Home » Yerramsetti sai » Jaya Vijaya


    అతను నిజం తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఒకవేళ నిజం బయటపడే పరిస్థితి వస్తే అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ఈరోజు మాత్రం అతను సాయంత్రం రాకుండా వుంటే అంతే చాలు! ప్రస్తుతానికి ఈ గండం గడిచిపోతుంది.
    సాయంత్రం వరకూ కలవరపాటుతోనే గడిపిందామె. అయితే అప్పటివరకూ జయ ఇంటికి రాకపోవడం ఆమెకి కొంత ఊరట కలిగించింది. ఒకవేళ చంద్రకాంత్ మళ్ళీ వచ్చినా 'విజయ' ఇంకా రాలేదు ఆమె స్నేహితురాలు యింటి నుంచి అని చెప్పి వెనక్కి పంపించేయవచ్చు! అయిదు దాటుతోండగా యింటి ముందు రిక్షా ఆగడం, అందులో చంద్రకాంత్ దిగడం గమనించేసరికి ఆమెకు మళ్ళీ ఖంగారు ఎక్కువయింది.
    "రండి! కూర్చోండి! మా విజయ యింతవరకూ రానేలేదు!" అందామె అతన్ని ఆహ్వానిస్తూ.
    "అరే! ఈ పాటికి వచ్చి వుంటారని అనుకున్నానే" నిరుత్సాహంగా సోఫాలో కూలబడ్డాడతను.
    "రావాల్సిందేమరి! ఎంచేతో రాలేదు" అతను వెళ్ళిపోతే బావుండునని దేముడికి మనసులోనే మొక్కుకుంటుందామె మనసులోనే.
    "ఇలా జరుగుతుందేమోనని వూహించి ఏడు గంటల బస్ కి రిజర్వేషన్ కాన్సిల్ చేసుకుని పది గంటల బస్ కి తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ యింతలో ఇక్కడికి రావడం కుదరదు గదా! ఆ తరువాత ఇక ఎవరెటో అయిపోతారు. నా సంగతెలా వున్నా ఆమె కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోయానని తెలిస్తే విజయగారికి నామీద యెంతో కోపం వస్తుంది. ఉత్తరాలు రాయడం మానేసినా మానేస్తారు కూడా!"
    విజయకు అతని మాటలు ఆనందం కలిగిస్తున్నా లోలోపల భయం పెరిగిపోతోంది. ఒకవేళ అతనుండగానే జయ జయ వసుంధర ఇంటి నుండి తిరిగి వస్తుందేమో? అలా జరిగితే అప్పుడేం దారి? అతను యిప్పట్లో కదిలే సూచన కూడా ఏమీ కనిపించడం లేదు. అతను వెళ్ళాల్సిన బస్ పదిగంటలకయితే తొమ్మిదింటి వరకూ ఇక్కడే 'విజయ' కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. మరికొన్ని అబద్ధాలు చెప్పి అయినా అతనిని వెంటనే పంపించివేయడం తప్ప వేరే గత్యంతరం కనిపించడం లేదామెకి.
    "అన్నట్లు మీకో విషయం చెప్పడం మరచిపోయాను. ఒక్కోసారి విజయ వాళ్ళ స్నేహితురాలితో ఫస్ట్ షో సినిమాకు వెళుతుంటుంది. ఒకవేళ ఇప్పుడూ అలాంటి ప్రోగ్రామ్ ఉందేమోనని నాకు అనుమానం! లేకపోతే ఈపాటికి ఇంటికి చేరుకుని ఉండాల్సింది." తడబడుతూనే మాట్లాడిందామె.
    అతని ముఖంలో మరింత నిరుత్సాహం ఆవరించింది.
    "అంతేనంటారా?" అన్నాడు ఆలోచనలో పడుతూ. కొద్ది నిముషాలు ఇద్దరూ మౌనంగా వుండిపోయారు.
    హఠాత్తుగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడతను.
    "ఇదిగో చూడండి! ఈ నాణెంతో బొమ్మా బొరుసూ వేస్తాను. ఒకవేళ బొమ్మ పడినట్లయితే విజయగారు ఓ గంట్లో వచ్చేస్తారన్నమాట! బొరుసు పడితే ఆమె సినిమా కెళ్ళినట్లు! అంటే నేనిక్కడ వెయిట్ చెయ్యడం వృధా అవుతుంది. ఏమంటారు?" అన్నాడు ఉత్సాహంగా.
    "సరే, అలాగే వేయండి!" అంది విజయ.
    బొరుసు పడితే బావుండునని ఉందామెకి.
    అతను నాణెం ఎగురవేశాడు. విజయ వూపిరి పీల్చకుండా గమనిస్తోంది. బొరుసు పడింది. ఆమె మనసు తేలిక పడింది.
    అతను నాణెం తీసి జేబులో వేసుకున్నాడు.
    "అంటే విజయగారు సినిమాకి వెళ్ళినట్లేనన్నమాట. మరి నేనిక వెళతానండీ!" బయల్దేరటానికి సిద్ధపడ్డాడతను.
    అప్పుడే జయ గేటు తీసుకుని లోపలికి వస్తూండడంతో విజయ ఉక్కిరిబిక్కిరయింది. పై ప్రాణాలు పైనే యెగిరిపోయినయ్.
    తను యెంత తెలివితక్కువ పని చేసిందో స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. ఇప్పుడిక భగవంతుడు కూడా తనను రక్షించలేడు.
    జయను చూసి తప్పక "విజయ" అని భ్రమిస్తున్నాడతను.
    జయ లోపలికి అడుగుపెడుతూ చంద్రకాంత్ వేపు ఓసారి పరిశీలనగా చూసింది.
    "నమస్కారం!" ఆమెకు చిరునవ్వుతో నమస్కరిస్తూ అన్నాడు.
    "నమస్తే!" ప్రతి నమస్కారం చేసి లోపలి గడప దగ్గర నిలబడిపోయింది అతనెవరో అర్థంకాక.
    విజయ వెంటనే లోపలకు నడిచి జయవేపు చూస్తూ లోపలకు రమ్మని సైగ చేసింది.
    సంగతేమిటో అర్థంకాక జయ లోపలకు నడిచింది. ఆమె రెక్క పట్టుకుని త్వరత్వరగా తన గదిలోకి యీడ్చుకు పోయింది విజయ.
    "ఆయనెవరో తెలుసా?" జయ నడిగిందామె.
    "బావుంది! నాకేం తెలుస్తుంది?"
    "చంద్రకాంత్ గారు!
    "ఓహో! మీ అభిమాన రచయితగారా!"
    "అవును."
    "మరి నన్ను లోపలకు లాక్కొచ్చావెందుకు?"
    "అది కాదే. నేనో పాడుపని చేశాను పొద్దున్న!"
    "ఏమిటది?"
    "ఆయన ఉదయం వచ్చి 'విజయగారున్నారా?' అంటూ అడిగేసరికి ఆయనను గుర్తుపట్టి, లేరు. ఫ్రెండింటికెళ్ళారని అబద్ధం చెప్పేశాను."
    "అదేమిటి? ఎందుకలా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra