Home » Yerramsetti sai » 420 Mega City


                                బాల ప్రేమకథ
    మా కాలనీ వాళ్ళకు రకరకాల పైత్యాలున్నాయి. హైదరాబాద్ లో ప్రతి వీధిలో ఒక సాంస్కృతిక సంస్థ వుండడం, వాళ్ళు సంవత్సరానికి ఆరుసార్లు సినిమా అవార్డులు, టీ.వీ. అవార్డులు ప్రకటించి రవీంద్రభారతిలోనో లేక ఇతర థియేటర్లలోనో బహుమతుల ప్రదానోత్సవం జరపడం. అక్కడితో ఆగక ఆ కార్యక్రమాన్ని వీడియో తీసి దూరదర్శన్ లో చూపించడం ఆనవాయితీ అయిపోయింది.
    మా కాలనీవాళ్ళు కూడా సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం వల్ల గత్యంతరం లేక సమావేశం ఏర్పాటు చేశాం.
    "ఉత్తమ చిత్రంగా ఏది సెలెక్టు చేద్దామంటారో సూచిస్తే మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి ఆ చిత్రాన్ని ఎంపిక చేద్దాం!" అన్నాడు సాయిరామ్.
    "చామంతి మొగ్గ" అంటూ అరిచారు స్టూడెంట్స్ ఏకగ్రీవంగా.
    "మేము ఆనందంగా తప్పట్లు కొట్టాం!"
    "అదేమిటి? ఆ సినిమాలో ఏం గొప్పతనముందని?" అడిగింది పార్వతీదేవి కోపంగా.
    "లేకపోవడమేమిటి సినిమా చరిత్రలో మొదటిసారి పదేళ్ళ కుర్రాడు, తొమ్మిదేళ్ళ పిల్ల మధ్య అద్భుతమయిన రొమాన్స్ చూపించారు. వాళ్ళ ప్రేమను ఈ చెత్త సమాజంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హర్షించక, అడ్డంకులు ఏర్పరుస్తారు- వాటినన్నిటినీ అధిగమించి ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి అడవిలో పెళ్ళి చేసుకుని కాపురం పెడతారు. ఎంత చక్కని మెసేజ్ వుందందులో" అన్నాడు రంగారెడ్డి.
    సావిత్రమ్మ కోపంగా లేచి నిలబడింది.
    "ఆ సినిమా వల్ల ప్రజలకు చెప్పే నీతి ఏముంది?"
    "లేకపోవడమేమిటి? పదేళ్ళకే ప్రేమించుకుని లేచిపోండి౧ పెద్దలనూ, సమాజాన్నీ లెక్కచేయకండి! అనే చక్కని నీతి లేదూ?" అడిగాడు రంగారెడ్డి.
    "అవునూ! నీతి వుంది! హియర్ హియర్" అంటూ అరిచారు స్టూడెంట్స్.
    "రంగారెడ్డి జిందాబాద్! సావిత్రమ్మ డౌన్ డౌన్" అని కూడా కొంతమంది అరిచారు. అందులో సావిత్రమ్మ భర్త కూడా వుండడం నేను చూశాను.
    "ఏమిటా బోడి నీతి- పదేళ్ళ పిల్లలను ప్రేమించుకుని రోడ్డున పడమనడం ఒక నీతా? మీకేమయినా బుద్ధుందా అసలు? పిల్లలకు స్పోర్ట్స్, గేమ్స్, మ్యూజిక్, డాన్స్ లాంటి వాటిలో అభిరుచి కలిగించే సినిమాలు మంచివా, పదేళ్ళకే సెక్స్ పాఠాలు నేర్పించే ప్రాక్టికల్స్ కోసం అడవులకు పారిపోమనడం మంచిదా?" విరుచుకుపడింది రాజేశ్వరి.
    "ఇదిగో చూడమ్మా! ప్రేమకు ఒక వయసంటూ లేదు. మొదట్లో ఇరవైఏళ్ళ వాళ్ళు ప్రేమించుకోవడం చూపించారు. ఆ మధ్య టీనేజ్ వాళ్ళు ప్రేమలు చూపించారు, ఇప్పుడు పదేళ్ళ పిల్లల ప్రేమ చూపిస్తున్నారు. రేపు అయిదారేళ్ళ పిల్లలే ప్రేమించుకుని పెద్దలనెదిరించి ఇంట్లో నుంచి పారిపోవడం చూపిస్తారు. నాగరికత అభివృద్ధిచెందుతోంటే మనం దానితోపాటు ముందుకి వెళ్ళాలి కదా!" నచ్చజెప్పబోయాడు రంగారెడ్డి.
    "నాన్సెన్స్! మరీ సినిమాని ఉత్తమ చిత్రం అంటే మా లేడీస్ అందరూ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీస్తాం! ఇలాంటి సినిమాలను బాన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరతాం" అంది సావిత్రమ్మ ఆవేశంగా.
    అందరూ ఘొల్లున నవ్వారు.
    సావిత్రమ్మ భర్తమాత్రం కిందపడి మరీ విరగబడి నవ్వడం మొదలుపెట్టాడు. సావిత్రమ్మకు అతనిని చూసేసరికి ఒళ్ళు మండిపోయింది.
    "ఏమిటా పిచ్చి నవ్వు?" అంటూ దబాయించిందతనిని.
    "పిచ్చి నాది కాదే! నీది! ప్రభుత్వమే ఆ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డ్ ఇచ్చిందే. నిన్నే ప్రకటించారు. అదిగాక మన జంట నగరాల్లో మూడు వందల ఎనభై సాంస్కృతిక సంస్థలు ఆ చిత్రంలో నటీనటులకు, డైరెక్టర్ కీ, నిర్మాతకూ అవార్డులు ఇచ్చి సన్మానాలు చేసి దూరదర్శన్ లో చూపించారు."
    "దిసీజ్ టూమచ్! గవర్నమెంటే ఇలాంటి అసహజ చిత్రాలకు అవార్డులిస్తే ఇంక దేశం గతేమిటి?" కోపంగా అంది సుష్మ.
    ఆ మాటతో అందరికీ తిక్కరేగిపోయింది. స్టూడెంట్స్ అంతా ఆమె మీద విరుచుకుపడ్డారు.
    "ఏమిటి- ఇందాకట్నుంచీ ఊరుకుంటూంటే తెగ రెచ్చిపోతున్నారు? ఇది అసహజమైన చిత్రం అంటారేమిటి? ప్రభుత్వం నడిపే అనేక స్కూళ్ళ హాస్టల్స్ లో పదేళ్ళ ఆడపిల్లలను ఆ స్కూల్ మాస్టర్లు ఒకేగదిలో పక్కలు వేసుకుని పడుకుంటున్నారని పేపర్లో చదవడం లేదూ? ఆ హాస్టల్ వార్డన్ లు ఆ బాలికలతో సెక్స్ వ్యాపారం చేస్తున్నారని మొన్నేగా వ్రాశారు? ఇలాంటి సన్నివేశాలనే కొంచెం రొమాంటిక్ గా చూపించారా సినిమాలో! ఇంక నేచురాలంటీ లేదంటారేమిటి?"
    సుష్మ జవాబు చెప్పలేక మొహం ఎర్రగా చేసుకుని సహాయం కోసం సావిత్రమ్మ వేపు చూసింది.
    సావిత్రమ్మ రోషంగా లేచి నిలబడింది. "ఇలాంటి చెత్త సినిమాల వల్ల దమ్మిడీ ఉపయోగం లేదు. ఒక్క ఉపయోగం ఉందేమో చెప్పండి చూద్దాం!"
    రంగారెడ్డి కోపంగా లేచి నిలబడ్డాడు.
    "లేకపోవడమేమిటి? ఇలాంటి సినిమాల్లో లేచిపోయిన ప్రేయసీ ప్రియులు అడవుల్లో కాపురం పెట్టినప్పుడు మరి ఆ పిల్ల గర్భవతి అవుతుంది కదా! అయితే తనంతటతానే ఏ డాక్టర్, నర్స్ సహాయం లేకుండా బిడ్డను ప్రసవిస్తుంది. అది మరి ఆ ఏజ్ గ్రూప్ లో ఆడపిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ కదా! మొన్న కరీంనగర్ ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో పధ్నాలుగేళ్ళ పిల్ల ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కీ, వార్డెన్ కీ కూడా తెలీకుండా పాపాయిని కనేసిన సంగతి మీకూ తెలుసు కదా! మరి అదంతా ఇలాంటి అద్భుతమైన చిత్రాల వల్ల వచ్చిన ఎడ్యుకేషనేకదా!" అన్నాడు తను ఆవేశంగా.
    మళ్ళీ స్టూడెంట్సందరూ తప్పట్లు కొట్టి ఆడాళ్ళను ఎద్దేవా చేశారు.
    ఆడాళ్ళకు కోపమొచ్చి మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు.
    దాంతో అందరూ కేకలు మొదలుపెట్టారు.
    చిన్నపిల్లల సెక్స్ సినిమాలూ జిందాబాద్.
    వాటికి ఆవార్డ్ లిచ్చి ప్రోత్సహించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిందాబాద్.
    సావిత్రమ్మా - డౌన్ డౌన్
    మా కాలనీ రచయిత చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ గురించి మీరు వినే వుంటారు. అతను ఈ మధ్య కొన్ని భూతు నవలలు రాశాడు గానీ అవి ఎవరూ పబ్లిష్ చేసుకోడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే బూతు రాయడానికి వేరే రచయితలవసరం లేదనీ, ఎవరికి వాళ్ళే రాసుకోగలమనీ అన్నారట పబ్లిషర్లు.
    అతను ఆ నవలల వ్రాతప్రతులన్నీ మా దగ్గరకు తీసుకొచ్చాడు విచారంగా. వాటినెలాగయినా పబ్లిష్ చేసే మార్గం చెప్పమని బ్రతిమాలాడు.
    వెంటనే అతని నవల మాన్యు స్క్రిప్ట్ తీసుకుని అందరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దగ్గరకు చేరుకున్నాం. చాలాసేపు వెయిట్ చేశాక ఇంటర్వ్యూ దొరికింది మాకు.
    "ఏం కావాలి?" అడిగాడాయన.
    మా కాలనీ రచయిత బ్రహ్మాండమైన బూతు నవలలు రాశాడు. ప్రతి వాక్యంలోనూ పచ్చి సెక్స్, ప్రతి మాటలోనూ బూతు అర్థం. మంచి అర్థం భలే బాగా రాశాడు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ నవలలన్నీ పబ్లిష్ చేసేందుకు మూడు లక్షల రూపాయల సబ్సిడీ, టాక్స్ రిబేట్ ఇవ్వాలని కోరడానికి వచ్చాం! ఆ పుస్తకాలన్నీ మన రాష్ట్రంలోనే ప్రింట్ చేయిస్తాం!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra