Home » Kommuri venugopala rao » Samkellu and Pilla Donga


    ఆమె తల విదిలించింది. నీరసంగా గోడకు ఆనుకొంది. "మీకు ప్రళయం వల్ల లాభం తెలుసునా?" అంది హఠాత్తుగా.    
    "నాకర్ధం కాలా మీ ఉద్దేశం ఎలాంటి ప్రళయం?"    
    "డాక్టర్! నీతి-అవినీతి, మంచీ-చెడూ వీటినిగురించి ఆలోచించడానికి అతీతమైన బాధ పొందని వ్యక్తికే అవకాశం వుంది. అతీతమైన బాధ అన్నాను, గుర్తుంచుకోండి. యుగాల తరబడి విడిచిపెట్టని బాధ."    
    "ఓ కొత్త నాగరికత, ఓ క్రొత్త ప్రపంచం, నవీనపు మనుషులు, నవీన కొత్తయుగం ఆరంభించబడటానికి ముందు ప్రళయం యేర్పడుతుంది. కొంత కాలం అల్లకల్లోలం, అరాజకం విజ్రుంభణ జరిగాక ప్రశాంత వాతావరణం, నవజీవనం అవతరిస్తుంది. ఆ కొత్త రాజ్యం, ఆ కొత్త నాగరికత రావాలంటే ప్రళయం సృష్టించటానికి ఆ కొందరు మనుషులు నీతి-అవినీతి, మంచీ- చెడూ అని ఆలోచించటం మానివేయాలి డాక్టర్ అందులో తృప్తిని పొందాలి. తమని త్యాగం చేసుకోవాలి."    
    "మీరు వాంఛించే నాగరికత యేమిటి? అది యెలా వుండాలి?"    
    "ఒక్క ముక్కలో చెప్పదలిచాను జవాబు. సంకెళ్ళు లేని బ్రతుకు స్వేచ్చగా గాలిపీల్చే నాగరికత."    
    "స్త్రీలనుగురించి, వాళ్ళ కష్టాలను గురించి మీరు యేదో చెప్పారు. నేనూ చూశాను చాలామంది స్త్రీలను వాళ్ళకేమీ బాధలు లేవే ఉచ్చమూ, నీచమూ లేకుండా సుఖించడం వాళ్ళ పరమావధి!"    
    "ఉదాత్తత, సత్ప్రయోజనం లేని సుఖపిపాస అజ్ఞానంతో కూడినది. అజ్ఞానానికి స్త్రీ పురుష వ్యత్యాసం లేదుగా అదలా చాలామందిని ఆవరిస్తుంది. మరోప్రపంచం కోసం దారి వెతుక్కోలేని సోమరులు యిందులో సౌఖ్యాల్ని బావుకుందామని తాపత్రయపడతారు."    
    "సరే, మరో సందేహంకూడా తీర్చండి. మీరు యిప్పుడే మీ భర్తను త్యజించి మీరు అనుకొన్నచోటకు వెళ్ళిపోవచ్చుగా. ఆయనకు చావు వచ్చేవరకూ ఆలసించటమెందుకూ?"    
    ఆమె నవ్వింది. కసితీరా నవ్వింది. "ఉదాత్తత, సత్ప్రయోజనమూ వీటిని గురించి మీకు ఎందుకు చెప్పాను? సహనం, కష్టంలేని ప్రయత్నం వ్యర్ధం జీవితం జీవించటానికి కాని భయపడి పారిపోవటానికి కాదు."    
    నేను యింక వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడనైనాను. గుమ్మందాకా వెళ్ళి, ఒక విషయం స్ఫురించి ఆగాను. ఆమెవంక క్రౌర్యంగా చూసి "మీ భర్త చనిపోయినప్పుడు అశ్రువులు రాల్చే సహనం మీలో వుందా? లేక సరిగ్గా అంతటితో మీ నటన పరిసమాప్తి చెందుతుందా?" అని అడిగాను.    
    దీనికి ఆమె ఏదోజవాబు చెప్పనుటకించింది. కాని సరిగ్గా అదే సమయానికి గదిలోనుండి గావుకేక వినబడింది. సర్వం విస్మరించి నేను లోపలకు పరిగెత్తాను. వెనువెంటనే ఆమెకూడా వడివడిగా వచ్చింది.    
    ఆయన నోటివెంట నురగ క్రక్కుకుంటూ వెల్లకిలా పడి కొట్టుకొంటున్నాడు. మనిషి మెలికలు తిరిగిపోతున్నాడు. అనసూయ చప్పున వచ్చి నా చేతులు పట్టుకుంది. నేను విదిలించుకుని వెళ్ళి ఆయన చేతిని బలవంతంగా పట్టుకొని నాడి చూశాను. వెంటనే చేయి వదిలేసి ఆమెవంక తిఇర్గి 'నిముషాల్లో వుంది బాబాయి జీవితం' అన్నాను.    
    ఆమె ఆయన హృదయంపై వాలిపోయి రోదించసాగింది. ఈ హడావుడికి ఇరుగూ పొరుగూ పరుగెత్తుకు వచ్చి, హృదయ విదారకంగా కనబడుతున్న ఈ దృశ్యాన్ని సానుభూతితో తిలకించసాగారు. నేను ప్రక్కనే నిలబడి ఆమెవంక తీక్షణంగా చూడసాగాను. కన్నీరు ఆమె చెంపలమీదుగా ప్రవహిస్తున్నాయి. కళ్ళలో దుఃఖం ప్రసాదించిన శోణిమయ.    
    ఆమె చెయ్యి పట్టుకొన్నాను. విపరీతంగా వణుకుతోంది. ఆమె ఏడుస్తోంది. కానీ ఆమె నరాలన్నీ వికటంగా నవ్వుతున్నట్లుగా తోచాయి. భయంతో విడిచి పెట్టాను.    
    ఆమె ఒక్కొక్క కన్నీటి కణమూ యెంతటి విలయానికి చిహ్నము! ఆమె ఒక్కొక్క కన్నీటిచారా యెంతటి దారుణానికి నిలయమూ!    
    ఈ చివరి అంకంలోకూడా ఈమె యెంత నేర్పుగా నటిస్తోంది? ఎంత చతురతతో తన పాత్ర నిర్వహిస్తోంది!    
    నేను బాబాయి ముఖంలోకి పరికించే ఉద్దేశంతో ముందుకువంగి ఆమె చెవిలో "ఎంత బాగా ఏడుస్తున్నారు" అన్నాను.    
    ఆ ఒక్క మాటతో ఆమెయందు నాకున్న కసి అంతా తీరినట్లు సంతుష్టి వహించాను. ఆమె ఉలకలేదు. పలకలేదు. ఆయన గుండెలపై తలవుంచి నిశ్శబ్దంగా విలపిస్తోంది.    
    బాబాయి అదృష్టవంతుడు తనకు పతివ్రత అయిన భార్య వుందన్న నమ్మకంతో, గర్వంతో చచ్చిపోతున్నాడు. ఆయన ఆత్మకు శాంతి గలుగుగాక!    
    ఆయన ముఖకవళికల్ని పరిశీలిస్తున్నాను. హఠాత్తుగా ఆయన ముఖంమీద ప్రేతకళ కనిపించింది. అనసూయ తెలుసుకొని గొల్లుమంది. నేను రెండు చేతుల్లో తలదాచుకొని "బాబాయి..." అని గొణిగాను.    
                                                           * * *    
    నేనే పూనుకొని బాబాయి శరీరానికి అంత్యక్రియలు జరిపించాను. కర్మ ముగించాను. ఈలోగా ఒక్కసారీ అనసూయ ముఖంలోకి తలయెత్తి చూడలేదు. ఏమైనా చెప్పాలంటే గది దగ్గర నిలబడి గోడవంక చూస్తూ చెప్పేవాణ్ణి. ఆమె విని ఆలాగే జవాబు చెప్పేది.    
    నేను చేయవలసిన పని ముగిశాక ఒక్క నిముషంకూడా అక్కడ నిలబడే ఆవశ్యకత లేదు. కాని వచ్చేసేముందు గదిదగ్గరకు వెళ్ళి "డబ్బేమైనా కావాలంటే చెప్పండి. బ్యాంకులో నాపేర కొన్నివేల రూపాయలు వున్నాయి. అదంతా అవసరమైతే ఇవ్వగలను" అన్నాను.    
    "ఒక వెయ్యిరూపాయలు బాగా అవసరమనుకుంటాను. దయవుంచి పంపించండి"    
    "అలాగే మీరు నాకు ఎవరివల్ల పిన్ని అయినారో ఆ వ్యక్తి ఇహ లేడు వస్తాను, సెలవు."    
    నేను యింటికి వచ్చి ఆరోజే బ్యాంకినుంచి రెండువేల రూపాయలు తీసి, ఒక కవరులో పెట్టి, కాంపౌండర్ చేతికిచ్చి ఫలానా వ్యక్తికి ఇచ్చి రమ్మన్నాను. అవును పాపం, ఢిల్లీలో తన ప్రియతమున్ని కలుసుకునేంతలో కొత్తకొత్త దుస్తులతో ఆకర్షణీయంగా తయారవద్దా మరి!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra