Home » Vempalli niranjan reddy » మౌనం

    "సంజు ఎక్కడుందో  ఏమయినా తెలుసా?" అడిగాడు  సెబాస్టియన్ ని.

    తెలియదన్నట్లు  తల అడ్డంగా వూపాడతను.

    "అంతా గంద్రగోళంగా  వుంది గురూ! ఆ రోజు బట్టల షోరూంలో నుంచి  మాయమయింది. అంతే....ఇంతవరకు  ఏమయిందో  తెలియదు. ఎవరో వ్యక్తి  ఆమెను తీసుకుపోయాడట. వాడు పోలీస్ డిపార్ట్ మెంటు మనిషట. పోలీస్ డిపార్టుమెంటు  మనిషనగానే  సరిపోయిందా! వాడు కానిస్టేబులో  తెలియదు. ఐ.జి ఏమో తెలియదు. జంటనగరాల  నిండా వేలలో వున్నారు పోలీసులు. వాళ్ళలో  ఆమెను  తీసుకుపోయినవాడు  ఎవరో ఏమిటో ఏమీ తెలియదు" అరచేత్తో కణతలు  రుద్దుకుంటూ  అన్నాడు  సెబాస్టియన్.

    "సంజు  చావకపోతే....మనం చంపకపోతే  మీ అందరికీ  వచ్చిన నష్టమేమీ లేదురా! మహా అయితే ఒక్కొక్కరికీ  ఒకటి రెండు  లక్షలు లాస్. కానీ నాకు  జీవితమే నాశనం  అయిపోతుందిరా!" బెడ్ మీద నుండి లేచి వాళ్ళని సమీపించాడు.

    "వైజాగ్ లో ప్రోగ్రాం  జరుగుతుంది. ప్రోగ్రాం  పూర్తయ్యేలోపు ఆమెను  చంపడానికి  చాలా పకడ్భందీగా ప్లాన్ చేశాను. లక్ష దూపాయలకు  పైగా  ఖర్చు పెట్టాను అన్నీ వృధా" అన్నాడు  శేషు.

    "నువ్వు వైజాగ్ గురించి  మాట్లాడుతున్నావు. న్యూయార్క్ లో ఆమె ఫ్లైట్ ఎక్కిన దగ్గర్నుండి ఎక్కడ  అవకాశం  వస్తే  అక్కడ  చంపమని  నేను మనుషుల్ని  పంపాను. రెండుచోట్ల  చేతికి  దొరికినట్లే  దొరికి జారిపోయింది. అదృష్టవశాత్తు  రెండుసార్లు  మన మనుషులు పోలీసులకు  దొరకలేదు. ఇలా చెయ్యి  జారిపోయినదానికి  ఇంకెంత  ఏడవాలి?" అసహనంగా  అన్నాడు  మన్సూర్.

    "నాకు ఇప్పటికీ  అర్ధంకాని  విషయం  ఒకటుంది. అసలు  మనం  ఆ పిల్లని ఎందుకు  చంపాలి?" అడిగాడు సెబాస్టియన్.  

    చురుకుగా తలెత్తి సెబాస్టియన్  వంక  చూశాడతను.

    "అవును గురూ! ఆమె పోలీస్ డిపారర్టుమెంటు మనిషా?"

    "కాదు"

    "పోనీ మన వ్యాపారానికి  ఏమైనా  అడ్డు వస్తోందా?"

    "లేదు"

    "అదీకాదు_మన వ్యాపారాలతో  ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగాకాని  సంబంధం  వుందా అంటే  అది కూడా  లేదు. పోలీ ఆమె మన  శతృవుకి ఎవరికయినా  కూతురో, చుట్టమో పక్కమో  అనుకుంటే  అదీ కాదు. మరి ఎందుకు....ఎందుకు  మనం ఆమెను హత్య చేయాలి?" సెబాస్టియన్ గొంతు తారాస్థాయిలో  వుంది.

    "ఎందుకంటే  నాకు అవసరం కాబట్టి చంపమంటున్నాను....నా జీవిత సమస్య కాబట్టి  చంపమంటున్నాను" అంతకంటే  గట్టిగా  అరిచాడు  ఆ వ్యక్తి.

    "అదే ఎందుకని? నీతో  వ్యాపారాలు  కలసిచేయాలి. హెరాయిన్ కొన్నా, గంజాయి అమ్మినా, ఆఖరికి  స్మగుల్ చేసిన  రిస్ట్ వాచ్ అమ్మినా  మేము నీతో చెప్పి చేయాలి....అదీ నీకు  ఇష్టమైతేనే  చేయాలి. ఇప్పుడీ హత్య కూడా నీకోసం చేయాలి. కానీ ఎందుకు  చేయాలన్నది మాత్రం మాకు అనవసరం. అంతేగా! ఇది మన మధ్య స్నేహంలా లేదు....కిరాయి గూండాల  వ్యవహారంలా  వుంది" మనస్సులో  వున్న  కక్షని, ఆవేశాన్ని  వెళ్ళగక్కాడు సెబాస్టియన్.

    "పిచ్చి పిచ్చిగా  మాట్లాడకు. నేను  మిమ్మల్ని ఏనాడూ కిరాయి గూండాల్లా  చూడలేదు. కారణాలు  చెబితే తప్ప మీరు ఆమెను చంపము అంటే  అవి చెప్పటానికీ  నాకు అభ్యంతరం  లేదు" ఆవేశంతో  అతని నాసికా పుటాలు అదురుతున్నాయి.

    "అయితే  మరి...." ఇంకా ఏదో అనబోతున్న  సెబాస్టియన్ ను ఇంకేమీ  మాట్లాడవద్దు అన్నట్లు  సైగచేశాడు  అన్సూర్.   

    మౌనంగా వుండిపోయాడు సెబాస్టియన్. టేబుల్  మీద  తల వుంచాడు .రెండు నిమిషాలపాటు  అలాగే వుండిపోయాడు.

    కొంతసేపటికి  అతనిలోని  ఆవేశం  తగ్గింది.

    కుర్చీలో  నిటారుగా  కూర్చున్నాడు.

    "ఇన్ని  సంవత్సరాల తర్వాత  ఆమె ఇండియాకు  ఎందుకొచ్చిందో తెలుసా?" ప్రశ్నించాడు  అందరినీ ఉద్దేశించి.

    ఎవరూ మాట్లాడలేదు.

    "అందరూ  అనుకున్నట్లు  ఆమె మ్యూజిక్ ప్రోగ్రాం  యివ్వటానికి  రాలేదు. అది కేవలం  వంక.... కుంటిసాకు. ఒక బలమైన  నిర్ణయంతో ఆమె వస్తోంది. అందుకే....అందుకే....ఎన్ని లక్షల  ఖర్చయినా  సరే....ఆమె బ్రతికుండకూడదు."

    అసలు విషయం చెప్పకుండా  ఏదేదో మాటలు చెబుతున్న అతన్ని  చూస్తే  ఒళ్ళు మండిపోతోంది  అందరికీ.

    "ఇప్పుడు  మీరడిగిన  విషయం  చెబుతాను. ఆమెను చంపడానికిగల ముఖ్యకారణం...." అని గొంతు సవరించుకున్నాడతను.

    జ్ఞానేంద్రియాలు  అన్నీ ఎలర్ట్  చేసి అతను చెప్పే  విషయం వినటానికి  సంసిద్దులయ్యారు  అందరూ.


                      *    *    *    *


    టెలివిజన్  స్క్రీన్ మీద తెల్లని  గీతలు  కదలాడుతున్నాయి.

    అప్పటికి  వి సి ఆర్ లోని  కేసెట్  పూర్తయిపోయి  పది నిమిషాలు పైగా అయింది.

    పరుపు మీద బోర్లా  పడుకుని  తదేకంగా టీవీ వైపే  చూస్తోంది  అర్చన.

    ఆమె దృష్టి  టి.వి. స్క్రీన్  మీద వుంది కానీ  ఆలోచనలు  ఎక్కడెక్కడో  పరిభ్రమిస్తున్నాయి. ఆ ఆలోచనల్లో  టి.వి. ఆఫ్ చేయాలన్న  ధ్యాస  కూడా లేదు ఆమెకు.

    అంతవరకూ  ఆమె చూసిన  క్యాసెట్ చాలా బాగుంది.

    దానిని మాటల్లో  వర్ణించడం  అసంభవం.

    అదెక్కడా  ఫ్యాషన్ షో క్యాసెట్ లాగా లేదు.

    అందులో  పదిమంది పైగా మోడల్స్  వున్నట్లు  అసలే  అనిపించడం లేదు.

    అంతా  అర్చనే వుంది.

    ఆద్యంతం  ఆమే.

    అతను  ఆమే వదనాన్ని ఎన్ని వందల క్లోజప్స్ లో పిక్చరైజ్ చేస్తాడో మాటల్లో  చెప్పటం  కష్టం.

    బ్రిలియంట్  షాట్  టేకింగ్....

    వండ్రఫుల్ మిక్సింగ్....

    ఫెంటాస్టిక్  ఎడిటింగ్....

    టాప్ స్టాండెర్ట్  ఎడ్వర్ టైజ్ మెంట్  చూస్తున్నట్లుగా  వుందది.

    'ఇంత  అందంగా  వీడియోగ్రఫీ  చేయటం  సాధ్యమా! నిజంగా  తాను అంతందంగా  వుందా  లేక కేవలం అతని ప్రతిభవలన  అందులో  అందంగా కనిపిస్తోందా!"

    ఏమో?

    చెప్పటం  అసాధ్యం....అనుకుంది.

    "నేను యిచ్చిన  యీ క్యాసెట్  నచ్చితే....ఈ నెంబరుకు  ఫోన్ చేయండి" అన్న అతని మాటలు గుర్తుకొచ్చాయి.

    ఒక్కసారిగా  ఆమెలో  చైతన్యం  వచ్చింది.

    మంచంపై  కూర్చుందామె.

    అప్పుడు  గుర్తుకు  వచ్చింది  ఆమెకు టి.వి. ఆఫ్ చేయలేదని.

    అదే సమయంలో  ఒకింత  ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. తను ఇంత  పరధ్యానంగా  ఎలా  వుండిపోయిందా  అని.

    వి.సి.ఆర్  ప్రక్కనున్న  అతని  విజిటింగ్  కార్డు  అందుకుని టీపాయ్ మీద వున్న కార్డ్ లెస్ పానాసానిక్  టెలిఫోన్  అందుకుంది.

    తిరిగి  బెడ్ మీద కూర్చుంది.

    ఇప్పుడీ  నెంబరు  డయల్ చేస్తే....చంద్రకాంత్  మాట్లాడతాడు.

    "మీకు నేను యిచ్చిన  క్యాసెట్  వచ్చిందన్నమాట" అంటాడు.

    'అవును' అంటుంది  తను.

    తర్వాత  ఏమంటాడో....ఏం మాట్లాడాలో....

    అదే సమయంలో  ఒకింత  భయం ఆమెను ఆవరించింది.

    ఏ మాత్రం  పరిచయంలేని  వ్యక్తితో  తను ఏం మాట్లాడుతుంది? అసలతని  వుద్దేశ్యమేమిటి? తనతో  కావాలని  పరిచయం  పెంచుకుంటున్నాడా? దాని వెనుక  కారణం  ఏమైవుంటుంది?

    తనేమీ  మాట్లాడకుండానే  పరిచయం  చేసేసుకుని  చాలాసేపు  మాట్లాడేశాడు. ఇక తనకు తానుగా ఫోన్ చేస్తే?

    చనువు  తీసుకుని  అతిగా  ప్రవర్తిస్తే! ఆ ప్రవర్తనని  తను భరించ గలుగుతుందా? నో....అది  తన వ్యక్తిత్వానికి  విరుద్దం.

    ఆలోచించినకొద్దీ  అతనొక  రోడ్ సైడ్  రోమియో  ఏమో  అని అనుమానం  రాసాగింది.

    రోడ్ సైడ్ రోమియో  అయినా  అతనిలో ఫెంటాస్టిక్  ఆర్ట్ వుంది. ఆ ఆర్ట్ ని మెచ్చుకోవటానికయినా  ఫోన్ చేయొచ్చుకదా?

    అనవసరంగా  అతని గురించి  చాలాసేపటి  నుండి  ఆలోచిస్తోంది.

    ఇక ఆ పని  చేయకూడదని  నిర్ణయించుకుని ఫోన్ ను, విజిటింగ్ కార్డుని  టీపాయ్ మీద వుంచి  ఆ గదిలో  నుండి బయటికి  అడుగు వేసిందామె.

    సరిగ్గా  అదే సమయంలో రింగ్ అయింది ఫోను.

    వెనక్కు  తిరిగిందామె.

    నాలుగు క్షణాల తర్వాత  ఫోన్  లిఫ్టుచేసి "హలో" అందామె.

    "ఫోన్  చేయాలని  అనిపించినా  ఆ ఉద్దేశ్యాన్ని  బలవంతంగా  చంపుకుంటున్నారెందుకు?"

    ఉలిక్కి పడింది  ఆ గొంతు  విని  అర్చన.

    "నన్ను  గుర్తుపట్టలేదా? చంద్రకాంత్. మీకు వీడియో  క్యాసెట్ ఇచ్చిన వ్యక్తి. మీకు క్యాసెట్ చాలా నచ్చింది కదూ?" తిరిగి  వినిపించింది అతని కంఠం.

    గుండె  ఝల్లుమందామెకు.

                    *    *    *    *    * 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra