Home » Kommuri venugopala rao » ఈ దేశంలో ఒక భాగమిది

   

     కానీ ఈ అమ్మాయి అలాంటి సిగ్గునేమీ ప్రదర్శించటంలేదు. అట్లా అని అహం, నిర్లక్ష్యంలాంటివేమీ కూడా కనిపించటంలేదు. ఆమెలో అందంతో పాటు, సభ్యతా, సంస్కారాలు ఉట్టిపడుతున్నట్లుగా కనిపించాయి.
   
    అందరికీ నమస్కారంచేస్తూ రాజారావు వంకకూడా తిరిగి నమస్కారంచేసి మందహాసం చేసింది.
   
    రెండు నిముషాలు వాతావరణంలో స్తబ్దత ఏర్పడినట్లుగా అయిపోయింది.
   
    తర్వాత మళ్ళీ మామూలయిపోయింది. పెళ్ళికూతురి తండ్రి పూనాలో మిలిటరీ ఆఫీసరట. ఆయన తన ఉన్నత హృదయం అడుగడుక్కీ వ్యక్తమయేలా, అరమరికలు లేకుండా మాట్లాడసాగాడు. వాతావరణంలో మొదట ఆవరించిన మసకతనం పోయి ఒకరకమైన నిర్మలత్వం తాండవించసాగింది. కొంతసేపటికి రాధకూడా వచ్చి పెళ్ళికూతురి ప్రక్కన మరో కుర్చీలో కూర్చుంది.
   
    పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ మాట్లాడుకునే ఘట్టం వచ్చింది.
   
    రాజారావుకూడా ఎక్కువ బిడియపడలేదు.
   
    "మీరు చాలాకాలంగా ఆంద్రదేశం వదిలిపెట్టి ఢిల్లీ, పూనావంటి ఊళ్ళలో ఉంటూవచ్చారు కదా, ఇటువైపు సంబంధం చేసుకోవటం మీకిష్టమేనా?" అని అడిగాడు.
   
    "మాకు ప్రాంతీయ భేదం అంటూ ఏమీలేదు. అన్నివిధాల పరస్పరం అభిప్రాయాలు ఏకీభవిస్తే ఏ ప్రాంతంవారైనా ఒకటే. అయినా ఇంతవేగం వున్న ఈ రోజుల్లో దూరం, దగ్గర-ఈ తారతమ్యం అంతగాలేదు. మరో విషయం....నేను ఇక్కడ పుట్టి పెరిగినదాన్నే, ఉద్యోగరీత్యా డాడీ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళబట్టిగానీ, నా బాల్యమంతా ఇక్కడే గడిచింది" అన్నదా అమ్మాయి.
   
    "పెళ్ళయాక కూడా మీకు చదువు కొనసాగించాలని వుందా?"
   
    "అభిలాష వుంది. పట్టుదల ఏమీలేదు. పరిస్థితులు అనుకూలిస్తే కంటిన్యూ చేస్తాను. లేకపోతే అట్టే విచారించను."
   
   
    "పెళ్ళయాక మీ భర్త ఉద్యోగం చెయ్యమంటే చేస్తారా?"
   
    "చెయ్యమంటే, నా మనసుకు నచ్చిన ఉద్యోగమయితే చేస్తాను."
   
    "మరో విషయం....మీ గురించి నాకూ, నా గురించి మీకూ ఇంతవరకూ ఏమీ తెలియదు కదా? నా  అభిప్రాయాలు, అభిరుచులూ మీకూ తెలియవు. అలాగే మీ టేస్టుగురించి నాకు తెలియదు. తర్వాత ఒకరి అభిప్రాయలు మరొకరికి రుచించకపోతే ప్రమాదం కదా!"
   
    ఆమె చాలా హాయిగా నవ్వింది. నవ్వినప్పుడు ఆమె అందమైన, ఆరోగ్యమైన పలువరుస ఓ మెరుపు మెరిసినట్లుగా కనిపించింది. ఆమెలో ఏదో రిచ్ నెస్ వున్నట్లుగా అనిపించింది సుధాకర్ కు.
   
    "మన పద్దతిలో జరిగే వివాహాల్లో ఈమాత్రం రిస్క్ ఎప్పుడూ వుంటుంది. ఆ రిస్క్ తీస్కోవాలి తప్పదు. అయితే అభిప్రాయాలూ, అభిరుచులూ తర్వాత జీవితాన్ని అశాంతిపాలు చేసేటంత ప్రమాదంగా అన్ని సందర్భాలలోనూ వుంటాయంటారా? ఇతరుల హృదయంతో మనం ఆలోచించగలిగితే, ఎడ్జస్ట బిలిటీని అలవరుచుకుంటే చాలా సమస్యలు పరిష్కారమౌతాయనుకుంటాను."
   
    "క్షమించండి. ఎడ్జస్టబిలిటీ మీకుందా అని అడుగవచ్చా?"
   
    "తప్పకుండా. నా సంస్కారంమీద నాకు నమ్మకం వుంది."
   
    "నాకు కొద్దిరోజుల్లో ఫారిన్ వెళ్ళి బిజినెస్ కోర్సులో దేంట్లో అయినా కొంత కాలంపాటు ట్రయినింగ్ అవ్వాలని వుంది. ఒకవేళ వివాహమాడటం అంటూ జరిగితే ఫారిన్ రావడానికి మీకేమైనా అభ్యంతరమా?"
   
    "ఎంతమాత్రం లేదు. అయితే మీరు విదేశాలు వెళ్ళే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయో తెలుసుకోవచ్చా?"
   

    "నూటికి నూరుపాళ్ళూ వున్నాయి. అది నా చిరకాలవాంఛ నెరవేర్చుకునే స్తోమత వుంది పెద్దవాళ్ళ సహకారం వుంది."
   
    వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఏమాత్రం అపసవ్యంగా గానీ ఎబ్బెట్టుగా గానీ లేదు వింటానికి ఎంతో ముచ్చటగా మధురంగా వుంది.
       
    మాట్లాడుకోవటమైపోయింది. తర్వాత పెళ్ళికూతురు నమస్కారంచేసి లోపలకు వెళ్ళిపోయింది. ఆమెతోబాటు రాధకూడా లోపలకెళ్ళిపోయింది.
   
    కాసేపున్నాక అంతా లేచారు. రాజారావు తల్లీ, తండ్రీ వాళ్ళదగ్గర సెలవు తీసుకుని తమ కారులో ఎక్కారు. రాజారావు, సుధాకర్ ఫియట్ లో ఎక్కారు.
   
    కొన్ని నిముషాలపాటు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు.
   
    "నీ ఉద్దేశం ఏమిటి?" అనడిగాడు రాజారావు నెమ్మదిగా.
   
    "ముందు నీ ఉద్దేశం చెప్పు?....అసలు పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకున్నావా లేదా?"
   
    "అంటే?"
   
    "పెళ్ళి చేసుకోవాలని లేకపోతే అసలు అమ్మాయి నచ్చిందా నచ్చలేదా అన్న ప్రశ్నేలేదు. బ్లంట్ గా రెప్యూజ్ చేసెయ్యటమే. పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం వుంటే ఈ అమ్మాయిని చేసుకో ఇంతకంటే మంచి సంబంధం దొరకదు."
   
    "అదే, ఇప్పుడు సమస్యలో పడ్డాను" అంటూ రాజారావు ఆలోచనలో పడ్డాడు.
   
    ఇంతలో సుధాకర్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. రాజారావు కారు ఇంటిముందు ఆపాడు. సుధాకర్ కారుదిగి మరునాడు కలుసుకుంటానని చెప్పాడు. కారు వెళ్ళిపోయింది.
   
    బయటవున్నా స్ట్రీట్ లైట్ వెలుతురులో టైము చూసుకునేసరికి తొమ్మిది దాటిపోయింది. కాలింగ్ బెల్ నొక్కేసరికి ఎవరో వచ్చి తలుపు తీశారు. తీరా చూస్తే తండ్రి.
   
    మామూలుగా ఆయనకు తొందరగా పడుకోవటం అలవాటు. ఇవాళెందుకో నిద్రపోలేదు.
   
    "ఎక్కడకు వెళ్ళావు?" అనడిగాడు తండ్రి.
   
    "ఎక్కడకూ లేదు......" అన్నాడు సుధాకర్ లోపలకు వస్తూ చిన్నగా.
   
    "ఎక్కడకూ లేకపోవటమేమిటి? ఎక్కడికో పోయి వచ్చావుగా?"
   
    "అదే అలా పోయి వచ్చాను."
   
    "అదే ఎక్కడికి?"
   
    తండ్రితో ఈ వివరాలన్నీ చెప్పడానికి ఎలాగో వుంటుంది. ఆయనేమో గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. చెప్పకపోతే తను తండ్రిని ఎదిరించిన కొడుకు క్రిందవస్తాడు. ఆవిధేయుడి క్రింద వస్తాడు. అందులో తను జీవితంలో ఇంకా సెటిల్ అవ్వలేదు. తండ్రి సంపాదనమీద ఇంకా ఆధారపడివున్న వ్యక్తి.
   
    "స్నేహితుడితో వెళ్ళాను."
   
    "ఏ స్నేహితుడు?"
   
    "రాజారావు"
   
    "ఆ విషయం చెప్పడానికి ఇంత డొంకతిరుగుడు దేనికి? ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి ఆలస్యంగా రావటం ఓ తప్పు. సరియైన సమాధానం చెప్పకపోవటం ఒక తప్పు. చదువుల్లో లేకపోయినా, వీటిల్లో వున్నాయి తెలివి తేటలు. అప్పుడే ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేనంత పెద్దవాడివైపోయానను కుంటున్నావా?" అని చివాట్లు పెట్టి రంగారావుగారు అవతలి గదిలోకి వెళ్ళిపోయి అక్కడ ఇంకా ఏదో పాఠం చదువుతూనే వున్నారు.
   
    సుధాకర్ బట్టలు మార్చుకుని పైజామా, చొక్కావేసుకుని లోపలకు వెళ్ళే సరికి పెద్దన్నయ్యపిల్లలు ముగ్గురూ చాపలమీదపడి నిద్రలో దొర్లుతూ కనిపించారు. చిన్నవదిన గదిలో వున్నట్లుంది. కనిపించలేదు. చిన్నన్నయ్య ఇంటికింకా వచ్చివుండడు. లోపల డైనింగ్ టేబుల్ దగ్గర పెద్దన్నయ్యా, అతని బావమరిదీ భోంచేస్తుంటే పెద్ద వదిన వడ్డిస్తూ కనిపించారు.
   
    అన్నయ్యను చూస్తే అతనికి జాలేసింది. అతనికి ఒంటరిగా కూర్చుని కాలం గడపటం, ఒంటరిగా కూర్చుని భోంచెయ్యటం అలవాటు. ఈ బావమరిది వచ్చి ఇంట్లో వుంటేవున్నాడు. అతన్ని ఇబ్బంది పెట్టకుండా తన మానాన తను ఉండకూడదూ? అన్నయ్యతో కాఫీ త్రాగటం, అన్నయ్యతో టిఫిన్ తీసుకోవటం, అన్నయ్యతో భోంచెయ్యటం - ఎంత న్యూసెన్స్ చెయ్యాలో అంతా చేసేస్తున్నాడు.
   
    అన్నయ్య భోజనం అయిపోయినట్లుంది. ఆ బావమరిది ఇంకా పచ్చడన్నం కూడా పూర్తిచెయ్యకుండా ఊకదంపుడు కొడుతున్నాడు.

    అతన్ని చూస్తే అసహ్యమేసింది సుధాకర్ కి.
   
    మరిదిని చూసి ప్రభావతి "రావయ్యా రా! నీక్కూడా అన్నం పెట్టేస్తాను" అంది చిరునవ్వు ముఖంతో.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra