Home » Veturi prabhakara sastry » Chatupadya Manimanjari

 

    
    పారిజాతవుల సమృద్దిఁ బండేడిది నమశ్శివాయ
    దురితవితతిఁ దూరుపాఱఁ దోలెడిది నమశ్శివాయ
    వరము లోలి నిచ్చుచోట వ్రాలేడిది నమశ్శివాయ
    మునులు ఘనులు మించి తలఁచి మ్రొక్కెడిది నమశ్శివాయ    
    ఇనశశిశి ఖినయనవీధి నెక్కేడిది నమశ్శివాయ
    ఓటలేక పుణ్యపధము లూఱెడిది  నమశ్శివాయ
    మేటిసుకృతకోటి నెల్ల మీఱేడిది నమశ్శివాయ
    తిర మిడుకొని విబుధవరులఁ ద్రిప్పేడిది నమశ్శివాయ
    గురుముఖ ప్రదత్తమగుచుఁ గ్రోప్పేడిది నమశ్శివాయ
    బహువిధ ప్రమాదములను బాపెడిది నమశ్శివాయ
    సుహితపుణ్య భోగపంక్తిఁ జూపేడిది నమశ్శివాయ
    మూల మీ నమశ్శివాయ ముఖ్య మీ నమశ్శివాయ
    శీల మీ నమశ్శివాయ శిఖర మీ నమశ్శివాయ
    సుపధ మీ నమశ్శివాయ శుద్ధ మీ నమశ్శివాయ
    నిపుణ మీ నమశ్శివాయ నిత్య మీ నమశ్శివాయ
    గగన మీ నమశ్శివాయ గర్త మీ నమశ్శివాయ
    నిగమ మీ నమశ్శివాయ నిఖిల మీ నమశ్శివాయ
    వీర మీ నమశ్శివాయ విమల మీ నమశ్శివాయ
    సార మీ నమశ్శివాయ సొఖ్య మీ నమశ్శివాయ
    ధనద మీ నమశ్శివాయ ధన్య మీ నమశ్శివాయ
    జనన మీ నమశ్శివాయ జన్య మీ నమశ్శివాయ
    యోగ మీ నమశ్శివాయ యోగ్య మీ నమశ్శివాయ
    భోగ మీ నమశ్శివాయ భోగ్య మీ నమశ్శివాయ
    సరస మీ నమశ్శివాయ సత్య మీ నమశ్శివాయ
    పరమ మీ నమశ్శివాయ బ్రహ్మ మీ నమశ్శివాయ        223

   కం.    ఈయష్తోత్తరశతముం
    బాయక పఠియించునతఁడు పరమానంద
    శ్రీయుక్తుఁడు రైయుక్తుఁడు
    దీయుక్తుఁడు నైతనర్చు దివ్యమహత్త            224
    
   చం.  అనిమనరంగనాథుఁడు దయానిధి శ్రీగిరినాథుమీఁదఁ జే
    ప్పిన శివమంత్రపర్ణనము చిత్తసముద్గత భక్తీ యుక్తి వ్రా
    సినఁ గొనియాడిన వినినఁ జేల్వేసలారఁ బకించిన  జగ
    జ్జనులకుఁ ఋణ్యసంపద లసంఖ్యములై సమకూరు నిమ్మహి.    225

        రంగనాథుని శివకవిత్వము
    
    రంగనాథుఁడను కవీశ్వరునిఁ గూర్చి యిటీవల చెలరేగిన వాద దావాగ్నిలోఁ జిక్కు వడి నే నొడలు కాల్చుకొనఁజాలను. ప్రాచీన కావ్య లక్షణ శాస్ర కవిచరిత్రాది పరిజ్ఞానము గొల్పుటలో నాకుఁ బ్రాచీన లక్షణ గ్రంధకర్తలు పితృతుల్యులు. ఉహ్వని యువ్వెత్తున వారి పరిజ్ఞానము నుత్తుత్తి దానిఁగా నే నూఁది వేయఁ జాలను. వారు భ్రమ ప్రమాదములు లేనివారనఁ గాదు. ప్రబల ప్రమాణములచే నట్టి వట్టి సరకును నిరూపించి కొట్టి వేయుట లగ్గు. రంగనాధునిఁ గూర్చి యుపలబ్దాంశముల నెత్తి చూపుటకే నాయీ యువక్రమము , ఇందు ప్రామాణ్య చర్చను ప్రాజ్ఞులు కావింపఁగలరు గాక!
        
                                             i


    కర్నాటక కవియగు తొంటే దార్యకవి 'పాల్కురికి సోమేశ్వర పురాణము' న రంగనాధుని విషయము నిట్లు చెప్పినాఁ'డు. చక్రపాణి రంగనాథుడను వైష్ణవునితో సోమనాధునకు మత విషయమునఁ' దగవు వాటిల్లెను. ఆ శైవుని దర్శింపఁడుగాన సోమనాధుఁడు తెరచాటున నుండి వాదము చేయ నంగీకరించెను. కాని యా వైష్ణవుని జయించుటకు సోమనాధుని పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరుఁడే తలపడెను. వారిర్వురకు గొప్ప వాదము జరిగెను. రంగనాధుఁ డోడి పోయేను. శ్రీశైల మల్లికార్జునిఁ జూడక  ద్వేషబుద్దితోనే యరిగెను. ఆ శివద్వేషముచే నాతనికిఁ గన్నులు గ్రుడ్డివయ్యేను. అహోబలమున కరిగి యాతఁడు నరసింహస్వామిని బ్రార్థించెను. ఆ స్వామి వలన స్వప్నమున శివాదిక్యబోధమును బడసి లజ్జితుఁడై తిరిగి శ్రీశైలమునకు వచ్చి మల్లికార్జునుని బహు విధములఁ బ్రస్తుతించెను. ఒక కన్ను వచ్చెను. పదపడి పాలుకురికికి వచ్చి సోమనాధునిఁ  దర్శించి యపచారము క్షమింపఁ బ్రార్ధించెను. సోమనాధుఁడను గ్రహించెను. రెండవ కన్ను వచ్చెను. రంగనాథుఁడు శైవదీక్ష నోసఁగుమని సోమనాధునిఁ బ్రార్థించెను. పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరుని చేత సోమనాథుఁ డాతని శివ దీక్షతుని జేయించేను. రంగనాథుఁడప్పుడు వీరభద్ర విజయ శరభచరితత్రాదులను రచియించి గురుపాదముల కర్పించెను."


                                          ii

    పాల్కురికి సోమనాధపురాణామే కాకా కర్ణాకటకృతి యగు గురురాజచరిత్రము గూడ నీ చక్రపాణి రంగనాథుని చరిత్రమును జెప్పుచున్నది. తొంటే దార్యకవి చెప్పినట్టే యా గురురాజచరిత్ర కర్త సిద్దనంజేశకవియు రంగనాథుని యాటమిని జెప్పినాఁడు. 'వీరభద్ర విజయము' 'శరభ లీల' యను గ్రంథములనే కాక యాతఁడు శ్రీగిరినాథవిక్రమ మని యేనఱు సీనపద్యముల తెలుఁగు గ్రంథమును గూడ రచించేనట! దానినే సంస్కృతమునఁ గూడ రచించేనట! ఆ కవి యిట్లు చెప్పు చున్నాఁడు.
    
    'శ్రీ శైలభర్తకును సీసంగ ళేనూఱు
    లే సప్ప పద్యంగ ళేఁటు సావిరగళుం
    భాసురద దండకం సాహస్త తారావళియు నాల్కు లయగ్రాహియు
    
    ఆశతక వృత్తగళు దోధకం సావిరావు
    భాసురద తోటకం నూఱురగ ళేగ ళేడు
    భాషిసిద మత్తకోకిల మూఱుసాసిరం గీతియం తాఱునూఱు
    
    సరస మంజెర వెంటు కందంగ ళై నూఱు
    విరచిసిద కృతియ మూవత్తాఱు గద్యగళు
    నిరువ మూవత్తాఱు వుభయశతకం వొప్పు మిగిలు సర్వేశనిమగె'     226
    

    ఇందు 'శ్రీగిరినాథ విక్రమము' అనుపేర శ్రీ శైల మల్లికార్జుని పై నైదువందల సీసవద్యములను , నేనిమిదివేల పద్యములు గల మరొక గ్రంథమును, వేయి పాదములు గల దండకమును , నొక తారావళిని , నాలుగు లయ గ్రాహులను, నొక వృత్త శతకమును , వేయి దోదక వృత్తములను , నూఱు తోటక వృత్తములను, నేఁడు రగడలను , మూఁ డు వేల మత్తకోకిలలను , నాఱు వందల గీత పద్యములను , నెనిమిది మంజరులను, నై నూఱు కందములను ముప్పదియాఱు గద్యములను, ముప్పదియాఱు ఉభయశతకములను చెప్పినట్లు ఈ పద్యమునందున్నది. ఇతని యీ కృతు లెల్ల నిప్పుడు మనకు గానరావు.

        
                                             iii

    కాని శివదూషణచే, గన్నులు పోఁగా శివస్తుతిచేఁ గన్నులు తెచ్చికొన్నట్లుగా రంగనకవి రచించినట్లుగా శ్రీగిరిమల్లికార్జునిని మీఁద రగడ యొకటి యున్నది. 'శివ  భక్తీ దీపిక' యని దానికి ఁబేరు. దానికే 'నయన రగడ' యని నామంతరము.

    
                                              iv

    నేఁడు శివమంత్రవర్ణనము అను పేర మఱియొక రగడ రంగనాథుఁడు రచించినదిగానే దొరికినది. నమశ్శివాయ రగడ యని దీనికి నామాంతరము. దీని కడపట నీ క్రింది పద్యమున్నది.

    'అని మన? (మును?) రంగనాథుఁడు దయానిధి శ్రీగిరినాథు మీఁద జె
    ప్పిన శివమంత్రవర్ణనము చిత్తసముద్గత భక్తి యుక్తి వ్రా
    సినఁ గొనియాడిన వినినఁ జెల్వేసలారఁ బఠించిన జగ
    జ్జనులకుఁ ఋణ్యసంపద లసంఖ్యములై సమకూఱు నిమ్మహి    227

    ఈ పద్యమును రంగనాథుఁడే రచించేనో లేక తర్వాతి కాలమున నితరుఁడే రచించేనో! ఈ రెండు రగడల నిప్పు డిక్కడఁ బ్రకటించినాఁడను. సిద్దనంజేశ కవి పద్యములో లెక్కింపఁబడిన రంగనాథుని రగడ లేడింటిలో నిప్పటికి రెండు రగడలు దొరికిన వనవచ్చును. 1. శివభక్తి దీపిక యను నయనరగడ 2. శివమంత్రవర్ణన మను నీ నమశ్శివాయ రగడ.


                                        v

    శివ భక్తీ దీపిక వ్రాఁత ప్రతిలో కడపట నిట్లున్నది.
    'వైష్తవ చక్రపాణి రంగనాథుఁడు శైవ దీక్షాధారణమైన తర్వాతను చేసిన నయనరగళ'

    
                                       vi

    'ఏకశిలానగర వృత్తాంతము' లో రంగనాథుని గూర్చి యిట్లున్నది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra