Home » Dr c. ananda ramam » Cheekati Kadupuna Kanthi

 

    మనసు చివుక్కుమంది రామచంద్రకు. తన చిలిపితనం చెయ్యబోయినప్పుదడు వారిజ సహితం వారించేది. కానీ ఆ మాటల్లో ఎంత మృదుత్వం? ఆ మోహంలో కనిపించేది విసుగు కాదు ఒక రకమయిన పారవశ్యం. పెదవులు వద్దంటోన్న సమయంలోనే కళ్ళు మరింత చిలిపిగా కవించేవి. చేక్కిళ్ళతో అరుణిమ మరింత బలంగా ఆహానించేది .చిరునవుతో తొణికిసలాడే చైతన్యం నిలువునా కుదిపేసేది. వారిజ వారింపు తన ఉద్రేకాలను ఇంక రెచ్చగొట్టేది. పెదవులతో వద్దంటూ వయ్యారంగా హేళనగా కదిలిన ఆమె తనువు కోటి గొంతులతో తనను పిలిచేది . తనలో ఆణువణువూ జలించేది.
    "ఏంటిది లతా! హాయిగా చిలిపిగా కవిస్తూ నవిస్తూ ఉండాలి కాని అలా విసుక్కోవచ్చా?"
    విసుగ్గా చూసింది లత.
    "నేనేమయినా భోగందాన్నా! ఆ వగాలన్నీ నాకు తెలిసేందుకు?" చురుక్కున తగిలింది రామచంద్రకు.
    వారిజ సమక్షంలో ప్రతిక్షణమూ ఒక అమృతపు గుళిక. తన కదలికలో , మాటలో , నవులో బెదిరింపులో , లాలనలో మాధుర్యపు పరమావధిని దర్శించజేయగలదు వారిజ. ఈ జగత్తునే మరిపింప చేయగల రసమయ లోకాల్లో తేల్చి వేయగలదు. అందుకు కారణం వారిజ. అయ్యో! అంతేనా? ఇది నిజమా?
    అకస్మాత్తుగా రామచంద్రకు రెండు రోజుల క్రిందట పొలంలో తను చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది. వీరన్న ఎవరూ లేకుండా చూసి రంగానాయికి పైట కొంగు పట్టి లాగాడు.
    "ఏటి మావా?" అంది కనుబొమలు ముడిచి, అంటూనే పకాలున నవింది.
    "ఏమిటో నువే చెప్పావు కదే!" అన్నాడు వీరన్న.
    "ఆ! చెప్పాను . ఇంకా చెప్తాను. రా!" అన్నది కళ్ళెర్ర జేసిందే కాని పెదవులు నవకుండా జాగ్రత్త పడటం మరిచిపోయింది. వీరన్న సమీపించాడు రంగానాయికిని.
    "చెప్పవే! చెప్పు గట్టిగా అరవకు. చెవులో చెప్పు" అంటూ దాని చెక్కిలి ముద్దు పెట్టుకున్నాడు.
    'ఛీ! ఛీ! అంటూనే అది హేలగా ముందుకు కదిలింది. ఆ కదలికలోనే రమ్మన్న పిలుపు వుంది. దానిని అందుకున్నాడు వీరన్న. మరి , రంగనాయికి?
    అశాంతితో వేగిపోతున్న మనసును ఏ విధంగా ఒదార్చుకోవాలో అర్ధం కావటం లేదు. రామచంద్రకు అసలు వారిజతో తనకు పరిచయం లేకుండా వుంటే ఇంత అశాంతి ఉండేది కాదేమో? లత ప్రవర్తన సహజంగా తోచి వుండేదేమో?
    తన కిది న్యాయం కాదు. లతను ప్రేమించాలి ఇంకా గాడంగా ప్రేమించాలి. ఆ ప్రేమలో ఇప్పుడు లోపాలుగా కనిపించే వన్నీ కొట్టుకుపోతాయి. తన ప్రేమ పొంగు లతలోనూ ప్రేమను అంకురింప జేస్తుంది.
    లత కాపురానికి రాకమునుపు వీరన్న కూడా రామచంద్ర ఇంట్లోనే ఉండేవాడు. కానీ లత వచ్చాక వీరన్న వేరే ఇల్లు తీసుకుని వుంటున్నాడు. పొలంలో కలుసుకోవటమే తప్ప, అంత తరచుగా రామచంద్ర ఇంటికి కూడా రావటం లేదు.
    చాలా రోజుల తరువాత తన ఇంటికి వచ్చిన వీరన్నను ఆప్యాయంగా ఆహ్వానించాడు రామచంద్ర. "ఏమిటి వీరన్నా! ఏం విశేషం, ఇలా వచ్చావు?" అన్నాడు వీరన్న కొంచెం సేపు ముసిముసిగా నవాడు.
    "ఏమిటి పెళ్ళి కొడుకులా సిగ్గుపడుతున్నావ్?" అన్నాడు రామచంద్ర నవుతూ.
    "అదే ! అదే బాబు! నేనూ రంగనాయికి పెళ్ళి చేసుకోబోతున్నాం. దానికీ ఎవరూ లేరు, నాకు ఎవరు లేరు. శాస్త్రులు గారు గుళ్ళో పెళ్ళి చేయిస్తానన్నారు. మీ చేతుల మీదుగానే జరగాలి మా పెళ్ళి. "సిగ్గుపడుతూ అన్నాడు వీరన్న.
    పట్టరాని సంతోషంతో వీరన్నని కౌగలించుకున్నాడు రామచంద్ర.
    "ఎంత మంచి కబురు తెచ్చావు వీరన్నా! నేను లేకుండా నీ పెళ్ళి ఎలా జరుగుతుంది? పెళ్ళి కొడుకు తరుపు పెద్దను నేనే? వియ్యంకుడి హోదా అనుభవిస్తాను. "వీరన్న ముఖం సంతోషంతో కృతజ్ఞతతో మెరిసింది." ఈ నెల ఇరవైయవ తేదీ ముహూర్తం నిర్ణయించారు శాస్త్రులు గారు."
    "ఇంకా పదిహేను రోజులుంది గదా! కావలసినంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకోవచ్చు"
    "మీరు నా ప్రక్కనే నిలబడడం కంటే గ్రేండ్ ఏం కావాలి బాబూ!"
    "పోరా! నేను నీ పక్కనుండక ఏమవుతాను? రంగానాయకికి ఏ రంగు ఇష్టమో కనుక్కో ఆ రంగులోనే పట్టు చీర కొందాం." ముసిముసి నవులు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వీరన్న. రంగనాయకికి, వీరన్నల వివాహ వార్త రామచంద్రకు కలిగించిన సంతోషం లతకు కలిగించలేదు.
    "ఆ! ఏముంది ఇందులో? పాలేరు కాపురాన్ని చేసుకుంటున్నాడు . మాములేగా!" అంది.
    'అలా కాదు లతా! వాడికి నేను తప్ప ఎవరూ లేరు. వాడు నా దగ్గిర పాలేరన్నమాటే గాని, ఒక రకంగా మేం స్నేహితులం. అన్నదమ్ముల్లా మసలు కొంటున్నాం. మనం దగ్గరుండి వాడి పెళ్ళి జరిపించాలి."
    'ఛీ! ఛీ! పాలేరు వాడి పెళ్ళికి నన్ను రమ్మంటారా? నా ఖర్మ కాళింది. నేను రాను."
    "లతా! నా కోసం...."
    "మీరూ , మీ స్నేహాలు! ఇలాంటి కూలి వెధవలు తప్ప మీకింకెవరూ స్నేహితులు దొరకరు కాబోలు!"
    'అలా మాట్లాడకు లతా@! పోనిలే ఈ ఒక్కసారికి రా."
    "ఎందుకు> తహిసీల్దార్ గారి భార్య మనింటికి స్వయంగా వచ్చి వాళ్ళబ్బాయి పుట్టిన రోజుకి రమ్మంది. నేను ఎంత బ్రతిమిలినా ఆనాడు మీరు వచ్చారా?"\
    'ఆడవాళ్ళ పేరంటానికి నేనెందుకు?"
    "మీ పొలంలో పాలేరు పెళ్ళికి నేనెందుకు?" ఊసురుమన్నాడు రామచంద్ర. ఇంక లతతో వాదించే ఓపిక లేకపోయింది. అసలు యుద్ధం రామచంద్ర రంగనాయకికి నూట యాభై రూపాయల పట్టు చీర కొనటంతో ప్రారంభమయింది.
    "కూలిదానికి ఇంత ఖరీదైన చీరా?" అంది ఉక్రోషంగా లత. రామచంద్రకు కూడా చాలా కోపం వచ్చింది.
    "కూలి దానికి కాదు........నా ఆత్మీయుడు వీరన్న భార్యకు."
    "మీరే చేస్తే అది మీకు మంచిది. నా స్నేహితురాలి కూతురు పుట్టిన రోజుకి ఇరవయి రూపాయలిచ్చి నైలాన్ గౌను కొన్నానని ఆరోజంతా సాధించారు. తలకు మించిన ఖర్చులు పెట్టకూడదని, లేనిపోని డాబులకు పోకూడదని, ఇంకా ఏమిటేమిటో . ఇవాళ మీరు నూట యాభై పెట్టి చీర కొన్నారు. పెళ్ళయ్యాక నాకయినా కొనలేదు. అంతమంచి చీర. అంతంత ఖర్చు పెడితే ఫరవాలేదు కదూ!"
    "నువు నీ స్నేహితురాలి కూతురు మీద ప్రేమతో కొనలేదు. ఆ గౌను. నలుగురిలో గొప్ప కోసం కొన్నావు. అలాంటి గొప్పలకు పోవద్దన్నాను. నేనూ, వీరన్నా అన్నదమ్ముల్లాంటి వాళ్ళమని చెప్పాను. అందుకు కొన్నాను."
    'అన్నదమ్ములు! ఎలా అవుతారు? ఈ కూలి వాళ్ళతో స్నేహాలే కాక బాంధవ్యాలు కూడానా? సాటి వాళ్ళలో చిన్నతనం కాకుండా ఉండటానికి నేనొక్క గౌను కొంటె అంత రాద్దాంతం . ఛీ! వెధవ బ్రతుకు! ఇవరయి రూపాయాలు స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోడానికి లేదు. పల్లెటూరు, మురికి వీధులు, మురికి మనుష్యులకు మురికి బ్రతుకు." నిర్ఘాంతపోయాడు రామచంద్ర.
    "మురికి బ్రతుకు" లతకు తన బతుకు మురికి బతుకులా వుందా? ఇంకొక్క మాట మాట్లాడలేదు రామచంద్ర. అతి ప్రయత్నం మీద ఎంతో ఓపికతో లత చుట్టూ రామచంద్ర అల్లుకోడానికి ప్రయత్నిస్తున్న ప్రేమ పాశాలన్నీ ఎప్పటి కప్పుడు తెగిపోతున్నాయి. మళ్ళీ వీరన్న లతను పెళ్ళికి రమ్మని అడగలేదు రామచంద్ర.
    కొత్త బట్టలు తీసుకుని ఒక్కడే గుళ్ళోకి వచ్చిన రామచంద్రను కొన్ని క్షణాలు ప్రశ్నార్ధకంగా చూశాడు వీరన్న రామచంద్రం తల వంచుకున్నాడు . వీరన్న ఇంకేమీ ప్రశ్నించలేదు. పసుపు బట్టల్తో తనకు నమస్కరించిన రంగానాయికీ, వీరన్న లను మనసారా అశేర్వదింఛి తను తెచ్చిన బట్టలు వీరన్న చేతిలో పెట్టాడు రామచంద్ర.

                                                    -------------

    "ఈ చీకట్లో అటు వెళ్ళకండి పురుగూ , పుట్రా ఉంటాయి.
    "ఎవరు ? వారిజ!' ఆశ్చర్యంగా అన్నాడు.
    "ఆ, అవును - నేనే!"
    "ఇక్కడుంటున్నావా?"
    "మీకు కనిపించటం లేదుగా, మీరే నాకు కనిపించారు. ఈ మారుమూల నిశ్శబ్దంలో కుర్చుని మిమ్మల్ని ధ్యానిస్తున్నాను. మీరు ప్రత్యక్షమయ్యారు. తపశ్శక్తి కల్పన అని ఎవరనగలరు?"
    "ఈ చీకట్లో నన్ను గుర్తుపట్టగలిగావా!"
    "సంపూర్ణమైన చీకటి ఎక్కడుంది అసలు? మిమ్మల్ని చూడాలని పరితపిస్తోన్న నా కళ్ళు ఈ చీకట్లో విలీనమైన కాంతి రేఖల సాయంతో నే మిమ్మల్ని చూడగలను."
    "ఇంతసేపు నిలబెట్టి మాట్లాడుతున్నావు- లోపలికి రామ్మనకూడదూ?"
    'అంత అదృష్టమా! నా ఇంట్లో అడుగు పెట్టారా?"
    చీకట్లో వారిజ ముఖ భావాలు స్పష్టంగా తెలియకపోయినా వారిజ కంఠంలో ధ్వనించిన సంతోషం సూటిగా రామచంద్ర హృదయాన్ని తాకింది.
    తనే వెళ్ళి ,లోపల కుర్చీలో కూర్చున్నాడు. విద్యుద్దీప కాంతిలో వారిజను చూశాడు. వెనుకటి కంటే కూడా బాగా చిక్కిపోయింది. ముఖం సదలిపోయింది. సాధారణమయిన నేతి చీర కట్టుకుంది. తలనిండా మల్లెలు, ఆ మల్లెల వంక చూస్తూ కూర్చున్నాడు రామచంద్ర. అతని చూపులు గమనించింది వారిజ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra