Home » Mainanpati bhaskar » Mister U

 

    మాటల్లో పడి పరిసరాలు గమనించడం మర్చిపోయారు రాజూ సృష్టినూ.
    లారీ ముందుకి వెళ్తోంది.
    హటాత్తుగా -- పైన ఒక కొమ్మ రాజుకీ, సృష్టికీ తగిలేట్టుగా కనబడింది ! తప్పించుకునే మార్గం లేదు. వ్యవధి లేదు. తలకి తగిల్తే కపాల మోక్షమే! లారీ ముందు కెళ్ళి పోతోంది!
    ఊహాతీతంగా -- వున్నట్లుండి లారీ భూమిలోకి కృంగిపోయింది!
    అక్కడ ఊబిలాగా వుంది. లారీ డ్రైవర్ సురేష్ తప్ప తాగి వున్నాడు. అంతకు ముందు రాత్రి కూడా నిద్ర లేకుండా నాన్ స్టాప్ గా డ్రయివ్ చేస్తున్నాడు అతను. నిద్రా ,మైకం రెండూ అతని కళ్ళు మూసుకుపోయేటట్లుగా చేశాయి.
    వంటి మీద తెలివి ఉంటె అతను లారీని అలా ఊబిలోకి దింపేవాడు కాడు!
    కొమ్మ తలకు తగలనందుకు గుండెల నిండా ఊపిరిపీల్చుకున్నారు రాజు, సృష్టి.
    కానీ --
    మరుక్షణంలోనే వాళ్ళకి జరుగుతోంది ఏమిటో అర్ధం అయింది.
    లారీ ఊబిలో పూర్తిగా కూరుకుపోతే దానితో బాటు తాము కూడా ఊబిలో కూరుకుపోతారు.
    డిస్పరేట్ గా , పైన ఉన్న కొమ్మ వైపు చెయ్యి జాపాడు రాజు.
    ఏ కొమ్మ తమకి తగిలి ప్రాణాలు పోతాయని భయపడ్డారో ఇప్పుడు అదే కొమ్మని పట్టుకుని ప్రాణాలు దక్కించుకోవాలని ప్రయత్నం!
    చాలా చిత్రం అనిపించింది రాజుకి.
    లారీ కూరుకుపోతున్నకొద్దీ కొమ్మ పైపైకి వెళ్ళి పోతున్నట్లు అనిపిస్తోంది.
    ఇంతలో కొమ్మ మీద ప్రత్యక్షమయ్యాయి అరడజను కోతులు.
    వాటి బరువుకి కొమ్మ కొద్దిగా కిందికి వాలింది.
    చటుక్కున కొమ్మని అందుకున్నాడు రాజు.
    వెంటనే రాజు నడుముని పట్టుకుంది సృష్టి. అతను ప్రయత్నపూర్వకంగా చెట్టు కొమ్మ మీదకి ఎక్కగలిగాడు.
    అతనితోబాటే సృష్టి కూడా చెట్టు మీదకి చేరుకుంది.
    "థాంక్స్ బడ్డీస్ " అంది సృష్టి కోతుల వైపు చూస్తూ.
    తమ డ్యూటీ తాము పూర్తీ గా చేసినట్లుగా , కిచకిచలాడుతూ పక్క చెట్టు మీదికి గెంతాయి కోతులు.    
    "ఈ కొమ్మ మాన ప్రాణాలు తీస్తుందనుకున్నాం -- కానీ ఈ కొమ్మ వల్లే మనం బతికి బయటపడ్డాం. చెడు అనుకున్నది మంచి కావచ్చును -- మంచి అనుకున్నది చేడు కావచ్చును కదా!"
    "మనం బతికి బయటపడింది కొమ్మ వల్లా? కోతి వల్లా?" అంది సృష్టి చిన్నగా నవ్వుతూ . "కోతులంటే మన పూర్వీకులు గదా -- ఆ అభిమానంతో హెల్పు చేసినట్లున్నాయి ."
    "ఇదే మా తులసీరావుగారయితే ఈ కోతులని ఆ హనుమంతుల వారు పంపారని తేల్చేసి వుండేవారు " అన్నాడు రాజు.
    "అరె! అదేమిటి?" అంది సృష్టి కంగారుగా.
    రాజు బొటన వేలు గాయమై రక్తం కారుతోంది.
    "చెట్టు ఎక్కుతున్నప్పుడు గీరుకుపోయి వుండాలి " అన్నాడు రాజు.
    వెంటనే తను వేసుకున్న షర్టు అంచుని చింపి, అతనికి కట్టు కట్టింది సృష్టి.  
    "మనిషికి బొటనవేలు ఎంత ఇంపార్టెంటో తెలుసా" అంది సృష్టి.
    "చెప్పండి"
    "సైన్సు చెప్పేస్తున్నా!" అని నవ్వి, చెప్పడం మొదలెట్టింది సృష్టి.
    "మనం కోతులలో నుంచి వచ్చాం కదా!"
    'చాలామంది మనుషులు ఆ విషయాన్ని రుజువు చేస్తూనే ఉంటారు " అన్నాడు రాజు.
    నవ్వింది సృష్టి.
    "కోతులు మొదట్లో పూర్తిగా చెట్ల మీద ఉండేవి. తర్వాత కోటి చెట్టు దిగింది. కొతికి బలం లేదు -- కానీ తెలివి ఉంది.
    చెట్టు దిగిన కోతి ఆత్మరక్షణకీ, తక్కిన జంతువూలనీ డామినేట్ చేయడానికి గానూ ఒక కర్రని చేతబట్టింది. అదిగో అక్కడే వస్తుంది బొటనవేలి టాపిక్కు."
    శ్రద్దగా వింటున్నాడు రాజు.
    "కోతికి అవయవనిర్మాణంలో ఇంకే జంతువుకీ లేని ఒక సదుపాయం ఉంది. అదే -- బొటనవేలు తక్కిన వేళ్ళకి వ్యతిరేక దిశలో ఉండడం -
    కోతికి ఉన్న వెళ్ళ'లో అన్ని వేళ్ళు ఒక వైపుకి ఉండగా, బొటనవేలు మాత్రం వ్యతిరేక దిశలో ఉంటుంది. అందుకని కర్ర చేతిలో పట్టుకో గలిగింది కోతి'.
    అంటే, బొటనవేలు అట్లా ఉండడం వల్ల దానికి ఏదైనా చేత్తో పట్టుకోడానికి గ్రిప్పు దొరికిందన్న మాట!"
    "బావుంది " అన్నాడు రాజు.
    "ఇంత పర్ ఫెక్ట్ గా ఉండే గ్రిప్పు సౌకర్యం ఇంకే జంతువుకీ లేదు. పులికి బలం వుండవచ్చును . కానీ వస్తువులను పట్టుకునే గ్రిప్పు లేదు. అవునా?
    "అవును"
    "అలాంటి గ్రిప్పు ఉన్న కోతి కర్ర పట్టుకుని తక్కిన జంతువులని డామినేట్ చేయడం మొదలెట్టింది. లేచి నిటారుగా నిలబడి నడవడం మొదలెట్టింది. అప్పట్నుంచే మొదలయ్యాయి కోతి మనిషిగా మరే దశలు. బొటనవేలుకి అంత ఇంపార్టెన్స్ వుండబట్టే ఏకలవ్యుడిని శక్తి హీనుడుగా చేయడానికి గానూ అతని బొటనవేలిని గురుదక్షిణగా  అడిగాడు ద్రోణాచార్యుడు.
    "లేచినిలబడి నడిచిన కోతిని హోమో ఏరెక్టస్ అన్నారు -- ఆయుధాలు తయారు చేయడం మొదలెట్టిన కోతిని హోమో హబిలస్ అన్నారు. ఆ తర్వాత హోమోఆస్త్రేలినస్ . రామా పిధికస్ , చిట్టచివరిగా , హోమో సపైనస్ - నవీన మానవుడు "
    "ఒక్కక్షణం -- మధ్యలో ఒక దశ ఏమిటి ? రామో...... ?"
    "రామో పిధికస్ -కదూ - చిత్రంగా వుంది -- రాముడికీ , కోతులకీ సంబంధం ఉందని పురాణాలు చెబుతాయి. కోతి పరిణామ దశలో రామో పిధికస్ అనే పేరు ....."
    తల పంకించింది సృష్టి.
    కాస్త ఆగి "రామాయణం లోని వానర సైన్యం గురించి ఒక సిద్దాంతం ఉంది " అన్నాడు రాజు.
    అతని మాట పూర్తీ కాకుండానే , సురసురమని సన్నగా శబ్దం వినబడింది.
    చుట్టుతా చూశాడు రాజు.
    మంటలు!
    దావాగ్ని!
    అడవి అంటుకుంటుంది !!!
    అన్ని వైపుల నుంచి వాళ్ళని చుట్టూ ముట్టేస్తున్నాయి మంటలు !

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra