Home » Yandamuri veerendranath » రక్త సింధూరం


    "తెలుసు."
    "దీని పరిణామాలు ఎంత భయంకరంగా వుంటాయంటే బహుశా నువ్వు ఒంటరిగా జీవించవలసిన పరిస్థితి రావచ్చు."
    "రాదు."
    "అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు?"
    "మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి" ఆమె చాలా తాపీగా అంది. కానీ ఆ వాక్యం నా గుండెల్లో అదోలాంటి ఆనందతరంగాల్ని జలతరంగిణిలా లేపింది. 'నామీద వుంచిన నమ్మకానికీ, చూపిస్తున్న అభిమానానికీ కృతజ్ఞతలు'- అందామనుకున్నాను. కానీ అంతకన్నా ముందే ఆమె అంది-
    'ప్రేమ ఏ క్షణంనుంచీ ప్రారంభమవుతుందో చెప్పటం కష్టం అనుకుంటాను. మొదట మిమ్మల్ని అల్లరి పట్టించినప్పుడు సరదాగా తీసుకున్నానంతే. ఎ భావమూ కలుగలేదు. తరువాత మీరు నన్ను ఫూల్ చేసిన విధానం చూసి అబ్బురపడ్డాను. ఇంత తెలివైన అబ్బాయా అనుకున్నాను. ఆ తరువాత జైలులో జరిగిన తిరుగుబాటుని మీరు ఎదుర్కొన్న విధానం తెలిశాక- రియల్లీ ఐ ఫెల్ ప్లాట్ ఫర్ యూ... మొన్న పరిచయం అయిన మీ కోసం, ఇన్నాళ్ళూ పెంచిన తండ్రిని వదిలెయ్యాలా? ...లాజిక్ వప్పుకోదు. కానీ ప్రేమ సత్యం కదా. Lagic is the first enemy to truth అన్నాడు అరబిందో. ఈ మధ్యలోనేను చాలా రోజులు అయోమయంలో గడిపాను. నా ప్రేమ సూర్యుడు ముద్దు పెట్టుకున్న మంచు బిందువు లాంటిది అని కవిత్వం చెప్పను గానీ, నాకు తెలిసినంతలో అది స్వచ్చమైనది. నేను చెపుతున్నదంతా మీ కర్ధమవుతుందో, లేక ఈ డెప్త్ అర్ధంకాక నవ్వు తెప్పిస్తుందో నాకైతే తెలీదుగానీ, 'ప్రేమించుకున్నాం' అనుకునేవాళ్ళు ఈ మాత్రమన్నా మనసు విప్పి మాట్లాడుకోవాలని నా ఉద్దేశ్యం. మీ కోసం నేను నా తండ్రిని వదులుకోవడానికి సిద్ధంగా లేను. కానీ వివాహానికి ముందే నా గురించి మీకు తెలియటం మంచిది కదా! నా యీ ఫ్రాంక్ నెస్ మీకు నచ్చకపోతే చెప్పెయ్యండి... మీ సమాధానం కోసం ఎంత కాలమైనా వేచి వుంటాను."
    సమాధానంగా "కారు ఒకసారి ఆపు చెయ్యనా" అని అడిగాను. నా మనసంతా ఏదో చెప్పలేని ఉద్వేగంతో, ఆమె పట్ల ఆప్యాయతతో నిండిపోయింది. ఆమె సమాధానం కోసం వేచి చూడకుండానే కారు ఆపుచేశాను. దూరంగా అడికిలమెట్ట మీద గుడి కనిపిస్తూంది. దానిమీదా, ఆమె మీదా వెన్నెల ఒకేలా పడుతూ వుంది.
    ఆమె తల తిప్పి నా వైపు చూసింది. సమాధానంగా ఆమెని దగ్గిరకి తీసుకున్నాను. ఫలితంగా ముద్దు పెట్టుకున్నాను. ఈసారి ఆ ముద్దు ఎంతో తీయగా, హాయిగా అనిపించింది. నా చేతులమధ్య, నాకు దొరికిన అపురూపమైన పెన్నిధిగా అనిపించింది. ప్రేమలో అవతలి వ్యక్తి ఒక సారైనా అలా అనిపించకపోతే అది ప్రేమే కాదు! మొదటి ముద్దుకీ దీనికీ తేడా స్పష్టంగా కనిపించింది. దగ్గిరతనం అనే తీపిలో ముంచి, ఆప్యాయతతో రంగరించి, ప్రేమ అనే తాంబూలంతో పెదవుల్ని పండించింది. ఇక దగ్గిరగా లేకపోతే లాభంలేదు అన్న తపనతో చేరికయినప్పుడు వున్న తీయదనం!
    దూరంగా గుట్టమీద గుడి. చాలా చిన్న గుడి. అద్భుతమైన దృశ్యం.
    తాజ్ మహల్ ని చూసినప్పుడు నాకేమీ అనిపించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుందెందుకు? తాజ్ మహల్ లో లేని అందం ఈ గుడిలో కనిపిస్తూంది ఎందుకు?
    మొదటి ముద్దులో లేని తీయదనం రెండు ముద్దులో కనిపించిందెందుకు?
    సమాధానం వెంటనే దొరికింది.
    ఆమె అన్నట్టు - 'స్పందన.'
    స్పందించే హృదయం వుంటే కొలను మెట్లమీద జారిన నిద్రగన్నేరు పువ్వు చాలు చూస్తూ ఆనందించటానికి.
    అంతలో మామూలు మనిషినయ్యాను. ప్రేమ ఎంత నాజూగ్గా స్పందనలోంచి పుట్టినా, చిలిపితనంతో హెచ్చి, ఆవేశంతో అంతం కావాలి.
    "నా మిత్రుడు రాజారాం ఏమనేవాడో తెలుసా?"
    "ఏమనేవాడు?"
    "రెండు హృదయాల కలుసుకునేటప్పుడు నాలుగు పెదాలు ఇచ్చుకునే షేక్ హాండ్ అట ముద్దంటే."
    దానికి ఆమె కిలకిలా నవ్వింది. "మా హాస్టల్లో మేము అనుకునే రైమ ఒకటి చెప్పనా? మనం వున్న స్థితికి సరిగ్గా సరిపోతుంది."
    "ఏమిటది?"
    "టూ ఇన్ ఎ కార్...
    టూ లిటిల్ కిసెస్
    టూ మంత్స్ ఆఫ్టర్
    మిస్టర్ అండ్ మిసెస్...."

    మాటకి మాట అలా అందించే పార్ట్నర్ దొరకటం అదృష్టం. ఆపుకోలేని తమకంతో ఆమెని దగ్గిరకి తీసుకున్నాను. అంతలో మా మీద బ్యాటరీ లైటు పడింది.
    ఇద్దరం షాక్ కొట్టిన వాళ్ళలా దూరంగా జరిగాము.
    పోలీస్ ఇన్ స్పెక్టర్ మా దగ్గిరకి వచ్చాడు "బహిరంగ స్థలాల్లో ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధం అని తెలీదా?" అని గద్దించాడు ఇంగ్లీషులో.
    "సారీ ఇన్ స్పెక్టర్" అన్నాను.
    "సారీ కాదు. మీ ఇద్దర్నీ అరెస్ట్ చేస్తున్నాను."
    రేఖ మొహం భయంతో పాలిపోయింది. నేనేదో అనబోతూ వుంటే అతడు దూరంగా వుంచిన తన మోటార్ సైకిల్ తీసుకుని దగ్గిరకి వస్తూ "ఫాలోమి" అన్నాడు.
    దాదాపు అరగంట ప్రయాణం చేసి, ఊరు పొలిమేర్లు సమీపించే సరికి అతడు మోటార్ సైకిల్ రోడ్డు పక్కన ఆపుచేసి, మమ్మల్ని కూడా కారు ఆపుచెయ్యమన్నాడు. ఆపుచేశాను.
    "మిస్టర్, మీ రెవరో నాకు తెలీదు. రెండు వేలకి సెటిల్ చేయండి. వదిలేస్తాను."
    "రెండువేలా, చాలా ఎక్కువ."
    "ఇంతకీ ఏం చేస్తూ వుంటారు మీరు?"
    "సారీ - చెప్పను."
    "కారూ అదీ వుంది కాబట్టి బాగా డబ్బున్నవాళ్ళే అయి వుంటారు. రెండు వేలొక లెక్కలోనిది కాదు."
    "అలా ఎంత లెక్కలోనిది అనికాదు ప్రశ్న. మేమిద్దరం ఏమీ తప్పు చేయలేదు. తొందర్లో పెళ్ళి చేసుకోబోతున్నాం"
    "మిస్టర్, మీ మధ్యవున్న సంబంధం ఏదన్నా కావొచ్చు. కానీ పబ్లిక్ స్థలంలో భార్యాభర్తలు ముద్దు పెట్టుకున్నా అది నేరమే" అన్నాడు. రేఖ ఎదో అనబోయింది. ఆమెని వారించి-
    "సరే, అరెస్టు చేసుకోండి" అన్నాను.
    "ఆమెని ఇంటి దగ్గిర దింపి పోలీస్ స్టేషన్ కి రండి."
    "అలాగే" అన్నాను.
    "వదిలేశాను కదా అని వెళ్ళిపోవటానికి ప్రయత్నించకండి. మీ కారు నెంబర్ నోట్ చేసుకున్నాను. ఏడులోకాల్లో ఎక్కడున్నా పట్టుకుంటాను. కేవలం ఆడపిల్లను స్టేషన్ కి తీసుకెళ్ళటం ఎందుకన్న జాలితో మీకీ ఛాన్సు ఇస్తున్నాను."
    "అదేమీ కాదు. మా ఇద్దర్నీ ఒంటరిగా వదిలిపెడితే, ఆమె ఇంటికి వెళ్ళేలోపులో ఈమె నా మీద వత్తిడి తీసుకొచ్చి మీరడిగిన లంచం ఇప్పించ్చేట్టూ చేస్తుందని మీ విశ్వాసం."
    "చాలా తెలివైనవాడిలా వున్నావు. వెళ్ళి ఆమెని దింపి వచ్చేయి. ఈ లోపులో కేసు రిపోర్టు ప్రిపేరు చేసి వుంచుతాను. ఇంకోసారి ఆలోచించుకో."
    మాట్లాడకుండా కారు స్టార్టు చేశాను. రేఖ డీప్ షాక్ లో వున్నట్టూ వుంది. ముఖం పాలిపోయి తెల్లగా వుంది. తలవంచుకుని వేలి గోళ్ళవైపు చూస్తూ కూర్చునివుంది. ఆమె చేతిమీద చెయ్యివేసి లాలనగా "ఏమీ భయపడకు. ప్రొద్దునకల్లా అంతా సర్దుకుంటుంది. నాకు మాత్రం ఒకందుకు చాలా సంతోషంగా వుంది-" అన్నాను. కళ్ళెత్తి ఏమిటన్నట్లు చూసింది.
    "నేను చేస్తున్న ఉద్యోగం ఏదో చెప్పి, కేసునుంచి బయట పడమని నువ్వు సలహా ఇవ్వనందుకు."
    "అవును. అలా చెయ్యవచ్చునని నేనూ అనుకున్నాను. కానీ అలాంటివి నాకు ఇష్టం వుండవు. వియ్ విల్ ఫేస్ ఇట్" అంది ఒక నిర్ణయానికి వచ్చినట్టు.
    చాలు. ఈ మాత్రం వ్యక్తిత్వం ఉన్న స్త్రీతో జీవితం హాయిగా గడిచిపోతుంది. ఇక ఈ విషయం గురించి ఏమీ ఆలోచించనవసరం లేదు.
    ఆమెని ఇంటివద్ద దింపి, నేను ఇం స్పెక్టర్ ని కలుసుకున్నాను.
    గంట తరువాత ఇంటికొచ్చేసరికి నేను వూహించినట్టే జవాను ఎదురు చూస్తున్నాడు. "మిమ్మల్ని అయ్యగారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారు" అని చెప్పాడు. రేఖ ఈ విషయం అంతా తండ్రితో చెప్పేవుంటుంది. ఎలాగూ రేపొద్దున్న ఇంకొకరి ద్వారా తెలుసుకోవటం కన్నా, తనే చెప్పటం మంచిదనుకుని వుంటుంది.
    నేను వెళ్ళేసరికి జగన్నాధం తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ వున్నాడు. అతడి మొహం సగానికి కోసిన పెండలం దుంపలా వుంది. అలాటి స్థితిలో అతడిని చూడటం ఇదే మొదటిసారి.
    "ఏమిటిది... ఏమిటిది?" అతడి గొంతు కీచుమంది. "నీ కసలు బుద్ధుందా?"
    "ఏ విషయంలో సర్?"
    "నా కూతుర్ని పోలీసు రికార్డుల్లోనూ, కోర్టు కేసుల్లోనూ ఇరికిస్తావా?"
    "ఒకందుకు నాకు సంతోషంగా వుంది. 'నాకూతుర్ని అర్దరాత్రి బయటకు తీసుకు వెళ్తావా?' అని మీరు కోప్పడనందుకు" అన్నాను. అతడు మరింత ఇరిటేట్ అయి, "ఆ విషయం తరువాత మాట్లాడతాను" అన్నాడు- ముందీ విషయం తేల్చు అన్నట్టు.
    "దీని గురించి మీరేమీ కంగారు పడకండి. సుప్రీంకోర్టు వరకూ వెళ్ళినా కేసు గెలవలేదు. మేమిద్దరం పబ్లిక్ ప్లేసులో ఒకరి కౌగిలిలో ఒకరున్నామని పోలీసులకి సాక్ష్యాధారాలు లేవు" అన్నాను.
    "నాన్ సెన్స్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు నీ కౌగిలిలో వుందా లేదా అన్న విషయం గురించి సుప్రీంకోర్టు వరకూ వెళతావా?"
    అకస్మాత్తుగా వాతావరణం సీరియస్ అయింది. "న్యాయం అన్నది కేవలం సాక్ష్యాధారాలమీదే ఆధారపడి వుంటుందని అన్నది మొదట మీరే!"
    "ఏమిటి నువ్వు అంటున్నది? దానికీ దీనికీ ఏమిటి సంబంధం?"
    "ఏ సాక్ష్యాధారాలూ లేకుండా మా మీద కేసు పెట్టినందుకు పోలీసు డిపార్టుమెంట్ మీద పరువునష్టం దావా వేస్తాను. అసలు మేమా సమయంలో ఒకరి కౌగిలిలో ఒకరం లేమని నిరూపిస్తాను. ఇం స్పెక్టర్ రెండు వేలు లంచం అడిగాడనీ, అది ఇవ్వనందుకు ఇలా దొంగకేసు పెట్టాడనీ అతడి మీదే కేసు పెడతాను."
    "ఈ లోపులో నా కూతురి ఫోటో పేపర్లో పడుతుంది. పరువు బజారు కెక్కుతుంది-"
    "పడనివ్వండి."
    అప్పుడు అతడి ఆవేశం చూసి నన్ను కొడతాడనుకున్నాను. రివాల్వర్ తో షూట్ చేస్తాడని అనుకున్నాను. "అయితే - అయితే నా కూతుర్ని చేసుకోవా" అని అడిగాడు. అతడి గొంతు కీచుగా వినిపించింది. నేను మాట్లాడలేదు.
    "ఇది ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ నువ్వు?"
    అప్పుడు మాట్లాడాను నేను. ఆవేశంతో ప్రవాహంలా వచ్చినయ్ మాటలు. "ఒక జైలుకి సర్వాధికారి అయివుండీ, ఒక ఖైదీ తప్పించుకోవటానికి సాయపడ్డారు మీరు. ఆ కూలో ఒక యువకుడైన పోలీసు ఆఫీసర్ మరణించటానికి కూడా మీరే కారణం. ఇన్ని హత్యలకి మీరు కారణమైనా చట్టం మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. ఇవన్నీ తెలిసింది నా ఒక్కడికే! మీరు ఎవరితో చేతులు కలిపారో కూడా నాకు తెలుసు. అందుకని నేను నా పరిధిలో చేయగలిగింది మిమ్మల్ని మానసికంగా చిత్రహింసలు పెట్టటమే! మీరు మీ కూతుర్ని ఎంతగా ప్రేమిస్తారో కూడా నాకు తెలుసు. అందుకని మీరు వ్యధ అనుభవించక తప్పదు."  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra