Home » D kameshwari » D Kameswari Kathalu


                                         మూడు ముళ్ళ బంధం

    "నాన్నా, ఈసారి అమ్మని నాతో తీసికెళ్లాలనుకుంటున్నాను కొన్నాళ్ళుండి వస్తుంది-" అన్నాడు అమెరికా కొడుకు.
    "ఏం, నేను చచ్చాననా అమ్మని తీసికెళ్లడం' దురుసుగా అన్నాడు తండ్రి. కొడుకు నుదురు బట్టించి 'నాన్న -' హెచ్చరిస్తున్నట్టు కాస్త గట్టిగానే అన్నాడు.
    "అమ్మకి కొన్నాళ్లు మార్పు కావాలనుకుంటుంది, నాతో వస్తానంది. తీసికెడుతున్నాను కొన్నాళ్ళుండి వస్తుంది-' మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు.
    "కొన్నాళ్ళేం ఖర్మ, శాశ్వతంగా వుంచుకో, నాకేం పరవాలేదు, నాగురించి ఎవరికి బెంగక్కరలేదు, నా సంగతి నేను చూసుకోగలను' ఉక్రోషం, అసహనం ధ్వనించింది ఆ గొంతులో - పక్కనించి వింటున్న రాజేశ్వరి ఏదో చెప్పడానికి నోరు తెరవ బోయింది, కొడుకు చాల్లే వూరుకో అని సంజ్ఞ చేశాడు. 'అమ్మ మీకోసం వంటమనిషిని మాట్లాడింది. మీకేంకావాలో ఎలా చెయ్యాలో అన్ని చెప్పింది - మీకేం ఇబ్బంది వుండదు - 'యింట్లోనే వుంటుంది ఆవిడ-' 'అయ్యో పాపం, నా గురించి అంత యావక్కరలేదు - నా సంగతి నేను చూసుకోగలను. ఎవరికెక్కడికి వెళ్లాలంటే వెళ్లి అక్కడుండచ్చు' మొహం ఎర్ర పరుచుకుని ఉక్రోషంగా అంటూ లేచివెళ్ళిపోయారు విశ్వనాథంగారు.
    రాజేశ్వరి కలవరంగా కొడుకు మొహం వైపు చూసింది. 'వూరుకో అమ్మ, నీవేం పట్టించుకోకు ఆయన మాటలు, ఆయన సంగతి మనకి తెలియదా - నీవు మాట్లాడక వూరుకో, నేను చూసుకుంటాను-' అని అభయం యిచ్చాడు నరేష్.
    నిన్న సాయంత్రం తండ్రి వాక్ కి వెళ్లినప్పుడు తల్లి వచ్చి ఏదో చెప్పాలనుకుంటూ సందిగ్ధ పడడం చూసి' ఏమిటమ్మా అన్నాడు నరేష్ - 'నానీ... ఈసారి నన్ను నీతో తీసుకెడతావా, కొన్నాళ్ళుండి రావాలని ఉంది నీదగ్గిర' అంది. నరేష్ ఆశ్చర్యంగా చూశాడు - తల్లి తనంతటతను తనతో వస్తాననడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కల్గించింది - గత పదేళ్లుగా ఎన్నిసార్లు పిల్చినా అక్కడ మాకు తోచదురా బాబూ, ఆ చలి అది పడదు ఏదో ఓసారి వచ్చాం. నాలుగు వూర్లూ తిరిగాం, నీ ఇల్లు వాకిలి సంసారం చూశాం గదా, ఆ ప్రయాణం అది యింక చేసే ఓపిక లేదురా, నేనెలావున్న మీనాన్న అసలు రారురాయింక - కిందటిసారే చూశావుగా వున్న నాలుగు నెలలు ఎంత సణిగారో..' అని రావదానికిష్టపడని తల్లి తనంతట తను అడిగిందంటే-?! ఏంటమ్మా నిజంగానే అంటున్నావా, నాన్న వస్తానన్నారా-' అనుమానంగా అడిగాడు.
    'మీ నాన్న కాదురా, నే ఒక్కర్తిని రావాలనుకుంటున్నాను... అని కాస్త ఆగి తలదించుకుని' నాకిక్కడ నించి రెండు మూడు నెలలు దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలనిపిస్తుందిరా. ఈయనతో పడలేక పోతున్నారా.. ఆవిడ గొంతు రుద్ధమయి, కళ్లు తడి అయ్యాయి- 'వయసుతోపాటు కాల్చుకు తినడం మరీ ఎక్కువైపోయింది నానీ, అనని మాట అనే మాట లేదు, నోటికెంత వస్తే అంత అందరిముందు అనడం, ప్రతి దానికి విసుగు, కసుర్లు, ఊ అంటే కోపం ఆ అంటే తిట్లు పడలేక పోతునార్రా. యీ కొంపలో వుండలేకపోతున్నానురా-' కళ్ళు తుడుచుకుంటూ అంది రాజేశ్వరమ్మ - తండ్రి సంగతి తెల్సిన కొడుకు తల్లిని ఏమనిచెప్పి ఓదార్చాలో తెలియలేదు. 'నాకు డెభైఏళ్లు వస్తున్నాయి - నేను మనిషినని, నాకు అవమానం, అభిమానం వుంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. కట్టుకున్న దానిమీద అభిమానం, గౌరవం అనేది ఆయనలో ఏకోశానా కనపడదు. భార్య అంటే చాకిరి చేస్తూ తన కాలికింద పడుండి, ఏమన్నా పడుండాలనే ఆ మనస్తత్వం నే చచ్చినా మారదు. ఆయనకి ఈ వయస్సులో వేళవేళలకి అన్ని అమర్చి పెడ్తూ చాకిరి చేస్తున్నానన్న కృతజ్ఞతన్నా లేదు మనిషికి - ఆయనకి వచ్చినట్టే నాకు వయసు పైబడ్తోందన్న ఆలోచన ఆయనకి లేదు. ఏ కాస్త చిన్న తప్పు జరిగినా విరుచుకుపడి నానా మాటలు అనడం - వూరుకొంటే మొద్దులా జవాబివ్వవేం అని తిట్లు, జవాబిస్తే ఏం నోరు లేస్తుంది అని ఎగరడం. ఏం బతుకు నాయనా యిది - ఆయనకి నే లేని లోటు, నా విలువ తెలియాలంటే ఆయన్ని విడిచి కొన్నాళ్ళు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను-' తల్లి ఆవేదన అర్థం చేసుకున్నాడు నరేష్ - 'అమ్మా, నీకు చాలాసార్లు ఇదివరకే చెప్పాను, మరీ అంతలా పడివుండద్దు, ఏదన్నా అన్నప్పుడు జవాబిస్తూ వుండమని, నీవలా వూరుకోబట్టే ఆయన నిన్ను లోకువ కట్టారు - మాటకి మాట అంటే, అనే ముందు కాస్త జంకుతారని చెప్పాను నీకు. నీ వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అలా అనడం, నీవు సహించడం వల్లే -' బాధగా, కోపంగా అన్నాడు- "నోరు మూసుకుంటుంటేనే యిలా అనే మనిషి జవాబిస్తే సహిస్తార్రా- ఎందుకీ గోల, రొస్టు అని నాపని నేను చేసుకొని వుంటున్నా - ఈ వయస్సులో గొడవలేమిటి నలుగురు నవ్వుతారని సహిస్తున్నకొద్ది... నా సహనానికీ హద్దుందని ఆయనకి తెలియాలి, నన్ను కొన్నాళ్ళు తీసికెడతావా... నీకు వీలుంటుందా, నీకు ఇబ్బందేం వుండదుగదా -' బిడియపడ్తూ అడిగింది రాజేశ్వరమ్మ.
    నరేష్ కోపంగా చూశాడు- 'ఏమిటమ్మా ఆ మాటలు - ఎన్నిసార్లు పిలిచాను రమ్మని, నాన్నకిబ్బంది అని, ఆయన్ని వంటరిగా వదిలి వస్తే బాగుండదని అనే దానివి. అమ్మా, నీకు ఎన్నాళ్లుండాలనిపిస్తే అన్నాళ్లుండు నా దగ్గిర. నీకేలోటు రాకుండా చూసే పూచినాది.
    "అయితే నీవే మీ నాన్నతో ఓ మాట చెప్పి టిక్కెట్టు అది ఏర్పాటు చెయ్యి-" అంది.
    కొడుకు ఆమాట చెప్పిందగ్గిర నించి విశ్వనాథంగారు మరింత బిగుసుకుపోయారు. భార్యతో అసలు మాటలు మానేశారు. మొహం ధుమధుమ లాడించుకుని విసరుగా వెళ్ళిపోవడం, ఏం కావల్సినా అడగకుండా తనే చేసుకోడం, కొడుకుతో కూడా చాలా ముభావంగా అడిగిందానికి ఊ ఆ - అనడం కంటే ఎక్కువ మాట్లాడకుండా యింట్లో సత్యాగ్రహం చేస్తూ తన అసమ్మతి, అప్రసన్నత తెలియచేశారు - రాజేశ్వరి చూసి చూడనట్టు ప్రవర్తించసాగింది - కొడుకు పట్టించుకోలేదు.
    వీసా, టిక్కెట్టు వచ్చాయి-' నాన్నా, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను, అమ్మకీ టిక్కెట్టు తీశాను-' కొడుకు చెప్పాడు - తన కోపాన్ని, అయిష్టతని చూసీ గ్రహించీ వెళ్ళడానికే భార్య తయారయిందిని మొహం మరింత గంటు పెట్టుకున్నాడు-' మంచిది' అన్నారు విశ్వనాథం వ్యంగ్యంగా "వంటావిడ వచ్చారు. అన్ని మన పద్ధతులు, మీ భోజన వేళలు అన్ని చెప్పింది. మీకెలా కావలిస్తే అలా చేస్తుంది చెపితే - పనిమనిషి వుండనే వుంది మీకేం యిబ్బందుండదు..." కొడుకు మాట పూర్తికాకుండానే 'నాకేం ఇబ్బంది- ఎవరన్నారు యిబ్బందని, యీవిడ లేకపోతే గడవదనుకుంటుంది, కోడిపెట్ట ముసలమ్మ కథ మాదిరి, వెళ్ళి శాశ్వతంగా అక్కడే వుండచ్చు నేను చచ్చాననుకుని-' ఆఖరి అస్త్రం వదిలారు- అంత మాట అన్నాక భార్య ఆగిపోతుందన్న ఆయన మనస్సులో ఆశ, - మర్నాడు భార్య సామానులన్ని సర్దుకుంటూ, పచ్చళ్లు, పొడులు చేస్తూ బజారునించి మిఠాయిలు అన్నీ తెప్పించడం చూశాక చిన్నపిల్లాడిలా ఉక్రోషపడిపోయారు. దీనికెంత ధైర్యం! తను లేకుండా, తనని వంటరిగా ఈ వయస్సులో వదిలి వెళ్ళడమా.. ఎంత పొగరు. కొడుకుని చూసి తైతక్కలాడుతుంది. వెళ్లనీ.. వెళ్లనీ దీని పని చెపుతూ, ఇల్లు ఆస్థి, గీస్తి ఏం రాయకుండా బుర్ర గొరిగించి కూర్చోపెడతాను అప్పుడు తెలుస్తుంది - ఏ కొడుకు ఎన్నాళ్లు ఆదుకుంటాడో చూద్దాం. - మనసు కల్లు తాగిన కోతిలా గెంతులు వేసింది.

                                           *    *    *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra