Home » Veturi prabhakara sastry » Chatupadya Manimanjari

 

                వరాహవతారము

    శా.    అద్యాలోకన భక్తీసంభ్రమదనేహః పురుషత్యక్త స
        త్పద్యాంభస్తులసీభ్రమ ప్రదఖుర ప్రక్షాళ నామాత్ర జా
        గ్రద్యోగాంబుధి దంష్ట్రికా గ్రరిపుహృత్కాలామిష ప్రాయశుం
        భద్యాదోనిధి సప్తకీస్థలికిటి బ్రహ్మంస్తుమ స్త్వామనున్.

    
               నరసింహావతారము

    శా.    డింభద్రోహివధోత్కటోత్ర్క మణరుష్టిక్లిష్ట తారోమ కూ
        పాంభోజ ప్రభవాండభాండదళనోధ్యద్ధ్వనధీకృత్సభా
        స్తంభాంత స్తృటనాస్పురత్పట పటద్వన్యాస్త నిశ్చేష్ట ని
        ర్ధంభోద్యోగదిశావశాపనృహరి బ్రహ్మంస్తుమ స్త్వామనున్.
        

                 వామనావతారం

    మ.    స్వతలస్వచ్చ తరారుణత్వరచితస్వస్త్రిః పరే డ్ర్భంతి వా
        క్ప్రతి కూలత్వ దశానుకారిగళ గాద్గడ్యక్షమాం భోజ భూ
        నుతిహసన్నఖరోర్ధ్వసారిత పదార్ణోరుడ్జగంగాసవ
        ప్రతి మాళీశక పర్ద మండలవటు బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

            పరశురామావతారము

    శా.    అజిప్రౌఢిమ దుర్జయార్జున గళోద గ్రాసృగాస్వాదన
        వ్యాజాపోశనభాక్తదస్వపహృతి ప్రాణాహుతి ప్రస్పుర
        ద్రాజాళీదివ సావసానవిఘ సప్రాయెందు వేలాయితా
        భ్రాజాధ్యక్షకుఠార ధారిభృగురాద్బ్రాహ్మం స్తుమ స్త్వా మనున్.

        
                  శ్రీరామావతారము
        
    శా.    చాపచ్చాత్రనిషంగ భంగకుపిత క్ష్మాభృద్దనుః పంచవి
        క్ర్తి పంచాళిక దృజ్ని యుక్త హుత భుగ్గ్రీవాద్యయీ పంచక
        వ్యాపార భ్రమకారి పంక్తిగళగళ్యాఖండనఖండదో
        ర్నైపుణ్యప్రదరౌఘ రాఘవ పరం బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

              బలరామావతారము
    మ.    కరిపూరుద్దరణేద్ద లాంగల విభగ్న క్ష్మాభరాదక్షది
        క్కరిపాద ప్రహతిస్పుట స్పుటిత భాగవ్యాపృత గ్రీవసూ
        కరపీఠీకృత పృష్ట తాహిత మహాగాఢాధి కూర్మాధీరా
        ట్పారిక్లుప్త ప్రళయాంబు గహనహలి బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

                   శ్రీకృష్ణావతారము

    మ.    అతిదోఃపీడన కర్కరీ ఫలితకంఠాభత్వాదుత్తర్తుధూ
        ర్తతృణా వర్త దృఢాంగ పాతహతగోత్రా భర్తృ కొత్పాదిత
        క్రతుభు గ్రాద్ర్గాహణా గ్రహోన్ముఖశతారద్వస్తమైనాకని
        ష్పతన భ్రాంతి కానంద గోపకసుత బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

                    భౌద్దావతారము
    మ.    గిరియుష్మద్దనురస్త్రతా ప్రభ్రుతి మోఘీకృద్వధూశీలవి
        స్పురణా వర్మాభి దాడ్యఢార్ధ్యాసఫలీ భూతత్రి పూతత్రి పూ
        ర్వారదై తేయ జిఘాంసు శాసనపరోగ్ర ప్రాప్యసారూప్యని
        ర్భరదైతేయత థాగతాంగక పర బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.
    
                      కల్క్యావతారము

    మ.    స్వమహబాహుకృపాణకృత్త గళ తుచ్ఛమ్లేచ్చ వీర చ్చటో
        త్ర్కమదాపాదిత పద్మినీరమణ మధ్యచ్చిద్రఖస్వామికా
        గమనానా స్రపయః పరాగ మదితక్ష్మా సౌర గంగానదీ
        భ్రమకృత్కీర్తిక కల్కి మూర్తిక పరబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

    
            కంచి వరద రాజస్వామి

    సీ.    చేతిలో వెనముద్ద చెంగల్వ పూబంతి
                 రంగై నముత్యాల రావిరేక
        పచ్చలు దాఁపిన పతకంబు పులిగోరు
                  మేలైన ముత్యాల మేలుసరము
        నీలాల ప్రోఁగులు నిగ్గులు మెఱయంగఁ
                  దీరు గైకొన్న కస్తూరి బొట్టు
        ధగ ధగద్దగకాంతి మిగులురత్న కిరీట
                   మలరారు పసిఁడి దువ్వలువ చెలువ

    గీ.    మాన లూరింప వైశాఖ మాసమందు
        ఐసిఁడిరాధ మెక్కి తిరువీధి బయలువెడలు
        నిన్నుఁ గంటి నాకోర్కు లన్నియును గంటి
        వరగుణసమాజ! శ్రీకంచి వరదరాజ !

                      ధరణి

    సీ.    కుహనా కిటీంద్రునికో ఱ సోఁకిన భామ        
                 కలిమి చూపుల సింధు కన్య సవతి
        ఆఁ భోజవర్జున కైన శృంగారిణి
                  తాలిమి కెల్లను దానకంబు
        గజకుంభముల మీఁదఁ గాపున్న దేవత
                    రాజశేఖరుమనో రధము రధము
        పెను వేల్పుఁ గోర్కులఁ బిదికేడీ ధేనువు
                    మెట్ట పట్టులకును బుట్టినిల్లు
        
    గీ.    హరునియష్టాంగములకును నాది వేల్పు
        కడఁగి రత్నాదివస్తువుల్ గలుగు పెట్టె
        యల్లవలయాద్రిక్రిందిటి యంటుబిళ్ళ
        భవ్యగంధాది గుణముల భరణి ధరణి
    
                 వెంకటనగాధ్యక్షా జగద్రక్షకా!

    శా.    ఓహో పిల్చినఁ బల్కవేమి దయ లేదో కాక దిక్బాల సం
        దోహస్తోత్రమర్భాటిన్ వినగరాదో కాక ప్రాత్రప్పులం
        దూహళ్ సేయుచు వడ్డీ కాసులకునై యూరూరవర్తించెదో
        ఆహా మేలు మఱేమివెంకటనగాధ్యక్షా జగద్రక్షకా!

    మ.    కుడిహస్తం బిటు చూపుచందమిది వైకుంఠం బనేయందమో
        జడధివ్రాతపరీత భూభువన రాక్షాదక్షిణం బైన నీ
        యడుగుల్ చూడుమనేవొ కాకయొక యొయ్యారంబొ సందేహమై
        యడిగే, నానతియిమ్ము వెంకటనగాధ్యక్షా జగద్రక్షకా!

    మ.    గతమే వింటిని నీచరిత్రములు లెక్కంజాల మాయయ్య యా
        శ్రితరక్షామణి నీవెకావె మఱివేఱే లేదు నీపాదమే
        గతి లోకంబుల కాదివంద్యమసగ్రవ్య గ్రమాయామయో
        ద్దత భూతాళికి రక్ష వెంటనగాధ్యక్షా జగద్రక్షకా!

    శా.    అనీఐంగరు పచ్చడంబువలెనా టాశంఖచక్రాదిసం
        ధానానూనవిలాస మాఘనఘనోద్యత్సత్వ మాలోకర
        క్షానామం బణిమాదిభాసుర పదాబ్జద్వంద్వ మాజ్ఘరె నే
        త్రానందమ్ముగఁ గంటి వెంకటనగాధ్యక్షా జగద్రక్షకా!

        వెంకటాచలపతీ! కలశాంబుధి కన్యకాపతీ !
    
    ఉ.    శ్రీయలమేలుమంగ కుఛసీమల నుంచిన కుంకుమాంకసు
        శ్రీయుర మందు నేత్రములఁ జెక్కుల విభ్రమముల్ ఘటింపఁగాఁ
        బాయక శేషశైలమునఁ బాల్పడ నిల్చిన తండ్రి కావవే
        ధీయుత వెంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ!

    ఉ.    కంటిని శంఖచక్రములు కంటిని మీపులు కాపుతీర్ధ ని
        ష్కంటకవాసనారుచులు గంటిని మీ చరణాంబు జాతముల్
        తొంటి నిరూడపాపములఁ దూలుచు మీమధురప్రసాదముల్
        తింటిని వెంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra