Home » Yandamuri veerendranath » Anaithikam


    ఏదో ఇదమిద్దంగా తెలీని బాధ నా గుండెని మండిస్తోంది. ఇది నా భర్త నన్ను నిర్లక్ష్యం చేసిన రోజుల్లో కలిగిన బాధకన్నా అతి తీవ్రమైనది.

 

    అతను చెప్పేదంతా నిజమైతే మరి నా తోడికోడలి చెల్లెలు గర్భవతి అవడానికి కారణ మెవరన్న ప్రశ్న నన్ను వదల్లేదు.

 

    అదే అడిగాను అతన్ని.

 

    "నేను కారణం కానంతవరకూ అది తెలుసుకోవలసిన అవసరం నీ కుండదనుకున్నానే..." అన్నాడతను ఆశ్చర్యంగా.

 

    నిజమే, ఆ విషయం నా కనవసరం. అయితే అది ఎవరో తెలుసుకోవడం వల్ల 'ఇతను' కారణం కాదని స్పష్టీకరించుకోవడమే నా ధ్యేయం. (నిజంగా అదేనా కారణం ? లేక ఆ కుతూహలమా?)

 

    నిజానికి అతడే కారణమైతే, నాకు కొద్దిగా బాధ తప్పుతుంది.  మేము విడిపోయామన్న విషయం బాధాకరం కాకుండా వుండడానికి అతని వంచన దోహదపడవచ్చు. అతడేమో కన్వీనియెంట్ గా తప్పు ఇంకెవరి మీదకో తోసేస్తున్నాడు.

 

    నేను లేచి నిలుచుని నా హాండ్ బ్యాగ్ తీసుకుని ముఖద్వారంకేసి నడిచాను. వెనుకనుంచి అతనూ మార్దవంగా పిలిచాడు. అప్రయత్నంగానే ఆగాను. నేను వెనుదిరగకుండానే అతనన్నాడు... "ఐ లవ్యూ...ఫరెవర్".

 

    నేను ఆగకుండా ముందుకి నడిచాను. నా పెదవుల మీద నిర్వేదమైన నవ్వొకటి కదిలింది.

 

                                                                    19

 

    సాయంత్రం ఆరవుతోంది. నా భర్త ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి ఇంకా చాలా టైముంది. ఇంట్లో ఎవరూ లేరు. లేచి టీ చేసుకుని తాగాను. తర్వాత నా థీసిస్ పేపర్లు సరిదిద్దడం మొదలు పెట్టాను. పది అయినా కూడా నా భర్త రాలేదు. అయితే హాస్పిటల్ కి పాపని తీసుకెళ్ళడం ఈవేళ కూడా కుదరదు. (దానికి ముందురోజు నుంచి ఒళ్ళు వెచ్చబడింది.)

 

    ఏం చేయడానికీ తోచటంలేదు. దాన్ని అలాగే పడుకోబెట్టేసి నా బాంక్ అకౌంట్ ముందేసుకుని కూర్చున్నాను. బ్యాలన్స్ ఎంతో తెలీక చాలా రోజుల్నుంచే ఇబ్బందిగా వుంది.

 

    కాలిక్యులేటర్ కోసం బ్యాగ్ లో వెతుకుతుండగా కనిపించింది. ముందేదో కాగితమని పక్కకి విసిరివేయబోయాను. కానీ దానిమీద కుదురుగా లేని తెలుగు అక్షరాలని చూసి ఏమిటాని తీసి చూశాను. అదో ఉత్తరంలా వుంది. "అక్కా" అని రాయబడి వుంది. దస్తూరిని బట్టి ఎవరు రాసిందో అర్థంకాలేదు. వెనక్కు తిప్పి సంతక మెవరిదో చూడాలన్న ధ్యాస కూడా లేకుండా ఉత్తరం చదవడం మొదలుపెట్టాను.

 

    "అక్కా!

 

    నేను నీకు ఉత్తరం రాయడమేమిటా అనే ఆశ్చర్యం నుంచి త్వరగా తేరుకుని దయచేసి ఇది శ్రద్ధగా చదువు.

 

    నేను మొదటిసారిగా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరందరూ స్వర్గం నుంచి దిగివచ్చిన దేవత లనుకున్నాను. నిజంగా దేవతలే కూడా! ముఖ్యంగా నన్ను పుట్టింటి నరకకూపం నుంచి తప్పించిన పెద్ద బావగారు!!! అందుకే ఎవరు నాకే పని అప్పగించినా నేనది సంతోషంగా చేశాను. నా తండ్రి పెంచి పెద్ద చేశాడన్న కృతజ్ఞతైనా లేకుండా నా అన్న వరసైనవాడు నాతో గొడ్డు చాకిరీ చేయించుకుని తిండి పెట్టడానికే బాధపడి పోయేవాడు. మీరందరూ నన్ను ఆదరించడమే కాకుండా నాకు పెళ్ళి చేయాలనే ఆలోచనలోకూడా వుండడం నాకు అంతులేని కృతజ్ఞతని కలిగించింది. ఆ కృతజ్ఞతతోనే ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖంగా వుండాలని దేవుడిని ప్రార్థించేదాన్ని. నీకూ, చిన్న బావగారికి వున్న గొడవల్ని నేను చూడడం తటస్థించింది. అవి ఎవరికీ తెలియవని మీరనుకుంటున్నారేమో నాకు తెలీదు....."

 

    ఉత్తరం కాస్త చదవగానే అది నా తోడికోడలు చెల్లెలు చచ్చిపోవడానికి కాస్త ముందు రాసిందని అర్థమైంది....కానీ రాసింది తన అక్కకి అనుకున్నాను. 'నాకు' అని అర్థమవగానే మొహాన చన్నీళ్ళతో ఛెళ్ళున కొట్టినట్లయింది. తమాయించుకుని తిరిగి ఉత్తరం చదవడం మొదలు పెట్టాను.

 

    "తప్పు ఎవరిదనే సమస్య కంటే మీరిద్దరూ ఆనందంగా లేకపోవడం నాకు ఎక్కువ బాధ కలిగించింది. బాధలని మర్చిపోవడం కోసమేనేమో నువ్వు ఇల్లు పట్టించుకోకుండా నీ చదువు, నీ కూతురే లోకంగా తిరగడం.. పెద్దబావగారితో నీ సంబంధం... నన్ను గాయపరిచింది. నీకు నచ్చచెబుదామని ఎన్నోసార్లనిపించేది. కానీ నా హద్దులు నన్ను హెచ్చరించేవి..."

 

    చదువుతున్న నాకు ఒళ్లు చల్లబడిపోయింది. అతి ప్రయత్నం మీద ముందుకి దృష్టి సారించాను.

 

    "ఇంట్లో అందరికీ ఆ విషయం తెలిసికూడా అది తమ బాధ్యత కానట్టు వుండటం నా కర్థమయ్యేది కాదు. ఆ పరిస్థితిలో చిన్న బావగారు.... అదే నీ భర్త... నాకు దగ్గరవటం జరిగింది.

 

    కాళ్ళకింద భూమి కదులుతున్నట్టు, ఆకాశం కూలినట్టు కదిలిపోయాను. ఒక్కసారిగా సుడిగుండంలోకి తోయబడినంత ఉక్కిరిబిక్కిరి. ఆ షాక్ నుంచి తేరుకుని చదవడానికి కొంత సమయం పట్టింది. నా కళ్ళు తిరిగి నిస్తేజంగా ఆ అక్షరాల వెంట పరుగెట్టాయి.

 

    ".... మగవాడు ఆడదానికి దగ్గరవడానికి పెద్ద సంఘటనలేం అక్కర్లేదు. భార్యనుంచి దొరికే నిరాదరణ అనే ఒక్క కారణం చాలు. నిన్ను చూశాక ఆ అభిప్రాయం బలపడింది. నీకూ పెద్ద బావగారికి మధ్య సంబంధం ఏర్పడడానికి కారణం అదే కదూ!... అదేవిధంగా- తన పట్ల నీ చిన్నచూపు నా దగ్గర 'లేమి' రూపంలో ప్రదర్శించి నీ భర్త నా ప్రేమని సంపాదించాడు! కాదు... అది ప్రేమ అని నేననుకున్నాను.

 

    మొదట్లో లేదుకానీ, తర్వాత్తర్వాత అతను నన్ను కేవలం శారీరక అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకునేవాడు. కోర్కె తీరగానే లేచి వెంటనే బట్టలేసుకుని నీవు వస్తావనో, కూతురి కోసమో ఎదురు చూసేవాడు. నాతో అతని శారీరకానందం తీరిపోతున్న కొద్దీ అతనితో నా మానసికావసరం పెరుగుతూ వచ్చింది. అంతలో అతడి రూపు నాలో కదలడం ప్రారంభించింది.

 

    అతను మొదట్లో అది విని తలక్రిందులైపోయాడు. తర్వాత మండి పడ్డాడు. "ముందే తెలీదా?" అని కసురుకున్నాడు. 'అతనికి తెలీనిది నాకు మాత్రం ఏం తెలుస్తుందని' నేనడగలేదు. నేనడక్కముందే చెప్పాడు- 'పెళ్ళంటే అంత తేలిక కాదు. న భార్యని వదులుకుని నిన్ను చేసుకునే స్థితిలో లేను ప్రస్తుతం' అని. నేను షాక్ అవలేదు. కానీ బాధపడ్డాను. నిన్ను వదులుకోలేనంత 'అవసరం' వున్న మనిషీ నీ గురించి నీచంగా నాతో మాట్లాడి నన్ను లొంగదీసుకున్నది అందుకేనేమో? పెళ్ళంటే అంత తేలిక కాదు అని అతననడం నాకు జ్ఞానోదయం కలిగింది. మేమా సందిగ్ధంలో వుండగానే పెద్ద బావగారు ఒకసారి మమ్మల్ని చూడడం జరిగింది. అయన తమ్ముడిని అడగడం కంటే నన్ను టాకిల్ చెయ్యడం తేలికనుకున్నాడేమో, నేరుగా అడిగేశాడు. నాకు నిజం చెప్పడం తప్ప మరోదారి కనిపించలేదు. పైగా ఆయన నాదృష్టిలో దేవుడు. ఆయన నాతో "నా తమ్ముడితో పెళ్ళి ఆలోచనలేం పెట్టుకోకు" అని హెచ్చరించినప్పుడు నవ్వొచ్చింది. "పెళ్ళంటే ఏమిటో మీ ఇద్దరి సంసారాలు చూశాక ఇంకా ఆశలు కూడానా?" అందామనుకున్నా, ఊహు... అప్పటికి నాకింకా ఆయనతో మొహమాటం పోలేదు. ఈ వ్యవహారం సెటిల్ చెయ్యడానికి పెద్ద బావగారిని ఒకటికి రెండుసార్లు కలవడం జరిగింది. నా కప్పుడప్పుడూ అనుమానం కలిగేది. నేను మరొక్కసారి ఉపయోగించుకోబడతానేమోనని, ఒకరు నా నుంచి సానుభూతి కోరుతూ దగ్గరైతే, మరొకరు సానుభూతి నందిస్తూ 'ఆ' అవకాశం వినియోగించుకుంటారేమోనని. అలాగని నాకేదో పెద్ద అర్హత వుందని కాదు. నిజానికి ఓ ఆడా, మగా దగ్గరవ్వాలంటే ఇద్దరికీ 'స్త్రీత్వం' 'పురుషత్వం' కంటే పెద్ద అర్హతలేం అక్కర్లేదు. పెద్ద బావగారు నాకు అబార్షన్ చేయిస్తానన్నారు. నాకు పెళ్ళక్కర్లేదు కానీ బిడ్డ కావాలన్నాను. అది పెళ్ళికంటే పెద్ద లిటిగేషన్ అని భయపడ్డాడేమో, వీలుపడదన్నాడు. మేమిద్దరం ఇంకా ఓ రాజీకి రాలేదు.  

 

    ఇదంతా నీకు చెప్పి, పరిష్కారం అడుగుదామనుకున్నాను. కానీ చాలాకాపంపాటు నిన్ను దగ్గరగా గమనించడం జరిగాక, ఇద్దరు స్వార్థపరుల మధ్య నువ్వెంత శూన్యమైన జీవితాన్ని గడుపుతున్నావో అర్థమైంది. నిన్ను నా సమస్యతో మరింత బాధపెట్టడం, రచ్చకీడ్చడం ఇష్టంలేక, నాకింత ఉపకారం చేసిన మీ అందరికీ బరువు కావడం ఇష్టంలేక ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను... అదే నా మరణం. నా మరణం వల్ల మీ అందరికీ పరువునష్టం, నిజం పొక్కుతుందేమో లాంటి భయాల్ని కలిగిస్తుందేమో కానీ ఎవర్నీ బాధించదు. అందుకే నేను మరి పునరాలోచించలేదు.

 

    అక్కా! నేనిదంతా నీతో చెప్తున్నది నిన్ను మరింత బాధించడానికో, నీ సంసారంలో మరింత చిచ్చు పెట్టడానికో కాదు. ఓ ఆడదానికి దగ్గరవడానికి మగవాడు ఎన్ని కబుర్లయినా చెప్తాడు. ఓ పెళ్ళాన్ని వెతుక్కోవడం కోసం అయితే ముందు వెనుకలు చూసుకోకుండా రంగంలోకి దిగుతాడు. సాధ్యమైనంత తక్కువ డబ్బు, సమయమూ వెచ్చించి తన పబ్బం గడుపుకోవాలనుకుంటాడు.

 

    పెద్ద బావగారు నీతో ఏం చెప్పి దగ్గరయారో నాకు తెలీదు. కానీ, ఇంట్లో నేను గమనించిన దాన్ని బట్టి ఇంటి ఖర్చులన్నీ పప్పు బియ్యంతో సహా నీ భర్తే భరిస్తున్నాడు. పెద్ద బావగారు మాత్రం సంపాదించినదంతా తన వ్యాపారంలోనే పెట్టి ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు. ఇంటి పెత్తనమంతా నా అక్కది. అధికారం, గౌరవమంతా ఆయనది! ఖర్చు, కష్టం మీ ఇద్దరిదీ. ఆ విషయం నువ్వు గుర్తించావో లేదో నాకు తెలీదు. గుర్తించినా అది నీకు పట్టని విషయమైతే నేనింత బాధపడవలసిన అవసరం లేదు. కానీ ఒక్కటి ఆలోచించక్కా! నీ చుట్టూ వున్నవాళ్ళందరూ తమ తమ పరిధుల్లో ఆనందంగానే వున్నారు. నీ పెద్ద బావ డబ్బంతా దాచుకుని నిన్ను ఉచితంగానో, లేకపోతే తక్కువ ఖర్చుతోనో పొందుతూ వున్నారు. నీ భర్త ఏ ఖర్చూ లేకుండా నన్ను పొందుతూ వున్నాడు. సంబంధాల విషయంలో ఖర్చొకటే కొలమానం కాకపోవచ్చు. కానీ ఏదో ఒక కొలమానం కావలసిందేగా... కనీసం ప్రే...మ.   

 

    నీ తోడికోడలు భక్తి ముసుగులో కళ్ళు మూసుకుని పతివ్రత బిరుదుతో ఆనందంగా వుంది. తన అధికారం చలాయించగలిగేది ఒక్క చిన్న కొడుకు దగ్గరే కాబట్టి అతన్ని అదుపులో వుంచుకుంటూ నీ అత్తగారు ఆనందంగా వుంది.

 

    అందరూ ఎదుటివాళ్ళని మోసగిస్తూ ఆనందంగా వుంటే, నువ్వు మోసగింపబడుతూ ఆ కోల్పోతున్నదే ఆనందమనుకుంటావ్. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే నీ బావగారికీ, నీ భర్తకీ పెద్ద తేడా లేదు. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మగవాళ్ళకీ పెద్ద తేడా వుండదు. ఆ మాత్రానికి నువ్వు ఎండమావుల కేసి పరుగెట్టకు. నీ భర్తనే మార్చుకోవడానికి ప్రయత్నించు. వీలుపడకపోతే నీ బిడ్డలో నీ ఆనందాన్ని వెతుక్కో! కనీసం నీ వ్యక్తిత్వం నిలుస్తుంది.

 

    ఇంకో ఉచిత సలహా! నువ్వూ, నీ భర్తా, నీ కూతురు- వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఇది మీరు సుఖపడడం కోసం మాత్రమే కాదు. మీ విలువలేమిటో, అవసరమేమిటో వాళ్ళందరికీ అలాగైనా తెలియజెప్పడానికి కూడా. ఈ విషయంలో నీ భర్త నీ మాట వింటాడా అని అనుమానపడుతున్నావేమో. భార్యాభర్తల మధ్య మంచి శారీరక సంబంధం అవసరమక్కా. అది దొరక్కపోతేనే నీ భర్త అయినా, నువ్వయినా, నీ బావగారైనా అడ్డదార్లు తొక్కేది. నీ భర్తని అతని శరీరం ద్వారా గెలవడానికి ప్రయత్నించు. నీ భర్త నాకు దగ్గరైనది కూడా అందుకే.      

 

    ఇదంతా నీకు ఎందుకు చెప్పానా అని కదా నువ్వు ఆశ్చర్యపోతున్నావ్! మీ ఇంట్లో నన్ను ఈక్షణం వరకూ స్వార్థంకోసం ఉపయోగించుకోనిది నువ్వొక్కదానివే. అంతేకాదు, మోసగింపబడిన వర్గంలో మనిద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నవాళ్ళం. నీ భర్తకూ, నాకూ వున్న సంబంధం నీకు చెప్పడంవల్ల- నీ సంసారానికి కొత్తగా వచ్చిన నష్టం ఏమీలేదు. పైగా కాస్త లాభం వుండొచ్చునేమోనన్న ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నాను. అంతే తప్ప నీ భర్తని నీ నుంచి వేరుచేయడం కోసం కాదు. నువ్వు చేసిన తప్పే నేనూ, నీ భర్తా చేశామని గ్రహిస్తే- తప్పుకి (?) పునాది 'అవసరం' అని తెలుస్తుంది. అది తప్పు' లోని అర్థాన్ని మారుస్తుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra