Home » Sree sree » Rekkalu Vippina Revolution


    బంగాళాదుంపల్ని తీసుకు వెళ్ళే ట్రయిన్లను నడపకుండా అది చెయ్యగలదు. (ఎల్లప్పుడూ బంగాళాదుంపలే పేదల తిండి దినుసు) . ఫినిస్తేర్ స్టేషన్ లో ఈ బళ్ళు ఆగిపోతాయి. అక్కడ నుంచే వర్కర్లు కాంటీన్లకు వెళ్ళాలి. అక్కడే వాటి అవసరం.
    అయితేనేం? ఒక్కొక్క రోజే భారంగా గడుస్తుంటే, స్పష్టంగానో, అస్పష్టంగానో మెల్లమెల్లగా దినాలు గడుస్తుంటే, ప్రత్యక్ష చర్య వైపుగా త్రాసు మొగ్గుతుంది.
    పాతరాతియుగపు కమ్యునిస్టు రాక్షసి ఇపుడు కరచరణాలాడనిది. దాని నాసారంధ్రాల నుంచి మాత్రమే విషపు పొగలు వెలువడుతున్నాయి. దాని ఒకనాటి ప్రచండ కళేబరాలు చుట్టూ ప్రచండ కళేబరం చుట్టూ , చిట్టి పొట్టి జనాలు నమ్మశక్యం గాని వేగంతో తిరుగుతూ ఝుంకారం చేస్తున్నారు.
    మెరుపులతో నిండిన ఆకాశంలో , తడి రెక్కల్ని అల్లల్లాడిస్తూ రాబందు కీచు పెడుతోంది.
    61 వేల జాతీయపోలీసులు (వారిలో 16 వేల మందికి నల్ల యూనిఫారాలు ధరించేసి ఆర్.యస్. దళాలు)
    168 వేల సైన్యం. అందులో 120 వేలమంది నిర్భందసైనిక శిక్షణ పొందినవాళ్ళు. వీళ్ళని బొత్తిగా నమ్మడానికి వీల్లేదు. "అంటుజాడ్యం ' తగలకుండా వీళ్ళని బారకాసులలోనే ఉంచేస్తారు'. అంటూ జాడ్యం అప్పుడే ఆరంభమయింది. వాళ్ళలో కార్యాచరణ సంఘాలు ఏర్పడి ఉన్నాయి.
    చిన్న హోదాల (నాన్ కమీషన్) అఫీసర్లంతా విద్యార్ధులు , సిపాయిలంతా యువక కర్షకులూ, కార్మికులూ 48 వేల మంది వృత్తి సైనికుల్లో సుమారు సగం మంది జనరల్ అధికారం కింది కొస్తారు. వీళ్ళని నమ్మవచ్చు.
    అయితే మాస్సుని ? ఏమో అప్పుడే చెప్పలేం.
    పారాదళాలున్నాయి. వీళ్ళ సంఖ్య ఇప్పుడు కొన్ని వేల మందికి తగ్గింది. చావో రేవో అంటూ పల్లె గ్రామాల్లో తిరుగుతున్నారు. మృతదేవతల సంధ్యా శక్తులు వీళ్ళు. కుళ్ళిపోయిన పాత కమ్యునిస్టు రాక్షసి యొక్క మెదడు, వీళ్ళు. ఈ రాక్షసి బల్లికి తెలుసు - తాను రంగం నుంచి నిష్క్రమిస్తున్నానని, ఆడ్డు గోడగా నిలిచినా సి.జి.టి కూలిపోతుంది.
    కొండచరియల నుంచి ప్రవహిస్తున్న లావా వేగాన్ని పుంజుకుంటోంది. మంచు ప్రవాహాలయుగం చివరి దశ చేరుకుంటోంది.
    మెదడు మొర్రోమంటూ భయంకరమైన సిగ్నల్సూ పంపిస్తుంది. రాబందు వాటినందుకుంటుంది. సి.యఫ్. టి.డి (కేధలిక్ కార్మిక సంఘం) ఒక కొత్త లేడిపిల్ల. పాత రాకాసుల భయ మింకా వదలనిది. ఒంటరిగా బతకగల ఆశలేని అర్భకురాలు. ఎవరితో చేరాలో ఎంచుకోకతప్పదు.
    ఉభయులూ రాబందుతో మాట్లాడుతారు.
    లూవియేర్ (శబ్దం, వెలుగు) ప్రదర్శన రంగం ఒక క్షణకాలం పాటు కాంతి మయవుతుంది. నామమాత్రులైన వామపక్షాల వారి అభిశంసనతీర్మానం ఒడిపోయింది.
    ఏది ఏమైనా సోన్ లూవియేర్ ప్రదర్శనం మాత్రం సాగిపోవలసిందే(sonet lumiere)
    ఈఫిల్ టవర్ మూడో అంతస్తులోని రేడియో , టెలివిజన్ సరంజామా విశాస పాత్రులైన సైనికులు రక్షిస్తుండగా, ప్రదర్శనాన్ని చేతిలోకి తీసుకోవడానికి సిద్దంగా ఉంది.
    పార్లమెంటు మసకలోకి కనుమరుగవుతోంది.
    కాన్- బాందీని ఫ్రాన్స్ నుంచి తరిమేశారు. ప్రదర్శనను బ్రతికించే ఆఖరి రసవదట్టం.
    ఎంచేత నంటే విద్యార్ధులు మళ్ళీ వీధుల్లో కొస్తారు; అమాయకంగా , అందంగా అగ్రహోపెతంగా , ఇతరుల సాయం లేకుండా.
    సి.జి.టి సంఘమూం సి.పి.(కమ్యునిస్ట్ పార్టీ) ఎడంగా నిల్చొని కనిపెడుతూఉంటాయి. మా మిత్రులు శత్రువులు మాకూ శత్రువులే.
    మళ్ళీ పోరాటం. ఈసారి బూల్ మీట్ యుద్ధ రంగం. డేస్ ఎకోల్ వీధిలో మంచి బారీ కేడ్లున్నాయి. మూడు వృక్షాలు కూడా కామ్రేడ్లులా సాయం చేస్తాయి.
    యధా ప్రకారం నల్ల యూనిఫారాలు బూల్ విష్ దిగువ ప్రాంతం నుంచి దాడి చేస్తాయి. ఒక కొత్త వ్యూహం రూపొందుతుంది. బారికేడ్లు మరీ దగ్గరదగ్గరగా ఉండకూడదు. మరీ చాలా సేపు ఉంచకూడదు. వాటి మధ్య యాభై గజాల పై చిలుకు దూరం వుండాలి.
    శత్రువు సేనాముఖం భయంకరమైన కవచంతో బతువైనదీ, అడ్డ దిడ్డమైనదీను. మరేవో లోకాలకీ చెందినట్లుంటాయి, కూత పెట్టి, దెబ్బ కొట్టేవేళకి దెబ్బకాచుకుంటున్న వాళ్ళేక్కడా కనబడకూడదు. బారీకేడ్ల వెనక్కి పోవాలి. ఆయుధాలన్నీ వాడాలి.
    దృష్టి మళ్ళించే ఎత్తుగడలు ముఖ్యం. శత్రువు ఉదృతం తగ్గించాలంటే తగ్గించవచ్చు. తాత్కాలికంగా ఆపవచ్చు కాని (స్థానిక ) బాహాబాహీ యుద్దంలో వాళ్ళని ఓడించడం అసంభవం. కారణం వాళ్ళ ఆయుధాల అధిక్యమూ, యుద్ధవిన్యాసాల నేర్పరితనమూ ! దెబ్బ కాచుకుంటున్న వాళ్ళందరిదీ ఒకే ఆలాపన. "మేమంతమందిమీ ఇప్పుడు జర్మన్ యూదులమె" అని. ఎంచేతంటే ఏనాడో కమ్యునిస్టు మసిపాతపత్రిక కాన్ బాందీ జన్మ రహస్యాన్ని బయట పెట్టింది.
    ఆఖరి బారికేడ్లు మిగిలేదాకా పోరాటం సాగుతుంది. ఆ తర్వాత కూడా! కాని ఇందువల్ల ఏం లభించినట్లు ? లాటిన్ కార్టరు లాంటి పరిమిత రంగంలో మాత్రమే భాష్పవాయువో, ప్లాస్టిక్ బాంబులో అధికారాన్ని అమలు చేతగలిగినపుడు పోలీసు స్టేషన్లలో చావబాదడాలూ, అవమానాలూ, ఏడుపులూ, ! తతిమ్మా అన్ని ప్రాంతాలలోనూ ఈ నల్ల పురుగులు కదలలేకపోవడమే కాకా కనిపించకుండా పోతున్నప్పుడు వాటికి ఒక విజయ భ్రాంతిని కలిగించే దృశ్యాన్ని అందజెయ్యడమా? ఇది నిజంగా అవసరమా?
    అవసరమే -- ఎందువల్లననగా , ప్రతి పరాజయమూ ఒక విజయమే కాబట్టి బోజాన్  'కాన్ సెంట్రేషన్' క్యాంపులో ' లో దెబ్బలు తింటున్న వాళ్ళ ప్రతీ అరుపూ ఒక సహాయం కోరే అక్రంధనం కాబట్టి. అది అంతరాత్మలలో మారు మ్రోగుతుంది కాబట్టి.
    ఒకవిధంగా అనవసరం కూడా. ఏమంటే రాబందుకీ రాక్షసీ బల్లికీ ఒక ఉత్తుత్తి క్రీడా రంగాన్ని సమకూర్చి ప్రజలలో గజిబిజి తెచ్చి,  ఈ సంఘర్షణ హాహాకారాలు మాత్రమె ఏకైక వాస్తవికత అనే భ్రమ కలుగుతుంది కాబట్టి.
    బుధవారం యుద్దపు రోజు. గురువారం యుద్ధపు రోజు. కాని ఇక విద్యార్ధులిదంతా విరమించాలనుకుంటారు -- రాబోయే నూతన జీవిత వ్యవస్థను తొందరగా, ఓర్పుతో పునర్మించవలసి సమయమిది కాబట్టి. అయినా పోరాటం నిష్కరుణగా సాగుతూనే ఉంది. చైనీస్ నీతి కధలోని చెరువులోని చేపలాగా, యువకులు పోరాటాలలో ఓడిపోవచ్చు గాని ఎక్కడ'పడితే అక్కడ మళ్ళీ ప్రత్యక్షమవుతారు.
    ప్రస్తుతం ఆసుపత్రిగా మారిన సోర్భాన్ లో ఒక చెయ్యి ఇలా వ్రాసింది:
    'అప్పుడే పది రోజుల అనందం."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra