Home » Yerramsetti sai » Jaya Vijaya


    విజయ అందరికీ టీ అందించి "అవును! ఫోటో దిగి మీకు పంపించాలని అంటూనే వుంది వారం రోజుల్నుంచీ." ఆమెను సమర్ధిస్తూ అంది విజయ.
    "అయితే ఎన్నాళ్ళలో పంపుతారో చెప్పండి!" జయను అడిగాడతను.
    "వారంలోగా తప్పక పంపుతాను!"
    "మర్చిపోరు కదూ?"
    "భలేవారే! ఎలా మర్చిపోతాను?"
    "ఏమో విజయగారూ! చాలా విషయాలు మర్చిపోయారు మీరు, ఇప్పటికిప్పుడే! అవునా కాదా?" నవ్వుతూ అన్నాడతను.
    "అవన్నీ వేరులెండి!" తనూ నవ్వుతూ అంది జయ.
    మరికాసేపు ఏవేవో విషయాలు మాట్లాడి టైమ్ చూసుకుని వెళ్ళడానికి సంసిద్ధమయ్యాడతను.
    విజయ, జయ ఇద్దరూ అతనితోపాటు గేటు వరకు నడిచారు.
    "థాంక్యూ వెరీమచ్ విజయగారూ! మిమ్మల్ని కలుసుకోలేమోనని నిరాశపడ్డానుగానీ ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఉంది. మీక్కూడా థాంక్స్ జయగారూ! నేను విజయ గారి ఫ్రెండ్ నయినా మీరు ఎంతో చక్కగా ట్రీట్ చేశారు." అభినందిస్తూ అన్నాడతను.
    "నమస్తే!" అన్నాడు చంద్రకాంత్.
    ఇద్దరూ ప్రతి నమస్కారం చేశారు.
    అతను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు.
    విజయ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగిపోయినాయి.
    అతనిని చూస్తుంటేనే తెలిసిపోతోంది అతను ఎంత మంచివాడయిందీ. ఎంత నిష్కల్మష హృదయం గలవాడైందీనూ! విజయ అన్న పేరే అతనికి ఎంతో తీయనిది. ఆ పేరంటే తనకు ఎంత ఇష్టమో ఎన్నోసార్లు రాశాడు తనకు. ఉత్తరాల ద్వారా తామిద్దరిమధ్యా ఏర్పడ్డ తీయని అనుబంధం, అభిమానం అన్నీ తనకు తెలుసు. అయినా అతనిని దారుణంగా మోసగించింది. తనకు తెలీకుండానే అతనిముందు నాటకమాడింది. నిజంగా తనెంత దుర్మార్గురాలు? ఇప్పటికైనా మించిపోయింది లేదు.
    "క్షమించండి చంద్రకాంత్ గారూ! నేను తప్పు చేశాను. నేనే అసలు విజయను. ఇది మా చెల్లెలు జయ! ఏవేవో తెలివితక్కువ ఆలోచనలతో మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసగించాను." అని చెప్పేస్తే?
    "వస్తాను విజయగారూ! ఇక్కడికొచ్చేముందు నేనూహించుకున్న రెండు ఊహలు తప్పయినాయి. మొదటిదేమో మీరు ఇంత అందంగా ఉంటారనుకోలేదు. రెండోదేమో మీరు ఉత్తరాలు రాసినట్లే ఎంతో స్వేచ్చగా, సరదాగా మాట్లాడతారనుకున్నాను. ఆల్ రైట్. మనం కలుసుకోవడం ఇది మొదటిసారి కాబట్టి మీక్కొంచెం అనీజీగా ఉందేమో! కనీసం మరోసారి మనం కలుసుకున్నప్పుడైనా నిరాశ పర్చకండి! సరేనా? జయ వంక నవ్వుతూ చూశాడు అతను.
    అతని చూపుల్లోని భావాలు గ్రహించిన జయ ఖంగారుపడింది. అతనిని తన రూపం ఎంతగా ఆకర్షించిందీ తెలుస్తూనే వుంది.
    కొంపతీసి అతను తనతో ప్రేమలో పడలేదు కదా!
    అదే నిజమయితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయ్.
    చంద్రకాంత్ వెళ్ళిపోయాడు.
    జయ,విజయ ఇద్దరూ లోపలకు తిరిగి వచ్చారు.
    "హమ్మయ్య! గండం గడిచింది." సోఫాలో కూలబడి గట్టిగా నవ్వేయసాగింది విజయ.
    జయ కూడా ఆమె పక్కనే కూర్చుని తనూ నవ్వేయసాగింది తేలికపడ్డ మనసుతో.
    "అయిందా నాటకం?" అడిగింది అక్కడికొచ్చి పార్వతి ఇద్దరినీ చూస్తూ.
    "అది సరేగాని మీ వసుంధర ఏమంది?" అడిగింది విజయ.
    "ఏమనడమేమిటి నేను వస్తున్నట్లు, నన్ను తనతోపాటు ఉంచుకునే ఏర్పాట్లు చేయమనీ ఇవాళే ఉత్తరం రాసి పోస్టు చేసేసింది. నాలుగు రోజుల్లో జవాబు రానేవస్తుంది. అప్పుడు బస్ స్టాండ్ కు రమ్మని టెలిగ్రామిచ్చి బస్సెక్కేయడమే! అంతే!" చెప్పింది జయ.
    వారంరోజుల తర్వాత చంద్రకాంత్ నుంచి ఉత్తరం వచ్చింది విజయకు. ఆత్రుతతో చదవసాగిందామె.
    విజయా!
    మీదగ్గర నుంచి వచ్చేశాక ఏరోజు కారోజే ఉత్తరం రాయాలని అనుకోవడం, కాగితం కలం తీసుకుని గంటలకొద్దీ కూర్చుని నా మనసులోని భావాలు ఎలా రాయాలో తెలీక ఆ ప్రయత్నం విరమించుకోవడం... ఇలా జరుగుతోంది. నిజమే! ఇంతకుముందు మీకు ఉత్తరాలు యెన్నో రాశాను. ఎన్నో కథలూ, నవలలూ కూడా తేలిగ్గానే రాయగలిగాను. అందులో ప్రేమ సన్నివేశాలూ కల్పించగలిగాను.
    కానీ ఈసారి మీకు ఉత్తరం రాయడం ఏమాత్రం చేతకావడం లేదు. ఎందుకంటారా?
    మిమ్మల్ని కలుసుకోవడం వల్ల నాలో చాలా మార్పులు వచ్చినయ్. ఆ మార్పులను వర్ణించడం ఎలాగో తెలీటంలేదు.
    కొన్ని ప్రేమ కథలు రాసినా ఇంతవరకూ నిజానికి "ప్రేమ" అనేది నాకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు.
    ఎంతోమంది అమ్మాయిలతో నాకు పరిచయముంది. మా పిన్ని కూతురు ఫ్రెండ్స్ చాలామందికి నా కథలంటే ఇష్టం. అంచేత నాతో చనువుగానే మసిలేవాళ్ళు. అయినా గాని నాకెప్పుడూ వారిమీద ఇంకో భావం ఏర్పడలేదు. కానీ మీరు ఎంతో అభిమానంతో ప్రారంభించిన ఉత్తరాలు నన్నెంతో ఆకర్షించాయి. నాకు తెలీకుండానే మిమ్మల్ని ఎంతో దగ్గరకు తీసుకువచ్చాయి. అయితే మీరు ఇంత అందంగా ఉంటారని, అంతకంటే అందమైన మనసు ఉంటుందని నేననుకోలేదు. మీ అందానికి, మీ వ్యక్తిత్వం మరింత నిండుతనం ఇచ్చింది. ఇంక మీ ప్రేమలో మునిగిపోకుండా నన్ను ఎలా రక్షించుకోగలను? కేవలం స్నేహ భావంతోనే మీరు నన్ను అభిమానించి ఉండవచ్చు! ఉత్తరాలు ఆ కారణంగానే రాస్తూ ఉండవచ్చు. ఆ అభిమానంతోనే మీ ఇంటికొచ్చినప్పుడు నన్నాదరించి ఉండవచ్చు. అలాంటి స్నేహ భావం వున్న మిమ్మల్ని ప్రేమించడం నా తప్పయితే అవ్వవచ్చు. కానీ నేనేం చేయను? నన్ను నేను అదుపులో పెట్టుకోవడం సాధ్యంకాలేదు. మనసు పూర్తిగా వశం తప్పిపోయింది. విజయా! మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీరు నా జీవితాన్ని పంచుకుంటారా? నాకు ప్రేమ భిక్ష పెడతారా?

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra