Home » D kameshwari » Teeram Cherina Naava


    వాణి గొంతు పెగుల్చుకొని- "చెప్పాగా బస్సు పాడయితే అతని బండిలో వచ్చానని...వాళ్ళ తోటలు పొలాలు చూపిస్తానంటే సరదాగా వెళ్ళాను-వాళ్ళ చెల్లెలు రేణు వాళ్ళంతా మంచివాళ్ళు- వాళ్ళేం గతిలేని వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు-చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు.....మరి మీకు వాళ్ళంటే ఎందుకు గిట్టదోకాని నాకు నచ్చారు ఇందులో మీరింత కోపం తెచ్చుకోడానికి ఏముంది?" ముందు భయపడినా జవాబివ్వడం ఆరంభించాక ధైర్యంగా అనేసింది వాణి. రాజారావు మొహం ఎర్రబడింది.
    "వాళ్ళు ఎలాంటివాళ్ళని నిన్ను అడగలేదు- వాళ్ళతో సంపర్కం నాకిష్టంలేదని చెపుతున్నాను- ఈ రాకపోకలు వీల్లేదు-గుర్తుంచుకో! నీకేం తెల్సు వాళ్ళెలాంటివాళ్ళో వాళ్ళ అమ్మ యింట్లోంచి లేచిపోయిన బాపతు. కులం తక్కువదాన్ని పెళ్ళాడాడు వాళ్ళ నాన్న- అందరూ తన్ని తగలేస్తే బంధువులందరికి దూరంగా యీ పల్లెటూరొచ్చిమొహాలు దాచుకున్నారు- అయినా పొగర్లకేం లోటు లేదు-ఆ కిషోర్, వాడి చెల్లెలు యీనాటికి రెండు యింగ్లీషు ముక్కలు చదువుకుని మా అంత వాళ్ళు లేరని విర్రవీగుతారు- చేసేది పొలం పని పెద్ద ఆఫీసరు ననుకుంటాడు వాడు. యింటి గుమ్మం తొక్కకుండా కాళ్ళు విరగ్గొడతాను. ఏదో అమ్మవైపు బంధువనీ ఆవిడ బాధపడ్తుందని యిన్నాళ్ళూరు కున్నాను" ఆవేశంగా ఉక్రోషంగా, కసిగా చెప్పసాగాడు, రాజారావు.
    కిషోర్ వాళ్ళపట్ల ఇతనికి యింత కోపం ఎందుకో అర్ధం కాలేదు వాణికి- అందరూ స్నేహితులు. సహృదయులు ననిపించారు తప్ప రాజారావు అన్నట్టు పొగరుబోతులుగా కనపడలేదు అనుకుంది. ఆవిడ లేచిపోయింది అంటూ హేళన చేస్తున్నాడుగాని తన భార్య లేచిపోయిన సంగతి మరిచిపోయాడు గాబోలు- రుక్మిణి యింట్లోంచి వెళ్ళి నచ్చిన వాడిని పెళ్ళాడడం నేరం అయితే భర్తని వదిలి లేచి పోవడం చాలా చక్కగా వున్నట్టుంది- కోపంగా అనుకుంది వాణి- ఆ మాట అంటే అతని మొహం ఎలా మారుతుందో! నిబ్బరం తెచ్చుకుని "ఒక్కమాట అడుగుతాను, జవాబు చెప్తారా?" అంది వాణి-రాజారావు అనుమానంగా చూస్తూ 'ఏమిటి?' అన్నాడు- వాణి తడబడ్తూ.... "ఏం లేదు.....మీ భార్య-పద్మావతిగారు నిజంగా చనిపోయారా?" అతిప్రయత్నం మీద అడిగింది వాణి-రాజారావు మొహం అరక్షణంలో రంగుమారిపోయింది...ఒక్క నిమిషం జవాబివ్వలేకపోయాడు ఆ తరవాత మొహంలో కోపం బుస్సున పొంగింది.
    "ఎవరూ ఆ కిషోరేనా చెప్పాడు నీకు. యీ సంగతులన్నీ నీ కెవరు చెప్పారు-యింకేం చెప్పాడు, నాగురించే నూరి పోశాడు. అందుకే ఆ వెధవని యింట్లో చేరనీయొద్దన్నాను. ఇదిగో వాణీ వీళ్ళువాళ్ళు చెప్పిన మాటలు నమ్మకు. వుండు ఆ రాస్కెల్ పనిచెప్తాను....యీ సారి కనిపించాడో చెప్పుచ్చుకు కొడ్తా" యింతెత్తు ఎగిరాడు మొహం ఎర్రపరుచుకుని వాణి భయపడింది-ఏం అంటాడో అతన్ని, ఏం అనుమానిస్తాడో ఏమిటో కిషోర్ ని మనసులో బెదిరింది వాణి. వాణి భయం ఆ క్షణంలోనే నిజమైంది -మరి రెండు నిమిషాల్లోనే కారుకి కిషోర్ బండి ఎదురైంది. పొలంనించి గాబోలు రెండెడ్ల బండి తోలుకుంటూ హుషారుగా వస్తున్నాడు కిషోర్ - రాజారావు కారు దగ్గరకి రాగానే ముందు సీటులో డ్రైవ్ చేస్తున్న రాజారావుని అతని పక్క వాణిని ఆశ్చర్యంగా చూశాడు ఎద్దులని ఆపుతూ -కిషోర్ ని రాజారావు చూశాడు-సడన్ గా బ్రేక్ వేసి కారాపాడు- వాణి పై ప్రాణాలు పైనే పోయినట్లు గాభరా పడ్తూ రాజారావువంక చూసింది-రాజారావు కారాపడం, కారు దిగి తనవైపు రావడం చూసి కిషోర్ ఆశ్చర్యంగా అనుమానంగా బండి ఆపి బండి దిగాడు రాజారావు రెండంగల్లో కిషోర్ దగ్గరికి వెళ్ళి కఠినంగా, క్రూరంగా చూస్తూ "ఏమిటి కూశావు నా గురించి వాణితో?" ఉపోద్ఘాతం లేకుండా విరుచుకుపడిన రాజారావుని తెల్లబోయి చూశాడు కిషోర్.
    "నాగురించి యిష్టమొచ్చినట్లు చెప్పడానికి నీకెన్ని గుండెలు. పద్మావతి గురించి ఏం చెప్పావు- అసలు మా విషయాలు నీ కెందుకు. నా యింటికి వచ్చి నా గురించే చెప్తావా? రాస్కెల్ నీకెంత పొగరు. నీమీద పరువు నష్టం దావా వేస్తాను, ఎవరనుకున్నావో ఏమిటి-నీ అంతు తేలుస్తా ఈసారి నా గుమ్మంలో అడుగుపెట్టు కాలు విరగకొడ్తా- ఊరి పొలిమేరల్లో కనిపించు పాతేయిస్తా, యీ రాజారావు తడాఖా చూపిస్తా-ఖబడ్దార్, జాగ్రత్తగా వుండు. నీవెంత నీ అంతస్థెంత నన్నే అనేటంత మొనగాడివయ్యావా-చూస్తా- నీ అంతు తేలుస్తా."
    రాజారావు కిషోర్ షర్ట్ గుప్పిటతో పట్టిగుంజి కిషోర్ ఏం జరుగుతున్నదీ అర్ధం చేసుకునేలోగానే విసవిస వచ్చి కారులో కూర్చుని కారు తలుపు దఢాలున మూసి ఒక్క ఉదుటున కారు ముందుకి ఉరికించాడు- కారు వెళుతుంటే నల్లబడిపోయిన కిషోర్ మొహం, అవమానంతో ఆవేశంతో వాణివంక చూసిన చూపు వాణి భరించలేక పోయింది-ఆ హఠాత్ సంఘటననించి తేరుకోడానికి ఆమెకి రెండు నిమిషాలు పట్టింది.
    'ఛ-ఛ-కిషోర్ ఏమనుకున్నాడో తనగురించి- తను రాజారావుతో అతనిగురించి ఉన్నదీ లేనిది చెప్పిందని ఎంత అపోహపడ్తాడో-' యిప్పుడేం చెయ్యడం?
    ఈ రాజారావు-ఛీ-ఛీ- యిలాంటి మూర్ఖుడేమిటి-సందు దొరికితే ఆ కిషోర్ మీద విరుచుకుపడ్తాడేమిటి? "మీకు కిషోర్ చెప్పాడని నేనన్నానా-అతన్నెందుకు అనవసరంగా అవమానించారు?" తిరస్కారం, కోపం అసహ్యం ముంచెత్తగా తీవ్రంగా అడిగింది వాణి.
    "అతనే పాపం ఎరగడు. మధ్య అతన్నెందుకు ఆడి పోసుకుంటారు-యీ విషయమే గాదు, మీ యింటి విషయమేమి అతను నాకు చెప్పలేదు- యింట్లో పనివాళ్ళు. మీ అమ్మగారు వాళ్ళు అనుకుంటూంటే విన్నాను-కిషోర్ నోరు మూయించగలరు గాని లోకం నోరు మూయించగలరా? ఏ పాపం ఎరగని అతన్ని దుమ్మెత్తిపోయడం, అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం ఏం బాగులేదు. తన అసమ్మతిని, అయిష్టాన్ని తీవ్రంగా వ్యక్తపరిచింది వాణి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra