Home » D kameshwari » Tirigi Dorikina Jeevitham


    "ఎక్కడికి వెడ్తుందిరా నన్నొదిలి. ఆ పెళ్ళేదో అయ్యేవరకు అమ్మని వదిలి కూతురు ఎక్కడికి వెడ్తుంది...."
    "చచ్చాం....ఇదొకటి గదా, అమ్మా ఇల్లరికపుటల్లున్ని తెద్దాం సరోజకి. అప్పుడింక ఎక్కడి కెడుతుంది. ఏం సరోజా" హాస్యంగా అన్నాడు. పెళ్ళి ప్రసక్తి రాగానే సరోజ మొహం మళ్ళీ మాడిపోయింది. పెదవి కొరుక్కుంటూ నిలబడింది క్రింది చూపులు చూస్తూ. సరోజ మొహం చూడగానే తనా ప్రసక్తి తీసుకురాక పోవలసిందని, అనవసరంగా బావని గుర్తు చేశానని అన్పించింది అతనికి. సరస్వతమ్మకీ అదే అన్పించింది.
    ఆ వాతావరణాన్ని తేలిక పరచడానికి ఏదో కల్పించుకుని నవ్వుతూ మాట్లాడా లనుకున్నాడు కృష్ణమోహన్. అంతలో గీత వచ్చింది. "రా...రా గీతా నీకో మంచి జోక్ చెప్పనా....చూడు మా సరోజ అంటోంది. నీకు సంగీతం చెప్పించమని..." అదేదో పెద్ద జోక్ లా నవ్వుతున్న కృష్ణమోహన్ని చూసి తుది మొదలు అర్ధంగాని గీత...తక్కినది అర్ధంగాక పోయినా మా సరోజ అనడం చూసి నుదురు చిట్లించి "సంగీతమా, నాకు.....మధ్యలో ఆవిడ కెందుకుట నాపై ఆ యింటరెస్టు...." వ్యంగ్యంగా అంటూ సరోజ వంక చూసింది. "యింతకీ ఆవిడిని యీ సలహా చెప్పమని ఎవరడిగారంట..ఏమండీ.." అంది సరోజవంక తిరిగి గీత నవ్వుతూనే అన్నా, ఆ నవ్వు మామూలు నవ్వుకాదని అందులో హేళన, వ్యంగ్యం, నిరసన అన్నీ స్పష్టంగా అక్కడున్న ముగ్గురికీ కన్పించాయి. సరోజ గీత మాట్లాడిన తీరుకి బిత్తరపోయి తడబడ్తు "నేను....నేను...." అంటూ ఏదో చెప్పబోయింది.
    తానాశించింది ఒకటి, జరిగింది మరొకటి కావడంతో ఒక్క క్షణం గాభరా పడిపోయాడు కృష్ణమోహన్. "అదికాదు గీతా, అసలేం జరిగింది అంటే..." అంటూ సంగతి చెప్పుకొచ్చాడు. "సరోజ గొంతు ఎంతో బాగుంటుంది. సంగీతంకూడా నేర్చుకుంటే యింకా బాగా రాణిస్తుందంటున్నాం అమ్మా, నేను..." అంటూ వాతావరణాన్ని తేలిక పరచడానికి గబగబ ఏదో అన్నాడు. ఆ మాటలు వింటూ గీత ఆశ్చర్యంగా..."ఏమిటీ, యీవిడకి సంగీతం చెప్పిస్తారా మీరు?...ముక్కు మొహం తెలియని వాళ్ళని పోషించడమేగాక సంగీతాలు, చదువులు చెప్పించేటంత డబ్బు ఎక్కువయింది ఏమిటి మీకు!" హేళనగా అంది. కృష్ణమోహన్ మొఖం ఒక్కసారిగా నల్లబడి పోయింది. ఆరాటంగా ఏదో వారించబోతూ సరోజ మొఖం చూశాడు. సరోజ మొఖం ఒక్క క్షణం అవమానంతో నల్లబడింది. ఆ వెంటనే, "బాగా అడిగారు. నేనూ అదే అంటున్నాను. వారి దయవల్ల వారింటిలో, తిండి తింటున్నాను. యింకా నామీద వృధాగా డబ్బు ఖర్చుపెట్టొద్దు. సంగీతం మీద అంత మోజువుంటే మీ శ్రీమతికి చెప్పించుకోండి, నామీద యింత దయ చూపకండి అంటున్నాను" అంది సరోజ తేలిగ్గా నవ్వుతూ.
    "యిందులో దయాధర్మాల ప్రసక్తిలేదు. నా ముచ్చట ఇది దేముడి దయవల్ల నాకింత వదిలిపోయారు ఆయన. నా సంతోషం కోసం సంతృప్తికోసం కాకపోతే యీ డబ్బు నాకెందుకు ఉపయోగిస్తుంది--" సరస్వతమ్మ గంభీరంగా అంది. ఆవిడ మాటలో మొహంలో గంభీరత చూసి- తల్లిని ఆ విధంగా ఎన్నడూ చూడని కృష్ణ మోహన్ తెల్లపోయాడు. యిది ఆమె డబ్బు నీమొగుడి సంపాదన కాదు అన్నది ఎంత తెలివిగా స్పష్టంగా వెల్లడించిందో తన సొమ్ము తన యిష్టం వచ్చిన రీతిని ఖర్చుపెట్టుకునే సర్వాధికారం ఆమెకున్నట్టు వెల్లడించిన ఆ మాటకి ముగ్గురూ ఒక్క నిమిషం తెల్లపోతూ నిలబడ్డారు. గీత మొహం కందగడ్డలా ఎర్రబడిపోయింది. తనకేదో అవమానం జరిగినట్లు పౌరుషంగా, విసురుగా...."మధ్యన నా కెందుకు ఎవరెలా ఏడిస్తే నాకేం" అంటూ తల ఎగరెసి విన విన బయటికి వెళ్ళబోయింది "గీతా" అన్నాడు అధికారంగా కృష్ణమోహన్ "గీతా మేడమీదికి రా" అంటూ యింకేం మాట్లాడకుండా మేడమీదికి దారితీశాడు. అతని గొంతులో గంభీరతకి వెళ్ళబోతున్న గీత ఒక్కక్షణం ఆగిపోయింది. ఆ తరువాత నిర్లక్ష్యంగా సరస్వతమ్మ సరోజల వంక ఒక చూపు విసరి మేడమెట్లు ఎక్కింది. సరోజ సరస్వతమ్మవంక చూసింది. ఆవిడ మొహం అంత గంభీరంగా ఎప్పుడూ చూడలేదు సరోజ. ఆవిడ సరోజ వంక ఒకసారి చూసి మామూలుగా నవ్వు తెచ్చుకుని "చూడమ్మా వంటావిడ యిందాక ఏదో అడిగింది" అంది. సరోజ లోపలికి వెళ్ళింది.
    "గీతా! నీవు కాస్త మాట్లాడేముందు వెనకా ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నీ కెంత తోస్తే అంత అనేయడం తప్ప అవతలవాళ్ళు ఏమనుకుంటున్నారన్న ఆలోచన తోచదా-" కృష్ణమోహన్ గీత వంక చూస్తూ కాస్త తీక్షణంగానే అన్నాడు.
    "ఏం అంత కానిమాట ఏమన్నాను. ముక్కు మొహం తెలియనిదాన్ని ఇంట్లో కూర్చోపెట్టి మేపడంకాక, సంగీతాలు చెప్పిస్తారా. నేనేకాదు ఎవరన్నా ఇదే అంటారు మీకు మతిపోయిందో డబ్బంత ఎక్కువయిందా....యీవిడ గారికంటే బీదలు లక్షలమంది వున్నారు. అందరినీ పిలిచి దానాలు చేస్తే సరి, వున్న ఆస్థి ఏదో వూడేవరకూ..." గీత కృష్ణమోహన్ కోపానికి ఏం చెదరకుండా అంతకంటే తీక్షణంగా గట్టిగానే జవాబిచ్చింది. కృష్ణమోహన్ పళ్ళు బిగించి, "ష్, నెమ్మదిగా మాట్లాడు..."
    "ఏం, నాకేం భయం. వున్నమాట అనడానికి నేనెవరికీ భయపడను. మీ అమ్మగారంటే ఏదో కాస్త కూతురిలా కన్పించిందని వళ్ళుపై తెలియకుండా యింట్లో చేర్చి అంతా దోచిపెడ్తుంది. ఆవిడకేం ఇవాళుంటారు, రేపుండరు. రేపొద్దున ఇదంతా మనదే. మీకామాత్రం బుద్ధి ఎందుకు లేకపోవాలి. ఆవిడ మొగుడు యిచ్చిపోయాడంటే ఇలా తగలేయడానికా, ఏం కొడుకుగా మీకేం హక్కులేదా యీ ఇంట్లో..." తీక్షణంగా రెచ్చిపోతూ అంది గీత.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra