Home » Suryadevara rammohan rao » అశ్వభారతం


    "ఇతను మంచి జాకీ, మీ హార్సెస్ ని గెలిపించి తీరతాడు. ఏమిటి గ్యారంటీ అంటే ఏమిలేదు. నమ్మితీరాలి ఎందుకంటే ఆరో ప్రాణం కన్నా ఐదో ప్రాణానికే ప్రియారిటి ఇవ్వటం వివేకుల లక్షణం. ఏమంటారు....?"

    తప్పక ఒప్పుకున్నట్లుగా మొహం పెట్టాడు శశాంక.


                               *    *    *


    శుక్రాచార్య బయట వస్తూ సడన్ గా ఆగాడు. "ప్రోగ్రామ్ ని ఎందుకు మరికాస్త ముందుకు జరిపావు....? ఇప్పుడు హాస్పిటలైజ్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? నాకిది ముందే చెప్పాల్సింది. నాకు అస్త్రంలా ఉపయోగపడతానని సొంత నిర్ణయం తీసుకున్నావు. అంత గడువు అయితే తప్ప విశ్వదత్తను విడిపించలేవా....? వెంటనే ఆపని చేయగల సమర్ధత నీకు లేకుంటే నేను చెప్పినట్లు మాత్రమే చేయాలి. దీనికి నీ సంజాయిషి....?" గట్టిగానే అడిగాడు శుక్రాచార్య.

    శుక్రాచార్య కోపాన్ని గమనించాడు భరత్.

    "చూడంకుల్.... నేను మనస్పూర్తిగానే ఈ యజ్ఞంలో దిగాను. దీన్ని పూర్తి చేస్తాను. ఆ నిజాయితీ నాకుంది. ఇలా ఎందుకన్నది ముందు ముందు మీకే తెలుస్తుంది. పోతే మీరన్నారు చూసారా_సమర్ధత లేదా అని ఉంది నా సమర్ధత ఏమిటో కూడా రుజువవుతుంది. నా సమర్ధతను శంకించే ధైర్యం మీకే ఉంది. మరొకరికి ఉండేదికాదు." సౌమ్యంగా అన్నాడు. భరత్ కు కోపం వచ్చినట్లుగా శుక్రాచార్య గుర్తించాడు.

    అందుకే మౌనంగా ఉండిపోయాడు.

    శుక్రాచార్య బాధ వేరు_తన చావు ఒక పక్క దగ్గర పడుతుండగా అనుకున్న పనులు వాయిదాలు పడటమే చికాగ్గా ఉంది.


                                                                         *    *    *


    "చెప్పింది గుర్తుందిగా....సిరంజి ఇచ్చి చెప్పింది చెప్పినట్టు చేయి. కరక్టుగా గంటకు డ్రామా క్రియేట్ చేయాలి. అంతా సవ్యంగా జరగాలంటే నీవు అతన్ని ఒప్పించాలి. అర్ధమైందా....?"

    అర్ధమైందన్నట్లు తపూపి స్టేషన్ వేపే చూస్తుంన్నాడు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి వందగజాల దూరంలో భరత్, శశాంక మనిషి ఉన్నారు.

    వీరికి మరో ఇరవై గజాల దూరంలో శుక్రాచార్య వీర్నే గమనిస్తున్నాడు.

    1.30....1.35....1.40....1.45.... కాలం భారంగా నడుస్తోంది.

    ఓపిగ్గా చూస్తున్నారు స్టేషన్ వేపే.

    1.50 అవుతుండగా సర్కిల్ ఇన్ స్పెక్టర్ జీప్ బయటకువచ్చి రోడ్డెక్కింది.

    భరత్ సైగనర్ధం చేసుకున్న ఆ వ్యక్తి సిరంజిని భద్రంగా లోపల దాచుకొని వడివడిగా స్టేషన్ వేపే సాగిపోయాడు.

    అప్పుడు శుక్రాచార్య భరత్ దగ్గరకు వచ్చాడు,

    "సెంట్రీకి అందాల్సిన సొమ్ము అందినట్టేనా?"

    "యస్ అంకుల్....రాత్రే అతని ఇంటి వద్దనే అందించారు...." దీక్షగా స్టేషన్ వేపే చూస్తూ అన్నాడు భరత్,

    ఆ వ్యక్తికి సెంట్రీతో ఏదో మాట్లాడ్డం వెంటనే ఆ వ్యక్తి లోపలకు వెళ్ళడం గమనించారు ఇద్దరు.

    "మొదటి పని పూర్తయినట్లే...." అన్నాడు భరత్ తల తిప్పకుండానే.

    మరో రెండు నిముషాలు గడిచాయి. అప్పుడు ఆవ్యక్తి వడివడిగా స్టేషన్ నుండి బయటకు వచ్చేసాడు.

    అటూ, ఇటూ జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎవరికి అనుమానం రాకుండా భరత్ ఉన్న స్థలానికొచ్చాడు.

    ఏమయిందన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు భరత్ ఆ వ్యక్తిని.

    అంతా సవ్యంగానే జరిగిందన్నట్లు తలూపాడు ఆ వ్యక్తి.

    ఇద్దరికి ముగ్గురు.... అలా ఆ స్టేషన్ వేపే ఎదురుచూస్తూ కూర్చున్నారు.

    "సర్కిల్ లంచ్ నుంచి వెంటనే తిరిగి రాడని గ్యారంటీ ఉందా?"

    భరత్ ఈ ప్రశ్నను ఇప్పటికిది నాలుగోసారి అడగటం.    

    "రాడు__ఎంక్వైరీ చేసాను. లంచ్ చేసాక ఒక గంట పడుకునే అలవాటుంది సర్కిల్ కి"

    "ఒకవేళ వస్తే...."

    "ఎలా వస్తాడు__స్టేషన్ నుంచి అర్జెంటు అని ఫోన్ వెళ్తే తప్ప రాడు...."

    "వెళ్తే...."

    "వెళ్ళడు. మీరు చెప్పినట్లుగా ఫోన్ ని ఫాల్డ్ లో పెట్టించాను. ఈ స్టేషన్ నుంచి కాల్ వెళ్ళదు, ఇక్కడికి బయటి నుండి రాదు" అన్నాడు వ్యక్తి స్థిరంగా.

    సంతృప్తిగా తలూపుతూ మరో సందేహం వెలిబుచ్చాడు భరత్.

    "ఒకవేళ ఏదో గుర్తొచ్చి సర్కిల్ ఇంటినుంచి బయలుదేరితే....?"

    "సర్కిల్ జీప్ ఇంటిముందాపి ఇంట్లోకి వెళ్ళిన మరుక్షణం జీప్ చెడిపోతుంది. మీరు చెప్పినట్లుగా ఇది ఏర్పాటు చేశాను...."

    "వెరీగుడ్....సర్కిల్ రావటానికి మరో గంటన్నర పడుతుంది. ఆలోపే పని జరిగిపోవాలి.

    ఆ వ్యక్తితో భరత్ ఏదో మాట్లాడాలనుకున్నాడుగాని ఇంత పకడ్భందీగా, అన్ని వేపుల నుంచి తన పథకానికి ఏ అడ్డూ రాకుండా జాగ్రత్తపడ్డాడని శుక్రాచార్య ఊహించలేకపోయాడు.

    నిజాయితీపరుడు, తెలివిగలవాడైన సర్కిల్ స్టేషన్ లో ఉండగా తన పధకం పారదని అందంగా వలపన్నాడని అప్పటికిగాని అర్ధంకాలేదు అక్కడున్న శుక్రాచార్యకు__అక్కడున్న శశాంకకు.

    2.50కి వరకు అసహనంగా గడిపాడు ఆ వ్యక్తి, శుక్రాచార్య.

    భరత్ ఆందోళన ఏం లేకుండా నిశ్చింతగా చూస్తూ కూర్చున్నారు.

    2.51కి విశ్వదత్త సెల్ ఊచల సందులోంచి అటూ, ఇటూ చూసాడు.

    సంతృప్తిగా తలపంకించి వచ్చి గది మధ్య కూర్చున్నాడు.

    అప్పటివరకు దాచిన సిరంజిని ఠక్కున బయటకు తీసాడు. చేతిని మడిచాడు.

    నీడిల్ ని వెయిన్ మీద ఆనించుకుని ఓ క్షణం ఆగాడు.

    రక్తం తీసే నరరూప రాక్షసుడికి కూడా తన రక్తం చూసుకోవాలంటే భయమే.

    కాని తనను తప్పించే బృహత్తర పధకం ఒకటి తండ్రి తన కోసం తయారుచేస్తున్నాడని వచ్చిన వ్యక్తి నమ్మకంగా చెప్పటంతో పళ్ళు బిగపట్టి ఆ వ్యక్తి సూచించిన దగ్గర నీడిల్ ని కస్సున దింపాడు.

    రక్తం బుస్సున సిరంజిలోకి ఎగజిమ్మింది. సిరంజిని కాస్త కాస్త పైకి లాగాడు. రక్తం కొద్దికొద్దిగా వచ్చి సిరంజి నిండిపోయింది.

    టక్కున సిరంజిని బయటకు లాగి ఆ స్పాట్ ని మరోవేలితో నొక్కిపట్టాడో నిముషం.

    ఆ తరువాత నోరు తెరిచి ఆ రక్తాన్ని సిరంజి ద్వారానే నోట్లోకి ప్రెస్ చేసుకున్నాడు.

    నోటినిండా రక్తం.

    సిరంజిని తీసి జాగ్రత్తగా మరలా లోపల దాచాడు. ఓ క్షణం ఆగి కృత్రిమంగా దగ్గాడు. రక్తం నోటి నుండి బళుక్కున బయటపడి నోరును, షర్ట్ ని తడిపేసింది.

    వెంటనే భయంకరంగా కేకలు, మూలుగులు మొదలెట్టాడు.

    క్షణాల్లో అతనికి అల్సరని సెంట్రీ తీర్మానించాడు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం.

    వెంటనే పక్క షాప్ లోకి వెళ్ళి అంబులెన్స్ కి ఫోన్ చేయటం అదొచ్చి స్టేషన్ ముందాగటం జరిగింది చూస్తుండగానే.

    స్టేషన్ బయట కాపేసి ఉన్న భరత్ సంతృప్తిగా చూస్తున్నాడు.

    క్షణాలు గడిచిపోతున్నాయి. కాని విశ్వదత్తను స్టేషన్ నుంచి తీసుకురావటంగాని, అంబులెన్స్ ఎక్కించటంగాని అనుకున్నట్లుగా అనుకున్న టైంకు జరగలేదు. ఆ వ్యక్తి, శుక్రాచార్య ఒకరి ముఖాలు ఒకరు అయోమయంగా చూసుకున్నారు.

    భరత్ జెట్ స్పీడులో ఆలోచిస్తున్నాడు ఎక్కడ పొరపాటు జరిగిందా అని.

    సరిగ్గా అదే సమయంలో సర్కిల్ ఫ్రెండ్ జీప్ లో స్టేషన్ కి బయలుదేరాడు.

    ఒక నరరూప రాక్షసుడు, డబ్బు మత్తులో వళ్ళు కొవ్వెక్కిన మిలియనీర్ కొడుకు విశ్వదత్తను ఉరికంబం ఎక్కించటం చాలంజ్ గా, ప్రెస్టేజ్ గా భావిస్తున్న సర్కిల్ ఇరవైనాలుగు గంటలూ అప్రమత్తంగా కాపు కాస్తున్నాడు.

    సర్కిల్ కి మరో అనుమానం కూడా వుంది....శిక్ష తప్పదు అని తెలుసుకున్న మరుక్షణాన పోలీస్ స్టేషన్ ని పేల్చి అయినా శశాంక కొడుకుని రక్షించుకొని, విదేశాలకు పంపించే ఛాన్సెస్ కూడా వున్నాయని.

    కోర్టుకి సెలవులు రావటం, విశ్వదత్తను కోర్టులో హాజరు పర్చటంలో జాప్యం జరగటం చికాగ్గా వుంది సర్కిల్ కి.

    అందుకే ఎప్పటిలా లంచ్ తర్వాత ఎక్కువసేపు కునుకు తీయకుండా, జీప్ చెడిపోయినా, మరో ఫ్రెండ్ కి ఫోన్ చేసి జీప్ తెప్పించుకున్నాడు.

    సర్కిల్ కి ఓమూల శశాంకమీద అనుమానం లేకపోలేదు. శశాంక అంతటివాడు కొడుక్కి శిక్షపడబోతుంటే చేతులు ముడుచుక కూర్చోడు. ఏదో ఒక ఎత్తు వేస్తాడు....దౌర్జన్యమో. డబ్బో ఏదో ఒకటి.

    అందుకే రహస్యంగా మెరికల్లాంటి ఇద్దరు సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్స్ ని స్టేషన్ బయట మఫ్టీలో కాపలా వుంచాడు. ఈ విషయం స్టేషన్ లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు సర్కిల్. ఆ ఫైల్ ని స్టేషన్ కు తీసుకురాకుండా ఇంటివద్దే వుంచాడు.

    విశ్వదత్త పట్ల సర్కిల్ ఏదో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సెంట్రీకి తెల్సినా అవి ఏమిటనేది స్పష్టంగా తెలియదు.

    అక్కడ స్టేషన్ బయట శుక్రాచార్య, భరత్.

    ఆ వ్యక్తి అసహనంగా పచార్లు చేస్తున్నాడు. అక్కడ సర్కిల్ ఎక్కిన జీప్ స్టేషన్ వైపు వేగంగా సాగివస్తోంది.

    సరిగ్గా ఇదే సమయంలో స్టేషన్ లో సెంట్రీకి మరో హెడ్ కానిస్టేబుల్ కి విశ్వదత్తను హాస్పిటల్ కి పంపించే విషయంలో ఘర్షణ జరుగుతోంది.   

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra