Home » Suryadevara rammohan rao » అశ్వభారతం


    "ఖైదీ చావు బ్రతుకుల్లో వుంటే సర్కిల్ వచ్చేదాకా ఆగాలనటం మంచిదికాదు. ఈలోపు అతను చనిపోతే అది మన పీకలకు చుట్టుకుంటుంది. శశాంకతేజదత్త దాంతో మనల్ని మర్డర్ చేసినా చేస్తారు." సెంట్రీకి కంగారుగా వుంది.

    విశ్వదత్త ఆగిపోతే, ఈలోపు సర్కిల్ వస్తే కూపీ లాగుతాడు. అప్పుడు విషయమంతా బయటపడుతుంది....దాంతో తన పేరు బయటకొస్తుంది. ఎలాగైనా సర్కిల్ స్టేషన్ కి వచ్చేలోపు విశ్వదత్తను ఇక్కడ నుండి తరలించాలి.

    "అతనికి బాగాలేదని నేనూ ఒప్పుకుంటాను. కాని అతని విషయంలో సర్కిల్ పట్టుదలతో వున్నాడు. అతనికి సంబంధించిన చిన్న విషయమైనా సర్కిల్ కి తెలియకుండా చేయటం కూడా మన పీకలకే చుట్టుకుంటుంది.

    "నువ్వేమైనా చెప్పు....నా డ్యూటీ నేను చేస్తాను....ఎక్కించండి" అంటూ గట్టిగా మాట్లాడేసరికి హెడ్ కాస్త తగ్గాడు. విశ్వదత్తను అంబులెన్స్ లోకి ఎక్కించటం, సర్కిల్ జీప్ ఆ వీధి మలుపు తిరగటం, భరత్, శుక్రాచార్య ఆ వ్యక్తి లేచి నిలబడ్డం, అంబులెన్స్ రివర్స్ లో బయలుదేరటం, భరత్ శశాంకకు ఫోన్ చేయటం. శశాంక హాస్పిటల్ కి ఫోనుచేయటం....ఒకదాని వెంట చకచకా జరిగిపోయాయి.

    జనాల్లో కలసిపోయి మఫ్టీలో తిరుగుతున్న సి.ఇ.డి ఇన్ స్పెక్టర్స్ అనుమానంగా స్టేషన్ వేపు పరుగెత్తుకొచ్చే లోపు అంబులెన్స్ వేగం అందుకుంది.

    సరిగ్గా అదే సమయంలో సర్కిల్ స్టేషన్ ముందు జీప్ దిగాడు.

    సెంట్రీ హెడ్, మరో ఇద్దరు అక్కడే నిలబడి చర్చించుకోవటం తనని చూడగానే ఆందోళనగా ముఖాలు పెట్టడం చూసి ఏదో జరిగినట్లుగా గ్రహించాడు.

    మఫ్టీలో వున్న ఇద్దరు సి.ఐ.డీలు అక్కడే వున్న వారితో వాదనకు దిగితే తామెవరన్న ప్రశ్న రెయిజ్ అవుతుందని మౌనంగా వుండిపోయారు.

    అది విని సర్కిల్ మండిపడ్డాడు.

    పరిస్థితి చేయిదాటి నట్లే కనిపిస్తున్నా వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. వైర్ లెస్ లో పక్క స్టేషన్ కి మెసేజ్ అందించాడు అంబులెన్స్ ఆపేయమని. అక్కడే సర్కిల్ భరత్ తెలివితేటల్ని తక్కువ అంచనా వేసాడు__దానివెనుక వున్నది భరత్ అని తెలియకున్నా.

    అంబులెన్స్ మెయిన్ రోడ్ లో వెళ్ళకుండా సందుల్లో గుండా ఉస్మానియా హాస్పిటల్ లో ఎంటర్ అయింది.

    మొత్తానికి ఇందులో ఏదో మోసం వుందని సర్కిల్ గ్రహించగలిగినా ఏం చేయలేక పిడికిళ్ళు బిగించి గోడకేసి కొట్టుకున్నాడు పిచ్చిగా.

    ఒకసారి అంబులెన్స్ హాస్పిటల్ లో ఎంటర్ అయితే ఇక డాక్టర్ చెప్పిందే శాసనం.

    డాక్టర్ ని ఈపాటికి శశాంక కొనేసి వుండవచ్చు. ఏదో ఒక పేరును చెప్పి తనకు కావల్సినన్ని రోజులు అక్కడే అట్టిపెట్టుకోగల అవకాశం డాక్టర్ కు వుంటుంది.

    అక్కడ విశ్వదత్తను నిమిషాల్లో ఆడ్మిట్ చేసుకోవటం డయాగ్నైజ్ చేయటం, అల్సర్ బిగినింగ్ స్టేజ్ లో వుందని, ప్రస్తుతానికి 20 రోజులు హాస్పిటల్ లోనే వుంచి ట్రీట్ మెంట్ ఇవ్వాలని డాక్టర్ తీర్మానించటం అంతా భరత్ శశాంకకు ఇచ్చిన సూచనల మేరకే శశాంక డాక్టర్ తో చెప్పించ గలిగాడు.

    ఇదంతా తెల్సుకున్న సర్కిల్ విశ్వదత్త స్పెషల్ రూమ్ దగ్గర హాస్పిటల్ బయట మఫ్టీలో నలుగురు వేటకుక్కల్లాంటి పోలీసుల్ని కాపలా వుంచాడు.

    దౌర్జన్యంతో విశ్వదత్తను విడిపించుకు వెళ్ళవచ్చనే, దగ్గరే సర్కిల్ ఆలోచనలు ఆగిపోయాయి.


                               *    *    *


    ఇచ్చిన మాట ప్రకారం శశాంక భరత్ ను తన జాకీగా ఎంట్రీలో జతచేయించాడు.

    శంకరరెడ్డి పూనా నుంచి వచ్చి భరత్ ను శుక్రాచార్య వుంచిన ఇంట్లోనే దిగిపోయాడు.

    అక్టోబర్ 13 ఉదయం భరత్ శశాంక పంపించిన కారులో బయలుదేరాడు.

    భరత్ వెళ్ళేసరికి సెంట్రల్ హల్లో శశాంక, శుక్రాచార్య కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

    అంత సామరస్యంగా వాళ్ళు మాట్లాడుకోవటం చూసిన భరత్ ఒకింత ఆశ్చర్యపోయాడు__వీళ్ళిద్దరికి పదిరోజుల్లో ఇంతగా రిలేషన్స్ డవలప్ అయ్యాయా!

    భరత్ రావటాన్ని ముందుగా గమనించిన శశాంక స్టయిల్ గా భుజాలు కదిలిస్తూ రమ్మన్నట్లుగా సైగచేసారు.

    "ఎల్లుండే నువ్వు మన గుర్రాలతోపాటు క్లబ్ ఆధీనంలోకి వెళ్తున్నావు. నీ వెంట మన ట్రైనర్ వుంటాడు. బరువు అతి జాగ్రత్తగా గమనించుకుంటూ వుండు. (జాకీ ఎప్పుడూ బరువు పెరగకూడదు. సాధారణంగా జాకీలు 45 కేజీల నుంచి 47 వరకే వుండాలి. గుర్రాలు వేగంగా పరిగెత్తాలంటే జాకీల బరువు తక్కువగా వుండాలి) యజ్ఞభూపతి ఈసారి మంచి గుర్రాల్ని పంపిస్తున్నాడట. దిగ్ జిత్ అరోరా గుర్రాలు కూడా మంచివే. ఈసారి పోటీలో వాళ్ళిద్దరు. మనమే ముందున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి మనకే ఎక్కువ కప్స్ రావాలి...." ఒకింత ఆగాడు శశాంక.

    శుక్రాచార్య భరత్ వేపు మర్మగర్భంగా చూసాడు. భరత్ ఆ చూపుల్ని పసిగాడుతూనే మీకేం పర్వాలేదన్నట్లు కళ్ళతోనే శశాంకకు అభయం ఇచ్చాడు.

    "బాబు పరిస్థితి ఏమిటి__?"

    "మరో పంతొమ్మిది రోజులుంది టైమ్. అప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి స్టేషన్ కి పంపిస్తారు. అప్పటికి మన పధకం సిద్ధంగా వుంటుంది" అన్నాడు భరత్.

    "ప్రస్తుతానికి నేను చేయించవల్సిన పనులేమైనా వున్నాయా?"

    "మొన్న వున్న స్టేషన్ సెంట్రీమీద సర్కిల్ కి అనుమానం వచ్చినట్లుగా వుంది. సర్కిల్ ఇప్పుడు చేయగలిగేది రెండే. ఒకటి సెంట్రీని తప్పించి మరొకర్ని అపొజిషన్ లో వేయటం. రెండు ఈ సెంట్రీ మీదే నిఘా వేయటం. ఏది జరగబోతుందో మీ మనుషుల్ని పంపించి తెల్సుకోండి. మరో విషయం.... సెంట్రీని మారిస్తే కొత్త సెంట్రీగా ఎవర్ని వేస్తారు? అతన్ని ఎలా లొంగదీసుకోవాలి అనేది కూడా తెల్సుకోండి...."

    శశాంక భరత్ వేపు ఆశ్చర్యంగా చూసాడు.

    నిండుగా ఇరవైదాటని నూలూగుమీసాల యువకుడు చట్టంతో మనిషి బలహీనతలతో ఆటలాడుకోవటం....!!!

    ఈ కురువృద్దుడి పెంపకమే దానికి కారణం అయుండాలనిపించింది శశాంకకు.   

    (నవలలో ఇకముందు రేసెస్ కి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. దానర్ధం నెగిటివ్ గా తీసుకుంటే ఆడటం తెలియని వారికి రచయిత తెలియజేస్తున్నాడా అనిపించవచ్చు కాని రచయితగా నా ఉద్దేశ్యం వేరు....ఆడేవారికి విముఖత_ ప్రక్కవారు పెట్టే ప్రలోభాలకు కొద్ది కొద్దిగా మొగ్గు చూపుతున్న వారికి భయం....అసలేం తెలియని వారికి అసహ్యం కల్గించాలన్నదే నా ఉద్దేశం. దురాశకు లోనై, తేరగా డబ్బు వస్తే బావుండనే మధ్యతరగతి మధ్యాజీవుల ఊహా సౌధాలను కదిలించేందుకే ఈ రచన. అయితే అటు డబ్బున్న హార్సెస్ యజమానులు డబ్బు ఎక్కువై వినోదం కోసం రేసెస్ రిచ్ పంటర్స్ రిచ్ సొసైటీలో ప్రెస్టీజ్ కోసం, సరదా కోసం రేస్ క్లబ్స్ నిర్వహించే కరోర్ పతులకు ఈ రేసెస్ వలన ఏ నష్టం లేదు. రాదు....వచ్చినా లెక్కలోనిది కాదు. ఎటొచ్చి పైవాళ్ళు ఆడుకొనే ఈ క్రీడలో బికారులయ్యే మధ్యతరగతి వంటర్స్ ఎలా దోచుకోబడుతున్నారన్నది చెప్పి__భవిష్యత్తులో బెట్టింగ్స్ మానుకోవాలో....కొనసాగించాలో అనే నిర్ణయాన్ని వారికే వదిలేయాలనుకుంటున్నాను గనుకే రేసెస్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలనుకుంటున్నాను. అలా అయితే తప్ప మోసాలు పాఠకులకు కూడా అర్ధంకావు. కేవలం ఇందుకోసమే)

    శారదకు అంతా అయోమయంగా ఉంది. రాత్రే బ్యాంకు నుంచి తెచ్చిన వెయ్యిరూపాయలు ఇంట్లో ఎక్కడా కనిపించటంలేదు, ఇంట్లో ఉంది తను__తన భర్త చక్రవర్తి__ఇద్దరు పిల్లలు. ఇద్దరితో ఒకరికి రెండేళ్ళు. మరొకరికి నాలుగేళ్ళు. తన భర్తకు తనింట్లో దొంగిలించాల్సిన అవసరం లేదు. పైపెచ్చు తన భర్త జెంటిల్ మెన్. ఏ వ్యసనాలు లేవు, పొద్దుట ఇంటిదగ్గర భోంచేసి ఆఫీసుకు వెళ్తే మరలా సాయంత్రం ఇంటికి వచ్చేవరకు బయట కాఫీ కూడా తాగడు. ఆఫీసు వదలగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను పనిచేసే బ్యాంకుకు వచ్చి తనను ఎక్కించుకొని ఇంటికి వస్తాడు. ఆ వెంటనే బాలవాడీలో ఉన్న చిన్నవాడ్ని. కిండర్ గార్డెన్ లో చదువుతున్న పెద్దవాడ్ని తీసుకొస్తాడు. ఎప్పుడూ కోపంగాని, విసుక్కోవటంగాని చూసి ఎరగదు.

    ఎప్పుడూ ఏదో కబుర్లు చెబుతూ, చిన్న చిన్న తమాషాలు చేస్తూ తనను ఆనంద పర్చాలనే భర్త.

    నిజంగా అలాంటి భర్త దొరకటం తన అదృష్టం అని చాలాసార్లు అనుకుంది శారద.

    అప్పుడప్పుడు వంట చేసుకుంటున్నప్పుడు....చిన్న చిన్న ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు హఠాత్తుగా వస్తాడు. అప్పటికి ఎంత సేపటి నుండి తన ఒంటిలోని అందాన్ని చూస్తున్నాడు అన్నది తను చేసే చిలిపి చేష్టలువల్లే తెలుస్తుంది.

    ప్రతిరోజూ పెద్దవాడ్ని స్కూల్ దగ్గర దింపి చక్రవర్తి ఆఫీసుకు వెళ్తాడు. తను చిన్నవాడ్ని బాలనాడిలో దింపి బ్యాంకుకు వెళ్తుంది.

    ఆ రోజు శనివారం. భర్తకు ఆఫీసులేదు. పెద్దవాడ్ని దింపి వస్తానని చెప్పివెళ్ళి ఒంటి గంటయినా రాలేదు. చిన్నపిల్లాడికి భోజనం పెడుతూ అలాగే ఆలోచనల్లో పడింది.

    ఒంటిగంట....రెండు మూడు....మూడున్నరవుతుండగా రిక్షాలో వచ్చాడు పెద్దాడు.

    ఆశ్చర్యపోయింది శారద.

    "నాన్నగారేరి....?"

    "రాలేదమ్మా, అందుకే ఆకలేస్తుంటే రిక్షాతో 'వచ్చేస్తాను." అంటూ వంటింత్లోకి పరిగెత్తాడు.

    అదికూడా గమనించకుండా ఆలోచనల్లో పడిపోయింది. ఈ ఆలోచనలు ఆరోజు వచ్చినవేం కావు.      

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra