Home » D kameshwari » Madhupam


                                          నేరం దాగదు
    
    ఓ శీతాకాలం తెల్లవారుతున్న సమయం. బ్లూ హెవెన్ అపార్ట్ మెంట్ ముందు అటో వచ్చి ఆగింది. నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ నించి నాంపల్లి లో దిగి యింటికి వచ్చిన సుధాకర మూర్తి మూడో అంతస్థు వెళ్ళి 302 ముందు ఆగి జేబులోంచి తాళాలు తీసి తాళం తీయబోతూ డోరు కాస్త తెరచినట్టుండడం చూసి ఆశ్చర్యపోతూ లోపలికెళ్ళాడు. వెళ్ళిన ఒక నిమిషంలో గావుకేకలు పెడ్తూ బయటికి పరిగెత్తి వచ్చాడు. ఎదురింటి పక్కింటి తలుపులు బాదుతూ వాచ్ మెన్ వాచ్ మెన్ అంటూ అరుస్తూ నిలువెల్లా వణికిపోతూ , నోట మాట రానట్టు అలా కూలబడి పోయాడు. పక్కింటి ఎదురింటి ప్లాట్ తలుపులు తెరచుకుని, కింద నించి , పైనించి జనాలు పరుగెత్తి వచ్చారు. వాచ్ మెన్ కింద నించి పరిగెత్తి వచ్చాడు.
    ఎదురింటి సుబ్రహ్మణ్యం "ఏం జరిగింది ఏం జరిగింది" అన్నాడు గాభరాగా.
    సుధాకర్ లోపలికి చూపిస్తూ "హత్యహత్య" అన్నాడు వణికిపోతూ.
    పక్కింటి ప్రదీప్ అతన్ని పట్టుకుని " .... వాట్ హేపేన్ద్"
    "సరోజ..... సరోజనీ ఎవరో ...." అంటూ లోపలికి పరిగెట్టాడు. అందరూ లోపలికి జొరబడ్డారు.
    అక్కడ మంచం కింద సరోజ రక్తపు మడుగులో పడి వుంది. లెమన్ కలర్ నైట్ గౌనులో ఉన్న ఆమె ఛాతి మధ్య కత్తి దిగబడి ఉంది. గౌను అంతా రక్తం.దుప్పటి సగం కిందికి జారింది. దుప్పటి నిండా రక్తపు మరకలు.
    "ఓమైగాడ్ ....హత్య ... ఎవరు చంపారు.... ఎప్పుడు ఎలా ..... మాకెవరికీ తెలియనే లేదు" - అంతా తలో మాట అన్నారు.
    పై ఫ్లోర్లో వుండే ఓ డాక్టరు ముందుకు వచ్చి చేయి పట్టి నాడి చూసి , కనురెప్పలు తెరిచి చూసి , "చనిపోయి చాలా సేపయింది. హత్య రాత్రి ఎప్పుడో జరిగి వుండచ్చు" కాళ్ళు చేతులు కదుపుతూ ఎముకల కదలిక చూస్తూ అన్నాడు.
    వాచ్ మెన్ ని అందరూ తలో ప్రశ్న వేశారు. రాత్రి ఎవరన్నా కొత్తవాళ్ళు వచ్చారా. ఏదన్నా చప్పుడు అది వినిపించిందా. ఎవరో వచ్చి ఇంత డేరింగ్ గా హత్య చేసి వెళ్ళారంటే ఈ వాచ్ మెన్ యూస్ లెస్ - అంతా తలోమాట అన్నారు. వాచ్ మెన్ బెదిరిపోయాడు. "బాబూ, నేనసలు గేటు నిండి కదలనేలేదండి. రాత్రి నీళ్ళ టాంకరు వచ్చినపుడు తప్ప గేటు నించి కదలనే లేదండి -" భయపడ్తూ చెప్పాడు.
    సుధాకర్ కుర్చీలో కూలబడిపోయి రోదించసాగాడు. ప్రదీప్ అతని భుజం తడ్తూ ఓదారుస్తూ 'సుధాకర్ గారూ, మీరెక్కడ నించి వస్తున్నారు. నిన్న ఊర్లో లేరా" - పక్కన సూట్ కేస్ చూస్తూ అడిగాడు.
    సుధాకర్ జేబురుమాలతో కళ్ళు తుడుచుకుంటూ , ఏడుపు ఆపుకుంటూ, "నేను మొన్న రాత్రి విజయవాడ వెళ్ళి ఇప్పుడే వస్తున్నానండీ, నేను వుండి వుంటే ఇలా ఎందుకు జరిగేదండి . నేను లేనని తెలిసి ఎవరో ఇలా ...."
    "నగలు, డబ్బూ, వస్తువులు ఏమన్నా పోయాయా చూడండి ముందు...." సుబ్రహ్మణ్యం అన్నాడు.
    సుధాకర్ అప్పుడే గుర్తు తెచ్చుకుని భర్త వంక చూసి, "మెడలో సూత్రాల గొలుసు గాజులు వుండాలి లేవు' అంటూ చుట్టూ చూసి బీరువా కి తాళాలు వ్రేలాడుతుండడం చూసి లేచి తలుపు తీయబోయాడు.
    "ఆగండి , వద్దు , పోలీసులు రానీండి. ఫింగర్ ప్రింటులు అవి వుంటే చెదిరిపోతాయి" అన్నారెవరో , తమకున్న డిటెక్టివ్ నవలల , సినిమాల పరిజ్ఞానంతో.
    సుధాకర్ ఆగిపోయాడు చూట్టూ చూశాడు - టి.వి. , విసిఅర్ అవి అలాగే వున్నాయి. బీరువాలో రెండు మూడు వేలు డబ్బు, సరోజవి ఇంకా కొన్ని నగలు ఉండాలి మరి! వీటి కోసమే ప్రాణాలు తీస్తారా ఎవరన్నా? మళ్ళీ అతని కళ్ళు నిండుకున్నాయి. అసలు లోపలికెలా వచ్చారు. ఆవిడ తలుపు బెల్ కొడితే తీసారా ..... ఇది ఎవరన్నా తెలిసినవాళ్ల పనా - లేక కేవలం డబ్బు కోసం జరిగిన పనా, ఎవరో అన్నారు. అందరి మనసులో లక్ష సందేహాలు. సుధాకర్ అయోమయంగా తలూపాడు.
    "ఆవిడ దగ్గర ఓ తాళం , నా దగ్గర ఓ తాళం ఉంటాయి. ఎవరంతట వాళ్ళు ఇంటికి వచ్చినపుడు తాళం తీసుకునే వస్తాం. అందుకే నేను ఏ రాత్రి వచ్చినా, ఇలా ఉదయం వచ్చిన సరోజని డిస్ట్రబ్ చేయకూడదని ఎవరి కీస్ వాళ్ళం పర్సులో వుంచుకుంటాం. ఏ తలుపు కిటికీ, వెంటిలేటర్లు తీసినట్టు లేదు" అన్నాడు చుట్టూ చూసి.
    "బహుశా ఎవరన్నా బెల్ కొడితే ఈవిడ తలుపు తీస్తే లోపల జోరబడ్డారేమో " - అన్నారెవరో.
    "ముందు పోలీసులకి ఫోను చెయ్యండి. ఎవరూ ఏం ముట్టుకోకుండా డ్రాయింగు రూములోకి పదండి. ఊరుకోండి సుధాకర్ . ఇంక ఎంత ఏడ్చినా ఏం లాభం? గుండె దిటవు చేసుకోండి." - ఏడుస్తున్న సుధాకర్ భుజం చుట్టూ చెయ్యి వేసి ముందు గదిలోకి నడిపించాడు ప్రదీప్."
    "లావణ్యా కాస్త కాఫీ గాని, టీ గాని చేసి పట్రా...." అన్నాడు భార్యతో.
    "నాకేం వద్దండీ ..... నాకేం వద్దు...." ఏడుస్తూ చేతిలో మొహం దాచుకున్నాడు సుధాకర్. అంతా జాలిగా చూసారు. సుధాకర్, సరోజల పెళ్ళయి పట్టుమని ఏడాది మీద రెండు నెలలయింది. సరోజ కూడా ఉద్యోగాస్తురాలే. భర్త మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య ఏదో కంపెనీలో పని. ఇద్దరూ బయటికి తొమ్మిది గంటల కల్లా వెడతారు. సరోజ ఏడు లోపల సాధారణంగా ఇంటికి వస్తుంది. సుధాకర్ రాకపోకలకి టైముండదు . నెలకి 10, 15 రోజులు బయటి ఊర్లకి తిరుగుతాడు. హలో అంటే హలో పలకరింపులు. ఏదన్నా బిల్డింగు మీటింగు జరిగితే ఒకటి రెండుసార్లు కలవడం న్యూ ఇయర్ పార్టీ అపుడు ఏడాదికి ఓసారి బిల్డింగులో అంతా కలవడం తప్ప వాళ్ళిద్దరికి ప్రత్యేకం ఎవరితో పరిచయం లేదు పెద్దగా. ఆ ఫ్లోర్ లో ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్యం , ప్రదీప్ భార్యలతో కాస్త పరిచయం. చాకలి బట్టలు తెచ్చినా, ఏదన్నా రిజిష్టరు , కొరియర్ లాంటివి వస్తే తీసి వుంచుతారు. అంచేత భార్యాభర్తల విషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు.
    ఫోను చేసిన అరగంటకి ఓ ఇన్స్ పెక్టర్ , ఇద్దరు కానిస్టేబుల్స్ , ఒక ఫోటో గ్రాఫర్ వేలిముద్రల నిపుణుడు వచ్చారు. అలవాటుగా ముందు ఫోటోగ్రాఫర్ శవాన్ని అన్ని కోణాల నుండి ఫోటోలు తీసాడు. "హత్య జరిగినట్టు ముందేవరు చూశారు? ఈమె ఎవరి తాలుకా?" అనడిగాడు. సుధాకర్ ముందుకొచ్చి, "నాభార్య సరోజ ఆమె - నేనే ఉదయం ఊరి నుండి రాగానే తలుపు తీసేసరికి ఇలా శవమై డగ్గుత్తికతో అన్నాడు. ఇన్ స్పెక్టర్ సుధాకర్ మొహాన్ని పరీక్షీస్తూ "ఉదయం రాగానే అన్నారు, మీరెక్కడి కెళ్ళారు - రాత్రి ఇంట్లో లేరా ...." అనుమానంగా చూశాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra