Home » Yandamuri veerendranath » Anaithikam


    "నా భార్య డైనమిక్ గా, చలాకీగా, తెలివితేటలతో నన్ను ఛాలెంజ్ చేస్తూ, అదే సమయంలో .... కాస్తంత అమయాకంగా- అంటే పెదవులమీద ముద్దు పెట్టుకుంటారన్న విషయం కూడా తెలియనంత పసిమనస్సుతో వుండాలని నేననుకున్నాను. వాస్తవం నన్ను వెక్కిరించింది. ఆ అమ్మాయి చాలా బీదరికం నుండి వచ్చింది. నేను చూసిన మొదటిరోజు బాగానే వుంది. తెలివైన అమ్మాయేననుకున్నాను. ఇంకాస్త చదివించి, ఆ పల్లెటూరితనాన్ని పోగొట్టవచ్చు ననుకున్నాను. మనమెలా వాళ్ళలా మారలేమో, వాళ్ళూ మనలా మారలేరనే తర్కం నాకు ఆ వయసులో తట్టలేదు. మొదట్లో యిలాకాదు, అలా అని చెప్పేవాడిని. ఆవిడకి నేనంటే వున్నది ప్రేమకాదు, గౌరవం కన్నా మరో మెట్టు పైనే! విపరీతమైన భక్తి!! నా కొకోసారి భయమేస్తుంటుంది. ఎప్పుడైనా చిరాకులో "వెళ్లి "గంగలో దూకు!" అని తిట్టానంటే, నిజంగానే ట్రైన్ ఎక్కి గంగదాకా వెళ్ళి దూకుతుందేమోనని. దాన్ని అమాయకత్వంగా సరిపెట్టుకుందామనుకున్నాను. కానీ ఎంత కాలం అలా? ఓసారి నేను ఇన్సూరెన్సు పాలసీ ఫారం పూర్తిచేస్తుంటే, అదేమిటని అడిగింది. చెప్పాను. వెంటనే ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. బుజ్జగిమ్హి అడిగితే అప్పుడు చెప్పింది- "మీరే లేనప్పుడు మీవల్ల వచ్చే డబ్బు మాత్రం ఎందుకండీ?" అని. "ఇన్సూరెన్స్ అంటే వ్యక్తి మరణానంతరం అతని కుటుంబసభ్యులకి రక్షణ అని టీ.వీ.లో చూశాను. మీరలా ఆలోచించకండి. తథాస్తు దేవత లుంటారు" అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అసలు సంగతి అర్థమయ్యేటట్లు చెప్పేసరికి నా తలప్రాణం తోక కొచ్చింది. ఆ రోజే నాకో సంగతి తెలిసింది. నేను చాలా కష్టపడాలని! నేను కావాలనుకునే స్థాయికి ఆవిడని తీసుకురావాలంటే ఆవిడకంటే ఎక్కువ నేను శ్రమపడాలని! అది ఇప్పటికీ, ఆవిడ సహకారం ఏమాత్రం లభించినా, నిజం చేసుకునే వాడినేమో. ఏం చెప్పినా, "అయ్యో! నాకలవాటు లేదండీ!" అనో, "ఛ! నా కెందుకండీ అలాంటివన్నీ!" అనో నన్ను నిరుత్సాహపరుస్తుంది. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే అంత బీదరికంనుంచి వచ్చిన ఆమెకి కూడా నేను సంపాదించిన డబ్బు సరిపోదు. "ఈ కార్లూ, ఇళ్ళూ లేకపోయినా నేను బతగ్గలను!" అంటుంది. మరోవైపు 'మీరింత కష్టపడటం ఎందుకు? అందరి లాగా పదినుంచి అయిదింటిదాకా ఆఫీసు పని చేసి హాయిగా వుండచ్చు కదా!' అంటుంది. భార్యచేత- తన కష్టమూ, తెలివితేటలూ, గుర్తింపబడని మగవాడికన్నా దురదృష్టవంతుడు ఇంకొకరు వుండరనుకుంటాను".

 

    అతడు కొనసాగించాడు- "తను కూడా నాపట్ల సంతృప్తిగా లేదు. దానికి తార్కాణం మన ఇంట్లో మొదట్లో కంటే ఇప్పుడు ఎక్కువగా జరిగే పూజలూ, పునస్కారాలే. నేను వ్యాపారంతో ఎస్కేప్ అయినట్లు, తను భక్తితో ఎస్కేప్ అవుతోంది. ఉపవాసాలయితే లెక్కలేదు. అన్నీ నా ఆయుష్షు కోసమే నంటుంది. ఆయుక్షేమం తప్ప నా ఆనందం కోసం ఏం చెయ్యాల్లో తెలుసుకోదు!" ఆగాడు.

 

    "ఎన్నోసార్లు చదువుకోమన్నాను. మంచి మంచి పుస్తకాలు తెచ్చి పెట్టాను. ఏళ్ళు గడిచినా ఆ పుస్తకం అట్టకూడా నలగదు. 'ఈ వయసులో నాకు చదువెందుకండీ? ఏదో మీ సేవలో గడిచిపోతే సార్థకత లభించిందనుకుంటాను' అంటుంది. ఆ సిన్సియారిటీకి నా కొకసారి జాలి కలుగుతుంది. కానీ చాలాసార్లు చిరాకు...!" అతడి కంఠం జాలిగా ధ్వనించింది.

 

    "పడగ్గదిలో ఎలా వుండాలో తెలియదు. మంచి చీర కట్టుకోవాలనుకోదు. "అర్థరాత్రి మంచి చీర దేనికి, ఎవరు చూడొచ్చారు?" అంటుంది. తనని చూసేవాళ్ళ లిస్టులో మొగుడికి అసలు ఐడెంటిటీ లేనట్టే. పొద్దున్న పూజకి తలంటుకున్న మనిషి పడగ్గది లోకి రాగానే తలకి నూనె రాసుకుని వుంటుంది. మొహంమీద నూనె కారుతూ ప్రత్యక్షమవుతుంది. రాతిలాంటి మనిషిని కూడా చిరాకు పరచగల దావిడ!" అతడి కంఠంలో విషాదం ధ్వనించింది.

 

    "సెక్స్ లో సిగ్గుపడదు. పెళ్ళయి పదేళ్ళయినా సిగ్గుపడాలని నేను కోరుకోను కానీ- ఎక్కడా ఆ మనిషిలో స్త్రీత్వం తొణకదు. నేనేం చెప్తే అది ఫీలింగులు లేకుండా చేస్తుంది. పెదవుల మీద ముద్దు పెట్టుకోవడాన్ని ఇష్టపడదు. ఎప్పుడెప్పుడు ఆ కార్యక్రమం అయిపోతుందా అని ఎదురు చూస్తున్నట్లుంటుంది. అయిపోయిన తర్వాత చీర కిందకి సర్దుకుని అటు తిరిగి పడుకుంటుంది. రాత్రంతా అలాగే నగ్నంగా పడుకోవాలనే కోరికుండేది నాకు మొదట్లో. నిద్రలో అటూ ఇటూ మెదిలినప్పుడు ఆ స్పర్శ గిలిగింతలు పెడుతుందనే భావన నాకు థ్రిల్ కలిగించేది. ఆ కోరిక ఎప్పుడూ తీరలేదు".

 

    అతడు ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్టు లేదు. తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు వుంది. నా ఉనికే పట్టకుండా చెప్పుకుపోతున్నాడు. "మళ్ళీ ఆమెను చాలా అమాయకురాలనుకోవడానికి వీల్లేదు. పల్లెటూరి గడుగ్గాయితనం బాగానే వుంది. అత్తగారినీ, ఆడపడుచునీ ఎలా బుట్టలో వేసుకోవాలో తెలుసు!" అతను నవ్వాడు.

 

    "...ఇన్ని డిగ్రీలు సంపాదించావు కానీ, నీకా తెలివితేటలు, లౌక్యం రాలేదు. నువ్వీ ఇంటికి రాగానే అందరూ తమకి కష్టమనిపించిన పనులన్నీ ఎంత చలాకీగా నీకు అంటగట్టారో నేను చూస్తూనే వున్నాను. అంతేకాదు, నీ టాలెంట్ అంతా పాడయిపోతుందనే భావం కూడా నాకు సానుభూతి కలిగించింది. నా భార్యను చూసి, 'అందరూ అలాగే వుంటార్లే' అని అనుకున్న నాకు నీ ధోరణి తెలిశాక నాతోపాటు బలైపోయే వ్యక్తి మరొకరు ఈ ఇంటికి వచ్చారని తెలిసింది. ఇంతకాలం నేను నీతో ఇవేవీ చెప్పలేదు. ఎందుకంటే నేనలా చెప్పడంవల్ల నువ్వు వీళ్ళందరి మీదా మరింత ద్వేషం పెంచుకుంటావేమోనని! ద్వేషం పెంచుకోవడం వల్ల నీకూ, వాళ్ళకీ అశాంతి కలగడం తప్ప లాభమేమీ లేదు. అందుకే డిటాచ్ మెంట్ పెంచుకోవాలి. ఆ అశాంతి నీ జీవితంలో ఒక భాగం కాదనుకో. నీ లక్ష్యమే నీ జీవితం అనుకో. అనవసరమైన వాటిని వదిలేసి, దొరికే వాటినే నీ అవసరాలుగా చేసుకో... కాస్త ఆనందం నిశ్చయంగా దొరుకుతుంది. ప్రస్తుతం నేను ఆ స్థితిలోనే వున్నాను!" అతను గాఢంగా నిశ్వసించాడు.

 

    అతడు చెప్తున్నదంతా అప్పటివరకూ నిశ్శబ్దంగా వింటున్నాను. అతని నోటినుంచి అవన్నీ వింటుంటే నాకు కలిగిన ఆశ్చర్యం ఇంకా పోలేదు. నా భర్తని చూసి అసలు మగవాళ్ళలో స్పందన లుంటాయా, భావుకత వుంటుందా అనే సందేహం కూడావచ్చింది. అలాంటిది వైవాహిక జీవితం నుంచి ఎంతో ఆశించి, అది దొరక్కపోతే సిన్సియర్ గా ఎదుటి వ్యక్తిలో మార్పు తేవడానికి ప్రయత్నించి, అదీ కుదరనప్పుడు వాళ్ళని బాధించి, తను బాధపడి అశాంతి సృష్టించుకునే బదులు ఆ దారినుంచి తప్పుకుని వున్న జీవితంలోనే ఆనందాన్నీ, సంతోషాన్నీ వెతుక్కోవడం...

 

    నాకెందుకో కళ్ళనీళ్ళొచ్చాయి.

 

    "మీకెప్పుడూ వేరే పెళ్ళి చేసుకోవాలనిపించలేదా?" సిన్సియర్ గా అడిగాను. అతను 'అనిపించింది' అనే జవాబు యిచ్చినా నాకేం బాధ కలిగేది కాదు. నిజానికి అతని నుంచి ఆ జవాబునే ఆశించాను నేను. అతడు లేచి కిటికీ దగ్గరికి వెళ్లి అన్నాడు-

 

    "అనిపించలేదు. రెండో పెళ్ళి నా అభిరుచికి తగ్గట్టుగా వుంటుందని గ్యారంటీ ఏమిటి? పైపైన చూసి ఏదీ మనకు తగినది అని నిర్ణయించుకోలేము. అందులోనూ మన వైవాహిక వ్యవస్థలో ఆ బంధం చాలా గట్టిగా వుంటుంది. నా అభిరుచి కోసం, ఆ వచ్చే రెండో మనిషినీ, నా భార్యనీ బాధపెట్టి నాకు నేనే విలన్ ని అవడం నాకెందుకో అంత సబబు అనిపించలేదు!" అతను కిటికీ దగ్గర్నుంచి తల తిప్పకుండానే జవాబిచ్చాడు.

 

    "అంటే మీకు ఇంతవరకూ ఎవరూ నచ్చలేదా?"

 

    నేనెందుకు ఆ ప్రశ్న అడిగానో నాకిప్పటికీ తెలియదు. కొన్నికొన్ని ప్రశ్నలు జీవనగతినే మార్చేస్తూ వుంటాయి. 'అశ్వత్థామః హతః' అని ధర్మరాజు అనకపోయి వుంటే కురుక్షేత్రమే మరోలా వుండేది. దశరథుడు కైకేయికి 'రెండు వరాలు' నే మాట జారకపోయి వుంటే రామాయణం సాగేది కాదు.

 

    అటువైపు నుంచి క్షణంపాటు నిశ్శబ్దం. తర్వాత అతని గొంతు మంద్రంగా పలికింది. "నచ్చలేదనుకున్నాను.... నువ్వు కనబడేవరకూ!"

 

    నా గుండె ఒక్కసారిగా ఆగిపోయిందనుకున్నాను. ఒళ్ళంతా చల్లబడిపోయి కుంచించుకుపోయిన ఫీలింగ్. నాలుక తడారిపోయి నట్లయింది. కళ్లు పెద్దవి చేసి అతనికేసి చూస్తున్నాను.

 

    అతను వచ్చి నాకు ఎదురుగా, సమీపంగా నిల్చున్నాడు. స్థిరంగా నా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు- "ఎస్, ఐ లవ్ యూ!"

 

    నా కళ్ళు తిరుగుతున్నాయేమో ననుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుని ఆధారంకోసం నేను కూర్చున్న సోఫాని... ఆ కుషన్ లోకి నా గోళ్ళు దిగిపోతాయన్నంత బలంగా గుచ్చి పట్టుకున్నాను.

 

    అతను అదేపళంగా నన్ను లేపాడు. నా నడుముచుట్టూ చెయ్యేసి, ఎడమ చేత్తో నా తలని వంచి పట్టుకుని నా కళ్ళమీద ముద్దు పెట్టుకున్నాడు. నేను నా కళ్ళను తెరవనే లేదు. ఏదో స్వాప్నిక జగత్తులోకి జారిపోయినట్టు సుషుప్తావస్థలో వున్నాను.

 

    అతని గడ్డం నా చెంపకి గరకుగా తగిలింది. నా పెదవుల్ని తన పెదవులతో కప్పేశాడు. 'వద్దు' అనాలనే స్పృహ కూడా నాకు లేదు. నేనూ బహుశా అది ఎంజాయ్ చేస్తున్నాననుకుంటాను.

 

    ఆ సోఫాయే మాకు పడకయింది. అ కాన్ఫరెన్స్ హాల్ మ పడగ్గది అయింది. ఎంతసేపు అలా గడిచిపోయిందో మా ఇద్దరికీ తెలియలేదు.

 

    నిస్సందేహంగా ఆ క్షణం అతని స్పర్శలో 'కేవలం కోరిక' మాత్రం లేదు. ఏదో ఆర్తి వుంది. అంతవరకూ పోగొట్టుకున్నదేదో తిరిగి నానుంచి పొందాలనే తపన వుంది. నేనూ కళ్ళు మూసుకుని ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నించాను.

 

    ఎప్పటికో లేవాలన్న తెలివి వచ్చింది. లేచి నా బట్టలు సరిచేసుకుని 'వెళ్దాం' అన్నాను. నా కంఠం జీరగా ధ్వనించింది. అయిష్టంగానే అతనూ లేచాడు. నేను జడ తిరిగి వేసుకుంటూ వుంటే అతను నన్నే చూస్తూ కూర్చున్నాడు.

 

    పది నిమిషాల తర్వాత బయల్దేరాం.

 

    కారులో కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను. ఏదో సన్నని బాధ గుండెలో అపుడు మొదలయింది. అయినా ఏడ్చి, రాద్ధాంతం చేయడం నాకెందుకో సిల్లీగా అనిపించింది. అతని పెదవుల స్పర్శ యింకా నా ఒంటిమీద వున్నట్టే ఫీలయ్యాను.

 

    కారు మా సందులోకి తిరుగుతూ వుండగా అతను హఠాత్తుగా నా మీదకి ఒరిగి నా బుగ్గమీద ముద్దు పెట్టుకుని "థాంక్యూ... థాంక్యూ ఫర్ ఎవ్విరిథింగ్" అన్నాడు సన్నగా. అతని గొంతులోంచి తడిని నేను గమనించాను.

 

    ఇంట్లో కెళ్లి ఎవ్వరితోనూ మాట్లాడే ఓపిక లేక, నా పని నేను చూసుకుని, భోజనమైన వెంటనే నిద్రలోకి జారుకున్నాను. అసలు ఏ ఆలోచనలకీ చోటివ్వలేదు.

 

    మరుసటి రోజు ఉదయమే లేచి అందరి మొహాల్లోకీ చూడాలంటే గిల్టీగా ఫీలయ్యాను. కానీ ఇబ్బంది వెంటనే దూరమయింది. ఆ వాతావరణంలో ఏ మార్పూ లేదు. తప్పు చేశానన్న నా ఫీలింగే అందరూ నన్ను దోషిలా చూస్తున్నారన్న భావన కలిగించిందేమో! మామూలుగానే పనిచేసుకుని కారులో అతనితో పాటు కాలేజీకి బయల్దేరాను. అతనసలా టాపిక్ ఎత్తలేదు.

 

    నిన్న జరిగిందంతా మా ఇద్దరి మధ్యేనా అన్న అనుమానం వచ్చింది నాకు.

 

    నా ఉదాసీనతని గమనించి అతను నన్ను ఇబ్బంది పెట్టకుండా మౌనంగా డ్రైవ్ చేయసాగాడు. ఆ రోజు, ఆ తర్వాత రోజు కూడా డల్ గానే వున్నాను.

 

    మూడోరోజు ఎందుకో కాలేజీలో కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. ఎక్కువసేపు కూర్చోలేక స్టాఫ్ రూమ్ లో టేబుల్ మీద తల పెట్టుకుని పడుకున్నా తగ్గినట్లనిపించలేదు. పర్మిషన్ తీసుకుని ఆటోలో ఇంటికి వచ్చేశాను.

 

    మూడు రోజులుగా యాంగ్జయిటీ నొక్కిపట్టి వుంచడంవల్ల అలా జరిగిందనుకున్నాను. నీరసంగా వుందంటే నా ఆడపడుచు బోర్న్ విటా తీసుకొచ్చి యిచ్చింది. పెళ్ళయ్యాక ఆ అమ్మాయిలో కొద్దిగా మార్పు వచ్చిందనుకున్నాను. కొంచెం సౌమ్యత నేర్చుకుంది.

 

    బోర్న్ విటా తాగిన వెంటనే కడుపులో తిప్పినట్టయి, పరుగెట్టుకెళ్ళి సింక్ లో వామిట్ చేసుకున్నాను. గదిలోకి వచ్చి పడుకోబోతుంటే నా అత్తగారు చాటంత మొహంతో ప్రవేశించింది.

 

    "ఏదైనా విశేషమేమోనే అమ్మాయ్! ఆ దేవుడి దయవల్ల అదీ అయిపోతే నేను సంతోషంగా కళ్ళు మూస్తాను..."

 

    నా గుండె జల్లుమంది.

 

    అది నిజమేమోనన్న అనుమానం నాలో ప్రవేశించి బలపడింది. అంతకు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చి గిల్ట్ ఎక్కువైంది. గర్భం ఒకరితో ప్రేమ మరొకరితో పంచుకుని... ఇక ఆలోచించలేక మైకంలోకి జారిపోయాను.

 

    తర్వాతెప్పటికో మెలకువ వచ్చింది. నా భర్త వచ్చాక ఇద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్దామనుకున్నాను. అతనా రోజు రాత్రి పదకొండింటికి వచ్చాడు. రోజంతా ఉపవాస ముండడం వల్ల అప్పటికి నా అత్తగారు కూడా పడుకుంది.

 

    ఆ టైమ్ లో అతనితో ఏమీ చెప్పాలనిపించలేదు. మరీ సినిమాటిక్ గా కాకపోయినా ఆ విషయం నన్ను బాగా తృప్తి పరిచింది. అతను ఆనందించాలనీ, తన ఆనందాన్ని నాకు వ్యక్తపరచాలనీ కోరుకున్నాను. అప్పుడు చెప్పి అతను అలసటలో నేనూహించిన రెస్పాన్స్ ఇవ్వకపోతే బాధపడడం నాకిష్టం లేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra