Home » Suryadevara rammohan rao » అశ్వభారతం


    తనొచ్చిన నిమిషమైనా భరత్ గమనించలేదు.

    చిన్నగా దగ్గింది.

    "మీరు వచ్చినట్లుగా తెలియచేయటానికి లేని అనారోగ్యం ప్రదర్శించటం ఎందుకు డాక్టర్?" అంటూ పుస్తకం పక్కన పెట్టి చూసాడు భరత్.

    ఠక్కున కోపం వచ్చింది త్రివేణికి.

    ఏం మీక్కోపం వచ్చింది....ఆ కారణంగానే....మీరొచ్చినట్లుగా నాకు తెలియచేయటం కోసం దగ్గటం ఓల్డ్ టెక్నిక్, పైగా మీరు డాక్టరు ఆరోగ్యంగా ఉన్నారు. దగ్గు రాదు....కాని...." చిలిపిగా చూసాడు త్రివేణి వేపు.

    తలవంచుకుని సిరంజి లోడ్ చేస్తోంది త్రివేణి. "కోటా చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు."

    చివుక్కున తలెత్తి చూసింది త్రివేణి.

    "అందంగా ఉన్నారు అంటే కర్టసీ కోసమన్నా కృతజ్ఞతలు చెప్పాలి గదా.... కర్టెసీ తెలుసు మీకు."

    త్రివేణీ కోపం చప్పున చల్లారిపోయింది.

    "థాంక్స్...." అంది పొడిగా.

    త్రివేణీ దగ్గరగా వచ్చింది. ఓ చేత్తో భరత్ చేతిని పట్టుకుంది."

    "అమ్మో...." అన్నాడు ఒక్కసారి.

    "ఏమైంది....?" అడిగింది ఆందోళనగా.

    "షాక్"

    "షాకా?"

    "అవును మీరు నన్ను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టింది."

    కోపంగా తిరిగి వెళ్ళిపోయింది త్రివేణి.

    ఆషా వుండే గదిలోకి ఎంటర్ అయ్యేసరికి త్రివేణి మనసంతా ఏదోలా అయ్యే ఓ దృశ్యం కనిపించింది?

    ఆషా అనురాగ్ ని గట్టిగా తన గుండెలకేసి హత్తుకుంటూ మునివేళ్ళ మీద పైకి లేస్తూ అతని పెదాల్ని అందుకునే ప్రయత్నంలో ఉంది.

    ఆ దృశ్యం చూసిన త్రివేణీ ఓ క్షణం కలవరపాటుకి గురయింది.

    వెంటనే గది బయటకు వచ్చింది.

    ఆమె గుండె కొట్టుకుంటున్న శబ్దం ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది.

    లెక్క ప్రకారం భరత్ కి ఈ టైంకి ఇంజక్షన్ ఇవ్వాలి.

    కాని అతన్ని చూస్తుంటే మనసంతా ఓలా అయిపోతోంది. ఆ ఇబ్బంది తప్పించుకోటానికే ఆషాకి ఆ పని అప్పగిద్దామని వచ్చింది.

    పోనీ పోకుండా తప్పించుకుంటే....

    ప్రొఫెషనల్ నెగ్లిజెన్సీ....పర్సనల్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకొని వృత్తికి ద్రోహం చేయటం కూడా త్రివేణీకి ఇష్టం లేదు.

    తిరిగి భరత్ రూమ్ లోకి వచ్చింది.

    బెడ్ మీద భరత్ లేడు. తలుపులు తెరిచి ఉన్నాయి, అప్పటివరకు అక్కడ ఉన్న వృద్ధుడు కూడా లేడు!!!


                                                                   *    *    *


    "ఎన్నాళ్ళనుంచి వీక్ గా ఉంటోంది?" డాక్టర్ నాయర్ అడిగాడు.

    "ఈ మధ్య నుంచే" నెమ్మదిగా అన్నాడు శుక్రాచార్య.

    "ఓసారి చెక్ చేస్తాను."

    ఐదు నిమిషాలపాటు నిశ్శబ్దం.       

    గాలి సయితం స్థంభించిపోయినట్లున్న ఆ స్మశాన నిశ్శబ్దంలోంచి వచ్చాయి నాయర్ మాటలు సూటిగా. "అశ్వభరత్ ని రంగంలోకి దింపావ్.

    శుక్రాచార్య మౌనంగా ఉన్నాడు.

    "రంగస్థలం మీదకు పాత్రలన్నిటిని చేర్చావు....?

    "..... ...."

    "గేమ్ సీరియస్ గానే మొదలెట్టావు."

    ".... ...."

    "సర్వనాశనానికి ఆతృత పడుతున్నావు."

    ".... ...."

    "వశిష్ట నీ కదలికల్ని కనిపెట్టాడు. తనకదలికల్ని ముమ్మరం చేస్తున్నాడట. నిన్న కలిసి వెళ్ళాడు...."

    తన మౌనాన్ని చీలిస్తూ అన్నాడు శుక్రాచార్య "అంతా సవ్యంగా జరుగుతోంది. కాని భరత్ వలన ఒక చావు ఆలస్యం అయింది. అదే నా దిగులు. నీవు రోజులు దగ్గర పడుతున్నాయంటున్నావు. భరత్ రోజుల్ని వెనక్కు జరుపుతున్నాడు కారణం తెలియటంలేదు."

    "భరత్ కి అసలు రహస్యం తెలిస్తే నిన్ను ఇంకా చాలామందిని సమాధి చేస్తాడు. అప్పుడిక నీమీద అతనికున్న కృతజ్ఞత అడ్డురానిపోవచ్చు."

    "ఎలా తెలుస్తుంది? నీ వలన. నా వలన__ఇకపోతే వశిష్ట వలన అంతేగదా?"

    "నేను చెప్పను. నీవు చెప్పుకోలేవు. కాని వశిష్ట విచిత్రమయిన మనస్తత్వం కలవాడు. అతను చెబితే...."

    "అప్పుడతను మిగలడు...."

    "అంత దారుణమా?"

    "మాకు జరిగిన దారుణంకన్నా మారేది పెద్దదికాదేమో."

    "అఫ్ కోర్స్ భరత్ మాత్రం చాలా తెలివిగలవాడు. అది గుర్తుంచుకో. మామూలప్పుడు ఎంత సరదాగా, తమాషాగా బిహేవ్ చేస్తాడో తనకిష్టంలేనిది జరుగుతుందని తెలిసినపుడు మాత్రం కాలరుద్రుడవుతాడు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో స్థయిర్యం కలవాడు. అతనికున్న వయస్సుకు మరో పది సంవత్సరాలు మీదకు తెచ్చుకొని ఆలోచించగల నేర్పున్నవాడు. రెండువేపుల పదునున్న చాకులాంటివాడు. అవతలవాడ్ని చీల్చడానికి ఓ వేపు నీవు అటు తిప్పితే మరోవేపు నీ వేపే ఉంటుంది."        

    సీరియస్ గా చూసాడు శుక్రాచార్య.

    "నిన్ను తక్కువ అంచనా వేయటంలేదు.... కాని జాగ్రత్త అంటున్నాను. త్రివేణి మొన్న ఓసారి నాదగ్గరకు వచ్చి వెళ్ళింది. నాన్నగారెంతో వీక్ గా ఉన్నారని అడిగింది? సమాధానం చెప్పటానికి ఇబ్బంది పడ్డాను. మరోసారి నాకా ఇబ్బంది రాకుండా ఉంచాలన్న__నీ పగ, ప్రతీకారం నెరవేరాలన్న మందులు జాగ్రత్తగా తీసుకోవాలి. ఏది ఏమైనా ఒకటి నాకు బాధగా ఉంది. త్రివేణి నీగంభీరతతో శిలలా మార్చావు. ఆ వయస్సులో ఉండాల్సిన హుషారు, దూకుడు లేవు. ఆమె మెంటల్ ప్రిజిడిటీని తొలగించే యువకుడు ఆమె జీవితంలోకి ప్రవేశించాలని మనసారా కోరుకుంటున్నాను."

    శుక్రాచార్య లేచాడు మౌనంగా నాయర్ ఇచ్చిన టాబ్ లెట్స్ తీసుకొని బయటకు నడుస్తూ "చెకింగ్ రేపు వస్తున్నాను- అన్నీ రడీ చేయి" అన్నాడు.

    వెళుతున్న శుక్రాచార్యవేపు చూస్తుండిపోయాడు నాయర్.


                                *    *    *


    ప్రతి ఆదివారం శారదకు ఒక పండగే. భర్త ఆ రోజంతా ఎక్కడికీ కదలడు. ఆ ఏర్పాటు పెళ్ళయిన కొత్తలో శారదే చేసింది. భార్యకిచ్చిన మాట చక్రవర్తి కూడా తప్పడు.

    కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆశలు విహంగాలయి విహరిస్తుంటే ఆ మాటకి ఎక్కడ కట్టుబడతాడు?

    వ్యసనానికి అలవాటు పడేంతవరకే అది కాస్త జరిగాక దాని చేతిలో కీలుబొమ్మే తప్ప- తల్లి, తండ్రి, భార్య బిడ్డలు, అక్కచెల్లెళ్ళు అంతా మిథ్యే.

    చ్రక్రవర్తి ఉదయం లేచిన దగ్గర్నుంచి లోలోపల ఒకటే ఆరాటపడిపోతున్నాడు.

    వెయ్యి కాయాలి. సాయంత్రానికి లక్ష తెచ్చుకోవాలి. ఆనందరావు ఇంటికివస్తే భార్యకు అనుమానం వస్తుందనే ముందే చెప్పేసాడు ఇంటికి రావద్దని__బయట బస్ స్టాఫ్ లో వెయిట్ చేస్తుండమని.

    భర్త తొందరని చూచాయగా పసిగట్టిన శారద త్వరత్వరగా భోజనం సిద్ధం చేసింది.

    తనే వెయ్యిరూపాయలు తెచ్చి భర్త చేతిలో పెడుతూ "పాపం....జాగ్రత్తగా అన్నీ దగ్గరుండి చూడండి. ఫ్రెండన్నాక ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అంది భర్త తల దువ్వుతూ.

    అప్పటికప్పుడే మొఖాన్ని విచారంగా పెట్టాడు చక్రవర్తి. తన మిత్రుడి భార్య ఏమయిపోతుందోనన్న ఆందోళన ముఖంలో చూపించేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.

    మొదటిదశ అబద్ధాలు.

    రెండవదశ నటన__

    తన భర్త సమక్షంలో తాను తృప్తి పొందాలనుకొని జీవితాంతం రిజర్వ్ చేసుకున్న ఆదివారాన్ని సయితం భర్తపై ప్రేమతో, సృష్టించిన జబ్బు మనిషై జాలితో త్యాగం చేసుకుంది శారద. చక్రవర్తి హుషారుగా బస్ స్టాప్ కి వచ్చేసరికి ఆనందరావు ఎదురుచూస్తున్నాడు.

    చక్రవర్తిని చూసి హుషారుగా ఈలవేసాడు. ఇద్దరూ కలిసి ఆటో ఎక్కారు.

    ముందు బస్ ఎక్కుదామన్నాడు చక్రవర్తి. "లక్షల్లో పందాలు గెలవబోతూ సిటీ బస్ ఎక్కటం ఏమిటి? కాస్త కాస్త మన లెవెల్ కూడా మార్చుకోవాలి" అన్నాడు ఆనందరావు.

    నిజమేననుకున్నాడు చక్రవర్తి.

    అబద్ధాలు....

    నటన....

    ఇప్పుడు ఫాల్స్ ప్రెస్టేజ్ ....

    "ఎందుకిలా హఠాత్తుగా తీసుకొచ్చారు" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు భరత్.

    "ఎక్కువగా మాట్లాడవద్దు ఇప్పుడో గేమ్ జరగబోతోంది. అది శ్రద్ధగా గమనించు. ఈ గేమ్ ని అడ్డంపెట్టుకొని మనమో మనిషిని మన చేతికి మట్టి అంటకుండా అంతమొందించాలి" అన్నాడు శుక్రాచార్య.

    భరత్ కి, పక్కనే వచ్చిన శంకర్ రెడ్డికి ఆశ్చర్యంగా ఉంది శుక్రాచార్య మనస్తత్వం.

    అర్దరాత్రి కావటానికి మరికొద్ది నిమిషాలే ఉంది. సభ్య ప్రపంచానికి తెలియని విచిత్రమైన లోకం అది.

    అసలు ఇలాంటి క్లబ్స్ ఉంటాయని, మనిషి ప్రాణాలతో ఆటలాడుకోవటం అక్కడే బహు సరదా అని చెప్పినా నమ్మనంత పర్ వర్షన్, బయటకు పాడుబడ్డట్టు కనిపించే ఓ పురాతనమైన బిల్డింగ్. అంతర్భాగంలో చట్టాల్ని సవాలు చేసే ప్రమాదకరమైన వ్యక్తులు చట్టాన్ని మార్పించగలంత ధనరాసులు వాటిచుట్టూ శలభాలు.

    వీటన్నిటితో ఆటలాడుకునే మత్త గజాలు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra