Home » Bollimuntha nageswara rao » లేటెస్ట్ లవ్ �

నీవు రాసింది ఎవర్ని కదిలిస్తుందనుకున్నావ్?
ఎవరినీ కదిలించదు.
ఐదువేల కోట్లు మింగిన మెహతాలకు ఆ తర్వాతే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.
హత్యలూ, దోపిడీలూ చేసినవాడే ఆధిపత్యం చేలాయిస్తున్నాడు.
లాకప్ గదుల్లో రేప్ చేసిన పోలీసులకు ముందుగా బదిలీలుంటాయి. ఆ తర్వాత ప్రమోషన్స్ వుంటాయి.
ఎన్ని చూడటంలేదు?
ఈ మార్గంలోకి నీవు ధైర్యంగా వెళ్ళావు. కానీ తిరిగి ఇంటికి చేరటం నీ చేతిలో వుండదు.
పద్మవ్యూహంలాంటి వ్యవస్థ.
ధర్మయుద్దమంటూ లోపలికి పోవటం వరకే నీ పాత్ర! లోపల జరిగేదంతా అధర్మయుద్దం.
ఈ దుర్యోధన, దుశ్శాసన సంస్కృతిని గురించి నేను మరలా నీకు గుర్తుచేయాలా? ఏం పావనీ?"
ఆయన ఆగిపోయాడు.
పావని ఆయన పడిన ఆవేదన మొత్తం వింది.
ఇప్పుడు తను తండ్రికి సరైన సమాధానం చెప్పాలి. ఏం చెప్పినా ఆయన తృప్తిపడకపోవచ్చు.
వాస్తవానికి అదో పద్మవ్యూహమే! కానీ అసలు ఎవరూ ఎంటర్ కాకపోతే ఇది సగమయినా ఛేదించబడదు. కోపంతో వూగిపోతున్న తండ్రి దగ్గరకు చేరి....
"డాడీ! మీ ఆవేదన అర్ధమయింది. కూతురిగా దాన్ని అర్ధంచేసుకోగలను. కానీ అందులో ఒక స్వార్ధముంది. నీ కూతురు ఈ ట్రాక్ లో చిక్కుకుంది గనుక ఇప్పుడిలా మాట్లాడుతున్నారు. అదే బయటింటి పిల్ల ఎవరైనా చేసివుంటే తమరు రోజూ పొగిడేవారు. ఈ పిల్ల కెంత ధైర్యం అనేవారు. ఆడపిల్లలకు కూడా ఇదిగో ఇలాంటి ఎత్తుల్లోకి ఎదగాలనేవారు. ఇదిరా జాతిరత్నం అనేవారు.
ఇప్పుడు మీకా అవకాశం పోయింది." అని తండ్రికి మరింత దగ్గరగా జరిగి_
"ఒక్క విషయం చెప్పండి డాడీ!
పులి ఎంత క్రూరమయిందో చెప్తేనే దాన్ని వేటాడే వాళ్ళు ముందుకొస్తారు. అది త్రాగుతున్న రక్తం ఎంతో చెప్తేనే-ఇక్కడి మనుషుల ఆలోచనలు ఎరుపెక్కుతాయి. ఈ పాశవిక సంస్కృతి యొక్క పరాకాష్టను ఎవరూ వివరించకపోతే ....ఎక్కడా కదలికలు రావు డాడీ!
ఒక ఉద్యమం రావటానికి ఒక భావనా సంపుటి వుంటుంది. ఒక ఫ్రెంచి విప్లవం సంభవించటానికి వైజ్ఞానిక కారణాలున్నాయి. రూసో, వాల్టేరులాంటి తత్వవేత్తలు వ్రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాలే ఆ జాతిని కదిలించాయి.
ఇలా చెప్పటంలో నేను అంతటిదాన్నని కాదు!
ప్రతి కదలికకు ఒక భావప్రేరణ వుంటుంది. ఈ పాలకుల కుంభ కోణాలన్నీ మేధావుల ప్రజల కందించాలి. ఇప్పుడు మీడియా విస్తరిస్తోంది. జాతి ఆ మీడియాల ద్వారా జాగృతంకావాలి. అలాంటి మహాప్రస్థానంలో నా వ్యాసాలూ, కథలూ ఒక అగ్నిపర్వతం లోపల ఆవగింజంత నిప్పుకణాలు తప్ప-రేపు పెల్లుబికబోయే చైతన్యజ్వాలల మొత్తానికి అవి అద్దంపట్టవు. ఇక నా జీవితానికి సెక్యూరిటీఅంటారు.
అది నేను ఆలోచించదలుచుకోలేదు.
నాకు లభించిన అవకాశాల్లో నేను చదివిన చదువూ- నాలో చెలరేగే అంతర్ మధనం నన్ను ఆ వ్యాసాలు వ్రాసేట్టు చేసింది. అది ఒక ఆశ్చర్యమయింది. ఆ మంత్రికి మరింత షాకింగ్ గా మారింది. అంబరీషుడే కాదు_మరికొందరి చిట్టాల సారాంశం కూడా నా దగ్గరుంది. అది నీకు ఎలా చేరుతుందని మాత్రం అడగవద్దు. మీరు అడిగినా చెప్పను.
ఇక తండ్రిగా మీకున్న భయం న్యాయమయిందే!
కానీ నాన్నా! ఒక అధ్యాయం తెరవబడింది. అది అంతటితో ఆగదు. అయితే జీవిగా నీవు ఆగిపోతావు కదా? అలాంటి విషమ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావని మీరు నన్ను అడగవచ్చు!
తల్లి దండ్రులుగా మా ఆశల్ని ఎందుకు వమ్ముచేశావ్? మమ్ముల్ని నీవు ఎందుకు అన్యాయం చేశావ్ అని కూడా మీరు అడగవచ్చు.
చీకటి వెలుగుల జీవితాల్లో న్యాయా-న్యాయాలు సహజం.
ఒక కాయిన్ కి బొమ్మ-బొరుసూ వుంటుంది. ఒకటి న్యాయం అనుకుంటే-అవతల మరో అన్యాయం వుంటుంది.
నాకుండే ధైర్యం నాకుంది.
మీరు నిశ్చింతగా వుండండి. మీ ప్రాజెక్టులో మీరు ముందుకు పదండి.
పులి సంస్కృతిని వేటాడే శక్తుల్ని సృష్టి చేయండి.
నేను మాత్రం ఈ పులుల రక్తం తడిసిన ముఖాల్ని నా రచనల కాన్వాసు మీద మాటల్లో చూపిస్తాను. ఆ ప్రయత్నంలో తాత్కాలికమయిన నష్టాలూ వుంటాయి. ఒక శాస్వతమయిన లాభమూ వుంటుంది."
పావని మాట్లాడుతుంటే తిరుమలరావు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయాడు.
తన కూతురు ఇంత ఎత్తుకు ఎప్పుడేదిగింది? ఇప్పుడు తను తిరిగి ఏమని వాదించగలడు?
ఆమె అన్నట్టు తను అనుకున్న ప్రాజెక్టులో తను పోవటం తప్ప.
పిల్లల్ని పెద్దచేయటం వరకే తమ వంతు! ఆ పిల్లలు పెద్దయ్యాక తమ జీవితాల్ని తమ ఇష్టమొచ్చిన దారుల్లో మలచుకుంటారు. అది వారిష్టం. అక్కడ తమ ఆజ్ఞలు, శాసనాలు ఏం పనిచేయవు.
తిరుమలరావు ఓ నిట్టూర్పు వదిలాడు. తిరిగి ఏం మాట్లాడలేదు. పావని మౌనంగా తన గదిలోకి వెళ్ళింది.
ఆ క్షణాలకు దూరంగా....
అంబరీషుడి ఇంటిలో....

                      *    *    *    *
"నీకేమన్నా పిచ్చిపట్టిందా? కోటి రూపాయలంటే మాటలనుకున్నావా ....?" అని కాసేపు రుక్మిణివంక చూసి-
"అయినా ఆ తిరుమలరావుగాడికి ఎందుకివ్వాలి? ఆ పావని- అంటే ఎరువుల కుంభకోణంలో నన్ను ప్రధాన ముద్దాయిగా రాసిందే....అది వాడి కూతురు, ముందు దానికి చదువు నేర్పుమను. తర్వాతః దేశానికి నేర్పవచ్చు. ఈ విషయంలో నీవు కల్పించుకోకు. అంత మనీ నాకు దొరకదు. వాడి తిప్పలు వాడు పడతాడు" అంబరీషుడు బిగ్గరగా అన్నాడు.
తర్వాత కోపంగా అటూ ఇటూ తిరిగి-
"ఇడియట్స్! వీడికి మనీ కావాలి. కోటి రూపాయలు ఎలా వస్తాయనుకున్నాడు? వీడి తాతగాడి మల్లె అనుకున్నాడా? కూతురి చేత కరప్షన్ మీద వ్యాసాలు వ్రాయించటం- తిరిగి ఆ కరప్టన్ చేసిన మనీకే సొంగ కార్చుకుంటూ ఎగబడటం.
తేలుస్తాను! వీడి సంగతి, వీడి కూతురి సంగతి" అని ఆయన ఆగ్రహంగా తన గదిలోకి వెళ్ళాడు.రుక్మిణి మరోసారి హర్టయింది.
తన భర్త ఇక ఆ మనీ విషయంలో కించిత్ సహాయం కూడా చేయడు. ఒకవేళ ఎవరయినా చేయటానికి ప్రయత్నించినా, పరోక్షంగానయినా అడ్డుపుల్ల వేస్తాడు.
పావని తమ గురువుగారి కూతురని ఇప్పటివరకూ తనకు తెలీదు. సరిగ్గా ఈ సమయంలోనే ఆమె ఈయనగారి కుంభకోణాన్ని బయటకు తీయటం- తమ అభ్యర్ధన బెడిసికొట్టేట్టు చేసింది.
ఇక తనకు పంజరంలోని చిలక తప్ప వేరే మార్గంలేదు. తను దాని పీకనొక్కటం పెద్ద సమస్యకాదు. ఆ తర్వాత వచ్చే పరిస్థితులే విచిత్రం.
తను మాస్టారుకు కబురుచేయటం జరిగింది. ఆయన త్వరలో వచ్చి ముందుగా తనిస్తానన్న రెండు లక్షల రూపాయలు తీసుకెళతాడు. తన ఫ్యామిలీ గోల్డ్ స్మిత్ ద్వారా ఆ మనీ ఇంటికి చేరింది. గిల్టు నగలు కూడా తెచ్చాడు. ఈ విషయం తన భర్తకు తెలియదు.
ఈయన అవునన్నా,- కాదన్నా ఆ ప్రాజెక్టు ముందుకు పోతుంది. ముందు పేపరు యాడ్ వస్తుంది స్థలం కూడా "ఎక్వైర్ చేస్తానన్నాడు.
ఇక కోటి రూపాయలు చేతికి రెండు మూడు రోజులు తిరక్కుండానే వస్తాయి.
తన కుమార్తె పత్రికలో ఈ కుంభకోణం విషయం వ్రాయటం వల్లనేమో....మాస్టారు తరువతః కనపడలేదు.
అయినా ఈ కుంభకోణాలు బయటపెట్టేవాళ్ళు తమ పేర్లూ, అడ్రస్సులూ వ్రాయటం ఏమిటి? ఏదో ఒక కలం పేరొ, మారుపేరో పెట్టుకోవాలి తప్ప మరీ అంత ధైర్యం పనికిరాదు.
ప్రస్తుతం ఈమె బయట పెట్టిన విషయాలతో ఇప్పుడే తన భర్తకేమీ కాకపోవచ్చు! పేపరు వార్త చూసి వెంటనే చర్య తీసుకోవటం జరుగదు. అందులో వ్రాసిన సంగతులు ఎంతవరకు నిజమో, కాదో మొత్తం తేల్చేందుకు ప్రభుత్వాధికారులు, సి.బి.ఐ. అధికారులు దిగవచ్చు.
అది నిజమే అయితే-
పావనికి తప్పక హాని జరుగుతుంది.
అది వాస్తవం కాక, ఊరికే ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురదచల్లే కార్యక్రమంలో ఒక అంతర్ భాగం అయితే పావనికేం కాదు.
ఆయన ఆగ్రహంగా మాస్టారునీ, ఆయన కుమార్తెనీ అంతుచూస్తానంటూ లోనికెళ్ళాడు.
అంటే పావని వ్రాసిన విషయాల్లో ఒక నిజం వున్నట్టే.
ఇంతకీ ఆ నిజం-
ఎవరికీ అంతుబట్టకుండా సాగిన ఆ నిజం-
అందరికంటే ముందుగా ఈ అమ్మాయికే ఎలా తెలిసింది? మాస్టారు వస్తే బాగుండును. ఈ పేపరు వార్తలోని తెర వెనుక విషయాలు ఏమిటో అడిగి తెలుసుకోవచ్చు.
తన భ్రమ కాకపోతే ఆయన మాత్రం ఆ విషయాలు తనతో చెప్తాడా? తనకు చెప్తే- మంత్రిగారికి చెప్పినట్టే అనే భయం మాస్టారులో వుంటుంది.
తనకు ఏం తెలీదని చెప్తాడు. ఈ విషయంలో తను నిమిత్తమాత్రుడని అంటాడు. కాకుంటే తన ముందే కుమార్తెను రెండు తిడతాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra