Home » Suryadevara rammohan rao » Anitara Sadhyudu


    "నీకేం ఫర్వాలేదు నేనున్నాను నీ వెనుక. నేనో పథకం వేసానంటే నూటికి నూరుశాతం అది బెసకదు. అన్ని వేపులా నిశితంగా ఆలోచించే ఈ పథకం వేసాను. ఎస్.ఐ. ఇందులో ఇరుక్కోవటం ఖాయం..." అన్నాడు సామంత్ ఆమెకి ధైర్యం చెప్పే ప్రయత్నంలో భాగంగా.

 

    "పోలీసులతో వ్యవహారం! అందుకే ఇంత భయపడుతున్నాను"

 

    "భయమేనా? అసహ్యం లేదా?"

 

    "అసలు వున్నదే అది. కాకపోతే వాళ్ళ రాక్షసత్వాన్ని ఎరుగున్న దాన్ని గనుక భయపడుతున్నాను..."

 

    "ఇంకా ఆ భయం గురించి మర్చిపో, నరసింహం అసలే పోలీసు జాగిలం. మనమే మాత్రం పొరపాటు చేసినా ఇట్టే పసిగట్టేస్తాడు. ఈ పాటికి బయలుదేరే వుంటాడు..."

 

    ఆమె ధైర్యాన్ని కూడదీసుకుంది.

 

    ఆమె మోములో వచ్చిన మార్పుని గమనించి సంతృప్తిగా తలపంకిస్తూ లేచాడు సామంత్.


                               *    *    *    *


    నాగమ్మ సెక్రెటరీ యిచ్చిన ఫైల్ ఓపెన్ చేసింది.

 

    మొదటి పేజీలోనే ఒక యువకుడి ఫోటో వుంది కుర్రాడు ఫర్వాలేదు... అనుకున్న మరుక్షణం తన చూపుల్ని క్రిందకు సారించింది.

 

    కె.రాంబాబు. బి.ఇ; ఎం.బి.ఏ. అతని బయోడేటా అంతా స్పష్టంగా అందులో పొందుపరచి వుంది.

 

    నాగమ్మ అన్నీ వివరంగా చదువుకుని తిరిగి మరోసారి ఫోటోకేసి చూసింది.

 

    అతని పేరు కాకర్లపూడి రాంబాబు. ఆంధ్రా యూనివర్శిటీలో బి.ఇ. మెకానికల్ గోల్డు మెడలిస్టు. ఆ తరువాత ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, బెంగుళూరులో ఎం.బి.ఎ. చేశాడు. ఫైనాన్స్ మెయిన్; ఇతనే ఆ ఇంటికి పెద్ద కొడుకు. ఇతని తర్వాత ఒక చెల్లెలు, ఒక తమ్ముడు వున్నారు. తండ్రి..." సెక్రటరీ చెప్పటం ఇంకా పూర్తి కాలేదు.

 

    "ఇంటికి పెద్ద కొడుకా...!" అంటూ నాగమ్మ అడ్డొస్తూ ప్రశ్నించింది.

 

    "అవునమ్మా..." సెక్రటరీ సందేహిస్తూ అన్నాడు.

 

    "వేరే ఎవరినన్నా చూస్తారా?" అంది నాగమ్మ సీరియస్ గా.

 

    ఆమెకా సంబంధం నచ్చలేదని అర్థం చేసుకున్నాడు సెక్రటరీ.

 

    ఆమె చేతుల్లోంచి ఆ ఫైల్ ని నెమ్మదిగా తీసుకొని మరో ఫైల్ అందించాడు.

 

    నాగమ్మ రెండో ఫైల్ ఓపెన్ చేసింది.

 

    బి.నాగేశ్వరరావు, ఎమ్.కాం., పిహెచ్.డి. నాగమ్మ ఆ ఫైల్లో స్టిక్ చేస్తున్న యువకుడి ఫోటోని నిశితంగా పరిశీలిస్తుండగా సెక్రటరీ చెప్పడం మొదలెట్టాడు.

 

    "నాగపూర్ యూనివర్శిటీలో ఎమ్ కామ్ చేశాడు.

 

    ఫాస్ట్ క్లాస్ పిహెచ్.డి.కూడా అక్కడే చేశాడు..."

 

    "బంగారంలాంటి ఆంధ్రా యూనివర్శిటీని వదిలేసి నాగపూర్ యూనివర్శిటీకి ఎమ్ కామ్ చదవడానికి వెళ్ళాడంటే చాలా పూర్ స్టూడెంట్ అయి వుంటాడు. బి.కాంలో మంచి మార్క్స్ రాకే యితర రాష్ట్రాలకు మన విద్యార్థులు వెళ్ళేది. కాదంటారా?" నాగమ్మ సూటిగా ప్రశ్నించేసరికి సెక్రటరీ గతుక్కుమన్నాడు.

 

    "నెక్ట్సు" నాగమ్మ ఆ ఫైల్ ని తిరిగి సెక్రటరీకి ఇచ్చేస్తూ అంది. సెక్రటరీ ఆమె అందించిన ఫైల్ తిరిగి తీసుకుని పక్కనే వున్న రేక్ లో వుంచి మరో ఫైల్ ని తీసి ఆమెకి అందించాడు.

 

    మూడో ఫైల్ ని ఓపెన్ చేసింది నాగమ్మ.

 

    డాక్టర్ బి.చక్రవర్తి ఎం.ఎస్... అని ముచ్చటగా ఫైల్ లోని మొదటి పేజీ మీద టైప్ చేసుంది.

 

    "బీరం చక్రవర్తి వయస్సు ఇరవై ఐదు. యం.బి.బి.ఎస్.మణిపాల్. ఎం.ఎస్. కూడా అక్కడే. మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్..."

 

    "కట్నం కోసం చదివాడా?"

 

    నాగమ్మ ప్రశ్నకు సెక్రటరీ బిత్తరపోయాడు.

 

    "మనిషికి ప్రాణం పోసే వైద్యవృత్తి ఇలాంటి మందభాగ్యులవల్లే భ్రష్టుపట్టి పోతోంది. అత్తెసరు మార్కులు వచ్చే అర్భకులే తల్లిదండ్రుల డబ్బుతో డొనేషన్స్ కట్టి డాక్టర్స్ అనిపించుకుంటారు. ఎందుకో తెలుసా...? వైద్య వృత్తి ద్వారా రోగులకు సేవ చేద్దామని కాదు. మంచి ప్రాక్టీస్ పికప్ చేసి సంపాదించుకుందామని కాదు. కట్నం గుంజుదామని. ఎం.బి.బి.ఎస్. చదివిన ప్రతి ఒక్కడ్నీ డాక్టర్ అనవచ్చేమో కాని, అందులోని చాలామందిని అర్భకులనే పిలవాల్సి వస్తుంది... నెక్ట్సు?" నాగమ్మ కంఠంలో ఈసారి అసహనం తొంగి చూసింది.

 

    సెక్రటరీ భయపడుతూ నాలుగో ఫైల్ అందించాడు.

 

    సి.నందకిషోర్, ఐ.పి.ఎస్. ఆ ఫైల్ లోని మొదటి పేజీలో పైపేరు వ్రాసి వుంది. పక్కనే ప్రస్తుత పొజిషన్ కూడా రాసుంది.

 

    "సి.నందకిషోర్. వయస్సు ఇరవై ఏడు. ఎం.బి.బి.ఎస్...ఐ.ఫై.ఎస్ ప్రస్తుతం హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో వున్నాడు. మోస్టు బ్రిలియంట్. అన్నిట్లో మార్క్స్ నైన్ టీ పైనే. ఫెయిర్ కాంప్లెక్షన్. ఫైవ్ నైన్ హైట్..."

 

    సెక్రటరీ చెప్పడం పూర్తికాక ముందే నాగమ్మ చిన్నగా నవ్వింది.

 

    "రియల్లీ హీ ఈజ్ బ్రిలియంట్ ఇన్ ఆల్ క్లాసెస్..." అన్నాడు సెక్రటరీ కాన్ఫిడెంట్ గా.

 

    ఆ సంబంధానికేం వంక పెట్టలేదని అతను ధీమాగా వున్నాడు.

 

    "యూనో... బ్రెయిన్ డ్రెయిన్... అంటే మన భారతదేశపు గెడ్డపై చదివి విదేశాలకు సేవ చేసేందుకు వెళ్లటం..."

 

    "బట్... ఇతనికా ఉద్దేశం లేదు. ఏ విదేశానికీ వెళ్ళే ప్రపోజల్ లేదు" సెక్రటరీ నొక్కి చెప్పాడు.

 

    "ప్రజల సొమ్ముతో మెడిసిన్ పూర్తి చేసి విదేశాలకు వెళ్తేనే కాదు బ్రెయిన్ డ్రెయిన్. మెడిసిన్ చదివి రాజకీయాల్లోకి వెళ్ళినా, వ్యాపారంలోకి వెళ్లినా వేరే ఏ వృత్తిలోకి వెళ్ళినా అది అలాంటిదే అవుతుంది. ప్రజలు పన్నులు కట్టేది కుక్క పనిని గాడిదని చేయమని, గాడిద పనిని కుక్కని చేయమని కాదు. ఒక విద్యార్థి మెడిసిన్ పూర్తి చేయాలంటే ప్రజల సొమ్ము కొన్ని లక్షలు ఖర్చయిపోతుంది. అప్పుడతని బాధ్యత ఏమిటి...? తను ఎంతో కొంత సంపాదించుకుంటూ ప్రజలకు వైద్య సేవల్ని అందించటం. మరి ప్రజల సొమ్ముతో ముందు మెడిసిన్ చదివి అది గిట్టుబాటుగా లేదని వ్యాపారంలోకి, రాజకీయాల్లోకి, వేరే వృత్తుల్లోకి వెళ్లటం బ్రెయిన్ డ్రెయిన్ కాదా? తప్పు కాదా? వేరే వృత్తుల్లోకి వెళ్లాలంటే ప్రజల సొమ్ము చెల్లించి అప్పుడు వెళ్ళాలి! ఇతనెందుకు వెళ్ళాడో తెలుసా? వైద్యవృత్తి సేవ తప్ప అధికారముండదని, రేపు ఏదైనా ఓ పద్ధతి ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చి పల్లెలకు వెళ్లి వైద్య వృత్తి చేయాలని ఖచ్చితమైన నిబంధన విధిస్తుందేమోననే భయంతో ఐ.పి.ఎస్.కి అప్పియర్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ హీ మేబీ బ్రిలియంట్. బట్ దేశాన్ని, దేశ ప్రజల్ని మోసం చేసి వేరే వృత్తిలోకి వెళ్లాడు. కనుక ఇతనికి బొత్తిగా స్థిరత్వం లేదని అర్థమవుతోంది. నేషనల్ ఎకౌంట్ బిలిటీ ఏమాత్రం లేని కుర్రాడితను. ఐయామ్ సారీ. నెక్ట్సు...??"

 

    నాగమ్మ ఆర్గ్యుమెంట్ తో ఏకీభవించకున్నా 'ది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్" అన్న సూక్తిని పాటించాడు.

 

    ఆఖరిగా తన దగ్గరున్న ఐదో ఫైల్ ని అందించాడు సెక్రటరీ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra