Home » Yarlagadda sarojani devi » కావేరి

    "పంటలు చేతికి రావాలంటే జేష్ట మాసం రావాలి! అంతవరకూ ఆగాలంటే నా వల్లకాదు! ఈ సంబంధాల గోల పడలేకపోతున్నాను...అవసరం అయితే ఓ పదివేలు నేను ఇస్తాను. నా నగలు వున్నాయిగా! అవి కావేరికి యిచ్చేస్తాను. ఈ పుష్యమాసంలోనే వాళ్ళిద్దరికీ వివాహం జరిపించేయటం మంచిది. ఏ వయస్సుకి ఆ వయస్సు వుండాలి కదా? నువ్వేమంటావు అన్నయ్యా."

    "అమ్మా కామాక్షి! నీ మనసు నాకుతెలుసు! అవసరం వస్తే నువ్వెంత త్యాగం చేయగలవో తెలుసు. ఈ బీద అన్నయ్యకి యిన్ని వరాలు ఇస్తున్నావంటే నిజంగా నీ ఋణం నేను తీర్చుకోలేనమ్మా! అంతా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు తల్లి! నీ మాటకి ఎదురు చెప్పగలిగేటంతటి వాడినా? నా బిడ్డ కావేరి పుట్టినప్పుడే వినాయకం భార్య అనే ముద్ర వేసిననాడే ఎంతో అదృష్టవంతురాలనిపించింది. చిన్నదానివయినా నన్ను ఓ కంట చూసి ఆదరించుతున్నావంటే ఈ అన్నయ్య కూడా అదృష్టవంతుడే నమ్మా! ధనుర్మాసం వెళ్ళిన తరువాత లగ్నం పెట్టుకుందాం! ఆ రోజుకి రమ్మనమని పార్వతికి త్రివిక్రమరావుకీ ఉత్తరం రాస్తాను." అనుకోని అదృష్టం లభించబోతున్నందుకు ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నాడు.

    పరంధామయ్యకి ఎంతో సంతోషంగా వుంది. ఈ సుభవార్త భార్యకి ఎంత త్వరగా అందచేయాలా? అన్న ఆత్రుత కలిగింది.

    "ఇంకేమయినా విషయాలు వుంటే తరువాత మాట్లాడుకుందాం. వస్తానమ్మా!" అంటూ పాలుసంగతి మరిచిపోయి పక్కన వుంచిన గ్లాసుని అలాగే వదిలేసి లేచి బయలుదేరాడు పరంధామయ్య. వీధి గుమ్మం దాటి రోడ్డు మీదకి వచ్చేవరకూ అడుగులో అడుగు వేస్తూ వచ్చిన వాడల్లా రోడ్డుమీద అంగలు పంగలు వేసుకుని విసురుగా నడుస్తున్నాడు. ఎవరు పలుకరించినా నిలబడి సమాధానం చెప్పటం లేదు. వేగాన్నంతా నడకలో చూపించుతున్నాడు.

    యింతకాలం మనసులోనే వుంచుకుని మధన పడుతూ, తను అడిగితే "నువ్వేమి యివ్వగలవని" చెల్లెలు ఎక్కడ హేళన చేస్తుందోనని భయపడి వూరుకున్నాడు. ఇప్పుడు తను అడక్కుండానే చెల్లెలు మహావర ప్రసాదం పిలిచి చేతిలో వుంచినట్లయింది. దానితో తబ్బిబ్బులాడి పోతున్నాడు పరంధామయ్య.

    పొలం వెళ్ళితే భోజనం వేళకిగాని రాణి భర్త యింత త్వరగా తిరిగి రావటంలో గల కారణం ఏమిటో సుభద్రమ్మకి అంతు పట్టలేదు. ఏదయినా విషయం విన్నా స్నానం చేసి అన్నం తిని చుట్టచుట్టుకుంటూ కొంత...చుట్ట కాల్చుకుంటూ మరికొంత చెప్పేవాడు. అలాంటిది యింత హఠాత్తుగా రావటంతో చేస్తున్న పనిని ఆపేసింది.

    నాటకంలో తన పోర్షన్ కంఠతాపడుతున్న కావేరికి తండ్రి నడుస్తుంటే కిర్రు చెప్పుల మోత వినిపించుతుంది. ఇంతకుముందే కదా నాన్న బైటికి వెళ్ళింది?...ఇంతలో వచ్చేశారేమిటి? అన్న ఆశ్చర్యం కలిగింది.

    "ఇవ్వాళ లేచిన వేళ ఎంత మంచిదయిందో? యిది విన్నావా సుభద్రా?" అంటూ వరండా అరుగుమీద చతికిల పడిపోయాడు.

    "ఏం జరిగిందండీ?" చేస్తున్న పనిని ఆపి దగ్గరకు వెళ్ళింది.

    చదువుతున్న కాగితాలను వడిలో వుంచేసుకుని వినేటందుకు సిద్దముగా కూర్చున్నది కావేరి.

    "రాత్రి పూజారిగారిని పిలిపించి మా చెల్లెలు అడిగిందట! పెద్దవాడికి వివాహం చేయకుండా చిన్నవాడికి చేయవచ్చునా? అని. దోషమేమీ లేదు. చేయవచ్చును అని సలహా చెప్పారట! చుట్టుపక్కల ఊళ్ళ నుంచి మా పిల్లని యిస్తామంటే? మా పిల్లని యిస్తామని కబుర్లు చేస్తున్నారట....ఈ పోరుపడలేక ఈ పుష్య మాసంలో కావేరికి వినాయకానికి పెళ్ళి చేయాలని తొందర పడుతొంది. ఇంటికి వెళితే చెప్పింది..."

    ఉలిక్కిపడింది కావేరి!....తనకీ వినాయకం బావకి పెళ్ళి. పెళ్ళి అనుకుంటున్నారేగాని; యింత త్వరగా నిర్ణయించబడటమా? యింక పెళ్ళి చేసుకుంటే సంసారం-పిల్లల్ని కనటం! పెంచడం! అత్తయ్య అజమాయిషీతో వుండాలి!....తను సినిమా హీరోయిన్ అయ్యేది ఎప్పుడు? తన కోరిక తీరేది ఎప్పుడు?...యింక ఇంతేనా తన జీవితం?...ఆంధ్రుల అభిమాని తారగా వెలుగొందగల అవకాశం, అదృష్టం తనకి లేవా?...తన కోరికలు ఆ నాలుగు గోడల మధ్య బందీ అయిపోవాలా?...తను అనతికాలంలోనే అగ్రశ్రేణి తారగా వెలుగొందగల అవకాశం తనకి లేదా?

    ఆలోచనలలో పడిన కావేరికి ఆ తరువాత తల్లిదండ్రులు చెప్పుకునేవి గాని; చర్చించుకునేవి గానీ వినలేకపోయింది. పెళ్ళి విషయం అత్తయ్య కదిపింది కాబట్టి యింక జరగక పోవటం అంటూ వుండదు....తన కర్తవ్యం ఏమిటో? ఏమీ చేయాలో తోచటం లేదు కావేరికి!...తమ స్కూలు యానివర్సిడే జనవరి ఫస్టున కాబట్టి ఈలోగా తమ నాటకం పూర్తవుతుంది...అప్పుడు కర్తవ్యం ఆలోచించుకోవాలి! అత్తయ్యా నాన్నకి చెప్పినదంటే తనూ బావా నిర్ణయించుకునే వుంటారు...లేదా బావ వత్తిడి అయి వుండవచ్చును. అత్తయ్య తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నదంటే యింక తిరుగుండదు...ఎవరు?...ఎవరు తనకి ఈ విషయంలో సలహా యిస్తారు?....అంతవరకూ నాటకంలో హీరోయిన్ పాత్రలో తనను జయసుధలాగా ఊహించుకుని డైలాగ్సు చదువుతూ హావభావాలు ప్రదర్శించుకుంటోంది....ఆ ఉత్సాహం యిట్టే హరించుకు పోయింది పెళ్ళి మాటలు వినగానే!

    "ఏం చేస్తున్నావు కావేరీ!" అంటూ వచ్చింది సుభద్రమ్మ అక్కడికి.

    "ఏముందీ?...చదువుకుంటున్నాను..."

    "మీ నాన్న చెప్పిన మాటలు విన్నావా?"

    "ఆఁ..."ముక్తసరిగా జవాబు యిచ్చింది.

    "నువ్వు అదృష్టవంతురాలివని నువ్వు పుట్టిన క్షణం నుంచే అనుకున్నాం...అలాగే జరిగింది...మాకు వినాయకం లాంటివాడు అల్లుడుగా దొరకటం కంటే భర్తగా నీకు లభించటం ఎంతో అదృష్టం! ఇంత శుభవార్త వింటాననుకోలేదు!..."

    తల్లి మాటలకి ఎంతో సంతోషించవలసింది పోయి చిరాకుపడి పోయి యింక అక్కడ వుండకుండా లేచి కాగితాలను తన పుస్తకాల మీద వుంచి బైటికి వెళ్ళిపోయింది.

    అలా వెళ్ళిపోతున్న కూతురిని ఆశ్చర్యంగాను, వింతగానూ చూసింది సుభద్రమ్మ...తాము యింత ఆనందపడుతుంటే? దానికి ఇసుమంతయినా ఆనందం కలిగించక పోవటం ఏమిటి? యిద్దరూ ఎంతో యిష్టంగా వుంటారు. కావేరి ఏది కావాలన్నా తీసుకువచ్చి యిస్తాడు అలాంటిది అతనితో పెళ్ళి అంటే ఎందుకలా ఎడమొహం పెట్టుకుందో అర్హ్ద్మ కాలేదు పెళ్ళి అంటే ఎంతో సిగ్గు పడతారు. ముఖ్యంగా ఆడ పిల్లలు!...అలాంటిది కావేరి మూతి బిగించుకుని వెళ్ళిపోవటంలో ఆంతర్యం అర్ధం కాలేదు! అలాగే చూస్తూ వుండిపోయింది.....

   
                                  8

    తలవంచుకుని ఏకాగ్రతతో నడుస్తున్న కావేరికి ఎదుట ఏ వాహనాలు వస్తున్నాయో కూడా తెలియనంతగా ముందుకి వెళుతున్నదల్లా దూరం నుంచి స్కూటర్ శబ్దం వినిపించే సరికి చటుక్కున తల ఎత్తి చూసింది.

    "నేనండి అమ్మాయిగారూ! నాగులుని! ఏమిటలా చూస్తున్నారు?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra