Home » Dr c. ananda ramam » రేపటి మహిళ

   
    ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాడు భాగవతార్. ఒక్కొక్కసారి చదివినప్పుడల్లా మనసు మరింత మరింత రగిలిపోతోంది. చదవడం ఆపలేడు. మనసుని స్వాధీనంలోకి తెచ్చుకోలేడు. కోపంవల్ల పెరిగిన ఉద్రేకంతో నరాల్లో రక్తం ఉరుకులు పెడుతోంది రక్తనాళాలు చిట్లిపోతాయా అన్నట్లు. పళ్లు పటపట నూరుకుంటున్నాడు. ఉరుములు- మెరుపులతో కుండపోతగా వర్షం కురుస్తోన్న ఆకాశంలా తయారవుతోంది మనసు. ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఝంఝా మారుతంలా అల్లాల్లాడి పోతోంది.
    ఎంత తెగింపు? అనంగ్ తో ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతుందా! రెండు రోజులవరకూ రానని ఉత్తరం రాసి పెడుతుందా! ఏమైనా అంటే, "నువ్వు నన్ను నమ్మాలి. నేనే తప్పు చెయ్యలేదు" అని లెక్చర్లు కొడుతుంది. అలా అనక ఇంకెలా అంటుంది? లోకంలో ఎవరేనా తన తప్పు తను ఒప్పుకుంటారా?
    "ఐ వాంట్ టు కిల్ హెర్. దాన్ని చంపేయ్యాలి. చంపి తీరతాను" పిడికిలి బిగించి బల్లమీద గట్టిగా గుద్ది చెయ్యి మంట పుట్టి "అబ్బా" అంటూ వెనక్కి జరిగి వెనకేవున్న మోడాని చూసుకోకుండా తన్నేసి దాని మీదుగా క్రిందపడ్డాడు. ఫోన్ రింగైంది. నెమ్మదిగా లేచి తను పడటం యెవరూ చూడలేదు కదాని అటూ యిటూ చూసుకున్నాడు. ఎదురుగా అద్దంలో ప్రతిబింబం బిక్కమొహంతో జారిగా చూసింది. కాలు చాచి తన్నబోయి మోకాలు కలుక్కుమనగా వెనక్కి తీసుకున్నాడు. ఫోన్ రింగవుతూనే వుంది. టెలిఫోన్ వున్న రౌండ్ టేబిల్ ప్రక్కన కేన్ కుర్చీలో కూలబడి ఫోన్ అందుకున్నాడు.
    "కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ భాగవతార్, "గంభీరంగా, అధికార పూర్వకంగా వినబడిందొక కంఠం. అలా అధికారంగా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పడం భాగవతార్ కి ఇష్టముండదు. రిసీవర్ క్రెడిల్లో పెట్టేసాడు. మళ్ళీ వెంటనే మ్రోగింది పోన్. అందుకున్నాడు.
    "పోలీస్ స్టేషన్ నించి మాట్లాడుతున్నాను. భాగవతార్ గారు ఉన్నారా?" అదే కంఠం, అదే అధికారం. ముచ్చెమటలు పోసాయి భాగవతార్ కి. ఈ మధ్య ఏ సినిమాలో చూసినా పోలీసుల దురాగతాలే కనిపిస్తున్నాయి. పోలీసులంటేనే అలర్జీ భాగవతార్ కి. కాని సమాధానం చెప్పాలి, తప్పదు.
    "నేనే భాగవతార్ ని, ఏం కావాలి మీకు?" బింకంగా మాట్లాడాలని ప్రయత్నించాడు కాని కంఠంలో ఒణుకు అదుపులో పెట్టుకోలేకపోయాడు.
    "మీ శ్రీమతి మృదులగారిని కొన్ని తప్పనిసరి పరిస్థితులలో మేము అరెస్టు చేయవలసి వచ్చింది. మీరొకసారి పోలీస్ స్టేషన్ కి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు" అటువైపు నుంచి ఫోన్ పెట్టేసిన చప్పుడు.
    ముచ్చెమటలు పట్టాయి భాగవతార్ కి. 
    మృదులని అరెస్ట్ చేసారా? ఎందుకు? ఏం నేరంమీద? లాకప్ రూమ్స్ లో రేప్స్ గురించి విన్నాడు, చదివాడు. పాపం మృదులని కూడా ఎవరైనా రేప్ చేస్తారా? ఇంతకీ మృదుల చేసిన నేరమేమిటి? ఆమె వెంట పెద్ద మనిషిలా వెళ్ళిన అనంగ్ రేప్ చెయ్యబోతే శీలరక్షణ కోసం అతడ్ని హత్య చేసిందా? అమాయకురాలు. అందర్నీ నమ్మేస్తుంది. ఇప్పుడు మృదులకేం శిక్ష విధిస్తారు? ఉరి తీస్తారా! అందమైన ఆ కళ్ళల్లోంచి కనుగుడ్లు పొడుచుకొచ్చి- నాలుక బయటికొచ్చి- మొహం వికృతంగా మారి- "నో" మృదులని ఉరి తీసే అధికారం ఎవరికీ లేదు. ఎంతడబ్బు ఖర్చు అయినా మంచి లాయర్ ని పెట్టి మృదుల నిర్దోషి అని రుజువు చేస్తాడు. తన మృదులని తప్పకుండా కాపాడుకుంటాడు.
    "అదేమిటి అయ్యగారూ! ఏడుస్తున్నారేమిటి?" ఆశ్చర్యంగా అడిగింది వంటమనిషి. ఆ మాటలకి ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి ఈ లోకం కొచ్చాడు. చేతులతో తడుముకుంటే చెంపలు తడిగా తగిలాయి. అప్పటివరకూ తను ఏడుస్తూన్నట్లు తనకి తెలియదు. గభాల్న పక్కకి తిరిగి రుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు. "భోజనం చేస్తారా?" అడిగింది వంటమనిషికి సమాధానం చెప్పకుండా డ్రైవర్ ని పిలిచి కారు తీయమని కారులో కూర్చున్నాడు. "ఎక్కడికి సార్?" అడిగాడు డ్రైవరు. "పోలీస్ స్టేషన్ కి....కాదు కాదు క్రిమినల్ లాయర్ షణ్ముఖంగారింటికీ" చెప్పేసి సీట్లో వెనక్కి వాలి కూర్చున్నాడు. కళ్ళ నీళ్ళు ఆగడంలేదు. బుఱ్ఱలోకి ఏ ఆలోచనలు రావడం లేదు. తన సంగీతాన్న పరవశత్వంతో వింటూ- తనకి ప్రోత్సాహానిచ్చే మృదుల_ ఎంతటి అలసటనైనా చిన్న చిరునవ్వుతో చెదరగొట్టే మృదుల_ ఇల్లంతా నవ్వుల జల్లులతో నింపేస్తూ ఉల్లాసంతో వెలిగించే మృదుల_ తన మృదుల తనకింక దక్కదా!
    డ్రైవర్ షణ్ముఖంగారి ఇంటిముందు కారాపాడు. మరోసారి కళ్ళు తుడుచుకుని లాయర్ గారి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లాడు. ఎవరో క్లయింట్స్ తో మాట్లాడుతున్నాడు లాయర్. భాగవతార్ ఖంగారు ఖంగారుగా "లాయర్ గారూ! మీరు ముందు అర్జెంట్ గా నా వ్యవహారం చూడాలి. ఒక్కక్షణం ఆలస్యం కావడానికి వీల్లేదు." అన్నాడు లాయర్ కి భాగవతార్ తెలుసు.
    "కూర్చోండి! ఏమిటో చెప్పండి."
    "నా భార్యని- మృదులని- పోలీసులు అరస్ట్ చేసారు."
    "అరె! మృదులగారిని అరెస్ట్ చేసారా? ఏ సందర్భంలో"
    "హత్యకేసు."
    "హత్యకేసా? ఎవర్నీ హత్య చేసారు?"
    "రైటర్ అనంగ్ ని. వాడు మృదులని రేప్ చెయ్యబోతే శీలరక్షణ కోసం చంపేసింది. మృదులని మీరెలాగేనా కాపాడాలి."
    "మళ్ళీ భాగవతార్ కళ్ళనిండా నీళ్ళు.
    "అలా బాధపడకండి, మీ మృదులకేం భయంలేదు. మొదట ఆమెని బెయిల్ మీద విడిపించుకుందాం. ఏ పోలీస్ స్టేషన్ లో వుంది?" తెల్లబోయి చూసాడు భాగవతార్.
    "అడగడం మర్చిపోయాను" అన్నాడు బిక్కమొహంతో. తెల్లబోవడం ఇప్పుడు షణ్ముఖం వంతు అయింది.
    "ముందు ఏ పోలీస్ స్టేషన్ లో వుందో తెలుసుకుని నా దగ్గిరకొస్తే విడిపించే ఏర్పాట్లు చేద్దాం అన్నాడు.
    మళ్ళీ కారులోకొచ్చి కూర్చున్నాడు భాగవతార్. "ఎక్కడికి సార్?" అడిగాడు డ్రైవరు.
    "ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి పోనీ."
    "ఎక్కడికి సార్?"
    "ఒక్కొక్క పోలీసు స్టేషన్ కి పోనీయమంటే నీక్కాదూ!" కసిరాడు. భాగవతార్ చిరాకులు- కసుగులు డ్రైవర్ కి బాగా అలవాటే. జీతం బాగా యిస్తాడు కాబట్టి భాగవతార్ దగ్గిరే ఉన్నాడు కాని లేకపోతే ఎప్పుడో ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మృదుల గురించి ఎంక్వయిరీ చేసి లేదని తెలుసుకోగానే భాగవతార్ గుండె దడ ఎక్కువ కాసాగింది. పోలీస్ లాకప్ రూమ్స్ లో ఖైదీలు మాయమవడానికి సంబంధించిన సమాచారం ఆ మధ్యనే ఏదో పేపరులో చదివాడు. లాకప్ రూమ్ లో మృదులని పోలీసులు రేప్ చేసేసి అది బయటకు రాకుండా చంపేసి- శవాన్ని పూడ్చేసి "మృదుల తప్పించుకు పారిపోయింది" అలా ప్రకటిస్తారేమో? రకరకాల ఊహలతో పిచ్చిగా చిందరవందరమైపోతుంది అతని మనసు. అతని కారుకి ఎదురుగా ఓ పెద్ద పొపేషన్ వచ్చింది. ఆడ - మగ అనేకమంది నినాదాలతో రోడ్డుమీద గుంపులు గుంపులుగా నడుస్తూంటే ఎక్కడి వాహనాలు అక్కడి ఆగిపోయాయి. భాగవతార్ కారు కూడా ఆపేయవలసి వచ్చింది. ఆ గుంపు ఏమిటా అని చూసిన భాగవతార్ అదిరిపడ్డాడు. గుంపు మధ్య మెడలో పూలమాలతో మృదుల.
    జన ప్రవాహం భాగవతార్ కారుని ముందుకు కదలనీయలేదు. అప్పటివరకు మృదుల యేదో అయిపోయిందని ఆరాటపడిపోతూ మతి పోగొట్టుకున్న భాగవతార్ కి అంతమంది మధ్య మెడలో పూలదండతో మృదుల కనపడేసరికి భరింపరాని ఇరిటేషన్ వచ్చేసింది. ఆ అమ్మాయి తనకేదో దారుణమైన మోసం చేసినట్లు ఫీలయ్యాడు.
    "కారు ఇంటికిపోనీ!" కోపంగా చెప్పాడు డ్రయివర్ తో. ఆ కోపం ఎందుకో డ్రయివర్ కి అర్ధంకాలేదు. అప్పటివరకూ భాగవతార్ మృదుల కోసం ఆరాటపడటం డ్రయివర్ కి తెలుసు. మృదుల క్షేమంగా కనిపించినందుకు సంతోషించాలిగాని కోపం తెచ్చుకోవడమేమిటి?
    "ఈయన మూడ్సు ఈయన్ని సృష్టించిన దేవుడుకూడా అర్ధం చేసుకోలేడు" అనుకున్నాడు మనసులో. కారు వెనక్కి తిప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. భాగవతార్ హాల్లోకొచ్చేసరికి పి.ఎ. నక్షత్ర అతనికోసం ఎదురు చూస్తున్నాడు. చాలా ఎగ్జెయిటింగ్ గా వున్నాడతడు - "సర్! ఏం జరిగిందో మీకు తెలుసా?" అడిగాడు సంభ్రమంగా, సోఫాలో కూలబడి విసుగ్గా, "చెప్పండి!" అన్నాడు భాగవతార్. ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతూన్న నక్షత్ర భాగవతార్ విసుగుని పట్టించుకోలేదు. జరిగిందంతా వివరంగా చెప్పసాగాడు....
                             *    *    *
    గుఱ్ఱం యెక్కడానికి సాహసించలేని అనంగ్ విధిలేక శోవమ్మతో కాలి నడకన బయలుదేరాడు. శోవమ్మలాంటి ఆడదానితో కలిసి అడవుల్లో కాలిబాట వెంట ప్రయాణం చేయవలసి రావడం ఏమాత్రం భరించలేకపోతున్నాడు అనంగ్. ఇంతలో ఆ దారిన ఒక జీప్ వెళ్తోంది ఆపమన్నట్లు చటుక్కున చెయ్యి జాపాడు, జీప్ ఆగింది. జీప్ డ్రయివర్ ప్రక్కన గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలతో జరీ అంచు ఖద్దరుపంచెలో ఖరీదయిన మనిషి కూర్చుని వున్నాడు. అతనికి తన పర్సులోని విజిటింగ్ కార్డు ఇచ్చి "కనుకునూర్ వరకు నాకు లిఫ్టు యిస్తారా?" అని అడిగాడు. "విత్ ఫ్లెజర్" అని జీపులోకి ఆహ్వానించాడు. జీప్ ఎక్కుతూ "శోవమ్మా! నిన్ను కునుకునూరులో కలుసుకుంటాను" అని చెప్పి చెయ్యి ఊపాడు. జీప్ లో పెద్దమనిషి ఈ మారుమూల పల్లెటూళ్ళో మీకేంపని?" అని అడిగాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra