Home » Yerramsetti sai » Kanthi Kiranalu

 

    పెద్దవాళ్ళ పరిస్థితి గ్రహించి , ఇద్దరికీ వివాహం చేయాలనే నిర్ణయాని కొచ్చారు. ఆ నిర్ణయానికొచ్చిన దగ్గర్నుంచి తాము నిజంగానే భార్యా భర్తలమన్న భావన ఇద్దరి మనసులోనూ ప్రవేశించింది.
    తనకు కాలేజీ తెరచారు. రోజూ తనను కాలేజీ వరకూ తీసుకొచ్చి వదలి తిరిగి వచ్చేవరకూ బయటే ఎదురు చూస్తుండేవాడతను.
    అప్పట్లో లగ్నాలు లేకపోవటం వల్ల మరో రెండు నెలల తర్వాత ముహూర్తం నిర్ణయించారు.
    అతని శెలవు అయిపోవచ్చింది. అతను వెళ్ళిపోయే రోజు దగ్గర కొస్తున్న కొద్దీ - ఇద్దరి మనస్సుల్లోనూ ఆందోళన మొదలయిపోయింది. తను మరీ దిగులు పడిపోయింది. అతనిని చూడకుండా రెండు నెలలు ఎలా గడపాలని బాధ పట్టుకొంది. అంతవరకూ మగాళ్ళు మోసగాళ్ళని అనుకొంటూ వచ్చిన అభిప్రాయం ఎటు పోయిందో తెలీదు !
    ఆఖరి ఆదివారం వచ్చింది.
    ఆ మర్నాడే అతని ప్రయాణం.
    "మనిద్దరం కలిసి సంపూర్ణంగా గడపగలిగిన రోజదొక్కటే ...." అన్నాడతను.
    "అవును ...." దిగులుగా అంది తను.
    "మనం బీచ్ కేళధాం. సాయంత్రం వరకూ అక్కడే కబుర్లు చెప్పుకొంటూ కూర్చుందాం , ఏమంటావ్?"
    వప్పుకుంది తను.
    ఇద్దరూ మధ్యాహ్నంపన్నెండింటికల్లా సముద్రం దగ్గరకు చేరుకొన్నారు. చాలాసేపు ఒద్దు నున్న పొడుగాటి పడవ మీద కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ గడిపారు. ఎంత మాటాడు కొన్నా తనివి తీరటం లేదు. హటాత్తుగా మబ్బులు మూసుకొచ్చినయ్.
    "వర్షం వచ్చేట్లుంది. ఇంటికి పోదాం" అంది తను గాభరాగా.
    ఇద్దరూ లేచి ఇసుకలో బస్ స్టాండ్ వేపు నడువసాగారు. అప్పటికే పెద్ద చినుకులు మొదలయినయ్.
    అక్కడవున్న కిళ్ళి కొట్టుదగ్గర నిలబడ్డారిద్దరూ.
    "బస్సు ఎప్పుడొస్తుంది ?" కొట్టతన్ని అడిగాడు ప్రసాద్.
    "ఈపాటికి రావాల్సింది ఎక్కడన్నా ఫేయిలయిందేమో " కొట్టుకట్టేసి తాళం వేస్తూ అన్నాడతను. వర్షం సన్నగా కురవడం మొదలుపెట్టింది. కొట్టతను గొడుగేసుకొని రోడ్డు వెంబడే నడుచుకొంటూ వెళ్ళిపోయాడు.
    ఆ ప్రాంతంలో నరసంచారమే కనిపించటం లేదు.
    మబ్బులు మరింతగా మూసుకొచ్చినయ్! మరుక్షణంలో వర్షం కుంభవృష్టి గా కురవడం మొదలు పెట్టింది. తాటాకుల పందిరి ఆ కిళ్ళీ కొట్టుకి ఎంతో సేపు రక్షణ ఇవ్వలేకపోయింది.  క్రమంగా తామిద్దరూ వర్షపు జల్లుకి తడిసిపోసాగాడు. చూస్తుండగానే చీకట్లు కమ్ముకొచ్చేసినయ్! సముద్రపు హోరు ఎక్కువయింది. ఏ క్షణంలో సముద్రం విరుచుకు పడుతుందా అన్నట్లుంది . తనకి లోలోపలే చాలా భయం వేసింది.
    "ప్రసాద్! ఇప్పుడేం చెద్దాం?" అంది భయంగా.
    "అరె! ఈ మాత్రానికే భయపడుతున్నావా? ఇలాంటి వాతావరణానికే భయపడితే మరింక మేము అంతంత మారణాయుధాలతో యుద్దమెలా చేస్తామనుకొంటున్నావ్?"
    తాటాకు పందిరంతా నీళ్ళు కారుతున్నాయ్. కొద్ది నిముషాలలో పూర్తిగా తడిసిపోయింది తను.
    "ఎలాగూ తడిశాము కదా! ఆ బల్ల మీద కూర్చుందాము" కొట్టుపక్కనే ఉన్న చెక్క మీద కూర్చుంటూ అన్నాడతను.
    ఇద్దరూ అతి దగ్గిరగా కూర్చున్నారు. పూర్తిగా చీకటి పడిపోయింది. ఎక్కడా బస్సు వస్తున్న జాడే లేదు.
    చలిగాలి ఉండుండి విదిలించి కొడుతుంది. చలికి తట్టుకోలేక వణికిపోసాగింది తను.
    "ఇలా దగ్గిరకురా! నీకు చలిపోగొడతాను ....." తనది పూర్తిగా అత్తని కౌగిట్లో బంధిస్తూ అన్నాడతను. నిజంగానే అతని కౌగిలి వెచ్చగా అనిపించింది. అతని స్పర్శ తనలో కూడా వేడిని కలిగించసాగింది.
    "స్వరూపా!" తనని గాడంగా గుండెలకు హత్తుకొన్నాడతను.
    ఉద్రేకంతో అతనిని పెనవేసుకుపోయింది తను.
    ఇద్దరినీ కోరిక జయించింది.
    తామలా యెంతసేపు ప్రణయంలో మునిగి తేలారో , వర్షం ఎప్పుడాగిపోయిందో ఇద్దరకూ తెలీలేదు.
    దూరంగా వస్తోన్న బస్ లైట్లు చూసి కౌగిలి నుంచి విడిపడ్డారు.
    ఇంటికి చేరుకునేసరికి రాత్రి పదయింది.
    మర్నాడే అతను వెళ్ళిపోయాడు.
    కొద్దిరోజుల తర్వాత తెలిసింది.
    తను గర్భవతి !

                                    *    *    *    *
    
    "జరిగిందానికి బాధపడుతున్నావా స్వరూపా?" జాలిగా అడిగింది కృష్ణకుమారి.
    "ఏమిటి " ........ తత్తరపాటుతో ఆలోచనల్లోంచి తేరుకొంటూ అంది స్వరూప.
    "ఏమిలేదులే! నువ్వేదో ఆలోచనలో పడినట్లున్నావ్" నవ్వుతూ అందామె.
    మరికొంచెం సేపు అవీ - ఇవీ మాట్లాడి కృష్ణకుమారి వెళ్ళిపోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra