Home » Yandamuri veerendranath » Anaithikam


    అలా నా బావగారితో 'సంఘర్షణలేని సంబంధం' ప్రారంభమైంది. పరిస్థితులు అలాగే కొనసాగుంటే ఏ కాంట్రడిక్షన్లూ లేకుండా సాగిపోయుండేది. దూరపు కొండలు నునుపులా ఎదుటి వ్యక్తి మనకు అందనంతవరకూ, మనకు అవసరానికి మించి ప్రాముఖ్యమూ, గౌరవం ఇస్తున్నంతవరకూ మనకు వాళ్ళ సమక్షం అత్యద్భుతంగా తోస్తుంది. స్నేహం పెరిగి, ఎదుటివాళ్ళు మనమీద చనువుతో కూడిన అధికారం చూపించడం మొదలు పెడితే ఆ సంబంధం తాలూకూ పునాది కదలడం ప్రారంభమవుతుంది.

 

    అతను నిస్సందేహంగా నన్ను సెక్స్ కోసం మాత్రమే కలవడు. కోరికకి అతీతమైన ప్రేమ (?), కన్సర్న్ అతనికి వున్నాయని నాకు తెలుసు. అయితే, మేము కలుసుకున్న ప్రతిసారీ అతనితో తప్పనిసరిగా సెక్స్ జరపడం నాలో అసంతృప్తిని ప్రవేశపెట్టింది.

 

    అలాగని మేము మాట్లాడుకునేవాళ్ళం కాదని కాదు. సెక్స్ కి తర్వాతో, ముందో, బోలెడన్ని 'జీవిత సత్యాలు' చర్చించుకునే వాళ్ళం. క్రమక్రమంగా మా మధ్య బిజినెస్ విషయాలు తక్కువగా దొర్లుతున్నాయనేది నేను చాలా ఆలస్యంగా గమనించిన విషయం. అంతేకాదు, మాకు లభించే సమయం తక్కువగా వున్నప్పుడు, మా మధ్య కేవలం 'సెక్స్' కొనసాగేది. మాటలు వుండేవి కావు.

 

    ప్రతి మానవ సంబంధంలోనూ ఈ మాత్రం 'క్యాజువల్ నెస్' కాలక్రమేణా మామూలే. అది మాత్రం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నాలాంటివాళ్ళు వ్యధకి లోనవుతారు. అంత చిన్న చిన్న విషయాలకి నేనెందుకు అసంతృప్తికి లోనవ్వాలని నేను అప్పుడప్పుడూ ప్రశ్నించుకునేదాన్ని. నాకేం కావాలో నాకే తెలియదా అనే ప్రశ్న నన్ను అయోమయంలో పడవేసేది.

 

    నా అన్ని వ్యధలకూ సాంత్వన నాకు నా కూతుర్లో లభించింది. అది పుట్టడమే నాకు ఓ పెద్ద అండ దొరికినంత ధైర్యాన్ని చేకూర్చింది. పూర్తిగా నా అనే వ్యక్తి, నా మీద ప్రతి చిన్న అవసరానికీ ఆధారపడే మనిషి దొరికిందనే ఆనందం అయ్యుండొచ్చు. మరోవైపు (చాలా చిత్రంగా) నా కూతురు నాకో గొప్ప సెక్యూరిటీ అనే భావన నాలో మొదలైంది. దీనికి తర్కంలేదు. ఆనందం ఇచ్చే చాలా విషయాలకు తర్కం వుండదు. భర్తల్నించి దూరమైన వాళ్ళూ, మానసికంగా ఒంటరులూ- తమ పిల్లల్ని ఆశల కేంద్రంగా చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది?

 

    అలాగని నా బావగారంటే నాకిష్టం పోయిందని కాదు. పైగా బాగా పాసెసివ్ నెస్ గా మారింది. అదే నా అసంతృప్తికి కారణం అయుండవచ్చు. నేను లోలోపల అతన్నుంచి కోరికల్లేని ప్లెటోనిక్ లవ్ ని కోరుకుంటున్నానేమో! అందువల్ల అతను నన్నూ, న కూతుర్నీ చాలా అపురూపంగా చూసుకోవాలనే స్వార్థం కలిగేది. ఇలా వుండగా జరిగిందది!

 

    ఆ రాత్రి నాకు బాగా దాహం వేసింది. నా గదిలోనే జగ్ లో నీళ్ళుంటాయి. కానీ, అవి నా కూతురి కోసం కాచి చల్లార్చిన నీళ్ళు. అ టేస్ట్ సరిపడక నేనా నీళ్ళు తాగను. అందుకే లేచి ముందుగదిలోవున్న ఫ్రిజ్ కేసి ఎవరికీ మెలకువ రాకుండా నిశ్శబ్దంగా నడిచాను. నీళ్ళు తాగి బాటిల్ యధాస్థానంలో వుంచి డోర్ వేయబోతుండగా......

 

                                                           *    *    *

 

    ఉత్తరం వైపు వున్న చిన్న స్టోర్ రూమ్ నా తోడికోడలి చెల్లెలికి కేటాయించబడింది. అక్కడ నెలసరి వెచ్చాలన్నీ డబ్బాల్లో పోసి వుంటాయి. పేరుకి స్టోర్ రూమ్ అయినా, ఏ ఎలుకల బెడదా లేకుండా కాస్తంత పెద్దదిగానే వుంటుంది. ఆ రూమ్ తలుపు చిన్నగా, అతి చిన్నగా ఓ నాలుగడుగుల దూరంలో నుంచున్న వారికి వినిపించేంత మెల్లగా కిర్రుమన్న శబ్దంతో తెరుచుకుంది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన నాకు, మెడవైపు వున్న జుట్టుని వేళ్ళతో సవరించుకుంటూ ఆ గదిలోనుంచి బయటికొస్తూ కనిపించాడు నా బావగారు!

 

    ఫ్రిజ్ డోరు మూయకపోవడం వల్ల ఆ లైటు వెలుగు అతని మీద పడి అస్పష్టంగా మెరిసింది. కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాను నేను. అతనూ నన్ను చూడగానే కాస్త షాక్ తిన్నట్లున్నాడు. అడుగులో కాస్త తడబాటు కనిపించింది. ఏదో చెప్పాలన్నట్లుగానో ఏమో, నా ముందు ఓ క్షణం ఆగాడు.

 

    లోపలినుంచి సన్నగా రోదన వినిపిస్తోంది. నేనటుకేసి చూశాను. ఆ చీకట్లో నాకేమీ కనిపించలేదు. అతనూ ఓక్షణం ఆ గదికేసి చూసి నాతో ఏదో చెప్పడానికి ఉపక్రమించాడు. నేను గిరుక్కున వెనుదిరిగి, ఎవరో తరుముకు వస్తున్నంత వడిగా నా గదిలోకి వచ్చేసి గడియ పెట్టేశాను.

 

    వగర్పుని అణచుకుంటూ మంచంమీద చేరి ముడుచుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాను. నా కళ్ళముందు క్రితం నెల జరిగిన సంఘటన మెదిలింది.

 

    ఆ రోజు కాలేజీలో ఏదో స్ట్రయిక్ జరిగి క్లాసులు తొందరగా అయిపోయాయి. కాలేజీ నుండి న బావగారికి ఫోన్ చేశాను. ఫోన్ అతని అసిస్టెంట్ లిఫ్ట్ చేశాడు. "ఆయన లేరండీ! పావుగంట క్రితమే బయటికెళ్ళారు. గంటా గంటన్నరలో వస్తానని చెప్పారు. ఎనీ మెసేజ్?" అడిగాడు మర్యాదగా.

 

    "నో, థాంక్యూ!" అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాను.

 

    ఇంటికి వెళ్ళే సమయం ఇంకా చాలా వుంది. అంత త్వరగా వెళ్ళాలనిపించలేదు. నా కూతురు కూడా స్కూల్ కి వెళ్ళుంటుంది. ఏదో నిశ్చయించుకున్నట్లుగా అక్కడి నుంచి బయలుదేరి ఆయన గెస్ట్ హౌస్ చేరుకున్నాను. అతను ఎక్కడికి వెళ్ళినా గంటన్నరలో ఆఫీసుకి వచ్చేస్తాడు. అతని టైమ్ సెన్స్ బాగా తెలిసి వున్న మనిషిని కనుక ఆ విషయంలో నాకేం అపనమ్మకం లేదు. అందుకే అక్కడే వెయిట్ చేయాలనుకున్నాను.

 

    గేటు తీసుకుని లోపలికి నడిచాను. కుడివైపు గ్యారేజీలో ఆయన కారు పెట్టేసి వుంది. కారు అక్కడ వుండటమేమిటో నా కర్థంకాలేదు. అడుగుదామంటే వాచ్ మెన్ కూడా గేటు దగ్గర లేడు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ముందు గది తలుపు వేసి వుంది. తోసి చూద్దామంటే జంకు కలిగింది.

 

    ఎవరైనా ఔట్ సైడ్ విజిటర్స్ వచ్చి అక్కడ దిగారేమోనన్న సందేహం కూడా కలిగింది. వాళ్ళు అతని కారుని కూడా ఉపయోగించుకుంటున్నారేమోననే ఆలోచన బలపడింది. అక్కడ వెయిట్ చెయ్యాలా, వద్దా అని కొట్టుమిట్టాడుతూ అక్కడ కూర్చోవాలనిపించక, వెనుక వైపున్న మొక్కలకేసి నడిచాను. కొత్త మొక్కలేవో తెచ్చినట్టున్నారు. కుండీల్లోనూ, ప్యాకెట్స్ లోనూ నవనవలాడుతూ వున్నాయి.

 

    అక్కడే వున్న ఓ ఖాళీ ప్యాకెట్ తీసుకుని నాక్కావలసిన మొక్కలని వేర్లు మట్టితో సహా పీకి దాంట్లో వేసుకుంటున్నాను. అప్పుడప్పుడూ కొత్త మొక్కలొచ్చినప్పుడు అలా చేయడం నాకు మామూలే!

 

    నా పనైపోయాక అక్కడున్న పైపులోనుంచి వస్తున్న నీళ్ళతో చేయి కడుక్కుని, తుడుచుకుంటూ ముందువైపుగా నడిచాను. టైమ్ చూసుకుని ఓసారి ఫోన్ చేసి చూద్దాం అనుకుంటూ వుండగా, అతని కారు ఎప్పుడు స్టార్టయిందో ఏమో, గేటుదాటి బయటకు కూడా వెళ్లిపోయింది. నేను మాత్రం చూస్తూ వుండిపోయాను. కారులో...ముందుసీట్లో... అతని పక్కగా నా తోడికోడలి చెల్లెలు... అంటే అతని మరదలు... నా కళ్ళముందు కనిపించింది.

 

    నమ్మాలో, లేదో నాకే అర్థంకాని పరిస్థితి! ఒక్కసారిగా గుండె మండినట్టుగా అయింది. కారు ...పక్కసీటు!! అచ్చు నేను వుండే పరిస్థితిలో ప్రస్తుతం నా బదులు ఆ అమ్మాయి!!

 

    నన్నేదో ఉన్మాదం పూనినట్టుంది. పిచ్చెత్తినట్టు రోడ్డుకు అడ్డంపడి నడిచి పబ్లిక్ బూత్ నుంచి ఆఫీసుకి ఫోన్ చేశాను. ఓ ఐదారుసార్లు రింగయ్యాక అతనే లిఫ్ట్ చేశాడు. నా గొంతువిని ఎప్పటి సాఫ్ట్ నెస్ తో, "హలో! నువ్వా? చెప్పు చెప్పు. ఇంత క్రితం వచ్చావుట?" అని అడిగాడు.

 

    "అవును. వచ్చి, మీరు లేకపోతే మీ ఆఫీసు వెనుకనున్న గెస్ట్ రూమ్ కి వెళ్ళివచ్చాను!" కామ్ గా అన్నాను.

 

    అటునుంచి ఓ అరక్షణం పాటు నిశ్శబ్దం.

 

    ఆ తరువాత అతనన్నాడు. "అవును, అక్కడే వున్నాను".

 

    అతని గొంతులో తడబాటు లేదు. కానీ ఎప్పటిలా 'నమ్మకం' కూడా ధ్వనించలేదు.

 

    "ఉన్నాను కాదు, వున్నాము అనండి!" అన్నాను కరుగ్గా.

 

    "ఓ కమాన్! నువ్వు అనుకునేలాంటిదేమీ లేదు...." అతనేదో చెప్పబోతుంటే నేను అడ్డుపడ్డాను- "పోనీ మీరేమనుకుంటున్నారో చెప్పండి!"

 

    అతను బాగా నచ్చచెప్తున్న ధోరణిలో గొంతు తగ్గించి మార్దవంగా - "చూడూ, అనవసరంగా ఎగ్జయిట్ అవకు. నువ్వు బాధపడాల్సిందేం లేదు. ప్రస్తుతం విషయమేమిటో చెప్పలేను కానీ, నన్ను నమ్ము!" అన్నాడు.

 

    "నమ్మాను. నమ్మక చేసేదేం లేదు కదా మరి! నాలాంటి వాళ్ళకి ప్రపంచంలో ఎప్పుడూ ఎవరిదో తోడు కావాలి. వాళ్ళు మమ్మల్ని ముంచేస్తున్నారని తెలిసినా నమ్మాలి! తప్పదు. లేకపోతే మాకు మనుగడే లేదు!" నా గొంతులో కసో దుఃఖమో చెప్పలేను.

 

    నేను నా పక్కమీద పడుకుని ఇంకా ఆలోచిస్తూనే వున్నాను.

 

    సమయంకాని సమయంలో ఓ అమ్మాయి గదిలోనుంచి ఓ మగవాడు గడియ తీసుకుని వస్తున్నాడంటే, వాళ్ళిద్దరి మధ్యా ఏముందనుకోమంటాడు నన్ను? పైగా ఆ అమ్మాయి రోదిస్తోంది...!

 

    అచ్చు (మొదటిసారి) నాలాగే!

 

    సంఘం నిర్దేశించిన విలువలతో సంఘర్షించి వాటిని గెలవాలన్న ఆవేశంలో ఏదో మలుపు తిరిగేసి, అక్కడా ఓడిపోతున్నామేమో అన్న భయంవల్ల వచ్చిన రోదన అది! నాలాటి చాలామంది ఆడపిల్లల రోదన. నాకు బాగా తెలుసది! నాకు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించిన విషయం నేనా విషయాన్ని గమనించానన్నప్పుడు కూడా నా బావగారు గిల్టీగా కనబడకపోవడం. అవును గిల్టీగా కనపడాల్సిన అవసరం అతనికేమిటి? భార్య కళ్ళు కప్పినవాడు నన్ను మోసం చేయకూడదనేముంది? నా ఆలోచనా ధోరణి నన్నేం ఆశ్చర్యపరచలేదు. కొన్నేళ్ళ క్రితం- అంటే- పెళ్ళవక ముందూ! పెళ్ళయిన కొత్తల్లో... 'ఇంకొకరితో రొమాన్స్' అన్న విషయం ఎవరినోట విన్నా జీర్ణించుకోగలిగేదాన్ని కాదేమో! కానీ ప్రస్తుతం 'మూడోవ్యక్తితో' అన్న విషయం కూడా ఆలోచించగలుగుతున్నానంటే నాకేం గిల్టీ ఫీలింగ్ లేదు. అయితే ఈ మొద్దు బారిపోవడం అనేది నన్ను బాధిస్తోంది. నా పిల్లల విషయంలోనైనా నా సున్నితత్వం మిగిలిపోతే బావుండుననిపిస్తోంది.  

 

    తోడికోడలి చెల్లెలి గదిలో అతన్ని చూసిన నేను, నేను చూశానన్న సంగతి చూసిన అతను- ఆ తర్వాత రోజు ఆ విషయం గురించి చర్చించుకోలేదు, వాదించుకోలేదు, పోట్లాడుకోలేదు, విడిపోలేదు. అంటే అతనే చెప్పాలని నేనూ, నేనడగాలని అతనూ - ఇలా ఎవరికెవరూ మాట్లాడుకోలేదేమో! పైగా- "అవును, నా ఇష్టం! నీకు నచ్చకపోతే నీ దారిన నువ్వెళ్ళవచ్చు!" అని అంటాడేమోననే భయం నాకు లోలోపల ఎక్కడో వున్నదేమో కూడా! లేకపోతే కాస్త ఘర్షణ సాగగానే- ఆవేశంతో "నా దారిన నన్ను బ్రతకనివ్వండి" అంటానేమోనని, నన్ను 'పోగొట్టుకోవడం' ఇష్టంలేక అతనా టాపిక్ ఎత్తి వుండడు! 'అనురాగం' అని మనుషులు ఏర్పరచుకునే సంబంధాలు 'అవసరాలు'గా ఎంత వేగంగా మారిపోతాయో చెప్పడానికి నా జీవితమే ఉదాహరణ! ఆ రోజు రాత్రి నాకెందుకో నిద్రపట్టలేదు. నాకు చాలా రాత్రులు నిద్ర పట్టదు. అవతల పక్కమీద నా భర్త నిశ్చింతగా నిద్రపోతున్నాడు. స్త్రీ స్పర్శా, సుఖం లేని లోటుని అతను ఏ మాత్రం ఫీల్ అవకపోవడం మొదలెట్టి చాలా రోజులయింది. అసలతనా సుఖాన్ని ఫీలయింది మాత్రం ఎప్పుడని? నిద్రలో నా కూతురు కదిలింది. దానికి మెలకువ రాకుండా నెమ్మదిగా జోకొట్టి, చప్పుడు కాకుండా లేచాను నేను. కిటికీ అవతల వెన్నెల నన్ను జాలిగా పలకరిస్తోంది. గ్రిల్ కి తలానించి నిశ్శబ్దంగా ఆ చల్లగాలిని ఆస్వాదించడానికి ప్రయత్నించాను.

 

    దూరంగా, చాలా దూరంగా ఎక్కడో నా కిష్టమైన ముఖేష్ పాట వినిపిస్తోంది. "కోయీ జబ్ తుమ్హరా హృదయ్ తోడ్ దే... తడప్ తా హువా జబ్ నహీ ఛోడ్ దే... తబ్ తుమ్ మేరే పాస్ ఆనా ప్రియే...మేరా దిల్ ఖులాహై ఖులాహీ రహేగా తుమ్హారే లియే!" (ఎవరైనా నీ హృదయాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోతే, అప్పుడు నా దగ్గరకు రా! నా హృదయం తలుపులు నీ కోసం తెరిచే వుంటాయి.) మనస్సును కదిలించి కలిచి, ఘనీభవించిన సున్నితత్వాన్ని కరిగించి....కళ్ళలో నీళ్ళు చేరుకోకూడదన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను. ఎవరు...ఎవరు సందర్శిస్తారు నా ఆర్తరావ హృదయ మందిరాన్ని?

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra