అనంతమూర్తి హుందాగా ఆ రూమ్ లోకి అడుగుపెట్టాడు.

 

    నిజానికది రూమ్ కాదు. ప్యారిస్ లోని బిల్డింగుల్లోంచి ఒక భాగాన్ని తెచ్చి అక్కడ పెట్టినట్టుగా వుంది.

 

    అక్కడ నుంచి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ ప్రారంభమౌతుంది.

 

    గదిలోంచి గది, గదిలోంచి గది. అనంతమూర్తి ఓ గది ముందు ఆగాడు. లోనికి తొంగి చూశాడు.

 

    "మే ఐ కమిన్" వినయంగా అడిగాడు అనంతమూర్తి.

 

    "ఎస్ కమిన్..." డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుని తల దువ్వుకుంటున్న ఆ వ్యక్తి తలతిప్పి చూశాడు.

 

    లోనికి అడుగుపెట్టిన అనంతమూర్తి-

 

    "గుడ్ మార్నింగ్ మిస్టర్ సిద్ధార్ధా!" అని విష్ చేశాడు.

 

    సిద్ధార్ధ మహంత... ఉరఫ్ సిద్ధార్ధ... అనంతమూర్తిని చూసి పలకరింపుగా నవ్వాడు.

 

    సిద్ధార్ధ... పాతికేళ్ళ సిద్ధార్ధ... పాలతో తయారుచేసిన బొమ్మకు, పగడపు పొడి అద్దినట్టుగా వుంటాడు. అయిదడుగుల, ఎనిమిదంగుళాల పొడవు. విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమల కింద గులాబీ రేకుల్లాంటి కళ్లు, పొడవాటి ముక్కు తీర్చిదిద్దిన ఎర్రటి పెదాలు, పొడవాటి చేతులు, దృఢమైన శరీరం.

 

    ప్రస్తుతం సిద్ధార్ధ ప్యారిస్ నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో తెప్పించిన స్పెషల్ సూట్లో తళతళ మెరిసిపోతున్నాడు.

 

    "మెనీ మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే... మిస్టర్ సిద్ధార్ధా..." బర్త్ డే శుభాకాంక్షల్ని తెలిపాడు అనంతమూర్తి. ఆ రోజు సిద్ధార్ధ బర్త్ డే అనే విషయం ఒక్క అనంతమూర్తికే తెలుసు.

 

    "ఎనీ డే... కామన్ డే ఫర్ మీ... ఇన్ క్లూడింగ్ మై బర్త్ డే... ఈ వింత వ్యాపార పంజరంలో నాకన్నిరోజులూ ఒకటేనని ఏ రోజూ డైలీ షెడ్యూల్ లో మార్పు రాదని మీకు తెలుసు... కదూ... అనంతమూర్తీ" సిద్ధార్ధ నోటివెంట అప్రయత్నంగా వచ్చిన ఆ మాటల వెనక విషాదం ఒక్క అనంతమూర్తికే తెలుసు.

 

    అయినా సిద్ధార్ధలాగే అతనూ నిస్సహాయుడు.

 

    "డోన్ట్ బీ డిప్రెసివ్ సిద్దార్దా... గొప్ప త్యాగం లేనిదే, గొప్ప సంకల్పం సిద్ధించదు. నీ తండ్రి మహంత ఆయుధ ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యక్తి. ఏదో మహా వ్యాపార శక్తి, ఆ శక్తికి వారసుడివి నువ్వు. అందుకే నీ తండ్రి నీకొక ప్రపంచాన్ని సృష్టించి యిచ్చాడు. నువ్వేం కావాలన్నా ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచయినా వచ్చే ఏర్పాటు చేస్తాడు. ప్రతి నెలా నీ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు నీ తండ్రి.

 

    మామూలు వాళ్ళు కలలో కూడా ఊహించలేని జీవితం నీది.

 

    నీ తండ్రి ప్రపంచ ఆయుధ వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తి. నువ్వు రేపటి చక్రవర్తివి. క్రమశిక్షణలో నుంచే బంగారు భవిష్యత్తు పుడుతుంది. అందుకు... రేపటి నీ భవిష్యత్తు నిదర్శనం అవుతుంది" సిద్దార్ధ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అనంతమూర్తి.

 

    "క్రమశిక్షణ మనిషికి అవసరం కాదనను... నేను మాట్లాడుతున్నది యీ జైలు గురించి. ఈ బంగారు పంజరం గురించి... యూ నో అతి ఖరీదైన, విలాసవంతమైన, జైలు కాని యీ జైల్లో అధికారులు మారారు. నా పరిస్థితి మారలేదు. ఒకటా, రెండా టెన్ ఇయర్స్, పది సంవత్సరాలు... పదేళ్ళుగా నేనీ జైల్లో గడుపుతున్నాను... నిద్రలో తప్ప నాకు స్వేచ్చ లేదు.

 

    బిజినెస్... బిజినెస్... బిజినెస్.

 

    జపాన్ నుంచి ఓ ఇండస్ట్రియలిస్ట్ వస్తాడు. లెక్చరిచ్చి వెళ్ళిపోతాడు. టోక్యో నుంచి ఓ కంప్యూటర్ జీనియస్ వస్తాడు. హ్యూమన్ బ్రెయిన్ ని కంప్యూటర్ లా మార్చుకోవాలో లెక్చరిస్తాడు. లెక్చర్స్.. లెక్చర్స్... అయామ్ బికమ్ మేడ్" అసహనంగా అన్నాడు సిద్దార్ధ.

 

    "ఆవేశపడకు... నిన్ను పర్ ఫెక్ట్ బిజినెస్ మెన్ గా తయారు చెయ్యాలన్నదే నీ తండ్రి ఆశయం.

 

    Perpetual devotion to what a man calls his business is only.

 

    To be sustained by perpetual neglect of many other things.

 

    ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇండియన్ బిజినెస్ టైకూన్ జె.ఆర్.డి. టాటా ఆచరించిన సత్యం.

 

    ఇఫ్ యూ వాంట్ సమ్ థింగ్ టేక్ ఏక్షన్ టు మేక్ ఇట్ హేవెన్ అన్నదానికి ఎర్లీ ఎన్విరాన్ మెంట్ అవసరం చాలా వుంది. పర్టిక్యులర్ వయసులో పెరుగుదల, పరిసరాలు, ప్రభావాలు, శిక్షణ, అనుభవం మనిషికి సక్రమమైన దారిని ఏర్పరుస్తాయి.

 

    పూర్వకాలంలో మహారాజులు తమ వారసులకు రహస్యంగా గొప్ప శిక్షణ యిప్పించడానికి కారణం ఇదే.

 

    ఆధునిక కాలంలో బిజినెస్ వరల్డ్ లోకి వెళ్ళబోయే నీలాంటి వాళ్ళకి ఈ శిక్షణ చాలా అవసరం.

 

    ఎన్నో దారులున్నప్పుడు ఏదో ఒక దారిన నువ్వు వెళ్ళాలనుకుంటావ్. ఏ దారీ నీకు కనబడనప్పుడు ఒక దారిని నువ్వు సృష్టించుకుంటావ్. ఆ మార్గమే సృజనాత్మకత. అందుకే దారులన్నీ మూసేసినట్టు కనబడే ఈ శిక్షణ.

 

    అమెరికన్ బిజినెస్ మెన్ హెర్మన్ కాన్ పేరు నువ్వు వినే వుంటావ్. ప్రాక్టికల్ లైఫ్- ఆ లైఫ్ లోని బాధలు తెలుసుకోవడం కోసం హెర్మన్ కాన్ ని ఆయన తండ్రి బూట్ పాలిష్ చేసే పని దగ్గర నియోగించాడు. వార్నర్ హెర్హాద్, హారీ హెమ్స్ లే బాల్యంలో బాధల చుట్టూ పెరిగారు. ఆ బాధల్ని సృష్టించింది వాళ్ళ తండ్రులే.

 

    అందుకే ఎ సోర్స్ ఆఫ్ ప్రోబ్లమస్ బికేమ్ ఎ సోర్స్ ఆఫ్ పవర్...

 

    ప్రఖ్యాత సినిమా నటుడు దాదా ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, కొడుకు నాగార్జున గురించి నువ్వు వినే వుంటావు. చిన్నప్పుడు బస్సులో వెళ్ళి, స్కూల్లో చదువుకొనేవాడు. అది అతనికి తండ్రి వేసిన శిక్ష కాదా?

 

    ఆ శిక్షే శిక్షణ...

 

    మిస్టర్ సిద్ధార్ధా... జెనెటిక్ వ్యూ, బిహేవిరిస్ట్ వ్యూ, రెండు వ్యూస్ మనిషి చుట్టూ వుంటాయి. జెనెటిక్ వ్యూ అంటే నీ తండ్రి గొప్పవాడయినంత మాత్రాన నువ్వు గొప్పవాడివి కాలేవు. బిహేవిరిస్ట్ వ్యూ నీకు తెలియాలి.

 

    నీ బ్రెయిన్ లోని కెమికల్ ప్రొఫైల్. నీ తండ్రి ద్వారా వచ్చినా ఆ ప్రొఫైల్ ని సక్రమ మార్గంలో మరల్చడానికి శిక్షణ అవసరం.

 

    అలాంటి శిక్షణ లేనినాడు-

 

    ధరమ్ హిందూజాలా మిగిలిపోతావ్. ధరమ్ హిందూజాలా నువ్వు దారి తప్పకూడదని ముందు చూపుతోనే నీ తండ్రి నీకీ అద్భుత పంజరాన్ని ఏర్పాటు చేశాడు" చెప్పాడు అనంతమూర్తి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra