Home » Kommuri venugopala rao » Pasupu Kumkuma


                                           10

    జీవితంలో కొందరు వ్యక్తులు ప్రాబల్యంవుంటుంది. అమితశక్తి సంపన్నంగా హఠాత్తుగా ఎక్కడినుంచో ఊడిపడ్డట్లు జొరబడతారు. ఇహ వాళ్ళనుంచి తప్పించుకునే వీలుండదు. ఊపిరాడదు, వాళ్ళను అనుక్షణం అసహ్యించుకుంటూనే నిరంతరం భరించాల్సి వస్తూ వుంటుంది.

    మాలతిపాలిట శంకర్ అట్లా అయినాడు. అతన్నిచూస్తే ఆమెకు కంపరం. అతన్ని చూస్తే ఆమెకు ఒళ్ళుమంట. అతని ఉనికి ప్రాణసంకటం.

    కానీ శేఖర్ కు అతను ప్రాణం.

    శంకర్ లో ఇంకో గుణంకూడా వుంది. "ఇది నీది, ఇది నాది" అనే తారతమ్యం అతనికి లేదు. అన్ని వస్తువులూ తీసుకుని స్వంతంగా వాడేసుకుంటూ వుంటాడు. అన్ని గదుల్లోకీ నిస్సంకోచంగా వెళ్ళిపోతాడు. మాలతి వంటచేస్తూ వుంటే వంటింట్లోకి వెళ్ళి మహాస్నేహం వున్నట్లు ఆమెను పలకరిస్తూ వుంటాడు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ వుంటే తనూ వెళ్ళి జోక్యం చేసుకుంటూ వుంటాడు. అతను తమతో భోజనం చెయ్యటం మాలతికి సుతరామూ ఇష్టంలేదు. అయినా ఎక్కడికి వెళ్ళినా, ఆ టైముకల్లా పిలిచినట్లు సిద్ధమై ప్రక్కనే కుర్చీ లాక్కుంటాడు.

    మాలతి ఈ విషయాలు రెండుమూడుసార్లు ప్రస్తావించింది శేఖరుతో. అతను తేలిగ్గా కొట్టిపారేసి "వాడికి కల్మషంలేదు. అందుకే అలా ప్రవర్తిస్తాడు" అన్నాడు.

    తనకూ భర్తకూ మధ్యగల "దాంపత్యం"లో సున్నితమైన పొర ఇంకా అడ్డునిలిచే వుంది. అయినా శంకర్ అదేం అర్ధంకానట్లు ప్రవర్తిస్తాడు.

    ఒకసారి శేఖర్ స్నానం చేస్తున్నప్పుడు శంకర్ హాల్లోకి వచ్చి రేడియో ఆన్ చేశాడు. ఆ సమయానికి రేడియోలో ఓ సినిమాపాట వస్తోంది. అందులో పచ్చి శృంగారం - గుండెల్లో చొరబడి కవ్వించేదిగా వుంది. శంకర్ ఆపాట వింటూ తన్మయుడయినట్లుగా కళ్ళు సగం మూసుకుని నిలబడ్డాడు.

    లోపల్నుంచి మాలతి విసురుగా వచ్చి రేడియో ఆఫ్ చేసింది.

    శంకర్ తెల్లబోయినట్లు "అదేమిటి, పాట ఆపేశారేం?" అన్నాడు.

    "ఈ ఇంట్లో ఇలాంటి పాటలు వినబడటానికి వీల్లేదు."

    "ఏం?"

    "కారణం మీకు తెలుసు."

    "పాటవింటే జీవితం దగా చేస్తుందా?"

    "కాదు, ఎత్తి పొడుస్తూంది."

    శంకర్ తేలిగ్గా నవ్వేశాడు. "మీరు పొడిచినట్లు మాట్లాడతారు" అని "అన్నట్లు ఇవేళ మినిస్టర్ గార్ని కలుసుకునేందుకు వెడుతున్నాను ఒక పెద్ద టెండర్ సాధించటానికి. అందుకని ఈ డ్రెస్ వేసుకున్నాను. అవునూ! ఈ డ్రెస్ బాగుందా?" మాలతికి ఒళ్ళంతా దహించుకుపోయినట్లయింది. "ఏమిటండీ మీరనేది?"

    శంకర్ మళ్ళీ బిగ్గరగా నవ్వేశాడు. "అవునూ! మిమ్మల్నీ విషయం అడగాలనుకుంటున్నాను."

    "అలాటివేమయినా వుంటే వారు వుండగా అడగండి."

    "కాదు శేఖర్ వుండగా అడగలేను. వాడూ, నేనూ ఎంత ప్రాణస్నేహితులమో ఈ పాటికి అర్ధమయేవుంటుంది. అయినా మా ఇద్దరి మధ్యా కొన్ని ఇబ్బందులున్నాయి."

    మాలతికి ఈ సంభాషణంతా చాలా అసహనంగా వుంది. "ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు మీరు?"

    "చెప్పక తప్పదు కాబట్టి. చూడండి, మీకేం అపకారం చేశాను? వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాను. నన్ను చూస్తూనే ఎందుకింత మండిపడుతున్నారు మీరు? దాచటానికి ప్రయత్నించకండి. నన్ను చూసినప్పుడల్లా మీలోని అశాంతి ప్రతి సంభాషణలోనూ, సంఘటనలోను   నన్ను దూరం చెయ్యాలని ప్రయత్నం - ఇది నేను....."

    "సహించలేకుండా వున్నారా? నిజం చెప్పమన్నారా? కొంతమంది నాకు నచ్చరు."

    "నేను మీకు నచ్చలేదా?"

    మాలతి త్రుళ్ళిపడినట్లయింది.

    "శంకరంగారూ! ఏ ప్రసక్తి అయితే మన ఇద్దరిమధ్యా రాకూడదనుకున్నానో అది వచ్చేసింది. నాకు తెలియకుండానే మనుషులను చదవటం నేర్పింది అనుభవం - మొగవాడు ఎంత తలక్రిందులయితేగానీ అర్ధం చేసుకోలేనిది, ఆడది ఒకచూపుతో, ఒకమాటలో, ఒక పరిశీలనతో గ్రహిస్తుంది. మా పరిస్ధితి మాకే విపరీతంగా వున్నప్పుడు మీరిక్కడ దాపరించడం దురదృష్టకరం...."

    "మాలతీగారూ!"

    ఆశ్చర్యం నటించకండి శంకరంగారూ! మీరు నటులని నాకు తెలుసు. మీ అందంగురించి మీకు చాలా ధీమా. నా ప్రతి కదలికనూ మీ కళ్ళు పసిగడుతున్నాయని నాకు తెలుసు."

    "నా శరీరం చిల్లులు పడుతుందని గ్రహించలేననుకున్నారా? శేఖర్ కు ప్రాణస్నేహితులు, అతని సంసారంలో మీరడుగుపెట్టి కల్లోలం రేపటానికి ప్రయత్నిస్తున్నారు..."

    "మీరు నన్ను అపార్ధం చేసుకుంటున్నారు మాలతిగారూ!"

    "మనుషుల పెదాలనుంచి చాలా తేలికగా వచ్చేమాట! అవసరం వున్నా లేకపోయినా కల్పించుకుని నాతో మాటలు పెంచే మీ తాపత్రయం గమనించకపోలేదు. టేబిలుమీద ఎవరినుద్దేశించో రాసినట్లు ఆవేశాన్ని విరజిమ్ముతూ మీరు రాసిపెట్టిన గేయం, నాకర్ధం కాలేదనుకున్నారా?.....అదలా వుంచి నా ఫోటో మీ ఉత్తరంలోకెలా వచ్చింది?"

    శంకర్ ముఖం వాలిపోయింది. "ఆ ఫోటో మీరు చూశారా?"

    మాలతి ఉద్రేకాన్ని నిగ్రహించుకుంటోంది. "శేఖర్ గారు మీకు ప్రాణస్నేహితులు కదూ? ఇలా ప్రవర్తించడమేనా మీ సంస్కారం?"

    శంకర్ బలవంతంగా నవ్వాడు. "ఒక్కోసారి సంస్కారాన్ని మించి వుంటుంది బలహీనతలోని బలం. దుర్మర్గపుటాలోచనలు చేసినంతమాత్రాన దుర్మార్గాలు చేయగలరనుకోకండి......"

    "చేయనక్కరలేదు, ఆలోచనలు చాలు మనుషుల్ని కాల్చడానికి."

    శంకర్ ముఖంలోకి గంభీరత్వం వచ్చింది. "ఆలోచనలు ఆపటం ఎవరితరం మాలతిగారూ? పవిత్రంగా జీవించే ప్రతివారికీ ఆలోచనలుకూడా పవిత్రంగా వుంటాయనుకోండి. కొందరు అపూర్వ వ్యక్తులుంటారు. వాళ్ళని దర్శించే కొన్ని అపురూప క్షణాలుంటాయి. అతిదాహం అనేదాన్ని మరచిపోయేటట్లు చేస్తాయి కానీ దానివెనుక మహా సంఘర్షణ వుంటుందని మరచిపోకండి."                         

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra