Home » Yerramsetti sai » Jaya Vijaya


    అక్కడి నుంచి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తప్పించుకుని బయటపడాలనుంది ఆమెకు. సరిగ్గా ఆ సమయానికి విజయ వచ్చి తనూ కూర్చుందక్కడ.
    "చూశారా జయగారూ! అన్నీ నేనే మాట్లాడుతున్నాను గానీ మీ సిస్టర్ ఏమీ మాట్లాడడం లేదు. ఇది అన్యాయం కదూ?" విజయనుద్దేశించి అన్నాడతను.
    విజయ నవ్వేసింది.
    "అదెప్పుడూ అంతేలెండి. ఎవరితోనూ అంత కలివిడిగా ఉండలేదు. అసలు ఉత్తరాలు కూడా రాయదెవరికీ! మీకొక్కరికే ఉత్తరాలు రాస్తుంది. అంతగా ఆకర్షించాయి మీ రచనలు."
    "బావుంది. అలా పొగిడేయకండి నన్ను. మీ పొగడ్తలన్నీ అబద్ధం అని తెలిసిపోతూనే ఉంది! ఎలాగంటారా? మీరు నా రచనలు చాలా తక్కువ చదివినట్లు మీరే చెప్పారు." విజయతో అన్నాడతను.
    విజయ నవ్వేసింది.
    ఆమెతోపాటు తనూ నవ్వక తప్పలేదు జయకు.
    జయ నవ్వుతున్నప్పుడు ఆమెవంకే అతను తదేకంగా చూడడం గమనించింది విజయ. జయ రూపం అంత అందమైనది. అది తన చెల్లాయ్ అవడం నిజంగా తన అదృష్టం. అయితే ఆమె మనసులో నిండిపోయిన కలవరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. తను చేసినపని మంచిదో కాదో తెలీదు. కానీ మెడ వరకూ ఊబిలో దిగినట్లయిపోయింది. ఈ ఊబి నుంచి బయటపడడం మాత్రం కల్ల. ఒకదానికొకటి అబద్ధాలు పేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. అంతకంటే గత్యంతరం లేదు.
    "నేనిప్పుడే టీ తెస్తాను." లేచి లోపలకు వెళ్ళబోతూ అంది జయ.
    "నువ్వుండవే! అంత దూరం నుంచి ఆయన నీతో మాట్లాడాలని వస్తే అలా వదిలేస్తే ఎలా?" ఆమెను వారించి తను లోపలకు వెళ్ళింది విజయ.
    వారిద్దరి వ్యవహారమంతా కనిపెడుతున్న పార్వతి నవ్వాపుకోలేకపోతోంది.
    ఆమెకు ఓ పక్క ఆశ్చర్యంగానూ, మరోపక్క భయంగానూ కూడా ఉంది.
    ఈనాటి ఆడపిల్లలు ఇంత ధైర్యసాహసాలు గల వారవుతున్నారంటే ఆశ్చర్యకరమయిన విషయమే.
    "చూశావా. నేను చెప్పలే. అబద్ధాలు ఎంత గొడవ తెచ్చి పెడతాయో! ఇప్పుడు చూడు! ఆ ఒక్క అబద్ధం కోసం వేయి అబద్ధాలాడాలి. సరే వేయి అబద్ధాలూ ఎలాగోలా అవస్థలు పడి చెప్తావనుకో! అయినా గాని చివరకు నిజం బయటపడక తప్పదు. అప్పుడు అనుకుంటావ్-అమ్మ అప్పుడు చెప్పినమాట విని వుంటే బావుండేదని..." విజయ టీ తయారుచేస్తోంటే అందామె.
    "అబ్బ! ఇప్పుడే నువ్వు కూడా ట్యూషన్ చెప్పేయకమ్మా! ముందీ రొంపి నుంచి బయటపడనీ నన్ను..." త్వరత్వరగా "టీ" తయారుచేసి కప్పుల్లో పోస్తూ అంది విజయ.
    అవతల చంద్రకాంత్ పరిస్థితి కూడా ఏమంత బావుండలేదు. జయను చూసిన మరుక్షణమే అతని మనసంతా పూర్తిగా ఆమెకు అంకితమయిపోయింది. ఆమె అందం చూసినకొద్దీ చూడాలనిపిస్తోంది. తను అంతకుముందు కూడా చాలామంది అందమయిన అమ్మాయిలను చూశాడు కానీ ఏనాడూ ఇంతగా చలించలేదు. జయ తనను ఇంతగా కదిల్చివేయడానికి మరో బలమయిన కారణం ఉంది. అది అంతకుముందే తామిద్దరిమధ్యా ఉత్తరాల ద్వారా ఏర్పడ్డ అనుబంధం. అయితే ఆమె ఇప్పుడు చూపుతున్న ముక్తసరి స్వభావమే తనకు అర్థంకావడం లేదు. ఉత్తరాల్లో ఎంతో ఆత్మీయత కనపరిచిన విజయ ఈమేనా అనిపిస్తోంది. నిర్మొహమాటంగా, నిర్మలంగా ఎన్నెన్ని విషయాలు రాసేది? ఎన్నెన్ని వాదోపవాదాలు జరిగేవి?
    "విజయగారూ?" నెమ్మదిగా పిలిచాడతను.
    "ఊ!" తలెత్తి అతనివంక చూసింది జయ.
    "నేను నిజంగా అదృష్టవంతుడినండీ!"
    "ఎందుకనీ!"
    "మీలాంటి అందమైన అమ్మాయి స్నేహము సంపాదించగలిగినందుకు..."
    జయకు ఏం మాట్లాడాలో తోచలేదు.
    "నేను రచయిత నవడం వల్ల ఎంత లాభం జరిగిందో చూశారా! మీతో ఇంత చక్కటి స్నేహం ఏర్పడడానికి వీలయింది. ఇదే ఇంకెవరితోనైనా మీరు స్నేహం చేసేవారా? అర్థరాజ్యం ఇస్తానని కబురు చేసినా కన్నెత్తి కూడా చూసేవారు కాదు! అవునా?"
    అతని మాటలు గిలిగింతలు కలిగిస్తున్నాయ్ జయకు.
    నవ్వాపుకోడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.
    "మీరు నన్ను హేళన చేయడం లేదు కదా?" నవ్వాపుకుంటూ అందామె.
    "అమ్మో! అంత ధైర్యమే నాకు! మిమ్మల్ని హేళన చేసేంత అర్హత నాకేముందని?" నొచ్చుకుంటూ మాట్లాడాడతను.
    "నేను మీరు మరీ పొగుడుతున్నంత అందంగా లేనులెండి!"
    "అన్నట్లు మర్చిపోయాను! మీరు ఫొటో దిగారా లేదా?"
    "ఫోటోనా? ఎందుకు?"
    "భలే వారే! మీ మనసు ఇక్కడ లేదనుకుంటాను. ఆఫీసులో ఏమైనా గొడవ జరిగిందా ఏమిటి?"
    "అబ్బే_అదేమీ లేదు."
    "లేకపోతే ఫోటో విషయము ఎలా మర్చిపోయారు? మీ ఫోటో ఒకటి త్వరలో దిగి నాకు పంపుతానని మీరు ప్రామిస్ చేయలేదూ?"
    "ఓ అదా! అవునవును! నిజమే! కానీ ఎందుకో ఫోటో దిగడమంటే పెద్ద యజ్ఞంలా అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడూ ఫోటోలు దిగలేదు...కదు జయా?"
    అప్పుడే కప్పుల్లో 'టీ' తీసుకుని అక్కడికొచ్చిన విజయను అడిగిందామె.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra