Home » Yandamuri veerendranath » రక్త సింధూరం


    "ఈ విధంగా కసి తీర్చుకుంటున్నావన్నమాట."
    "ఇంకా ఎక్కువగా తీర్చుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను."
    "దీని పరిణామాలు ఎలా వుంటాయో తెలుసా నీకు?"
    "ఏముంది? మీవెనుకవున్న రాజకీయ గూండాల్తో నా మీద దాడి జరిపిస్తారు. అంతేనా! దానికి భయపడను. కానీ మీరే వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించుకోండి! ఎందుకు చేశారు మీరిదంతా? డబ్బు కోసమా? వున్నది ఒక్కగానొక్క కూతురు మీరు చేసిన దానికి ఒక అమాయకుడు, అప్పుడే పెళ్ళయినవాడు, మొదటిరాత్రికి కొన్ని గంటలముందు- దారుణంగా హత్య చేయబడ్డాడు. మీరు నిజంగా మనిషై వుంటే ఈపాటికే ఆత్మహత్య చేసుకుని వుండాలి! రాక్షసులు మీరు. మీరు చేసినదానికి ఇంతకు ఇంత కసి తీర్చుకుంటాను. మీరు చేసిన పరిధిలోనే నేనూ చేస్తాను. దానికిది మొదటి మెట్టు మాత్రమే. ఈ చర్యతో మీ కూతురి పరువు గంగలో కలుస్తుంది. వీలైనంత ఎక్కువగా దీనికి అడ్వర్టెయిజ్ మెంటు ఇస్తా..."
    "ఆపు" అరిచాడు. అతని మొహం జేగురు రంగులోనికి మారింది. అతడిని చూస్తూంటే ఏదో చెప్పాలన్న వ్యధ గుండెల్లోంచి తన్నుకొస్తున్నట్టుగా అనిపించింది. అతడి చేతులు వణకటం స్పష్టంగా కనిపిస్తూంది. "...ఇదంతా నేను డబ్బు కోసం చేయలేదు" అన్నాడు కంపిస్తున్న కంఠంతో.
    "మరి?"
    -అతడు జవాబు చెప్పలేదు. ఇనుము వేడిమీద ఉన్నప్పుడే దెబ్బకొట్టాలి. అతడి కళ్ళముందు కూతురి భవిష్యత్తు తెలుపు నలుపుల్లో స్పష్టంగా కనిపిస్తూన్నట్టుంది. సరీగ్గా నేను అనుకున్నట్టే మనిషి కదిలిపోయాడు. మనిషి కదిలిపోయినప్పుడే విషయం బయటకొస్తుంది. ఇబ్బందిగా నా వైపు చూశాడు. నేను అన్నాను-

    "ఒక ప్రతిష్ఠాకరమైన జైలుని అపఖ్యాతి పాలు చేయటానికి ప్రయత్నించారు మీరు. ఎన్నో సంవత్సరాల చరిత్రని ఒక్క చర్యతో నలుపు చేయటానికి సిద్ధపడ్డారు మీరు. నీతీ న్యాయం ఏమీ ఆలోచించకుండా ఇంతసిగ్గుచేటు పనికి దేనికి పూనుకున్నారు? డబ్బుకి కాకపోతే ఎందుకోసం? దేనికి కక్కుర్తిపడి?"
    "పోయే పరువుకి కక్కుర్తిపడి-" అతడి స్వరం నూతిలోంచి వచ్చినట్టుంది. "గోపీ! నీకు తెలుసు... నా భార్య పోయి ఇరవై సంవత్సరాలైందని. ఈ కాకీ బట్టల వెనుక ఉన్న శరీరంలో ఇంత జుగుప్సాకరమైన కోరికలుండటంలో తప్పు వున్నదో లేదో నాకు తెలీదుగానీ, ఫలితం- ఇరవై ఏళ్ల అమ్మాయిలతో నగ్నంగా వున్నా దృశ్యాలు- ఒక సీక్రెట్ ఫంక్షన్ లో ఉన్నప్పుడు వీడియో కెమేరాతో తీసినవి - దామోదరం దగ్గిర శాశ్వతంగా భద్రపరచబడ్డాయి. మై ప్రిస్టేజ్ వజ్ ఎట్ స్టేక్...... దామోదరం బేరం పెట్టాడు. తనకి కావల్సిన గూండాల్ని జైలునించి బయటకు పంపితే ఆ క్యాసెట్ ఇస్తానన్నాడు. కూ ప్లాన్ చేశాను, 'కూ' లో శివప్రసాద్ మరణిస్తాడని నేనూ వూహించలేదు. ఇన్ని రోజులుగా నేనూ ఎంతో బాధపడుతూ వచ్చాను గోపీ! కానీ ఒకసారి ఆ క్యాసెట్స్ బయటపడితే నా స్థితి ఎలా ఉంటుందో వూహించుకుంటూ వుంటే, ఇక నాకు వేరే దారిలేదేమో అనిపించింది-"
    "బయట నుంచి సెల్ వరకూ సొరంగం తవ్వింది కూడా మీరే కదూ.."
    "అవును. ఎన్నో రోజులు కష్టపడి తవ్వాను. నీ మూలంగా అది కూడా ఫెయిల్ అయింది."
    చాలు. అంతవరకే నాకు కావల్సింది. అతను నిల్చున్న వెనుక వైపు వున్న బీరువాకేసి చూస్తూ చెయ్యి వూపాను. అక్కడ రికార్డు చేస్తున్న కెమేరాలోంచి ఈ దృశ్యం బయటికి కనబడుతుంది.

    గదికి ఉన్న రెండు తలుపులూ తెరుచుకున్నాయి. ఆఫీసర్లు బిలబిల మంటూ లోపలికి వచ్చారు. మొత్తం నలుగురు. వాళ్ళని చూడగానే జగన్నాధం మొహం పూర్తిగా పాలిపోయింది.
    అందరికన్నా ముందు వచ్చినవాడు అడికిలమెట్ట దగ్గర నన్ను అరెస్టు చేసిన పోలీస్ ఇం స్పెక్టర్... కాదు.... ఆ బట్టలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రమేష్ వర్మ. జైల్లో జరిగిన ఈ కూప్ గురించి ప్రభుత్వం నియమించిన సి.బి.ఐ. ఆఫీసర్! అంతకుకొన్ని రోజులముందే ఈ ప్లాన్ వేయబడింది. మనిషి చుట్టూ ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించి అతడిచేత నిజాన్ని చెప్పించటం... కన్ సీల్డు కెమేరాలు అమర్చటం...! ఆ ప్రయత్నంలో విజయం సాధించాం. ఏ క్యాసెట్లు భయంవల్ల అతడీ పన్లన్నీ చేశాడో, ఆ క్యాసెట్ల రూపంలోనే అతడు నిజాన్ని వప్పుకున్న దృశ్యం చిత్రీకరించబడింది.
    "సర్! మీరు చెప్పుకోవలసింది ఏమైనా వుందా? లేక నేరాన్ని అంగీకరిస్తున్నారా?" వర్మ నమ్రతగా అన్నాడు.
    జగన్నాధం తల వంచుకుని, నెమ్మదిగా "నేను చెప్పవలసింది ఏదీ లేదు" అన్నాడు. అతడిలో ఒకప్పుడున్న బింకం, ధైర్యం ఇప్పుడు లేవు. "మీరు నాకు చేయవలసిన సహాయం ఒకటే. దయచేసి దామోదరం దగ్గిర వున్న క్యాసెట్లని కోర్టులో హాజరు పరిచేలా మాత్రం ఆదేశించకండి-" అతడి స్వరంలో వేడుకోలు కనిపించింది. రమేష్ వర్మ అన్నాడు. "ఆ క్యాసెట్ విషయం దామోదరంగారు వప్పుకోరు. బహుశా ఆయన ఇంటిని రైడ్ చేయవలసి వస్తుంది."
    "అంటే - విషయం అంతా బయటికి వస్తుందా? పేపర్లలో పడుతుందా?"
    వర్మ మాట్లాడలేదు.
    జగన్నాధం తనలో తనే గొణుక్కున్నాడు- "ప్రాణాలు పోయే దానికి కొద్ది నెలలు ముందే పరువు పోతుందన్నమాట."
    అతడిని ఆ క్షణం చూస్తే జాలేసింది. అతడెంత దుర్మార్గుడైనాకావచ్చు. కానీ రేపు ప్రాసిక్యూషన్ ఈ కేసు నిరూపించటం కోసం ఋజువులు వేటినీ వదిలిపెట్టదు. అందరూ 'ఛీ' కొడతారు. ఈ వయసులో కక్కుర్తి అంటారు. ఉరిశిక్ష పడుతుంది. అతడన్నట్టు- ప్రాణం పోవటానికి కొద్దినెలలు ముందే పరువు పూర్తిగా పోతుంది.
    వర్మ అన్నాడు - "క్యాసెట్స్ లేకుండా కేసు నిరూపించటం కష్టం. బహుశా దామోదరం తనకేమీ సంబంధం లేదంటాడు. అయినా కూడా కేసేమీ బలహీనమవదు సర్! ఐయామ్ సారీ..."
    ఎవరం మాట్లాడలేదు. వర్మే తిరిగి అన్నాడు-
    "ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒక రాజకీయ నాయకుడితో కలసి, ఒక గూండాని బయటకు తెప్పించే ప్రయత్నం చేయటం- అందులోనూ మరో యువకుడైన పోలీస్ ఇన్ స్పెక్టర్ మరణం!! అన్నిటికన్నా ముఖ్యంగా... ఎంతో ప్రతిష్టాకరమైన జైలు చరిత్ర మంట కలిసిపోవటం... రేపట్నుంచీ ఇక న్యూస్ పేపర్లకు చేతినిండా పనే! ఇష్టం వచ్చినట్టు వ్రాస్తారు. మనల్ని దుమ్మెత్తి పోస్తారు. దక్షకులే భక్షకులు అయ్యారంటారు...ఇదంతా మీవల్ల! ఈ విషయాలేమీ బయటికి రాకుండా వుంటే ప్రభుత్వం సంతోషిస్తుంది. కానీ కోర్టుకి వెళితే మాత్రం - బయటకు పొక్కకమానదు. నాకున్న అనుభవంతో చెపుతున్నాను సర్... మీకు శిక్ష తప్పదు. అందులో ఈ జైలు విషయంలో ప్రభుత్వం చాలా పట్టుదలతో వుంది. జడ్జీకి స్పెషల్ సూచనలు ఇచ్చినా ఆశ్చర్యంపోనవసరం లేదు."   
    అతడన్న ఆఖరి వాక్యం నాకు అర్ధం కాలేదు. నాకు తెలిసిన పరిధిలో అది అసంభవం (కానీ నిజం కావొచ్చు). అయినా వర్మ ఇదంతా ఎందుకు చెపుతున్నాడో అర్ధం కాలేదు నాకు. జగన్నాధాన్ని అరెస్టు చేసి తీసుకు వెళ్ళచ్చు కదా. ఆలస్యం చేస్తాడేమిటి అనుకున్నాను.
    జగన్నాధం బ్లాంక్ గా వర్మవైపు చూస్తున్నాడు. అలా చూస్తున్నాడన్న మాటేగానీ, అతడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని అర్ధమైంది. అంతలో వర్మ అన్నాడు-
    "-మిమ్మల్ని అరెస్టు చేయడానికి నా దగ్గర వారెంటు లేదు సర్! మీరు అనుమతి ఇస్తే మీ ఫోను వాడుకుంటాను- వారెంటు తెప్పించటానికి..."
    రమేష్ వర్మ కన్నా సూపర్నెంటెండెంట్ ఎన్నో మెట్లు పై హోదాలో వున్నాడు. అయినా సరే, వర్మ మరీ ఇంత నమ్రతగా మాట్లాడనవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాడు? జగన్నాధాన్ని అరెస్టు చెయ్యటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నిజంగా వారెంటు కోసమేనా?
    అంతలో మళ్ళీ వర్మ అన్నాడు- "ఒక సీనియర్ ఆఫీసర్ ఈ విధంగా చెయ్యటం ప్రభుత్వ వర్గాల్లో చాలా అసంతృప్తి కలుగజేస్తుంది. ముఖ్యంగా అధికారంలో వున్న పార్టీ, దామోదరంగారి మీద ఏ మచ్చ రావటాన్నీ ఇష్టపడదు. ఇన్ కెమేరా' జరగవచ్చు కోర్టులో!.... అయినా అవసరం వస్తే బ్లూ ఫిలిమ్స్ సంగతి కూడా బయట పెట్టవలసి వుంటుంది. ఇంత జరిగినా కూడా మీరు ఏ విధంగానైనా దీనినుంచి బయట పడటానికి వీలుంటుందా అంటే- నూరు శాతం లేదు.... ప్రభుత్వం ఈ కేసు ఎంత తొందరగా ముగుస్తే అంత సంతోషిస్తుంది."
    యధాలాపంగా వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. ఈ ఆఖరివాక్యం- దానికి ముందు వర్మ అన్న మాటలు...
    ఒకదానికి ఒకటి కలిపి ఆలోచిస్తే...
    పరువు పత్రిష్టా పోకుండా, ముఖ్యంగా... జైలు చరిత్రకి మచ్చరాకుండా వుండటం కోసం వర్మ జగన్నాధానికి ఇన్ డైరెక్టుగా ఏం సూచిస్తున్నాడు...? ఈ ఆలోచన స్పురించగానే వణికిపోయాను. ఇది వర్మ ఆలోచన కూడా అయి వుండదు. ప్రభుత్వాధికారులు ఈ పాటికే దీని గురించి ఆలోచించి, వీలైనంతలో దీన్ని నొక్కెయ్యమని ఆదేశాలిచ్చి వుంటారు.
    "నేనొకసారి లోపలికి వెళ్ళొచ్చా" నా ఆలోచన్లని చెదర గొడ్తూజగన్నాధం అన్నాడు.
    "ష్యూర్ సర్.."
    జగన్నాధం లోపలికి వెళ్ళగానే వర్మ పక్కనున్న ఇన్ స్పెక్టర్ వైపు చూశాడు. ఇన్ స్పెక్టర్ బయటకు వెళ్ళాడు. బహుశా ఇంటి వెనుక వైపు నుంచి జగన్నాధం పారిపోకుండా అనుకున్నాను. కానీ బయటకు తాపీగా వెళ్తున్న ఇన్ స్పెక్టర్ ని చూస్తుంటే  అతడేదో డ్యూటీ చేయాలని వెళ్తున్నట్టువుందే తప్ప, జగన్నాధం అటువంటి పనేమీ చేయడన్న నమ్మకం అతడిలో స్పష్టంగా కనిపించింది. అతడిలోనేకాదు, అక్కడున్న వారందరిలోనూ.
    అంతలో లోపల్నుంచి రెండుసార్లు పిస్టల్ పేలిన శబ్దం వినిపించింది. ఒక్కసారిగా అదిరిపడి రమేష్ వర్మ వైపు చూశాను. అతడి మొహం నిర్వికారంగా వుంది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. నేనూ అనుసరించాను. లోపల రక్తం మడుగులో పడివున్నాడు జగన్నాధం. వర్మ అతడివైపు చూడలేదు. బల్లమీద ఉత్తరం వైపునడిచాడు. "నా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు. మానసికమైన బాధలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని వ్రాసిన ఉత్తరం.
    ఉత్తరాన్ని అసిస్టెంట్ కి అందిస్తూ, నా వైపు తిరిగి 'వెళ్దామా' అన్నాడు. మరో ఇం స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తున్నాడు. ఇక నుంచి ఇది 'మామూలు' ఆత్మహత్య వ్యవహారం. పోలీసుల ఫైళ్ళలో మాత్రమే వుంటుంది. వీళ్ళ బాధ్యత తీరిపోయింది. 'నేరస్తుడు మరణించాడు' అని వ్రాసి క్లోజ్ చేస్తారు ఫైల్ ని.
    కేవలం రష్యాలోనూ, చైనాలోనూ, లేక మిలటరీలోనూ ఇలాటి సంఘటనలు జరుగుతాయని చదివాను. సగటు మనిషి ఊహించటానికి వీల్లేనంత పైస్థాయిలో ఇంత రహస్యంగా కేసులు సెటిల్ చేయబడతాయని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏది ఏమైనా, చారిత్రాత్మకమైన ఈ జైలు గురించిన మచ్చ బయట పడకుండానే దానికి మరో రంగు వేసెయ్యబడింది.
    జగన్నాధం కథ అలా ముగిసింది.
                                                 9
    రేఖ చాలాసేపు దుఃఖిస్తూ వుండిపోయింది. ఆమెని ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు నేను. దుఃఖం ద్వారా వ్యధ తగ్గుతుంది. ఆమె అతడిని అసహ్యించుకుని వుండవచ్చు. కానీ ఎంతైనా తండ్రి కదా. ప్రస్తుతం తల్లీ తండ్రీ లేని అనాధ. అయితేనేం నేనున్నాను. ఆ విషయమే చెప్పాను. నాలుగైదు రోజుల్లో ఆమె తేరుకుంది. తనతండ్రి జీవితం ఇలాగే ఏదో దురదృష్టకరమైన పరిస్థితిలో అంతం అవుతుందని ఆమె అనుకుందట. నేరం చేసిన మనిషిని న్యాయం ఏదో ఒక రూపంలో వెంటాడి అంతం చేస్తుందని ఆమె విశ్వాసం. మొన్నటివరకూ నేనూ అలాగే అనుకుంటూ వుండేవాడిని. జైళ్ళు నేరస్తులకోసం, బయట వున్న అమాయక ప్రజల్ని రక్షించటం కోసం అన్న నమ్మకంతో వుండే వాణ్ణి. న్యాయం చాలా పదునైనదని అప్పట్లో నా నమ్మకం. వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తూంది. దీనికి కారణం 'దామోదరం.' ఇంత చేసినా అతడు బయట ప్రపంచంలో హాయిగా వుండగల్గుతున్నాడు. పావులు మాత్రం బలి అయిపోతున్నాయి. ఎన్నెన్నో పావులు-

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra