Home » Lalladevi » శ్వేతనాగు - 2

                                                                         8
    కేశవరావుగారికి కొన్ని సందేహాలు మనసుని పీడిస్తున్నాయి. ఒకప్పుడు శ్వేతనాగు పగనుంచి బయట పడేందుకు నాగాలు ఇచ్చిన నాగమణిని ధరించేది.
    నాగమణిని సాధించినందుకు ప్రశంసాపూర్వకంగా రెండు లక్షలు ఖరీదు చేసే వజ్రాల హారంలో పొదిగించి బహుకరించారాయన. ఆ పని చేసేందుకు బొంబాయి నించి ప్రత్యేకమైన పనివారిని పిలిపించారు.
    అంత ఖరదయిన హారాన్ని వదిలి వచ్చింది వాణి. దాన్ని వాణి ధరించని కారణం ఏమిటో వారికి అర్ధం కాలేదు.
వారికి వాణి తన బిడ్డగానే ఇంకా కనిపిస్తోంది కాని ఆమె ఒక బిడ్డకు తల్లి అయి తన ప్రాణాధారమైన హారాన్ని బిడ్డసంరక్షణ కోసం వదలివేసిందన్న స్పృహ వారికి ఇంకా కలగటంలేదు.
    పాముల మల్లిగాడి విషయంలో ఆమె ఎందుకు ఇంకా పోరాపడుతుందో కూడా వారికి అర్ధం కాలేదు కారణం తెలియకపోయినా ఆయన కట్టడి చేశారు.
    పాముల మల్లిగాడు వాణికి కనిపించరాదు. దూరంగా ఉంటూనే ఆమె రక్షణ భారం తాలూకు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎట్టి పరిస్థితిలోనూ వాడు మేడమీడికి వెళ్లరాదని కట్టడి చేశారాయన.
    మల్లిగాడి విషయంలో వాణికి భయ సందేహాలున్నాయి. కాని తండ్రి అతడిమీద ఎందుకు అంతగా విశ్వాసం ఏర్పరచుకున్నారో కూడా అర్ధం కావటంలేదు. కాని అతడు తనకు కనిపించే అవకాశాలు తగ్గిపోవటంతో కొంత రిలీఫ్ వచ్చినట్లు అయింది. అతడిని తిరిగి పంపివేయమని చెప్పేందుకు తండ్రి మనసు తెలిసిన తరువాత ఇష్టపడలేకపోయింది.
    పాముల మల్లిగాడు తిరిగి వెళ్ళిపోతే ఆ రహస్యం అగాధంగానే ఉండిపోతుంది. అలా కావటాన్ని అంగీకరించే మనస్తత్వం ఆమెకు లేదు. మనసుమీద అనేక గాయాలు తగులుతున్నా, పిరికిదానిలా ఆలోచించటం చేయలేదు. ధైర్యంగానే ఆలోచిస్తూంది.
    ఒకవేళ చావు నిశ్చయమైతే, అది ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి, దాని గురించి ముందుగా భయపడటం తెలివితక్కువ.
    మనిషిగా పుట్టటమనేది ఒక అందమైన, అర్ధవంతమైన అవకాశం. పదుగురికి ఉపయోగించే పద్దతిలో పరిశోధనలు చేయగల అవకాశం రావటం ఇంకా అరుదైన విషయం.
    అలాంటి అవకాశం దక్కినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి చేయగలిగిన పూర్తి కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వహించాలి. అంతేకాని, చావు గురించి ముందుగా ఆలోచించటం, పిరికివారిలా కర్తవ్యం నించి పారిపోవటం ఉన్నతమయిన జీవితాన్ని ఆశించేవారు చేసే పని కాదు అలాంటివారు చరిత్ర హీనులవుతారు.
    దురదృష్టకరమైన ఆ జీవితాన్ని వాణి ఆశించలేదు మనిషి గతించాక ఏ కొంత అయినా చరిత్ర రూపంలో మిగుల్చుకోలేనప్పుడు ఆ పుట్టుకకు అర్ధమే లేదని ఆమె ప్రగాఢమైన విశ్వాసం. అందునించి, వాణి భయపడి పాముల మల్లిగాడిని తిప్పి పంపేయాలని పట్టు పట్టలేదు. అతడి గురించి తెలుసుకోవలసిన రహస్యాన్ని తెలుసుకుందుకు ఉన్న ఒక్క అవకాశాన్ని చేజారిపోనివ్వలేదు.
    తన గదిలో సైన్స్ జర్నల్స్ కు రాసిన వ్యాసాలు, అందుకు సంబంధించిన ఫైళ్ళు తీసిందామె. స్వప్నతో పెళ్లి అయిన తరవాత దాదాపు అవి అన్నీ మూలపడినాయి. తిరిగి ఇప్పుడే చూడటం!
    ఉదయం వరో మిత్రులు ఫోన్ చేసి చెప్పారు. మహారాష్ట్రకు చెందిన ఓ సాహసిక యువకుడు లాల్ బహుదూర్ స్టేడియంలో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడని. అతడి సాహసోపేతమైన ప్రదర్శనలు జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ప్రదర్శనలు చేస్తున్నాడని. అతడి సాహసోపేతమైన ప్రదర్శనలు ముగింపు సందర్భంగా ఏదో సభ జరుగుతోంది.
    సైన్స్ జర్నల్స్ లో సర్పాలను గురించి తన వ్యాసాలు చదివి అభిమానించిన వారెవరో ఆ సభలో తాను ప్రత్యక్షంగా పాల్గొనాలని ప్రతిపాదించారు విజ్ఞానశాస్త్ర మేధావులు అందుకు అంగీకరించారు.
    ఉదయం ఫోనులో తనకు ఆహ్వానం అందింది. అందరు విజ్ఞానశాస్త్ర మేధావులు, అభిమానం కలిగిన ఔత్సాహికులు పాల్గొనే ఆ సభలో తాను మాట్లాడవలసి రావటం ఆమెకు భయంగానే ఉంది.
    విజ్ఞానశాస్త్రమంటే మాటలా?
    అది హిమగిరి శిఖరాలలో ఉన్నతోన్నతమైనది. సముద్రగర్భంలా నిగుడమైనది. ఆకాశంలా సూక్ష్మాతి సూక్ష్మమయినది.
    తల పండిన మేధావులు ఆ సభలో పాల్గొంటున్నారు. వారిమధ్య తానెంత?" అనుకుంది వాణి.
    తాను గతంలో తయారుచేసిన నోట్సు, ప్రకటించిన ఆర్టికల్సూ తిరిగి పరిశీలించసాగిందామె. ఆ పనిలో తల దూర్చాక ఎన్ని గంటలు గడచినాయో ఆమెకు తెలియనే లేదు.
    పనిపిల్లాడు వచ్చి "మీకోసం లాల్ బహదూర్ స్టేడియం నించి కారు వచ్చింది. మిమ్మల్ని కలుసుకునేందుకు ఎవరో కొందరు వచ్చారు. హాలులో కూర్చున్నారు." అన్నవార్తను అందించాడు.
    "వస్తున్నాను." ఆ ఫైళ్ళనన్నింటిని పక్కన ఉంచేసి హడావిడిగా లేచింది వాణి. బాత్ రూమ్ లోంచి తడిసిన శరీరం మీద టవల్ చుట్టుకుని పదినిమిషాల అనంతరం బయటకు వచ్చింది.
    స్నానం చేయటం నించి ఆమె శరీరం పులు కడిగిన ముత్యంలా తరలాయితమవుతోంది. చేసిన పరిశ్రమ తాలూకు అలసట తీరిపోవటం నించి కన్నులు మెరుస్తున్నాయి.చెంపలు తళుకు అద్దినట్లు మిలమిలలాడుతున్నాయి.
    వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు అయిన మేధావుల మధ్యకు వెడుతోంది కాబట్టి. పెద్దరికం ఉట్టిపడేలా స్కైకలర్ ఎల్లో బార్డర్ పట్టుచీర కట్టుకుంది వాణి.
    చక్కదిద్ది పిన్ను అమర్చిన పయ్యెద మడతలు గుండెమీద నిండుగా కనిపిస్తున్నాయి. జేడ్ కలర్ బ్లౌజు వేసుకుంది. ఇయర్ డ్రాప్స్ బలహీనంగా ఊగిసలాడుతున్నాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra