
    "బొత్తిగా జనానికి డబ్బంటే లక్ష్యమే లేదు. అందుకే అన్నిటికి ధరలు అలా పెరిగిపోతున్నాయ్. సంపాదించటం, ఖర్చు పెట్టడం అనుకున్నాడతను.
    సినిమా హాళ్ళని చూస్తుంటే అతనికి మతిపోయినంత పనైంది. ఆ టిక్కెట్ల రేట్లు చూడగానే తల తిరిగినట్లయింది. "మూడు గంటల వినోదానికి మూడురూపాయలా; పగలల్లా చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకున్నా తమ ఊళ్ళో అంత కూలీ ఇవ్వరు అదీ తినటానికి చాలటంలేదు టౌను జీవితానికి పల్లె జీవితానికీ ఎంత తేడా?" అనుకున్నాడు మళ్ళీ.
    నడిచి, నడిచి దారి తెలుసుకుంటూ ఇల్లు చేరాడు రమణయ్య క్షణకాలం దిగ్భ్రాంతి చెందాడు అతను.
    "రాధా నివాస్" అన్న అక్షరాలు కొట్టిచ్చినట్టుగా కనిపించే ఆ ఇంటిముందు ఆగాడు రమణయ్య, గేటుకు కూడా అదే పేరువుంది. గేటుకు అటూ ఇటూ గోడకి నల్లరాతిపై రాధా, గోపీల పేరు చెక్కారు అందంగా.
    గేటు తీసుకుని నడిచాడు రమణయ్య.
    "ఏయ్! ఏయ్! ఎవరు నువ్వు కారొస్తుంది తప్పుకో" అని కేక వేశాడు ఒకతను.
    బెదిరినట్లయి తప్పుకున్న రమణయ్యని దాదాపు రాచుకుంటున్నట్లుగా వెళ్ళిపోయింది కారు.
    గేటునుంచి వరండా దాకా నున్నగా రోడ్డు వేశారు. ఆ బాటకీ రెండువైపులా పూలమొక్కలు అందంగా పూచి తలలూపుతూ స్వాగతం చెపుతున్నాయి. గేటుకి అటూ ఇటూగా ఉన్న అశోకవృక్షాలు, వాటినానుకునే పెరిగిన టెంకాయ చెట్లు అదే వరసలో ఉన్న నందివర్ధనం చెట్లూ ఆ యింటికి అందాన్నీ సమకూర్చుతున్నాయి.
    "ఎలాగయినా ఇల్లు కట్టుకోవడం వేరు, కట్టిన యిల్లు కొనుక్కోవడం వేరు" అనుకుని "పాపం! ఏం ఇబ్బంది వచ్చి అమ్ముకున్నారో? మంచి అభిరుచి ఉన్నవాడే" అనుకున్నాడు రమణయ్య.
    వరండా చుట్టూ మామిడి తోరణాలు కట్టారు. కప్పుకి చుట్టూరా రంగు రంగుల కాగితాలు అతికించారు. బూరా బుగ్గలు వేలాడదీశారు.
    "ఏయ్! ఎవరు నువ్వు? ఏమిటలా చూస్తున్నావ్?"
    "నేను..." తన విషయం చెప్పాడు రమణయ్య, తనెవరో తెలిస్తే అదిరిపడతాడు వీడు. దొంగనో బిచ్చగాడినో కసిరినట్టుగా కసురుతున్నాడు" అనుకుని గర్వగా చెప్పాడు.
    ఆ అడిగిన వ్యక్తి ఫణి కంపెనీలో ప్యూన్. అన్ని విషయాలను తనే శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తున్న ఫణికి పనులకి తనపని మనుషులనే పంపక తప్పలేదు.
    "ఓహో! అయ్యగారి ఊరి మనిషివన్న మాట. అలా మూల కూర్చో, ఇప్పుడే ఇల్లు చేరుతున్నారు. అదిగో కలెక్టరు గారు వస్తున్నారు, తప్పుకో" అన్నాడు వాడు కాస్త సౌమ్యంగా.
    గేటుముందు కారు ఆగింది. మళ్ళీ కదిలి లోపలికి వస్తోంది. కలెక్టరుగారు వస్తున్నారన్న కబురు విని రాధ బయటికి వచ్చింది. ఫణి ముందునుంచీ యీ గృహప్రవేశం దర్జాగా జరపాలని పట్టు పట్టాడు. నిజానికి రాధకికానీ, గోపీకికానీ ఆ ఊళ్లో ఎవరూ తెలియదు కానీ ఫణి అందర్నీ పిలిచేడు. రకరకాల బిజినెస్సులు చేస్తూ అందరితో పరిచయం ఉన్న ఫణి, గోపీని వెంటేసుకుని ప్రతి ఆఫీసరునీ ఆహ్వానించేడు. పెద్ద వ్యాపారస్తుల్నీ పిలిచేడు. మునిసిపల్ చైర్మన్ గారినీ, జిల్లా పరిషత్తు చైర్మన్ గారినీ కూడా ఆహ్వానించారు.
    ఇంతమంది పెద్దల్ని ఆహ్వానించటం గుండె దడగానే వుంది గోపీకి. రిసెప్షన్ విషయం అంతా రాధకీ, ఫణికీ వదిలేసి తనూ రోజీ వచ్చిన అతిధుల్ని పరామర్శ చేస్తున్నారు.
    రాధా ఫణి సరిగ్గా కలెక్టరుగారి కారు గేటు ముందుకి వచ్చేసరికి బయటికి వచ్చేరు. అప్పుడే రమణయ్య ప్యూన్ తో మాట్లాడేడు.
    ఆ ప్యూన్ రాధ దగ్గరిగా వచ్చి "అమ్మగారూ! ఎవరో మీ ఊరి వాడట, వచ్చాడు. మీ పాలేరో, రైతో, అలా నించోబెట్టేను" అన్నాడు.
    ఆ మాటలు విని తల తిప్పి చూసింది రాధ.
    రాత్రల్లా చేసిన రైలు ప్రయాణంతో తల మాసి, గుడ్డలు మాసి, ఓ చేత్తో నేతి తపేలా, మరో చేత్తో అరటిగెల, భుజంపై ఉతికిన మాసిన కండువా, నీరుకావి పంచ, అంగీలతో వున్న రమణయ్యని చూసి క్షణకాలం విస్తుపోయింది.
    అంతలో కారువచ్చి కలెక్టరుగారూ, ఆయన సతీమణి దిగేరు. ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళటంలో నిమగ్నమయింది రాధ.
    నమస్కారాలయ్యాక వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళింది ఆమె.
    ఆ మనిషి తనని గూర్చి రాధతో అలా చెప్పటమూ, ఆమె తనవైపు క్షణం సేపు చూసి వాళ్ళవెంట వెళ్ళిపోవటమూ గమనించిన రమణయ్యకి తల తీసేసినట్లయింది.  
    భూమి కాళ్ళక్రింద విచ్చుకుని అలాగే కూరుకుపోతున్నట్లుగా ఉంది రమణయ్యకు.
    "అమ్మగారు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళమన్నారు" అని పెరటి గుమ్మంగుండా లోపలికి తీసుకెళ్ళాడు. నేతి తపాలా, అరటి గెల, మిగతా సామాను తీసి స్టోరు రూములో పెట్టాడు.
    బాత్ రూం వద్దకి తీసుకెళ్ళేడు.
    "అది స్నానాల గదా!" నిర్ఘాంతపోయాడు రమణయ్య.
    మొజాయిక్ ప్లోర్ తో, 'పాలరాతి పలకల గోడలతో, అద్దాలతో, హేండిల్ బార్స్ లో, రంగు రంగుల టవల్సుతో అడుగు పెడితే మాసిపోతుందా అన్నట్లున్న గదిలోకి అడుగు పెట్టటానికి సంశయించేడు.
    రమణయ్య వాలకం చూసి నవ్వుకున్నాడు వాడు.
    "ముఖం కడుక్కో" అని పళ్ళపొడి చేతిలో వేశాడు.
    వేపపుల్లో, కచ్చికో తీసుకొని వాడుకునే రమణయ్యకి ముఖం కడుక్కోటానికి కూడా యీపొడి కొనుక్కోవాలి కాబోలు, అన్నట్టు అన్నీ వున్నాయిగానీ ఈ యింట్లో వేపముక్కలేదు. తమ్ముడితో చెప్పి ఓ మూల నాటించాలి అనుకున్నాడు.
    ముఖం కడుక్కున్న రమణయ్యతో బలవంతంగా స్నానం చేయించాడు వాడు.
    ఆ సబ్బులు, ఆ షాంపూలూ చూసి తల తిరిగిపోయింది అతనికి. స్నానం చేసి వాడిచ్చిన టవల్ చుట్టుకున్నాడు మొలకి. ఖర్చయితే అయింది. ఇంత శుభ్రంగా తలారా స్నానం చేసి ఎన్నేళ్ళయింది, అనుకున్నాడు రమణయ్య.
    కొత్త పంచ యిచ్చాడు వాడు కట్టుకోటానికి.
    "నాకెందుకు, నా చేతి సంచీలో ఉంది అందుకో"
    "అమ్మగారు చెప్పారు."
    "హుఁ" అనుకుని కట్టుకున్నాడు, ఒళ్ళు తేలిపోతున్నట్టుగా వుంది రమణయ్యకి. అతని జీవితంలో 40వ నంబరు పంచలుతప్ప కట్టలేదు. జరీ పొందూరు పంచ అతని ప్రాణానికి దేవతా వస్త్రంలా ఉంది.
    గోపీ ఎప్పుడో సరదాకి కుట్టించుకుని తొడక్కుండా వదిలేసినా జుబ్బా తెచ్చి యిచ్చాడు వాడు. బొమ్మలా తొడుక్కున్నాడు. పేటంచు పై కండువా వేసుకున్నాడు. తలకి నూనె పట్టిస్తే, దువ్వుకున్నాడు.
    రమణయ్యని కొత్తమనిషిలా తయారు చేసి తీసికెళ్ళాడు వాడు.
    ఆ సమయానికి గృహప్రవేశం అయిపోయింది. అతిధులంతా భోజనాలకి కూర్చుంటున్నారు. రమణయ్య కూడా వెళ్ళి ఓ చోట కూర్చున్నాడు.
    ఆ భోజనం, ఆ దర్జా, ఆ దుబారా చూసి కళ్ళు తిరిగిపోయినవి అతనికి.
    భోజనాల మధ్యలో అటుగా వచ్చాడు గోపీ.
    "గోపీగారూ! మీ జీతగాడో, పాలేరో వచ్చాడు. శ్రద్ధగా చూసి పలుకరించండి" నవ్వుతూ అన్నాడో వ్యక్తి జోక్ చేస్తున్నట్లుగా భావించి.
    "అన్నయ్యా!" గొణిగాడు గోపీ.
    వంచిన తల ఎత్తలేదు రమణయ్య.
    పేలవంగా నవ్వి "మీరున్నారుగా బాగా చూసుకోండి" అని వెళ్ళిపోయాడు గోపీ.
    "కాదండీ" అతను మా అన్నయ్య! నన్ను పెంచి పెద్ద చేసిన వాడు ఈ రోజు ఈ ఉద్యోగం చేయటానికి, ఈ యిల్లు కొని, మీలాంటి వాళ్ళకి ఇంత దర్జాగా ఖర్చుచేసి మీ ముందు పరువు నిలుపుకోవటానికీ ఈయనే కారణం, ఈయనే లేకుంటే నేను శూన్యంలో వుండేవాడిని" అంటాడేమో అని భావించిన రమణయ్యకి తనవన్ని ఊహలే అనిపించాయి.
    "బాగా భోజనం చెయ్యవయ్యా! మీ అయ్యగారు చెప్పారుగా" అన్నాడతను నవ్వుతూ__రమణయ్య విధిలేక నవ్వేడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra