Home » Suryadevara rammohan rao » Anitara Sadhyudu


    "నన్నో నాలుగురోజులు వదిలెయ్యి. ఆ నర్సింహగాడి పనిపట్టి వస్తాను. వాడ్ని సస్పెండ్ చేయిస్తానని సవాల్ చేశాను. అది చేసేవరకు నాకు నిద్రపట్టదు."

 

    "ఇంతకీ ఎవడా నర్సింహం?"

 

    "వాడో ఎస్.ఐ"

 

    "ఎస్.ఐ.ని నువ్వు సస్పెండ్ చేయిస్తావా?"

 

    "ఏం... ఎస్.ఐ.కి కొమ్మలేమన్నా వుంటాయా?"

 

    "కొమ్ములుండవు - కొమ్ముల్లాంటి లాఠీలుంటాయి"

 

    "ఏడ్చాడు... ఎవడో దొంగతనం చేస్తే ఆ మల్లేష్ గాడి కోసం వచ్చారు. వాడు లేకపోయేసరికి నన్ను తీసుకెళ్ళి..."

 

    "ఊ... తీసుకెళ్ళి... కుళ్ళబొడిచారా...?"

 

    "నీ పైశాచికానందం పాడుగాను నన్ను కుళ్ళబొడిస్తే నీకానందమనుకుంటాను"

 

    "నువ్వు నన్ను మాటల్తో కుళ్ళబొడవలా? దానికంటే ఎక్కువా అది?"

 

    "నువ్వనవసరంగా నాతో పెట్టుకున్నావంటే అయిపోతావు... నన్ను వదులుతావా లేదా?" సామంత్ అసహనంగా అడిగాడు.

 

    "నిన్ను వదిల్తే నన్ను చంపేస్తాడయ్యా బాబు."

 

    "ఎవడా పిల్లిగడ్డమోడేనా?"

 

    "అబ్బా... పిల్లికి అసలు గడ్డమెక్కడుంటుందయ్యా?"

 

    "అయితే ఏంటి నీ ఉద్దేశం? దానికసలు గడ్డమే లేదంటావా? ఒక పిల్లిని పట్టుకురా-"

 

    "ఇప్పుడు పిల్లెక్కడ దొరుకుతుంది?"

 

    "ఎలుకను పట్టుకొచ్చి ఎరవేయ్"

 

    "ఆ ఎలుకెక్కడ దొరుకుతుంది?"

 

    "ఉల్లిగడ్డలు... అదే ఆనియన్స్ పట్టుకొచ్చి మాటు వెయ్యి"

 

    "ఓరి నాయనో..." ఏడుపు ముఖం పెడుతూ అన్నాడు కనకారావు.

 

    "అదే వద్దన్నాను"

 

    "ఏది?"

 

    "మూడో వ్యక్తి"

 

    "ఇక్కడెవడున్నాడు. మన మధ్య?"

 

    "మీ నాయన"    

 

    "నిజంగానే మా అబ్బను గుర్తు తెస్తున్నావయ్యా బాబు. ఎన్నిరోజులు వదిలిపెట్టాలి?" సామంత్ పెట్టే బాధను భరించలేక అడిగాడు.

 

    "నాలుగురోజులు...."

 

    "నాలుగురోజులు కుదరదు. ఒక్కరోజు తీసుకో"

 

    సామంత్ కాసేపు ఆలోచించి అలాగే అన్నట్టు తలూపి "నేను చెప్పినట్టు వినే ఓ అమ్మాయిని పిలిపించు" అన్నాడు.

 

    "ఛా...ఛా...నేనలాంటి పనులు చెయ్యను" అన్నాడు సిగ్గు పడుతూ కనకారావు.

 

    "నేనూ చెయ్యను. ఊరికే అలా మెలికలు తిరక్కు. అందుకు కాదు వేరే అవసరం వుంది"

 

    "నాకేం తెలీదు. అలాంటివి నేనెక్కడ చెయ్యను? నేనెక్కడ వెతుక్కురాను?"

 

    "అయితే సరే... పెట్రోల్ ఖర్చులివ్వు"

 

    "అదేమిటి?"

 

    "నేను వెళ్ళిపోతున్నాను. పెట్రోలు ఖర్చులు ఎవడిస్తాడు- నీ బాబా?"

 

    "ఇప్పుడు నా బాబు సంగతెందుకు? నాలుగురోజులు. ఆగి ఒక్కసారే యాభైవేలు పట్టుకెళ్ళవచ్చుగా?"

 

    "ముందు అమ్మాయిని చూస్తావా? వెళ్ళిపొమ్మంటావా?" సామంత్ బట్టలు సర్దుకుంటూ అన్నాడు.

 

    కనకారావు పిచ్చిచూపులు చూశాడు.

 

    "పిచ్చెక్కినట్టు నటిస్తే ఊరుకుంటాననుకున్నావేమో?"

 

    "మళ్ళీ ఇదేమిటి? పిచ్చెక్కినట్టు నటించడమేమిటి?"

 

    "ఇప్పుడు నాకేసి పిచ్చిచూపులు చూశావుగా?"

 

    కనకారావు అమాంతం సామంత్ కాళ్ళమీద పడిపోయాడు. "మహాప్రభో నన్ను క్షమించు. నీ దాసాను దాసుడ్ని- నీ సేవకుడ్ని- నీ కాళ్ళ దగ్గర ఊడిగం చేసే గుమాస్తా సన్నాసిని. నన్నేం చెయ్యమంటావో చెప్పు" అన్నాడు ప్రాధేయపడుతూ.

 

    "ఇప్పటికి ఒప్పుకున్నావు నా సేవకుడ్నని. ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను. ఓ అందమైన అమ్మాయిని పట్టుకురా."

 

    "మరలా అదేమిటి? ఇందాకేమో ఆమ్మాయన్నావు- ఇప్పుడేమో అందమైన అమ్మాయంటున్నావు?"

 

    "మరీ అప్పలమ్మను పట్టుకొస్తావేమోనని"

 

    "ముందే అలా ఎలాగనుకున్నావు?"

 

    "నీకింకా పెళ్లే కాలేదుగా అందుకని"

 

    "నీతో మాట్లాడడం ఆ బ్రహ్మ తరంకూడా కాదు. పూర్వజన్మలో నీ నోరు బి.బి.సి., వి.ఓ.ఎ., ఆకాశవాణి అయుంటుంది. నీ గొంతులో రేడియో, టి.వీ. స్టేషన్లు వున్నాయా? గొంతు డాక్టర్ దగ్గరకు నాఖర్చుతో తీసుకెళతాను పదవయ్యా బాబు. నీ స్వరపేటిక పీకి ప్రతిపక్షాల వాళ్ళ కిచ్చి వేరేది వేస్తాడు."

 

    "అలాగే... ముందు అమ్మాయిని చూడు" అన్నాడు సామంత్ సీరియస్ గా.

 

    "ఇప్పుడే వెళ్ళి అరగంటలో వస్తాను. నువ్వు ఈ లోపు ఆ ఇంగ్లీషు పదాలు బట్టీపట్టు" అంటూనే వేగంగా బయటకు నడిచాడు కనకారావు.

 

    అతనలా వెళ్ళగానే చటుక్కున ఫోన్ దగ్గరకు లాక్కున్నాడు సామంత్.


                                 *    *    *    *


    సాయంత్రం నాలుగ్గంటలకు రెండు రూమ్స్ బిల్ ప్రిపేర్ చేయమని రిసెప్షన్ కి ఫోన్ చేసి చెప్పాడు అర్జునరావు.

 

    ఈలోపు పీటర్ సామాన్లు సర్దేశాడు.

 

    "పీటర్... మళ్ళీ మనం హైదరాబాద్ లో దిగి, నేను నీకోసం కబురు చేసే వరకు కనీసం నావేపు నువ్వు కన్నెత్తి అయినా చూడగూడదు. ఆడ సింహం గుహలోకి వెళుతున్నాం జాగ్రత్త" అంటూ పీటర్ ని హెచ్చరించి తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వచ్చి నాయకి గదిముందు కాలింగ్ బెల్ నొక్కాడు అర్జునరావు.

 

    వెంటనే పీటర్ తన బ్రీఫ్ తీసుకొని రూమ్ ఖాళీచేసి రిసెప్షన్ కేసి సాగిపోయాడు.

 

    తనపై భయంకరమైన ఉచ్చు బిగుసుకోబోతుందని ఏమాత్రం ఊహించక నిద్రలో గోర్వెచ్చని కళలు కంటున్న నాయకి ముఖం ముగ్ధమోహనంగా గులాబి బాలలా వుంది.


                                                        *    *    *    *


    రాత్రి ఎనిమిదిన్నరకి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయింది ఎయిర్ బస్.

 

    ఫ్లయిట్ రన్ వే మీద పరిగెడుతూండగానే నాయకి సేఫ్టీబెల్టు విడదీసి లేచి నుంచుంది. ఫ్లయిట్ వేగం తగ్గి టెర్మినల్ కేసి మెల్లగా వెళుతూండగానే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నెమ్మదిగా డోర్ దగ్గరకు నడిచింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra