Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    మృదుల అనంగ్ కి ఫోన్ చేసి, "నాతో గిరిజన గ్రామానికి వస్తానన్నారు కదా! రేపు బయలుదేరుతున్నాను వస్తారా?" అంది.
    "వస్తాను. రేపెన్నింటికి రావాలి? ఎక్కడికి రాను?" ఉత్సాహంగా అన్నాడు అనంగ్.
    "ఎక్కడికేమిటి? మా యింటికే రండి. ఇక్కణ్నుంచి రైలులోనైనా, బస్సులోనైనా వెళదాం. ట్రైన్ లో వెళ్ళినా కరీంనగర్ లో దిగి బస్సు ఎక్కవలసి వుంటుంది కాబట్టి డైరెక్టుగా బస్సులో వెళితేనే బాగుంటుందేమో?"
    "బస్సులోనే వెళదాం. నేను నేరుగా బస్సుస్టాండ్ కే వస్తాను ఎన్ని గంటలకో చెప్పండి?"
    "ఉదయం ఫస్టు బస్సులోనే వెళదాం. మధ్యాహ్నానికల్లా నీలంపల్లి చేరుకోవచ్చు.
    బస్ స్టాఫ్ కి వంటరిగా వచ్చిన మృదులని చూసి ఉత్సాహంతో పొంగిపోయాడు అనంగ్. అతడి మనసు యేవేవో దృశ్యాలను అల్లేసుకో సాగింది. బస్ లో పక్కపక్క సీట్లులోనే కూర్చున్నారు ఇద్దరూ. బస్ బయలుదేరాక, "ఏరోడ్డు మీదో నిర్జనంగా వున్న ప్రదేశంలో గుండా ఎవరయినా ఈ బస్ ఆపేస్తే యెంత బాగుంటుంది" అన్నాడు అనంగ్.
    "అప్పుడు బాగుండేది యేవిటిటా?"
    "అపుడు బస్ ఆగిపోతుంది. మనిద్దరం రోడ్డుకి దూరంగా ఆ కనిపించే మైదానాలవైపు వెళ్ళి ఎత్తయిన కొండలమీద కూర్చుని ఆరుబయల్లో ప్రకృతి అందాలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకోవచ్చు."
    "అలాగే జరుగుతుందని యెందుకనుకోవాలి? గూండాలు బస్సు ఆపడానికొచ్చినపుడు నేనెదురుతిరిగి వాళ్ళందర్నీ చావబాది బస్సుని యధాప్రకారం ముందుకి నడిపించొచ్చును కదా!
    "మీరా!"
    "ఏం మిస్టరీ నవలల్లోలాగ మొదటి ఐడియా థ్రిల్లింగా వుందనుకోండి- రెండోది మరింత థ్రిల్లింగ్ గా లేదూ?"
    మృదుల తనని వెక్కిరిస్తోందో- సరదాగా మాట్లాడుతోందో అర్ధం కాలేదు అనంగ్ కి.
    "అవును, అలా జరిగితే మరింత థ్రిల్లింగ్ గా వుంటుంది. కరెక్ట్! బస్ యేదో స్టేజిలో ఆగింది. నిండు గర్భిణి స్త్రీ బస్సెక్కింది. బస్ లో వెనకసీట్లు తప్ప ఖాళీల్లేవు. గర్భిణి అటు నడవబోతుంటే మృదుల చటుక్కున లేచి నిలబడింది. "వెనక కుదుపెక్కువ. మీరిక్కడ కూర్చోండి. నేను వెనక్కి వెళతాను." అని తన సీటు ఆవిడకి ఆఫర్ చేసి, తను వెనక సీట్లోకి వెళ్ళిపోయింది. గర్భిణి స్త్రీ అనంగ్ పక్కన కూర్చోడానికి కొంత సంకోచించినా నిలబడే స్థితిలో లేకపోవడంవల్ల అతడి పక్కనే వొదిగి కూర్చుంది. ఉండుండి ఎవడో కీచకుణ్ని చూసినట్టు అనంగ్ ని చూస్తూ పైట వొంటినిండా కప్పుకొంటోంది. పల్లెటూరి గర్భిణీ స్త్రీ ప్రక్కన కూర్చోవలసి వచ్చినందుకే లోలోపల చిరాకు పడుతున్న అనంగ్ ఆచూపులకి మరింత ఇరిటేట్ అయ్యాడు. లేచి నిలబడి "మీరు విశాలంగా కూర్చోండి" అన్నాడు గర్భిణి స్త్రీతో. ఆవిడ ముఖంలో రిలీఫ్ కనిపించింది. డబుల్ సీట్లో పూర్తిగా సర్దుకుని కూర్చుంది. వెనకసీట్లో మృదుల ప్రక్కన ఖాళీలేదు. ఎవరో ఇద్దరు పంచె ఆసామీ కూర్చున్నాడు. మృదుల తన పక్కన కూర్చునందుకు ఆనందంతో వెలిగిపోతోంది ఆ ఆసామి మొహం. ఆ మొహాన్ని ఈర్ష్యగా చూసి రాడ్ పట్టుకుని నిలబడ్డాడు అనంగ్. వెనకసీట్లో కూర్చునే అనంగ్ వైపు చెయ్యి వూపి, "చాలా మంచిపని చేసారు." అంది మృదుల మెచ్చుకోలుగా. ఆ ప్రశంస మండుతున్న అతని మనసుని కాస్త ఓదార్చింది. అనంగ్ మనసులో -
    "పోనీలే. బస్సులో యెలా కూర్చుంటేనే ముందు ముందు ఆ పల్లెటూళ్లో ఇద్దరమే యేకాంతంగా వుంటాం గదా!" అనుకున్నాడు.
    మృదుల, అనంగ్ నీలంపల్లి చేరుకునేసరికి అక్కడ మరో ముగ్గురమ్మాయిలు వీళ్ళకోసమే వెయిట్ చేస్తున్నారు. అనంగ్ ఆశలు నీరుకారిపోయాయి. అమ్మాయిల్లో ఒకమ్మాయి పెళ్ళికాని దానిలా కనిపిస్తోంది. మరొకమ్మాయికి పెళ్ళయిందో లేదో తెలియడంలేదు. మెడలో నల్లపూసలున్నాయి. ముఖాన బొట్టులేదు. ఆమె ముస్లిమ్ కావచ్చునేమో? కనీసం యువతరంలో విద్యావంతుల్లోనైనా హిందూ ముస్లిమ్ లు పరస్పరం స్నేహంగా, ప్రేమగా వుండటం వాంఛనీయమే కదా! మూడో అమ్మాయి ఫ్రాక్ లో వుంది. మెడలో శిలువ గుర్తు లాకెట్ గా వున్న సిల్వర్ చైన్ మెడలో వుంది. బహుశా ఆంగ్లో ఇండియన్ కావచ్చునేమో? మృదులని చూడగానే సంతోషంగా విష్ చేసారు ముగ్గురూ. వాళ్ళలో ఒకమ్మాయి అనంగ్ నుద్దేశించి, "ఈయనేనా ట్రైబల్ లైఫ్ స్టడీ చేస్తానంటూ మీతో వచ్చిన మిస్టరీ రైటర్," అంది. ఆ అడగడంలో వున్న వెటకారాన్ని గుర్తించాడు అనంగ్. అతడు పాపులర్ రైటర్స్ లో ఒకడు. ఎంతోమంది ఫాన్స్ వున్నారతనికి ఆంధ్రదేశంనిండా. అయినా అతనిని ఘాటుగా విమర్శిస్తూ, నిరసించే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి కొద్దిమందిలో ఈ అమ్మాయి కూడ ఒకర్తి కావడం అతనికి కొంచెం కష్టంతోచింది.

    "మన "కరదీపిక" కార్యాలయానికి వెళదాం పదండి" అంది మృదుల. అందరూ కాలి నడకన బయలుదేరారు. మట్టిగోడలతో తాటాకుల కప్పులతో వున్న పూరిగుడిసె ముందు నిలబడి "శోవమ్మా!" అని పిలిచింది మృదుల. నలభైయేళ్ళ పల్లెటూరి గృహిణి తలుపు తెరుచుకొని వచ్చింది. తల చక్కగా దువ్వుకుని ముడి వేసుకుంది. చేతులకి మట్టిగాజులు, మడమలకి కొద్దిగా పైగా కట్టుకున్న నేత చీర - నుదుట కాస్త పెద్దదిగా కనిపించే కుంకుమబొట్టు. ఇంతకుమించి పల్లెటూరి వాలకం యేమీ లేదు శోవమ్మలో.
    అందరికీ నమస్కారాలు చేసి, మట్టి అరుగుమీద ఈతాకుల చాప పరిచి, "కూర్చోండమ్మా! గుఱ్ఱాలు తెప్పిస్తాను" అంది నమ్రతగా. ఆ గుడిసె- ఆ వాతారణం- శోవమ్మ- అన్నీ చాలా చప్పగా ఉన్నాయి అనంగ్ కి. ఏదో చాలా థ్రిల్లింగ్ గా వుండే ఎడ్వెంచరస్ అనుభూతి ఎక్స్ పెక్టు చేస్తూ వచ్చాడు అతడు. ఆడపిల్లలంతా చాపలమీద కూర్చున్నారు. శోవమ్మగాజు గ్లాసులతో కుండలో నీళ్ళు ముంచి తెచ్చిచ్చింది. మిగిలినవాళ్ళంతా తాగారు గాని అనంగ్ మాత్రం ఆ నీళ్ళు తాగలేక" ఈ చుట్టుపక్కలెక్కడా సోడా దుకాణాలు లేవా" అన్నాడు.
    "లేకేం. ఈ వీధి చివరలోనే ఒకటున్నట్టుంది కాని ఆ సోడాల కంటే యీ నీళ్ళే శుచిగా- శుభ్రంగా వుంటాయి" చెప్పింది ముస్లిమ్ లా కనిపిస్తూన్న అమ్మాయి. వివిధ జాతులకు చెందిన అమ్మాయిలందరూ ఇలా ఒక్కటిగా మసలుకోవటం చాలా వింతగా తోచింది అనంగ్ కి. సిటీలో మత కలహాల గురించి వినివిని అతడు ఆ రెండు జాతులకి మధ్య బద్ధ వైర్యం అనే అభిప్రాయానికి వచ్చేసాడు. నిజానికి ప్రత్యేకించి యే ఒక్క జాతిని తప్పు పట్టడానికి లేదు. స్వార్ధపరులు కొందరు రగిల్చిన విద్వేషాగ్నులలో జాతి పేరిట- మతం పేరిట అమాయకులు నాశనమైపోతున్నారు.
    విధిలేక అందరితో పాటు ఆ మంచినీళ్లే తాగి చాపకి ఒక చివరగా కూర్చున్నాడు. అతనికి ట్రైబల్ విలేజికి వెళ్ళడంలోని ఛార్మ్ నశించిపోయింది పూర్తిగా. ఒక అరగంటలో పదిహేనేళ్ళ కుర్రాడు అయిదు గుఱ్ఱాలను తీసుకొచ్చాడు ఆ యింటికి. అవి రేసు గుఱ్ఱాలాగ షోక్ గా లేవు. బలహీనంగా వున్నాయి. వాటిమీద యెక్కి వెళ్ళడం ఊహించుకునేసరికి కాళ్లల్లోంచి వొణుకొచ్చింది అనంగ్ కి. ఆడపిల్లలు నలుగురూ గుర్రాలెక్కి రికాబుల్లో కాళ్ళు బిగించుకుని కళ్ళేలు చేత్తో పట్టుకున్నారు.
    "మీరెక్కరేం?" అడిగింది మృదుల అనంగ్ ని.   
    "నాకు గుఱ్ఱపు స్వారీరాదు" బిక్కమొహంతో చెప్పాడు అనంగ్.
    "ఇది హార్స్ రేసు కాదు- సినిమా సీను అంతకంటె కాదు. గుఱ్ఱపు స్వారీ రావక్కరలేదు. ఎక్కి కూర్చోండి. ఈ గుఱ్ఱాలకి యీ దార్లో నడవడం అలవాటే. అవే వెళ్ళిపోతాయి మనకేం శ్రమ లేకుండా" చెప్పింది మృదుల. అప్పటికీ అనంగ్ గుఱ్ఱం యెక్కడానికి సాహసించలేదు.
    "మీరు నడుస్తానంటే నేను తోవ చూపిస్తాను." చెప్పింది శోవమ్మ. ఆ అడవి కాలిబాటలో - శోవమ్మ తోడుగా- కాలి నడకన- ఉసూరుమంది అనంగ్ మనసు. శోవమ్మ బదులు మృదుల ఆ మాట అని వుంటే యెంత బాగుండేది. ఈ ప్రయాణమే ఎంత ఎగ్జెయిటింగ్ గా వుండి వుండేది మనసులో ఊహించుకున్న శృంగార సంభాషణలు, కాయిన్ చేసుకున్న జోక్సు అన్నీ వేస్టేనా? అతడు ఆలోచిస్తూ నిలబడే వున్నాడు. అమ్మాయిలూ తమ గుర్రాలని అదలించారు. అవి సన్నని కాలిబాటలో ఒకదాని వెంట మరొకటి అతి నెమ్మదిగా పరుగు తీసాయి.
                              *    *    *
    "డియర్ అవతార్!"
    నీకు చెప్పకుండా వెళ్ళవలసి వస్తోంది. నిన్న రాత్రే వస్తానన్నావు నువ్వు. ఇంకా రాలేదు. నా ఫ్రెండ్స్ అంతా నాకోసం యెదురు చూస్తూంటారు. నేను వెళ్లక తప్పదు. అన్నట్టు ఈసారి పాపులర్ రైటర్ అనంగ్ కూడా నాతో వస్తున్నాడు. అతను ట్రైబల్ లైఫ్ స్టడీ చేసి వాళ్ళ సమస్యల పైన నవల వ్రాద్దామనుకుంటున్నాడట. అతడు సిన్సియర్ గా అలా రాస్తాడని నమ్మకం లేదు. అయినా నాతో వస్తానంటే సరేనన్నాను. చూద్దాం ఏం ప్రయత్నిస్తాడో! నేనతి త్వరలో మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తాను.
                                                                                                                          విత్ లవ్
                                                                                                                                నీ
                                                                                                                             మృదు"       

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra