Home » Dr. dasaradhi rangacharya » Shrimadbhagwatgeeta


        అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః
        నిందంతం స్తవ సామర్ధ్యం తతో దుఃఖతరం సుకిమ్|| 36

    నీ శత్రువులు నిన్ను అసమర్ధుడు అంటారు. నిందిస్తారు. నలుగురిలో అవమాన పరుస్తారు. అంతకు మించిన హీనమేమి?
        హతో వా ప్రాప్స్యసే (సి) స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్
        తస్మాదుత్తిష్ట కౌంతేయ! యుద్దాయ కృతనిశ్చయః 37

    చత్తువా? స్వర్గసుఖములు కలుగును. గైలుతువా! రాజ్య సుఖములు అనుభవింతువు. లెమ్ము.
        సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ,
        తతో యుద్దాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి 38

    జయాపజయములు, లాభనష్టములు, సుఖదుఃఖములను సమముగా భావించుము యుద్దమునకు లెమ్ము. అప్పుడు నీకు పాపములు తాకవు.
        ఏషా తే -భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు
        బుద్ధ్యా యుక్తో యయా పార్ధ! కర్మబంధం ప్రహాస్యసి 39

    అర్జునా! ఇంతవరకు జ్ఞానయోగము చెప్పినాను. ఇప్పుడు కర్మయోగము వివరించెదను. వినుము. అర్ధము చేసుకొనుము. ఆచరించుము. కర్మబంధములో నుండి విముక్తుడవు ఆగుము.
        నేహాభిక్రమనాశో-స్తి ప్రత్యవాయో న విద్యతే    
        స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మమతో భయాత్ 40

    ఇది నాశము లేనిది. దీనికి విపరీత ఫలితాలుండవు. దీనిని స్వల్పముగా ఆచరించినను జన్మమృత్యురూప భయముండదు.
        వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన!-
        బహుశాఖా హ్యనంతాశ్చ బుద్దయో వ్యవసాయినామ్ 41

    దీనిలో నిశ్చయ బుద్ది ఒకటియే యుండును. కాని భోగాశక్తులు, వివేకహీనులు, చంచలములైన వారు, కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుదురు.
        యామిమాం పుష్పితాం వాచం ప్రవదం త్యవిపశ్చితః
        వేదవాదరతాః పార్ధ! నాన్యదస్తీతి వాదినః 42

    
        కామాత్మాన స్స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదామ్
        క్రియావిశేష బహూళాం భోగైశ్వరయ గతిం ప్రతి 43

    
        భోగైశ్వర్య ప్రసక్తానాం తయా -పహృత చేతసామ్
        వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే 44

    అందరూ వేదవాదమును ఆశ్రయించినవారు వుందురు. వారికి అది తప్ప మరేదియు తెలియదు. వారు దానిని గురించి గొప్ప గొప్ప ప్రవచనములు చేయుదురు.
    కొందరు కోరికల పుట్టలు. కర్మఫలమైన స్వర్గమునే ఆశింతురు. తమ కార్యముల వలన, భోగములు ఐశ్వర్యములు కలుగవలెనని కోరుచుందురు.
    భోగమే ఐశ్వర్యమే కోరికగా గలవారు, అపహృత మానసులు. బుద్ధిని ఒకే విషయమునందు నిలుపజాలరు. వారు అస్థిరచిత్తులు.
        త్రైగుణ్య విషయా వేదాః నిస్రై గుణ్యోభవార్జున!
        నిర్ధ్వంద్వో నిత్యసత్త్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ 45

    వేదములు, సత్త్వరజస్తమో త్రిగుణముల ఆసక్తులు అవుతారు. అర్జునా! నీవా గుణములను వదులుము. నీవు ద్వంద్వము కానట్టియు, నిత్యసత్వస్థము అగునదియు, నిర్యోగక్షేమల ఆత్మవంతుడవగును.
        యావానర్ధ ఉదపానే సర్వతః సంప్ణుతోదకే
        తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః 46

    కర్మయోగము నిండిన మహాజలాశయము వంటిది. అది వేదమునందుగల బ్రాహ్మణుని తెలియపరుస్తుంది.
        కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
        మా కర్మఫల హేతుర్భూః మా తే సంగో స్త్వ కర్మణి 47

    పనిచేయుటయే ధర్మము. ఫలమును ఆశించుట కాదు. నీవు కర్మఫలహేతువుగా కుండుము. అకర్మముల జోలికి పోబోకుము.
        యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
        సిద్ద్యసిద్ద్యోస్సమో భూత్వాసమత్వం యోగ ఉచ్చతే 48

    అర్జునా! ఏకాగ్రబుద్దివి అగుము. కర్మసంగములను వదులుము. సిద్ధిని, అసిద్ధిని సమముగా భావించుట, సమత్వయోగము అనబడును.
    
    దీపిక:
    
    కర్మయోగము ఏకాగ్రసిద్ది అగుచున్నది. కోరికలు వీడుట దీని ప్రధాన లక్షణము.
    వేదములు కేవలము భోగములనే ఉపదేశించినవి అనటము సరికాదు. శుక్ల యజుర్వేద అంతమున ఈశావాస్య ఉపనిషత్తునకు మూలము ఉన్నది. వేదము కేవలము స్వర్గమునే ఆశించును అనుట గూడ సరిగాదు. వేదము అనేకములను బోధించినది.
    'శాస్త్రయోనిత్వాత్' సకల శాస్త్రములకు వేదమే మూలము అగుచున్నది.
    ఆదిశంకరుడు ఉపనిషత్తులను వేదభాగము అన్నాడు. ఉపనిషత్తులు ఆనందము నాశించును. కోరికలను ఆశించవు.
    ఒక వాద ప్రచారమునకు మరొక వాదమును నిందించుట ఆచారమైయున్నది. వైష్ణవులు శివుని, శైవులు విష్ణువును నిందించుట అటువంటిదే.
    కర్మయోగమును ప్రచారము చేయుటకు వేదమును నిందించుట సమంజసము కాదు.
    కర్మఫల త్యాగము చాలా గొప్ప విషయము. ఇది సుఖ దుఃఖములకు అతీతమైనది. ఆనందము కలిగించునది అగుచున్నది.
    ఒక పనిచేస్తాము. దానివల్ల ఇంత ఫలము కలుగునని ఆశిస్తాము. అది కలుగునపుడు దుఃఖహేతువు అగుచున్నది. అది కలిగినపుడు గర్వకారణమగుచున్నది.
    కర్మఫల త్యాగములో సుఖదుఃఖములు లేవు.
    మానవుడు అగువాడు కర్మ ఆచరించుట ధర్మముగా భావించవలెను. అకర్మకుడు కారాదు. కర్మచేయుచునే కర్మఫల త్యాగము జీవితమునకు సుఖశాంతులు కలిగిస్తున్నది.
        దూరేణ హ్యవరం కర్మ బుద్దియోగాద్దనంజయ!
        బుద్ధౌ శరణ మన్విచ్చ కృపణాః ఫలహేతవః 49

    బుద్ధి యోగముకంటెను. సకామకర్మ నీచమైనది. కావున అర్జునా నీవు బుద్ది యోగమునే ఆచరింపుము. ఫలమును ఆశించి, కర్మలు చేయువారు మిక్కిలి హీనులు.
        బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్క్రుతే
        తస్మాద్యోగాలు యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ 50

    బుద్ధియోగి పుణ్యపాపములను ఈ లోకముననే త్యజించును. కావున నీవు బుద్దియోగమునే ఆశ్రయించుము. ఇది ధర్మముల నుండి విముక్తి కలిగించును.
        కర్మజం బుద్దియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః
        జన్మబంధ వినిర్ముక్తాః గచ్చంత్యం నాయకమ్ 51

    బుద్దియోగము సమభావము కలది. దానిని అనుష్టించినవాడు కర్మఫలమును త్యజించును. సుఖదుఃఖములు లేని పరమపదమును చేరుచున్నాడు.
        యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి!
        తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ 52

    నీ మనసు మాయనుండి తొలగవలయును. అపుడు నీవు పూర్వము వినిన, ముందు వినబోవువానిని గ్రహించగలవు.
        శ్రుతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా
        సమధావచలా బుద్ధిః తదా యోగ మవాప్స్యసి 53

    అనేక శాస్త్రములు అనేక రీతులుగా చెప్పుచున్నవి. అవి నీలో బుద్ధి చాంచల్యమును కలిగించుచున్నవి. సమబుద్ధిని అవలంబించి ఏకాగ్రచిత్తుడవు అయినప్పుడే నీకు స్వామి సంయోగము కలుగుచున్నది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra