Home » Yerramsetti sai » Nee Kalala Bandheeni


    సీత ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి చాలాసేపు పట్టింది. అతనికేం జవాబు చెప్పాలో తెలీలేదు. నవల రాయడానికి తను సిద్దంగానే వుంది. కాని అతను ఎంత డబ్బు ఇవ్వాలనుకొంటున్నాడో ఎలా తెలుసుకోవడం? ఇదే పబ్లిషరు అయినట్లయితే ఎలా మాట్లాడాలో తనకు తెలుసు. కానీ ఇతనో పత్రిక యజమాని. అదీగాక తన అభిమాని అట! మరిక్కడ మొఖమాటం అడ్డువస్తుంది, ఆ విషయం అడగాలంటే!
    'సరే! ప్రయత్నిస్తాను ......అందామె తేల్చకుండా.
    "థాంక్యూ! నాకు తెలుసు మీరు తప్పక సహకరిస్తారని" జేబులోంచి చెక్ బుక్ తీసి ఓ చెక్కు మీద సంతకం పెట్టి మొత్తం రాయకుండా ఇచ్చాడతను.
    ఇది మరీ ఆశ్చర్యం కలిగించింది సీతకి.
    "మీకు ఎంత కావాలో ఆ సంఖ్య మీరే వేసుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు" నవ్వుతూ అన్నాడతను.  
    సీత అయోమయంలో తలూపింది.
    అతను మరోసారి ధన్యవాదాలు తెలుపుకొని వెళ్ళిపోయాడు.
    ఆ చెక్కు మీద ఎంత వేసుకోవాలో ఒపట్టాన తేలలేదామేకి. మాధవరావు ఇంటికొచ్చాక అడిగి నిర్ణయించుకోవొచ్చని అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. చాలా పొద్దుపోయాక గాని మాధవరావు ఇల్లు చేరలేదు.
    "ఇవాళో శుభవార్త మోసుకొచ్చాను" అన్నాడతను ఇంటికొస్తూనే.
    "ఏమిటది?" విస్మయంతో అడిగింది సీత.
    మా కంపెనీ వచ్చే సోమవారం నుంచి తెరుస్తున్నారు మళ్ళీ!
    "నిజంగానా?" నమ్మలేనట్లు అడిగిందామె.
    "అవును! ఇప్పటివరకూ అందుకే ఆలస్యమయింది. వర్కర్లూ, కంపెనీ చివరకు ఓ ఒప్పందానికి వచ్చారు"
    'అమ్మయ్యా. పెద్ద బరువు దిగిపోయినట్లుంది" ఆనందంగా అంది సీత.
    "ఇక నీ యిష్టం! నీ డబ్బుతో నీక్కావాలనుకొన్నవన్నికొనేనుకోవచ్చు. ఇంట్లో ఖర్చు ఎలాగూ నేను చూసుకొంటానుగా"అన్నాడతను.
    "అదలా వుంచండి మీరూ నేను మరో మంచివార్త చెప్తాను" అందామె.
    "ఏమిటది"
    "ఇదిగో....." బ్లాంక్ చెక్ అతనికి చూపించిందామే.
    అందుకొని ఎగాదిగా చూశాడతను.
    "ఎవరిది?"
    "తను ప్రారంభించబోయే ప్రతికకు సీరియల్ రాయడానికి?
    మరి అందులో ఎంత ఇచ్చేది వేయలేదు!"
    "వేస్తె ఇందులో ఆశ్చర్యమేముందీ? నా యిష్టం వచ్చినంత వేసుకోమన్నాడు"
    ఈసారి మాధవరావు తెల్లపోయాడు.
    "అంటే?"
    "అదే మనం నిర్ణయించుకోవాలిప్పుడు ఎంత తీసుకొందామంటారు?"
    మాధవరావు కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు.
    మొదటిసారిగా అతనికి భయం వేసింది. సీత రూపం రచయిత్రిగా వెయ్యి తలై తనముందు నిలబడ్డట్టు కనిపించింది. సీత భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉన్నదనడానికి "ఈ చెక్కే నిదర్శనం. ఆమె మరికొన్ని రోజుల్లో ఎంతో ఎట్టు ఎదిగిపోవడం ఖాయం . ఈమె చుట్టూ అభిమానులూ, పత్రికాధిపతులు, పబ్లిషర్లూ మూగిపోతారు. తనకూ ఆమెకూ మధ్య పలుచని గోడ కట్టేస్తారు. అప్పుడు మరి తామిద్దరి మధ్యా ఇదే విధమయిన సంబంధ భాంధవ్యాలుంటాయా!ఏమో వుండవచ్చు, వుండక పోవచ్చు . కాని తనకు నమ్మకముంది సీత తన విషయంలో మాత్రం ఎప్పటిలాగానే ఉంటుంది. మారదు.
    ఆమెను హటాత్తుగా దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకున్నాడతను.
    "సీతా ఈ బ్యాంక్ చెక్కు కి అర్ధం ఏమిటో తెలుసా? నువ్వు ఎదిగిపోతున్నావు ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నావు . నీ భవిష్యత్తు మహోజ్వలంగా పెరిగిపోతుంది!" సీత అతని గుండెల మీద ప్రేమగా చుంబించింది.
    "రాయి సీతా మొఖమాటపడకు అవతలివాడు బాధపదతాడేమోనని ఆలోచించకు . మూడు వేలు రాయి చెక్కుమీద . ఇహ ఎంతో కాలం కలల్లో వివరించకు నీ కోరికలకు కళ్ళాలు తీసెయ్యి మనసు పడ్డ వస్తువుల్లా స్వంతం చేసుకో జీవితాన్ని అనుభవించు ఇలాంటి అవకాశం అందరికీ ఇవ్వడు దేముడు. నీకిచ్చాడు కనుక సద్వినియోగం చేసుకో" ఆవేశంగా అన్నాడతను.
    సీత విస్తుపోయిందతని ఆవేశం చూసి.
    "అవును సీతా, ఇవి నేను ఆవేశంలో మాట్లాడుతున్న మాటలే కావచ్చు కాని ఆలోచించే మాట్లాడుతున్నాను. ఇంక నువ్వేమీ ఆలోచించకు నేను చెప్పినట్లు చేసేయ్ నీ ఇష్టాలనీ కోర్కెల్నీ తీర్చే సామర్ధ్యం ఎలాగూ నాకు లేదు కనీసం నువ్వయినా నీ గురించి చూసుకో ఇంతకంటే ఇంక నేనేమీ చెప్పలేను."
    సీత ఆనందంగా అతని కళ్ళలోకి చూస్తుండిపోయింది.
    ఆ ఆదివారం రెడ్డి, సుభాషిణి వచ్చారు వాళ్ళింటికి. ఇంట్లో కొత్తగా వెలసిన డేకోలం మంచాలూ, వాటిమీద యూఫామ్ పరుపులూ , అందమయిన దుప్పట్లూ చూస్తూనే ఆశ్చర్యపోయారిద్దరూ.
    'అరె ఇవన్నీ ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి.
    "సీత కోరికలకు ప్రాణలోచ్చాయి" నవ్వుతూ అన్నాడు మాధవరావు.
    సీత సిగ్గుపడిపోయింది.
    "అయితే స్కూలు మీద సంపాదన బాగానే ఉందన్న మాట" నవ్వుతూ అంది సుభాషిణి. సీతకు ఉక్రోషం ముంచుకొచ్చింది. ఆమాటతో తామిద్దరూ కేవలం ఆ స్కూలు మీదే ఆధారపడి బ్రతుకుతున్నారను కొంటున్నారు కాబోలు. వాళ్ళ రెండు వేలూ వాళ్లకిచ్చేస్తే కాని కొంతవరకూ ఆభావన పోదు అనిపించిందామెకి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra