Home » Suryadevara rammohan rao » క్రిమినల్స్ -1


    మర్డర్స్ చేసిన హీరోయే. అసలు మర్డర్స్ చేస్తేనే  హీరో అవుతాడని చెప్పే గొప్ప సందేశాత్మక చిత్రరాజాల్ని  సెలక్టుచేసి పెట్టారు.

    ఒక పథకం  ప్రకారం  పనులు ఒక్కొక్కటి  జరిగిపోతున్నాయ్.

    రాజర్షి రెండోరోజుకు  కూడా ఉదయ్ ని అబ్జర్వ్ చేయడానికే  ఉపయోగించుకుంటున్నాడు.

    మూడోరోజు....సరిగ్గా  నాలుగున్నరకు  ఉదయ్ తో మాటకలిపాడు రాజర్షి.

    కేవలం అరగంటలోనే  ఉదయ్ ని రాజర్షి  మచ్చిక చేసుకోగలిగాడు.

    "నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు?" రాజర్షి ఉదయ్ కేసి అభిమానంగా చూస్తూ అడిగాడు.

    "బాగా చదువుకొని. మంచిపేరు తెచ్చుకుని అమ్మా నాన్నా  ఆనందించేలా  మంచి ఉద్యోగంలో చేరాలనుంది అంకుల్."

    ఉదయ్ పసిమోములో తల్లిదండ్రులవల్ల  గౌరవభావం  స్పష్టమైంది.

    "ఇంకా?"

    "ఇంకా....అక్కకు మంచి బట్టలు  కొనిపెట్టాలి."

    రాజర్షి కొద్దిసేపు  మౌనం  వహించాడు.

    "అంటే  డబ్బు కావాలికదా?" రాజర్షి  గాలం వేస్తున్నాడు.

    "అవును."

    "మరి డబ్బెలా  సంపాదిస్తావ్?"

    "బాగా చదువుకుంటే ఉద్యోగం  వస్తుంది. ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది" ఉదయ్ అమాయకంగా అన్నాడు.

    వాళ్ళిద్దరిప్పుడు  మామిడితోపులో  ఓ చెట్టుక్రింద  కూర్చున్నారు. సాయం చీకట్లు  ముసురుకుంటున్నాయి. ఉదయ్ కి యింటిధ్యాస పట్టుకుంది.

    "చదువుకున్నవాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అయినా ఉద్యోగం డబ్బు ఏ మూలకి సరిపోతుంది?" రాజర్షి  చుట్టుప్రక్కల చూస్తూ అన్నాడు.

    "మా నాన్నలా బిజినెస్ చేస్తాను" ఉదయ్ తిరిగి అన్నాడు.

    "మీ నాన్నకి వ్యాపారంలో వచ్చింది నష్టమేగా?"

    "మరెలా అంకుల్?"

    ఉదయ్ నిరుత్సాహంగా  చూస్తూ అన్నాడు.

    "నువ్వు పెద్దయి బాగా డబ్బు సంపాదించాలి. హీరో అని పేరు తెచ్చుకోవాలి. కేవలం డబ్బే  సంపాదిస్తే నీ గురించి నలుగురూ గొప్పగా ఎలా చెప్పుకుంటారు? ధనవంతుడనే అంటారు. ఈ ప్రపంచంలో ఎంతమంది  ధనవంతులు లేరు? వాళ్ళందరి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారా?"

    అతని మాటలవైపు ఉదయ్ కి గురి కుదిరింది. "హీరో కావాలంటే  ఏం చేయాలంకుల్?" జిజ్ఞాసగా అడిగాడు.

    "నేను చెప్పేకన్నా  చూస్తేనే  బాగా అర్ధమవుతుంది పద" అంటూ అతను ముందుకు కదిలాడు.

    అది తొమ్మిదో రోజు.

    గత నాలుగురోజులుగా రోజుకొక్క సినిమా చొప్పున  చూపిస్తున్నాడు అతను ఉదయ్ కి.

    రోజూ మధ్యాహ్నం  క్లాసుల్ని ఎగ్గొట్టడం ఉదయ్ కి అలవాటయి పోయింది.

    సరిగ్గా ఒకటిన్నరకి స్కూల్  ముందుంటాడు రాజర్షి.

    ఉదయం క్లాసుల్ని పూర్తిచేసుకున్న ఉదయ్ ఎవరి కళ్ళలో పడకుండా నేరుగా తప్పించుకుని  వచ్చి రాజర్షిని  కలుస్తాడు.

    అక్కడినుండి ఆ యిద్దరూ సినిమా ధియేటరుకేసి  సాగిపోతారు.

    ఓ రోజు వున్నట్టుండి అడిగాడు ఉదయ్.

    "అంకుల్! నేను స్కూల్ కి వెళ్ళటంలేదని మా నాన్నగారికి తెలిస్తే?"

    "తెలియదు. అలా మీ మాష్టార్ని  మేనేజ్  చేశాను. త్వరగా  పద. దొంగతనాలు  చేసిన  ఓ కుర్రాడు పెద్దయ్యాక  ఎలా హీరో అయ్యాడో చూద్దూగాని" అతను హడావుడి చేశాడు.

    రోజూ ఫ్రీగా సినిమాలు చూడటం గొప్ప అదృష్టంగా భావించే స్టేజీకి ఉదయ్ వచ్చేశాడు.

    రాజర్షి అనుచరులకు, పట్టాభి, మధుమూర్తిలకు  అతని పథకం ఏమిటో  ఎంతమాత్రం అర్ధంకాలేదు. పట్టాభికయితే మరీ చిరాకుగా వుంది.

    "పరమశివాన్ని, శశిభూషణ్ ని రాజర్షి దెబ్బకొడతాడని యెంతో ఆశగా ఎదురుచూస్తుంటే  అతనేమో పరమశివం కొడుకుతో  స్నేహంచేస్తూ సినిమాలు చూపించటం, కాలయాపన చేయటం అంతా గందరగోళంగా అనిపిస్తుంది."

    "మా గురువుగారు ఏ పనిని వృధాగా  చేయరు. ఏ పథకం ఎదురు తిరగదు.

    ఆయన పధకమేమిటో మనకర్ధం కానంత మాత్రాన తక్కువ అంచనా వేయటం  మనకే ప్రమాదకరం" ఒక అనుచరుడన్నాడు ఒకింత సీరియస్ గా.

    "అవుననుకోండి. కాని బుడ్డోడు ఘటికుడు. పరమశివం అంతకంటే ఘటికుడు" మధుమూర్తి గొణిగాడు.

    "మాకు మా గురువుగారి పధకం అంతుబట్టడంలేదు.

    అయినా  ఆయన పెట్టిన గడువు పదిరోజులు.

    ప్రపంచం తలక్రిందులయినా  ఆయనేసుకున్న  పధకం బెసకదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra