Home » D kameshwari » Kadedi Kadhaku Anarham


    భార్య ముందు తల దించి తల దువ్వించుకోవడం, స్నానం చేస్తూ తువ్వాలు మర్చిపోయిన వంకతో భార్యని స్నానాల గదిలోకి లాగి సరిగంగ స్నానాలు చెయ్యడం, అన్నం తింటూ తింటూ భార్య పళ్ళెం లోది లాక్కుని తినడం, ఆఫీసు నించి రాగానే కాఫీ కప్పుతో పాటు భార్య చేయి పట్టి దగ్గరికి లాక్కుంటే రోజంతా నీరిక్షణకి అర్ధం కనపడదా? ఇలాంటి చిన్న చిన్న సరదాలకి డబ్బు ఖర్చు లేదు. భార్య భర్త నించి కోరేది ప్రేమానురాగాలు కానీ, సెక్స్ కాదన్నది అర్ధం కాదా, ప్రేమలేని చోట స్త్రీకి సెక్స్ నరకం అన్నది ఈ మగాళ్ళకి అర్ధం కాదా. రాత్రి అరక్షణం పని. భర్తకి తృప్తి నివ్వచ్చు గాని భార్యకి కాదన్నది ఈ మగాళ్ళు ఎందుకు గ్రహించరు? ఆమెకి కావాల్సింది భర్త గుండెల మీద తలపెట్టి పడుకుంటే ఆ చేతులు అనురాగంతో శరీరాన్ని వీణగా చేసి మీటుతూ ఉంటే పులకింత కావాలి అన్నది ఎప్పటికీ అర్ధం చేసుకోలేరా! పత్రికలలో సెక్స్ సందేహాలు చూస్తె నవ్వు వస్తుంది. ఆడదాన్ని ఇంప్రెస్ చెయ్యడానికి అదే మార్గం అనుకునేవాళ్ళు తెలివి తక్కువతనానికి నవ్వు వస్తుంది. వాళ్ళ శక్తి సామర్ధ్యాలు , ప్రతాపాలు చూసి ఆడది ప్రేమించదని , స్త్రీకి అది సెకండరీ థింగ్ అన్న నిజం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యరు? మగాడు నపుంశకుడు అయినా ప్రేమానురాగాలు చూపి గుండెల్లో దాచుకుంటే చాలనుకుంటుంది ఆడది!
    ఓ చిన్న చిరునవ్వుతో , ఓ మధుర వచనంతో భార్యని బానిసని చేసుకోవచ్చని ఈ పిచ్చి మొగవాళ్ళు ఎప్పుడు అర్ధం చేసుకుంటారు? సరసం తెలీని మొగుడి కటువైన మాట కత్తిలా గుండెల్ని కోసి బాధపెడ్తుంది స్త్రీని. ఇవన్నీ ఎవరికి చెప్పడం? ఎలా చెప్పడం?"
    ఎత్తి ఎత్తి ఎంగిలాకు మీద అడుగేసినట్టు వెతికి వెతికి మంచి సంబంధం ----ఇంజనీరు , ఉన్నవాళ్ళు అన్న మురిపం ఏడాది నిలవలేదు. ఎనిమిది నెలలకి పుట్టింటికి వచ్చిననాడే అర్ధమయింది.
    "రేణూ , ఏం జరిగిందో చెప్పకపోతే మాకేలా తెలుస్తుంది? మీ నాన్నగారిని వెళ్ళి మాట్లాడమనాలన్నా అసలు సంగతి తెలియాలి కదా --చెప్పు రేణూ. అతను నీమీద చెయ్యి కూడా చేసుకుంటూన్నాడా!" ఆందోళనగా అడిగింది.
    'అమ్మా ప్రేమ ఉంటే చెంపదెబ్బ వేసినా ఆడది సహిస్తుంది. కోపం వచ్చినప్పుడు ఓ దెబ్బ వేసి తర్వాత దగ్గరికి లాక్కునే భర్తని ఎప్పుడూ క్షమిస్తుంది. అన్నింటికన్నా ఆడదాన్ని బాధించేది ఇండిఫరెంట్ అటిట్యూడ్, భార్యా అన్నదాన్ని ఇగ్నోర్ చేసి, ఆవిడ కా ఇంట్లో వండిపెట్టే , పిల్లలని కనే స్థానం మాత్రమే అనే యాటిట్యూడ్ ఏ ఆడది భరించలేదమ్మా. ప్రతి ఇంట్లో భార్య భర్తా అరుచుకుంటారు. కానీ, తరువాత మర్చిపోవాలి. ఓ చిన్న విషయాన్ని పట్టుకుని రోజుల కొద్ది సాగదీసిసాధించి ముంగిసలా మాట్లాడకుండా కూర్చునే మనస్తత్వం నాకు సరిపడదమ్మా. ఊ అంటే , ఆ అంటే కోపం. మొగుడితో కూడా డ్రాయింగు రూములో గేస్టులా మాట్లాడాలి . తక్కడలో మాటలు తూచినట్టు అటు ఇటు ఓ మాట ఎక్కువ ఆడకూడదంటే ఎలా అమ్మా? ఏదీ సర్దుకునే మనస్తత్వం కాదు. ఇవతలివాళ్ళు చెప్పేవి, చేసేవి తప్పులు. అయన చేసేవి రైటు . తను ఇతరులను ఎన్నైనా అనవచ్చు. తనని ఎవరూ ఏమనకూడదు. మేమూ చదువుకుంటున్నాం. మాకూ ఓ వ్యక్తిత్వం ఉంటుంది. మాకూ కొన్ని అభిప్రాయాలు, టెస్టులు ఉంటాయి. ప్రతిదానికి భార్యే సర్దుకోవాలంటూ ఎన్నాళ్ళమ్మా? అందరూ నీతులు చెపుతారు. పెళ్ళి కోసం , సంసారం కోసం తల వంచి ఎన్నాళ్ళు భరించాలి? భర్త సహృదయుడైతే ఎంత చదువుకున్న ఆడదైనా తనని తాను అర్పించుకొని ఏమన్నా భరిస్తుంది. ప్రేమలేని చోట పెళ్ళికి కట్టుబడి, ఈ మగాళ్ళ జులుం సహిస్తూ ఎన్నాళ్ళయినా పడుండాలాంటావా!" రేణులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆర్నెల్లుగా మనసులో అణగదొక్కిన ఆవేశం లావాలా పెల్లుబికింది.
    "రేణూ , నీవు చెప్పిందంతా నిజమే - సామరస్యం లేని కాపురం స్త్రీకి నరకమే. కానీ, ఈ దేశంలో ఓసారి పెళ్ళయ్యాక ఆడదాని అదృష్టం మంచిదయితే అనుకూలుడైన భర్త దొరుకుతాడు. లేదంటే దురదృష్టం అని సరిపెట్టుకు బతకాల్సిందే."
    'అదంతా ఇదివరకటి రోజుల మాటలు. ఏం పెళ్ళి, సంసారం, ఇల్లు, పిల్లలు, భార్య మొగుడికి అక్కరలేదా? మగాడికి ఆడదాని అవసరం లేకపోతే ఆడదీ ఈనాడు మగాడి అవసరం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడగలదు.' పౌరుషంగా అంది రేణుక.
    రేణు మాటలతో అర్నేల్లకే కూతురి మనసు ఎంత విరిగిపోయిందో అర్ధం చేసికోగల్గింది సావిత్రి. కానీ, పెళ్ళయ్యాక , అందులో నెల తప్పిన పిల్ల కాపురం వదులుకోడం అంత సులువా! పెళ్ళయిన అర్నేల్లకే ఆ కాపురం వద్దన్న ఆడపిల్ల మనసు ఎంత గాయపడి ఉండాలి! ఇద్దరబ్బాయిల తరువాత ఒకతే కూతురని గారాబంగా పెంచి, పెద్ద చేసి ఇంజనీరని, బాగున్నాడని ఎంచి పెళ్ళి చేస్తే ఇలా జరిగిందేమిటి? సావిత్రి మనసులో వ్యధ బయటపడితే, కూతురు ఇంకా అధైర్యపడ్తుందని అప్పటికి ఏం మాట్లాడలేదు.
    ఆరాత్రి భర్తతో అంతా చెప్పింది సావిత్రి. ప్రసాదరావు చకితులై విన్నారు. 'అయ్యో, ఇదేమిటి నిజంగానా? రమేష్ అలాంటివాడా? "రేణు అంత బాధ పడ్తోందా?" ఆయనకా క్షణంలో నిస్సహాయత తప్ప ఏం చెయ్యాలన్నది తట్టలేదు.
    "ఏం చేద్దాం? మనం చెపితే వింటాడా! అసలు మనిషి నేచర్ మనం ఎలా మార్చగలం? ఏదో అట్టే మాటకారి కాదనుకున్నాను గాని ఇలా.....' అయన తల పట్టుకున్నారు.
    "పోనీ వియ్యంకులతో మాట్లాడితే.....' ఆరాటంగా అన్నారు ప్రసాదరావు.
    "ప్రత్యేకం ఏముందని చెపుదాం, మీ అబ్బాయి సరసుడు కాడని ఎలా చెపుతాం? చెప్పినా వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు? భార్యాభర్తల అన్యోన్యత అన్నది వాళ్ళిద్దరి మధ్య విషయం అంటే......' సావిత్రి సందేహంగా అంది.
    "అదీ నిజమే..... కొడుకుని వాళ్ళు ఏమన్నా అలా ఉండమన్నారా- వాడి స్వభావం అంతే అంటే మనం ఎమంటాం? ఏదో కొడ్తున్నాడు, హింసిస్తూన్నాడంటే కంప్లైంట్ చేస్తాం గాని , ఇలా వాళ్ళ మధ్య ప్రేమ లేదని ఏం చెప్తాం? ఇంతకీ రేణు ఏమంటుంది?"
    "వెళ్ళనంటూ ఏడుస్తుంది. నన్నక్కడికి వెళ్ళమనద్దు అని ఏడుస్తుంది. దానికి ఆరు నెలలకే మనసు విరిగి పోయిందండి."
    "ఖర్మ దాని ఖర్మ. ఎంచి ఎంచి అపురూపంగా పెళ్ళి చేస్తే ఇలా జరగడం.....దానికి తోడు నెల తప్పిందంటున్నావు.....ఈ పరిస్థితిలో మనం ఏం చెయ్యాలి?"
    "అదే నేనూ అన్నాను. కాపురం, మొగుడు వద్దనుకోవడం అంత సుళువు కాదు, అందులో పిల్ల పుట్టబోతుంటే మరీ ఇబ్బంది అని నచ్చచెప్పాను."
    "అతన్ని కాస్త సౌమ్యంగా మార్చుకోడానికి ప్రయత్నించమని నచ్చ చెపుదాం. పెళ్ళి, సంసారం అన్నాక రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మరీ సెన్సిటివ్ గా వర్రీ అయిపోతే ఎలా? సాల్వ్ చేసుకోడానికి ప్రయత్నించాలి గాని. ఊ ఆ అంటే విడిపోతే తరువాత ప్రాబ్లమ్స్ ఆలోచించాలి గదా.....దాంతో మాట్లాడుతాను రేపు ' నిట్టూర్చి అన్నారు ప్రసాదరావు.
    తరువాత వారం రోజులు తల్లి, తండ్రి రకరకాలుగా కూతురికి నచ్చజెప్పి ' సంసారం వదులుకుంటే ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు , పిల్లతల్లి కాబోతున్న తరుణంలో భర్తని వదిలితే వచ్చే ప్రాబ్లమ్స్ రకరకాలుగా చెప్పి, కూతుర్ని సామరస్యంగా అతన్ని మార్చుకోడానికి ప్రయత్నించమని ఓ విధంగా బలవంతంగానే పంపించారు. ప్రతి తల్లితండ్రుల మాదిరిగానే అలోచించి.

                                            *    *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra